జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన హడావిడి అందరూ చూసాం.. అందులో కేంద్రం, మన రాష్ట్రానికి అన్యాయం చేసింది అని, 75 వేల కోట్లు రాష్ట్రానికి రావాలని తేల్చారు... అందులో లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ కూడా ఒక భాగస్వామిగా ఉన్నారు... అయితే, ఒకే ఒక ప్రెస్ మీట్ పెట్టి, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ వివరాలు చెప్పిన పవన్ కళ్యాణ్, తరువాత ఆ విషయం మర్చిపోయారు... అనూహ్యంగా, మోడీని ఒక్క మాట కూడా అనకుండా, కేంద్రం పై పోరాడుతున్న చంద్రబాబు పై రివర్స్ అయ్యారు... అంతే కాదు, ఒక పెద్ద మీటింగ్ పెట్టి, జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ లోని అంశాలు కనీసం ప్రస్తావించ లేదు...

jfc 30032018

అసలు జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ రిపోర్ట్ అనేది, మర్చిపోయారు... తరువాత ఏమి చెయ్యాలి అనే కార్యాచరణ లేదు... దీంతో ఆ కమిటీలో జయప్రకాశ్ నారాయణ లాంటి పెద్దలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు... పవన్ కళ్యాణ్ రాజకీయ గేమ్ ఆడాడు అని, కేంద్రం ఆడించిన డ్రామా అని గుర్తించారు... అందుకే జయప్రకాశ్ నారాయణ రెండు రోజుల క్రిందట, స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటు చేసారు... ఇందులో అందరు ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, నిపుణులు మాత్రమే ఉన్నారు... జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీలాగ, ఉండవల్లి, పవన్ కళ్యాణ్ లాంటి స్వార్ధ పరులని ఇందులో తీసుకోలేదు..

jfc 30032018

జయప్రకాశ్ నారాయణ ఆధ్వర్యంలో స్వతంత్ర నిపుణుల బృందం, ఈ రోజు మొదటి సమావేశం జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వారధిలా పనిచేస్తూ వివాద పరిష్కారానికి తోడ్పాటునందించే పౌర సమాజంగా వ్యవహరించడం, ఇతరత్రా అంశాలపై అధ్యయనం చేసి పరిష్కారానికి కృషి చేయడం వంటి పనులను నిర్వర్తించడానికి ఈ బృందం పని చేస్తుంది... మొదటి సమావేశం తరువాత జయప్రకాశ్ నారాయణ మీడియాతో మాట్లాడారు... జేఎఫ్‌సీపై పవన్ కల్యాణ్ తొలుత చూపిన శ్రద్ధ తర్వాత చూపలేదని, అందుకే స్వతంత్ర నిపుణుల బృందం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు... జేఎఫ్‌సీ లెక్కలు తేల్చిన తర్వాత, పవన్ వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవని, అందుకే స్వతంత్ర నిపుణులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు... జేఎఫ్‌సీ తొలిదశ అయితే... నిపుణుల కమిటీ రెండో దశ అని జేపీ అన్నారు... కేంద్రం సమయమిస్తే వెళ్లి కలుస్తామని అన్నారు..

నవ్యాంధ్ర రాజధాని అమరావతిని పారిశ్రామిక పెట్టుబడులకు కేంద్రంగా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వం, ఈ మేరకు తొలి అడుగులు ఆరంభించింది. ఇప్ప టికే రెండు జిల్లాల పరిధిలో ఏపీఐఐసీ భూ బ్యాంకులు సిద్ధం చేసింది. దశల వారీగా మౌలిక వసతులు కల్పిస్తోంది. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆదర్శ పారిశ్రామిక వాడ (మోడల్ ఇండస్ట్రియల్ పార్కు, ఆహార ఉద్యానవనం(మెగా ఫుడ్ పార్కు) నెలకొల్పేలా రెండేళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించింది. భూ సేకరణ, కేటాయింపుల కసరత్తు తుది దశకు రావడంతో, ఇప్పుడు పరిశ్రమల స్థాపన వేగవంతం చేసే దిశగా కార్యాచరణ చేపట్టింది.

ashok leyland 30032018

ఇందులో భాగంగానే శనివారం ప్రముఖ రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్ లేల్యాండ్ యూనిట్లు అంకురార్పణ చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్ర బాబు స్వయంగా దీనికి భూమి పూజ చేస్తారు. ఈ తర్వాత మరిన్ని పరిశ్రమలు కొలువుదీరనున్నాయి. మల్లవల్లి గ్రామంలో రూ. 135కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. తొలిదశలో ఏటా 2400 బస్ బాడీలు తయారు చేసే బిల్లింగ్ యూనిట్సు రూ.90 కోట్లతో ఏర్పాటు చేస్తారు. రెండు దశలో మరో రూ.45 కోట్లతో 2400 బస్ బాడీలను తయారు చేసే మరో యూనిటీను ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థకు 100 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ యూనిట్లలో 2400 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి.. రేపు ఈ సీన్ చూడబోయే కొంత మంది, ఢిల్లీ నుంచి, హైదరాబాద్ లో ఉంటూ ఆంధ్రా రాజకీయాలు చేసే వాళ్ళు, ఏడుపులు వర్ణనాతీతంగా ఉంటాయి... ఈ కడుపు మంట చల్లార్చుకోటానికి, మళ్ళీ ఆంధ్రాకు వచ్చి ఏ విషం చిమ్ముటారో...

ashok leyland 30032018

మల్లవల్లి గన్నవరం దగ్గర ఉన్న, మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో మొత్తం 1260.06 ఎకరాల సువిశాల భారీ మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో 964 ప్లాట్లు ఉండగా, కేటాయింపులకు ముందే హౌస్‌ఫుల్‌ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది... మరో పక్క ఇదే ఇండస్ర్టియల్‌ పార్క్‌ లో, మోహన్‌ స్పిన్‌టెక్స్‌ సంస్థకు ఇంటిగ్రేటెడ్‌ మెగా టెక్స్‌టైల్స్‌ పార్క్‌ ఏర్పాటుకు 81 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది... భారీ పరిశ్రమల కేటగిరిలో ఇవి పోను గోల్డ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌తో పాటు అనేక స్పి న్నింగ్‌ మిల్లులు, ఫార్మా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి..

కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ ప్రాజెక్టు పనుల ప్రగతిని పరిశీలించేందుకు ఏప్రిల్‌ ఒకటో తేదీన వస్తున్నారంటూ జలనితిన్‌ గడ్కరీ కార్యాలయ అధికార వర్గాలు బుధవారం రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అయితే, వెంటనే మరో కబురు వచ్చింది... అదే రోజున పార్లమెంటరీ కమిటీ సమావేశం ఉన్నందున పర్యటన వాయిదా పడిందంటూ జల వనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు.. ఆ వెనువెంటనే గడ్కరీ కార్యాలయం నుంచి సమాచారం చేరింది. బుధవారం ఉదయం గడ్కరీ కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన సమాచారం మేరకు.. ఏప్రిల్‌ ఒకటో తేదీ, ఆదివారం ఉదయం నాగపూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి గడ్కరీ చేరుకుంటారు.

gadkari 29032018

అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం చేరుకొని, అంతర్గత జలరవాణా వ్యవస్థను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. ఈ కార్యక్రమం అనంతరం, మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ నుంచి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి గడ్కరీ వెళతారు. కాని, ఈ పర్యటన వాయిదా వెనుక ఢిల్లీ పెద్దల నుంచి ఒత్తిడి కారణంగా చెప్తున్నారు... నిఘా వర్గాల సమాచారం ప్రకారం, పోలవరం పనులు ఎప్పుడూ లేనంత వేగంగా పరుగులు పెడుతుంది... పనులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి... మరో పక్క, అన్ని కమిటీలు పోలవరంలో అవినీతి అనేది లేదని తేల్చాయి...

gadkari 29032018

ఇలాంటి పరిస్థుతుల్లో కనుక కేంద్ర మంత్రి పోలవరం సందర్శనకు వెళ్తే, అక్కడ పోలవరంలో జరుగుతున్న పనిని మెచ్చుకునే పరిస్థితి ఉంటుంది... ఇలా జరిగితే, ఇప్పటికే పోలవరం కొత్త అంచనాలు రూ.58,319.06 కోట్లకు కేంద్రం ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాయి.. ఇలాంటి పరిస్థుతుల్లో, పోలవరం పై పోజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తే, కేంద్రం పోలవరం పై ఎదో రకంగా, రాష్ట్రానికి సాయం చెయ్యాల్సి ఉంటుంది... ఇలా చేస్తే, చంద్రబాబు పోలవరం కట్టేస్తాడు... అందుకే, ఇప్పుడు ఉన్న పరిస్థుతుల్లో కేంద్రం మంత్రి పోలవరం పర్యటనకు వెళ్ళవద్దు అంటూ, ఢిల్లీ పెద్దలు ఆదేశాలు ఇచ్చారు.. రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.. ఎందుకంటే, అదే రోజున పార్లమెంటరీ కమిటీ సమావేశం అప్పటికప్పుడు పెట్టింది కాదు, అది ఉందని ముందే తెలిసినా, గడ్కరీ పోలవరం పర్యటన పెట్టుకున్నారు... ఎవరో ఒత్తిడి తెస్తేనే, పర్యటన వాయిదా పడిందని, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి...

తమిళనాడు తరహా కుతంత్రాలు ఇక్కడ సాగవు.. ఆనాడు ప్రధానమంత్రి పదవినే కాదన్నా.. హక్కుల కోసం ప్రశ్నిస్తే బురదజల్లుతారా.. నామీద కోసం ప్రజలపై చూపద్దు.. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు ఎందుకు నెరవేర్చరో ప్రజలకు సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి కేంద్రంపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ 37వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గుంటూరులోని పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తల నుద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు చిరస్థాయిగా పార్టీ నిలిచి ఉంటుందన్నారు. పేదలపాలిట పెన్నిధిగా నిలిచిన ఎన్టీఆర్‌ను సైతం ఆరోజు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక ఇబ్బందులకు గురిచేసి ప్రజాగ్రహాన్ని చవిచూసిందని గుర్తుచేశారు. నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎదురుదాడి కొత్తేమీ కాదన్నారు.

cbn 30032018

నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, ఎన్డీయే-1ల ఏర్పాటు నేపథ్యంలో అప్పట్లో ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చినా తృణప్రాయంగా తిరస్కరించామన్నారు. రాష్ట్రాన్ని హేతుబద్ధతలేకుండా ఓ జాతీయ పార్టీ కుక్కలుచింపిన విస్తరి చేస్తే మరో పార్టీ ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు బీజేపీకి మద్దతి చ్చామన్నారు. గత నాలుగేళ్లుగా హామీలను అమలు చేయకుండా విస్మరించటం వల్లే ఎన్డీయే నుంచి వైదొలగామని తెలిపారు. అండగా నిలుస్తుందని ఆశిస్తే అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తోందని ధ్వజమెత్తారు. ఎక్కడా ఏ తప్పు చేయం.. కక్కుర్తి రాజకీయాలతో ఇరుకున పెట్టాలని చూస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ వైపు హోదా కావాలని కాలు దువ్వుతూ మరోవైపు అంతర్గతంగా ప్రధాని కాళ్లకు మొక్కుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లు సహకరించిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ అవగాహనా రాహిత్యంతో బురద చల్లుతున్నారని మండిపడ్డారు.

cbn 30032018

పోలవరాన్ని అడ్డుకునే ప్రయత్నంచేస్తే మాడి మసైపోతారని హెచ్చరించారు. మాకు ఎవరి దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు.. విభజనతో హక్కుగా వచ్చినవే అడుగుతున్నాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. స్వశక్తితో ప్రపంచస్థాయి రాజధాని నిర్మాణం చేపడతామన్నారు. ఇందుకు ప్రజలు తమ శక్తికొలదీ సహకరించాలని పిలుపునిచ్చారు. నాలుగు దశాబ్దాల ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఆంధ్ర, తెలంగాణలో నిర్ణయాత్మకశక్తిగా రూపుదిద్దుకుని తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు అండగా తమ పార్టీ నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

Advertisements

Latest Articles

Most Read