మన రాష్ట్రంలో చంద్రబాబు పెద్ద 420 అంటూ జగన్ కొద్ది రోజులుగా చెప్తున్నారు... దానికి కారణం ఏంటి అంటే, చంద్రబాబు పుట్టిన రోజు అంట.... చంద్రబాబు ఏప్రిల్ 20 న పుట్టారు కాబట్టి, ఏప్రిల్ నెల 4, తేది 20 కలిపి, చంద్రబాబు పెద్ద 420 అంటూ జగన్ పాదయాత్రలో ప్రచారం చేస్తున్నారు.. ఎవడైనా పాదయాత్రలో మన పార్టీ ఏమి చేస్తుందో చెప్తారు, లేకపోతే మీ కష్టాలు ఏంటో చెప్పండి అంటారు... కాని, ఈయన మాత్రం, ఎంత సేపు చంద్రబాబు జపం.. పోనీ ఏమన్నా వాస్తవం ఉంటుందా అంటే, స్కూల్ పిల్లల లాగా, నీ బర్త్ డే డేట్ ఇలా ఉంది అంటూ చచ్చు లాజిక్లతో రాజకీయం చేస్తున్నారు.. పోనీ చంద్రబాబు మీద ఏమన్నా 420 కేసు ఉందేమో అని, ఆయన ఎలక్షన్ అఫీడవిట్ చుస్తే ఒక్క కేసు లేదు... ఎందుకంటే ఎలక్షన్ అఫీడవిట్ లో వాస్తవాలు రాయాల్సిందే...

election 19042018 1

సరే, పోనీ మన రాష్ట్రంలో ఎమ్మల్యేలుగా ఉన్నవారిలో, నెంబర్ వన్ 420 ఎవడు అని, అన్ని ఎలక్షన్ అఫీడవిట్ లు తిరగేస్తే, నెంబర్ వన్ 420 దొరికాడు... ఆయన ఎవరో కాదు, మన ఘనత వహించిన ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి. ఈయనే నెంబర్ వన్ 420 గా ఉంటూ, అందరినీ నువ్వు 420, నువ్వు 420 అంటూ పాదయాత్రలో తిరుగుతున్నాడు.. ఇంకో ట్విస్ట్ ఏంటో తెలుసా, ఈ 420 కేసుల వల్లే, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్తాడు... 16 నెలలు జైలులో ఉండి, ప్రస్తుతం కోర్ట్ షరతులతో కూడిన బెయిల్ ఇస్తే, బయట తిరుగుతున్నాడు... మళ్ళీ 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు... ఇది మన ఘనత వహించిన జగన్ గారి ప్రొఫైల్.. ఇంతకీ ఆయన మీద ఎన్ని 420 కేసులు ఉన్నాయో తెలుసా ?

election 19042018 1

1. 420 - Sec 12, 11 Of Prevention Of Corruption Act, Case No CC No 8 of 2012 R.C.No 19(A) of 2011- CBI Hyd. Court Principal Spl. Judge For CBI Cases Red Hills Nampally Hyd.... 2. 420 - Case No CC No 9 of 2012 In R.C No 19(9) of 2011- CBI Hyd. Cong. Dt 29.05.2012, Court Principal Spl. Judge For CBI Cases Red Hills Nampally Hyd. Cogn.Dt 29.05.2012.... 3. 420 - 9 & 12 Prevention OF Corruption Act, Case No CC No 10 of 2012 In R.C No (19(A) of 2011 CBI Hyd. Cogn.Dt 30.05.2012, Court Principal Spl. Judge For CBI Cases Red Hills Nampally Hyd..... 4. 420 -9 & 12 of Prevention Of Corruption Act, Case No C.C. No 14 of 2012 In RC. No 19(A) of 2011-CBI Hyd. Cong.Dt 13.09.2012, Court Principal Spl. Judge For CBI Cases Red Hills Nampally Hyd...... 5. 420 - 9 of Prevention Of Corruption Act CC No 12 of 2013 In R.C.No 19(A) of 2011 CBI Hyd., Cong. Dt 13.05.2013, Court Principal Spl. Judge For CBI Cases Red Hills Nampally Hyd....

election 19042018 1

6. 420 -9 & 12 of Prevention Of Corruption Act, CC. No 24 of 2013 In R.C No 19(A) OF 2011- CBI Hyd.The Court Of The Principal Special Judge For CBI Cases, Red Hills, Nampally.... 7. 420 - 13(2) 13(1)(d) Prevention Of Corruption Act, CC No 25 of 2013 R.C No 19(A) OF 2011 CBI Hyd. The Court Of The Principal Special Judge For CBI Cases, Red Hills, Nampally,.... 8. 420 -9 of Prevention Of Corruption Act, CC No 26 of 2013 In R.C. No 19(A) Of 2011- CBI Hyd., The Court Of The Principal Special Judge For CBI.... 9. 420- 9 of Prevention Of Corruption Act, CC No 27 OF 2013 In R.C. No 19(A) Of 2011- CBI Hyd. The Court Of The Principal Special Judge.... 10. 420- 9 of Prevention Of Corruption Act, CC No 28 of 2013 - R.C No 19(A) Of 2011- CBI Hyd. Cong. Dt 17.10.2013. The Court Of The Principal Special Judge... 11. 420 - 13(2)(13(1)(C) & (d) of Prevention of Corruption Act 1988, 3 Prevention of Money Laundering Act, 2002 Punishable Under Sec. 4 of The Act On The File Of The Spl. Court Of Enforcement Directorate Court Nampally Hyd. E.C.I.R No 09/HZO/2011 Dt 30.08.2011

రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీతో కలిసి నాలుగేళ్లు ప్రయాణించినా.. ఎలాంటి ఫలితం దక్కలేదని.. అందుకే కేంద్ర ప్రభుత్వం, ఎన్డీయే నుంచి బయటకు వచ్చినట్లు కేంద్ర నిఘా విభాగం అధిపతి(ఐబీ) రాజీవ్‌జైన్‌కు సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. బుధవారం అమరావతి వచ్చిన రాజీవ్‌ జైన్‌ సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ముందు అరగంట అనుకొన్న సమావేశం సుమారుగా గంటసేపు జరిగినట్లు సమాచారం. వివిధ రాష్ట్రాల పర్యటనలో భాగంగా ఐబీ చీఫ్‌ ఇక్కడకు వచ్చారని ప్రభుత్వవర్గాలు చెబుతున్నా.. ఈ భేటీలో వర్తమాన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయి. ప్రత్యేకహోదా.. విభజన చట్టంలోని హామీల అమలులో కేంద్రం నిర్లక్ష్యం, కేంద్ర మంత్రివర్గం, ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడానికి దారితీసిన పరిస్థితులను సీఎం వివరించారు.

chief 19042018 2

‘నాలుగేళ్లు ఎంతో సహనంతో ఎదురుచూశాం. అయినా ఫలితం దక్కలేదు. అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా పూర్తిగా ఎత్తివేస్తున్నామని చెబితే ప్రత్యేక ఆర్థికసాయానికి ఒప్పుకొన్నాం. దానికింద కూడా ఇంతవరకూ ఎలాంటి సాయం చేయలేదు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు హోదా ప్రయోజనాలు మళ్లీ కల్పిస్తూ జీవో ఇచ్చారు. ఆ జాబితాలో ఏపీని కూడా చేరిస్తే సరిపోతుందని కోరాం. దానికీ ఒప్పుకోలేదు. మేం బీజేపీతో కలిసిందే రాష్ట్ర అవసరాల కోసం. అవి నెరవేరనప్పుడు కలిసి ఉండి ఏం ప్రయోజనం?. అందుకే ఈ నిర్ణయం తీసుకొన్నాం’ అని సీఎం వివరించారు. ఈ భేటీకి ముందు ఐబీ డైరెక్టర్‌ రియల్‌ టైం గవర్నెన్స్‌ కేంద్రాన్ని సందర్శించి దాని పనితీరును అడిగి తెలుసుకొన్నారు.

chief 19042018 3

ముఖ్యమంత్రితో సమావేశం తర్వాత రాజీవ్‌ జైన్‌ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయానికి వెళ్లి డీజీపీ మాలకొండయ్యతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ పోలీస్‌శాఖ పనితీరును జైన్‌ అడిగి తెలుసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, పోలీస్‌ శాఖ టెక్నాలజీ వినియోగంలో బాగా ముందున్నాయని ప్రశంసించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో పోలీస్‌ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులను మాలకొండయ్య ఆయనకు వివరించారు. అమరావతిలో గ్రేహౌండ్స్‌, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ వంటి వసతుల అభివృద్ధికి నిధుల కొరత ఉందని డీజీపీ చెప్పారు. 14వ ఆర్థికసంఘం ప్రతిపాదనల్లో పోలీస్‌ శాఖకు నిధుల లభ్యత పెద్దగా లేదని, 15వ ఆర్థికసంఘం సిఫారసుల్లో ఆ లోపం కొంతమేర సవరించే అవకాశం ఉందని ఐబీ చీఫ్‌ ఆయనతో చెప్పినట్లు సమాచారం.

గుంటూరు హైలెవెల్ ఛానల్ పర్చూరు వరకు పొడిగింపు అంశంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు. మొదటి దశ సర్వే పనులకు కోటి రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నల్లమడ రైతు సంఘం నేతలు డా. కొల్లా రాజమోహన్, యార్లగడ్డ అంకమ్మ చౌదరి నేతృత్వంలో రైతాంగ ప్రతినిధులు ముఖ్యమంత్రిని సచివాలయంలో కలిసి గుంటూరు హైలెవల్ ఛానెల్ పొడిగింపు ఆవశ్యకతను వివరించగా సీఎం సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరివ్వాలన్న ఉద్దేశంతోనే వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేశామని తెలిపారు.

cbn 1904208

సాగునీరు లేదని, నీటి కొరతతో పంటలు ఎండిపోతున్నాయని అనే మాటలు ఇకపై వినపడవని, వాటర్ గ్రిడ్ పనులు పూర్తయితే రాష్ట్రంలో ఎక్కడ నీరు అవసరమైతే అక్కడికి పంపిస్తామని, అటువంటి దార్శనికతతో తాము స్వర్ణాంధ్ర విజన్ రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రాధాన్య క్రమంలో 29 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టామని, జూన్ నుంచి వరుసగా ఈ ప్రాజెక్టులను ప్రారంభించి రైతాంగానికి అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. గుంటూరు హైలెవల్ ఛానల్ విస్తరణ ఆవశ్యకతను పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యమంత్రికి వివరించారు.

cbn 1904208

అంతకు ముందు నల్లమడ రైతు సంఘ ప్రతినిధులు డా. కొల్లా రాజమోహన్, యార్లగడ్డ అంకమ్మ చౌదరి మాట్లాడుతూ గుంటూరు ఛానెల్ యామర్తి దగ్గర నిలిచిపోయిందని, ఈ ఛానెల్ కాల్వ పనులను ప్రకాశం జిల్లా పర్చూరు వరకు పొడింగించాలని, తర్వాత ఇంకొల్లుకు విస్తరించవచ్చని ముఖ్యమంత్రికి వివరించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ భూమి సాగు అవుతుందని, రాష్ట్రానికి ఆదాయం సమకూరుతుందని ముఖ్యమంత్రికి వివరించారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, చిలకలూరిపేట మండలాల్లో కొంత భాగంలో భూగర్భ జలాలు అడుగంటాయని, ఉన్న నీరు కూడా ఉప్పునీరేనని తెలిపారు.

cbn 1904208

గుంటూరు ఛానెల్ పొడిగింపు వల్ల కనీసం ముందుగా 50 గ్రామాలకు సాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందించేందుకు తక్షణం వీలు కలుగుతుందని రైతాంగ ప్రతినిధులు సీఎం దృష్టికి తెచ్చారు. ప్రస్తుతం పులిచింతల ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు వల్ల, వాటర్ గ్రిడ్ వల్ల నీటికి కొరత లేదని, అందువల్ల పెదనందిపాడు, కాకుమాను, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, పర్చూరు వరకూ సరిపడా జలాలను ఇవ్వవచ్న్నారు. వాటర్ గ్రిడ్ ద్వారా పైప్ లైన్ వేసి, కాల్వను ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేస్తే 50 వేల ఎకరాలను తక్షణం సాగులోకి తేవచ్చన్నారు. గుంటూరు ఛానెల్ ను ప్రకాశం జిల్లాకు తొలుత పర్చూరుకు, తర్వాత ఇంకొల్లుకు పొడిగించడం వల్ల ప్రత్తి, మిరప, పసుపు లాంటి వాణిజ్యపంటలను, ఆరుతడి పంటలను వేయవచ్చని తెలిపారు. ఎంపీ గల్లా జయదేవ్‌కు వినతిపత్రం సమర్పించగా సానుకూల స్పందన వ్యక్తం చేశారని, తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు గుర్తు చేశారు.

cbn 1904208

గతంలో గుంటూరు ఛానెల్ పొడిగింపు అంశంపై చీఫ్ ఇంజనీర్ వెంకటేశన్ సర్వే చేశారని, తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. 1953 నుంచి 1967 వరకు పార్లమెంటు సభ్యులు తరిమెల నాగిరెడ్డి, ఎస్వీఎల్ నరసింహం, కడియాల గోపాలరావు, మాదల నారాయణ స్వామి, కొల్లా వెంకయ్యలు పెదనందిపాడు హైలెవెల్ ఛానెల్ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించారని, ఉమ్మడి రాష్ట్ర శాసన సభలో ఎమ్మెల్యేలు వావిలాల గోపాల కృష్ణయ్య, మంతెన వెంకటరాజు, గౌతు లచ్చన్న, నరహరిశెట్టి వెంకట స్వామి, కొరటాల సత్యనారాయణ, మద్దుకూరి నారాయణ తదితరులు అసెంబ్లీలో తమ వాణి వినిపించాచని నల్లమడ రైతు సంఘ నేతలు, రైతాంగ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.

తాము దశాబ్దాలుగా అనేక ఉద్యమాలు, ఆందోళనలు చేశామని అన్నారు. ఈ ప్రాంతానికి నీరువస్తే పొగాకు పంట వేయడానికి వీలుకాదన్నది అపోహ మాత్రమేనని, పొగాకు పంటకు కూడా 3 తడులు అవసరమని తెలిపారు. కృష్ణా నదికి 60 కి.మీ దూరంలో ఉన్న తమ ప్రాంతానికి గతంలో కృష్ణా జలాలు రాకుండా చేశారని,నల్లమడ వాగులోకి వచ్చే మురుగునీటిపై ఆధారపడి పంటలు వేస్తున్నామన్నారు. ఒకవైపు డెల్టా, మరోవైపు నాగార్జున సాగర్ ఆయకట్టు భూములున్నాయని చెప్పారు.ముఖ్యమంత్రి చంద్రబాబును కలసిన రైతు సంఘ ప్రతినిధి బృందంలో కుర్రా హరిబాబు, మొవ్వా పెద్దన్న, నర్రా బాలకృష్ణ, ప్రత్తిపాటి రవీంద్ర ప్రసాద్, విక్రయాల సుబ్బారావు,డి. కోటేశ్వరరావు తదితరులున్నారు.

పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన నెల్లూరు మున్సిపల్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంట‌ర్ మొదటి సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలు సాధించారని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. గత నెలలో జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో పరీక్షలకు 49 విద్యార్థులు హాజరు కాగా.. 32 మంది 10కి 10 జీపీఏ, మరో 12 మంది 9.8, మిగిలిన ఐదుగురు 9.5 జీపీఏ సాధించారన్నారు. పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో రాబోయే విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మరికొన్ని చోట్ల ఇటువంటి బోధన విధానం అమలు చేయనున్నామని మంత్రి తెలిపారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విద్యార్థులతో కలిసి మంత్రి నారాయ‌ణ మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలు కార్పొరేట్ ధీటుగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారన్నారు.

cbn college 19042018 1

ఆయన ఆశయ సాధనలో భాగంగా ఇప్పటికే ప్రాథమిక విద్యలో రాష్ట్ర ప్రభుత్వం పెనుమార్పులు తీసుకొచ్చిందన్నారు. అడ్వాన్స్ ఫౌండేషన్ కోర్సు ప్రారంభించిందన్నారు. ఈ ఫౌండేషన్ కోర్సుపై విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, మేధావులు అభినందనలు తెలియజేస్తున్నారని తెలిపారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 49 మంది నిరుపేద విద్యార్థులను ఎంపిక చేసి, పైలెట్ ప్రాజెక్టుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ప్రారంభించి అందులో వారికి ఇంటర్మీడియట్ కోర్సులో విద్యాబోధన చేశామన్నారు. విద్యార్థులకు బోధన చేయడానికి ప్రభుత్వంతో నారాయణ విద్యాసంస్థలు రెండేళ్లకుగానూ ఎంవోయూ కుదుర్చుకున్నాయన్నారు.

cbn college 19042018 1

ఉపాధ్యాయులు బోధనతో పాటు నారాయణ విద్యా సంస్థల నుంచి పుస్తకాలు, మెటీరియల్ అందించామన్నారు. ఇంటర్మీడియట్ బోర్డు చరిత్రలోనే గవర్నమెంట్ విద్యార్థులు ఇటువంటి ఫలితాలు సాధించారన్నారు. విద్యకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఈ ఫలితాలు రుజువు చేస్తున్నాయన్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన మున్సిపల్ జూనియర్ కళాశాలలను రాబోయే విద్యా సంవత్సరంలో విశాఖపట్నం, తిరుపతి, విజయవాడలో ప్రారంభించే ఆలోచన ఉందన్నారు. ఇప్పటికే అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ పిల్లలకు వయస్సుకు తగ్గ బోధన చేస్తున్నామన్నారు. మరో 3 వేల స్కూళ్లలో పూర్తి స్థాయిలో వసతి సౌకర్యం లేకపోవడం వల్ల ఫ్రీ స్కూళ్లగా మార్చలేకపోయామని త్వరలోనే వాటిని కూడా ఫ్రీ స్కూళ్లగా మార్చుతామని మంత్రి నారాయణ తెలిపారు.

cbn college 19042018 1

స్కూళ్ల ఎడ్యుకేషన్ మాదిరిగా కాలేజీ విద్యను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు. విద్యా సంస్కరణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏపీకి మొదటి ర్యాంకు ఇచ్చిందన్నారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో నిరుపేద విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించడంలో మంత్రి నారాయణ కృషి ఎంతో ఉంద‌న్నారు. పేదరికం అనేది చదువుకు భారం కాకూడదని మంత్రి భావించడం వల్లే నిరుపేద విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించగలిగారన్నారు. తొలుత విద్యార్థులతో కలిసి మంత్రి నారాయణ సీఎం చంద్రబాబును ఆయన కార్యాలయంలో కల‌వ‌గా విద్యార్థులను ముఖ్య‌మంత్రి చంద్రబాబు అభినందించారు.

Advertisements

Latest Articles

Most Read