జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే... ఏది ఎందుకు మొదలు పెడతాడో తెలియదు, ఎందుకు ఆపేస్తాడో తెలియదు... ఇదే కోవలో, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అని వేసి, కేంద్రం ఇంత ఇవ్వాలి అని తేల్చారు.. కాని, తరువాత నుంచి కేంద్రాన్ని ఒక్క మాట అనటానికి కూడా సాహసించటం లేదు.. ఈ వ్యవహారంతో చిర్రెత్తిన లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారయణ కూడా, పవన్ మీద నమ్మకం లేక, సొంతగా ఒక కమిటీ వేసుకుని, కేంద్రం చేస్తున్న అన్యాయం పై పోరాడుతున్నారు... పవన్ వ్యవహార శైలికి కారణం, బీజేపీతో పవన్ చేసుకున్న ఒప్పందమే అని విశ్లేషకులు అంటున్నారు.. మోడీని ఒక్క మాట కూడా అనకపోవటం, నేషనల్ మీడియాకు ఎక్కి, మోడీ నాకు ఆదర్శం అని చెప్పి, చంద్రబాబుని తిట్టటం, ఈ ఆరోపణలకు బలం చేకూర్చాయి...అయితే, ఇప్పుడు పవన్ చేసిన మరో పని చర్చనీయంసం అయ్యింది...

pavan 18042018

ఈ నెల 16న అనంతపురం జిల్లలో పవన్ పర్యటన అని, అక్కడ ప్రత్యెక హోదా పై, ఆందోళన చేస్తారు అంటూ, హడావిడి చేసారు... పవనే స్వయంగా ఈ విషయం కూడా చెప్పారు.. అయితే, చివరి నిమిషంలో పర్యటన రద్దు అయ్యింది. ఎడమ కంటికి కొద్దిపాటి డస్ట్ ఇన్‌ఫెక్షన్ కారణంగా పర్యటన రద్దు చేసుకున్నట్టు జనసేన కార్యాలయం లీక్ ఇచ్చింది... అయితే, ఆ ముందు రోజు ఎదో సినిమా ఫంక్షన్ కి వెళ్ళటం, ఆ తరువాత రోజు హైదరాబాద్ లో అసిఫాకు మద్దతుగా దీక్ష అంటూ, ఒక గంట హడావిడి చేసారు పవన్... అయితే తరువాత రోజు చెయ్యాల్సిన అనంత పర్యటన మాత్రం వాయిదా పడింది... కొద్దిపాటి ఇన్ఫెక్షన్ కే, పర్యటన వాయిదా వేసేంత బలహీనుడు అయితే పవన్ కాదని, దీని వెనుక ఎదో బలమైన కారణం ఉంది అని అంటున్నారు... దీనికి బలం చేకూరుస్తూ మరో, నిర్ణయం తీసుకున్నాడు , పవన్...

pavan 18042018

15న అనంతపురం, 24న ఒంగోలు, మే 6న విజయనగరంలో పట్టణాల్లో నిర్వహించ తలపెట్టిన, మేధావులతో సమావేశాలని కూడా రద్దు చేసారు... ఇది కూడా పవనే ప్రకటించారు... హోదా పై, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాలు అంటూ చెప్పి, అన్ని కార్యక్రమాలనూ నిలిపివేసినట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. రైతు, కార్మికుల సమస్యలపై పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని పవన్ చెప్పారు... ప్రత్యేక హోదా సాధన కోసం, ఎవరైనా, ఏ కార్యక్రమానికైనా చేస్తే తాము మద్దతిస్తామని అన్నారు.. ఇవన్నీ చూస్తుంటే, బీజేపీ నుంచి ఆదేశాలు రావటంతో, ఇక హోదా పై పవన్ పోరాటం ఆగిపోయినట్టే అని అనుకుంటున్నారు... బీజేపీ సూచనల మేరకు, ఇక హోదా పై కాకుండా, కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకుండా, రాష్ట్రంలో సమస్యల పై, చంద్రబాబు పై పోరాటానికి పవన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది... లేకపోతే, కామెడీ కాకపొతే, చిన్న ఇన్ఫెక్షన్ వస్తే, పోరాట యోధులం అని చెప్పుకునే వారు, వారం రోజులు ఇంట్లో కూర్చుంటారా ? అంతా ఢిల్లీ మహిమ...

గత నెల రోజులుగా, మోడీ, అమిత్ షా పై నిప్పులు చెరుగుతున్న చంద్రబాబుకి, అమిత్ షా సిగ్నల్స్ పంపిస్తున్నట్టు తెలుస్తుంది... చంద్రబాబు ఈ స్థాయిలో విరుచుకుపడుతుంటే, అమిత్ షా మాత్రం కూల్ గా స్పందిస్తూ, కొన్ని ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసారు... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తమకు ఎలాంటి గొడవ లేదని.. పెట్టుకోవాలని కూడా అనుకోలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు.... మా నుంచి చంద్రబాబే వెళ్లిపోయారని వ్యాఖ్యానించారు. దిల్లీలో ఆయన మాట్లాడుతూ.. పీలో తెదేపాతో తెగదెంపుల తర్వాతే పార్టీ అధ్యక్షుడి మార్పు అనివార్యమైందన్నారు. త్వరలోనే ఏపీ భాజపా అధ్యక్షుడిని ప్రకటిస్తామన్నారు.

amitshah 17042018

కర్ణాటక ఎన్నికల్లో భాజపా గెలుస్తుందని అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన ప్రధాన వ్యక్తులంతా భాజపా వైపే ఉన్నరన్నారు. మరో పక్క కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే ఏపీ భాజపా అధ్యక్షుడు హరిబాబు రాజీనామా చేశారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. త్వరలోనే కొత్త అధ్యక్షుడు ఎవరనేది ప్రకటిస్తామని తెలిపాయి. కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది. రానున్న కాలంలో హరిబాబుకు సముచిత స్థానం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం. కర్ణాటక ఎన్నికల తర్వాత కేంద్ర మంత్రివర్గం విస్తరించే అవకాశముందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

amitshah 17042018

అయితే ఇప్పుడు అమిత్ షా స్పందించిన విధానం కొంచెం ఆశ్చర్యం కలిగించింది. ఇది కేవలం, మీడియా ముందు బిల్డ్ అప్ కోసం చెప్పిన కామెంటా లేక, నిజంగానే చంద్రబాబుకి ఏమన్నా సిగ్నల్ పంపిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఇప్పటికే చంద్రబాబు, కేంద్రం పై మండి పడుతున్నారు. అయితే, చంద్రబాబుతో అనేక విధాలుగా సంధికి ప్రయత్నించినా, చంద్రబాబు మాత్రం, విభజన హామీలు అమలు చేసే వరకు, మీతో చర్చలు లేవు అని చెప్పిన సంగతి తెలిసిందే.. అయితే, ఇప్పుడు మీడియా ద్వారా, అమిత్ షా ఏమన్నా సిగ్నల్స్ పంపిస్తున్నారా అనే అనుమానం కలుగుతుంది. ఎందుకంటే, అమిత్ షా, విపక్షాల మీద ఇంత సాఫ్ట్ గా మాట్లాడరు. విరుచుకుపడతారు... అయితే, ఇవన్నీ మీడియా ముందు ఎదో హడావిడి అని, కర్ణాటకలో తెలుగువారి ఓట్లు పోకుండా, అమిత్ షా ఎదో కవర్ చేస్తున్నారని, తెలుగుదేశం నాయకులు అంటున్నారు...

ప్రధాని పదవో... సీఎం సీటో అడగలేదే... మరో పదివో అడగలేదు... టీ అడగలేదు.. పకోడీ అడగలేదు... కాని బయటకు గెంటేసారు... ఇది, సంఘ్ పరివార్‌తోనూ సన్నిహితంగా పని చేసిన 62 ఏళ్ల ప్రవీణ్ తొగాడియా మాటలు... ప్రధాని నరేంద్ర మోదీతో తనకెలాంటి వివాదాలు లేవని, కేవలం రామాలయం నిర్మాణానికి సంబంధించి చట్టం చేసే విషయంలోనే మోడీతో సమస్య అని అన్నారు తొగాడియా... తాను ఎలాంటి పదవులు కోరుకోకుండానే నాలుగు దశాబ్దాల పాటు సంఘ్ పరివార్‌కు సేవలందించానని, తానే కోరుకుని ఉంటే 2001లోనే ముఖ్యమంత్రి అయ్యేవాడినని అన్నారు.. 'మోదీతో నాకు వివాదాలే ఉండుంటే ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యిండేవారు కాదు' అని మోదీపై ప్రవీణ్ తొగాడియా నిప్పులు చెరిగారు.

modi 17042018

అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌరస్మృతి అమలు తదితర డిమాండ్లపై ప్రవీణ్ తొగాడియా పల్డిలోని వీహెచ్‌పీ కార్యాలయం ముందు మంగళవారంనాడు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఆయనతో పాటు వీహెచ్‌పీ రాష్ట్ర చీఫ్ కౌషిక్ మెహతా, ప్రధాన కార్యదర్శి రాంచోడ్ భార్వాడ్, సుమారు 200 మంది సాధువులు, మద్దతుదారులు పాల్గొన్నారు. 'ఒక ప్రధాని హిందువుల వల్ల అధికారంలోకి వచ్చి గోరక్షులను గూండాలని పిలవడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చు' అంటూ మోదీపై తొగాడియా విమర్శలు గుప్పించారు.

modi 17042018

తొగాడియా మాట్లాడుతూ మోదీపై నిశిత విమర్శలు చేశారు. తానే అప్పట్లో కోరుకుని ఉంటే మోదీకి సీఎం పదవి కూడా దక్కేదికాదని అన్నారు. 'నా జీవితంలో 50 ఏళ్లుగా హిందువుల సంక్షేమానికి పాటుపడుతూ వచ్చాను. అయినప్పటికీ నన్ను బయటకు నెట్టారు. ఎందుకోసం?...నేనేమీ పదవులు అడగలేదు. ప్రధాని పదవి ఇమ్మనలేదు. ఒక సంచీ టీ, పకోడా వేయించుకునే బూలిమూకుడో అడగలేదు. కేవలం రామ మందిరం నిర్మించాలని అడిగా. అందే అంశంపై ఆయన (మోదీ) ప్రధాని అయ్యారు' అని తొగాడియా అన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకహోదా కోసం చేస్తున్న దీక్షకు మద్దతుగా బెంగళూరులోని జిగిణీ పురసభలో ఉంటున్న తెలుగు ప్రజలు అమరావతికి వచ్చారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి తమ సంఘీభావం తెలిపారు. చంద్రబాబునాయుడు చేస్తున్న పోరాటానికి పూర్తి మద్దతు తెలిపేందుకు వచ్చామని కర్ణాటక రాష్ట్ర పొట్టిశ్రీరాములు తెలుగు సంఘం నాయకులు తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ఆయన పోరాటం ఎంతో ఉత్తమమైనదిగా అభివర్ణించారు. సంఘం గౌరవాధ్యక్షులు ఉమామహేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు వెంకటరామిరెడ్డి, వీరనారాయణ, కోశాధికారి హరినాథ్‌, పాలకవర్గ సభ్యులు, జిగిణీలోని తెలుగువారు ముఖ్యమంత్రి నివాసం వద్ద ఫ్లెక్సీని ప్రదర్శించారు.

karnataka 17042018

అనంతరం వీరనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ బెంగళూరు జిల్లా జిగణి పురసభలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గుర్తించి, వారికి బాసటగా నిలిచేందుకు ఈ సంఘాన్ని స్థాపించామన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములును ఆదర్శంగా తీసుకుని, ప్రవాసాంధ్రులకు, వలస కార్మికులకు, తెలుగు పాఠశాలల అభివృద్ధికి తమ సంఘం ఉదాత్త సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం 2015 నుంచి అనేక సార్లు బెంగళూరు విధానసౌధ వద్ద ధర్నాలు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించినట్టు వివరించారు.

karnataka 17042018

ఏపీ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబును కొనియాడారు. హోదా, విభజన హామీల అమలు సాధనకు చంద్రబాబు చేస్తున్న పోరాటానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా తమ సంఘం సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబుకు భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. ఇప్పటికే కర్ణాటకలో, బీజేపీ ని ఓడించటానికి, తెలుగు వారు అన్ని ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో, బీజేపీ వ్యతిరేక ప్రచారం జరుగుతుంది... కర్ణాటకలో ఉంటున్న దాదాపు కోటి మంది తెలుగు ప్రజలు, కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చెయ్యనున్నారు..

Advertisements

Latest Articles

Most Read