కేంద్రం పై విపక్షాలు అన్నీ ఏకం అయ్యాయి... ఇప్పటికే టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వగా తాజాగా ఆ జాబితాలో సీపీఎం కూడా చేరింది... తృణమూల్ కాంగ్రెస్ కూడా రేపు నోటీసు ఇవ్వనుంది.. జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, సీపీఎం అవిశ్వాసం నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో తప్పకుండా అవిశ్వాసం ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దీంతో బీజేపీ రేపు అవిశ్వాసం పై చర్చకు రెడీ అవుతుంది... దీంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు... లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు శాసనసభ వ్యూహ కమిటీ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

cbn mps 26032018

రేపటి సభకు ఎంపీలంతా హాజరై అవిశ్వాసంపై చర్చకు పట్టుబట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. తెదేపా, వైకాపాతో పాటు కాంగ్రెస్‌, సీపీఎం కూడా అవిశ్వాస నోటీసులు ఇచ్చాయని చెప్పిన ముఖ్యమంత్రి.. లాటరీ ద్వారా అవిశ్వాసంపై చర్చను చేపట్టే అవకాశం ఉందన్నారు. ముందు నోటీసు ఇచ్చిన పార్టీ అవిశ్వాసంపై చర్చను చేపట్టవచ్చన్నారు. ఈ చర్చ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనదని, లోక్‌సభ వేదికగా ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రతిధ్వనించాలని ఆదేశించారు. ఇది చాలా కీలక సమయమని, అవిశ్వాసంపై చర్చ రాష్ట్రానికి ఎంతో ముఖ్యమన్నారు.

cbn mps 26032018

పార్టీ ఎంపీలంతా ఈ రాత్రికే దిల్లీ చేరుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. రేపటి సభకు పసుపు చొక్కాలు, కండువాలతో హాజరుకావాలన్నారు. అవిశ్వాస తీర్మానం మంగళవారం చర్చకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీల నేతలను కలిసి ఏపీకి సహకరించాలని కోరాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం గురించి అందరికీ వివరించాలని, తమ వద్ద ఉన్న సమాచారం అంతా ఆయా పార్టీల నేతలకు ఇవ్వాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్‌ను ఒంటరి చేయాలనే భాజపా ప్రయత్నాలను తిప్పి కొట్టాలని ముఖ్యమంత్రి ఎంపీలకు సూచించారు. ఎంపీలకు సమాచారం అందించేందుకు రెండు బృందాలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. దిల్లీలో ఒక బృందం, అమరావతి నుంచి మరో బృందం పనిచేస్తోందని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో భాజపా దుష్ప్రచారన్ని అధికం చేసిందని, దీనిపై ఎవరూ అధైర్య పడొద్దని, వెనుకంజ వేయొద్దని నిర్దేశించారు.

గత 10 రోజుల నుంచి, వాయిదాలతో సాగుతన్న పార్లమెంట్, రేపు కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది... తెలుగుదేశం అవిశ్వాసం ఇచ్చిన తరువాత, దేశ రాజకీయాల్లో ఒక కుదుపు వచ్చింది.. అయితే, కేంద్రం మాత్రం, అవిశ్వాస చర్చకు సిద్ధం కాలేక పోయింది... ఒక పక్క సొంత ఎంపీలు వ్యతిరేకంగా ఓటు వేస్తారు అని భయం, మరో వైపు చంద్రబాబు ఇంత మందిని కూడగడితే, చంద్రబాబు పెద్ద నాయకుడుగా కనిపిస్తాడు అనే ఇగో... అందుకే వాయిదా వేస్తూ వచ్చింది... అయితే, ఉన్నట్టు ఉండి కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ఇవ్వటంతో, ఇక బీజేపీ కూడా ఎదో ఒక చర్చ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది...

modi bjp 26032018 2

ఇప్పటికే టీడీపీ, వైసీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇవ్వగా , శనివారం కాంగ్రెస్ పార్టీ కూడా నోటీసు ఇచ్చింది... తాజాగా ఆ జాబితాలో సీపీఎం కూడా చేరింది. . సోమవారం లోక్‌సభ జనరల్ సెక్రటరీకి అవిశ్వాస తీర్మానం నోటీసును అందజేసింది. తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది... రేపటికి సీపీఐతో పాటు, మరిన్ని పార్టీలు కూడా నోటీసు ఇస్తారని తెలుస్తుంది... ఇప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ కచ్చితంగా ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది..

modi bjp 26032018 3

దీంతో ఇక బీజేపీ కచ్చితంగా అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది... గత రెండు రోజులు నుంచి, బీజేపీ ఈ ప్రకారం కసరత్తు చేస్తుంది... ఇప్పటికే, కెసిఆర్ పార్టీ కూడా, మేము ఇక ఆందోళన చెయ్యము, మేము అవిశ్వాసానికి సహకరిస్తాం అని చెప్పారు.. ఇవన్నీ చూస్తుంటే, అవిశ్వాసం పై చర్చకు బీజేపీ రెడీ అవుతున్నట్టే అర్ధమవుతుంది... ఇదిలా ఉంటే.. అవిశ్వాస తీర్మానం ఎల్లుండి లోక్‌సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. కాగా రేపు అవిశ్వాస తీర్మానం నోటీసు అడ్మిట్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి...

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, కేంద్రం సాయం చెయ్యని పరిస్థుతులు నేపధ్యంలో, అన్ని పార్టీలతో అఖిల సంఘాల సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు చొప్పున ఈ సమావేశానికి రావాలని కోరనున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడే వివిధ సంఘాలను ఈ సమావేశానికి పిలవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

cbn 26032018

మరో వైపు నిన్న టెలి కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజల సెంటిమెంట్‌ను అందరూ గౌరవించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీలకు, నేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూటిగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ఆంధ్రా పక్షమా? కేంద్రం పక్షమా? అన్నది ఆయా పార్టీల నేతలే తేల్చుకోవాలన్నారు. ప్రజల కోసం పోరాడే ముఖ్యమంత్రి పక్షాన ఉంటారా? రాష్ట్రానికి అన్యాయం చేసే కేంద్రం పక్షాన ఉంటారా? అని నిలదీశారు. ప్రజల హక్కుల కోసం పోరాడే తెలుగుదేశం పక్షాన ఉంటారా? ప్రజల మనోభావాలను నిర్లక్ష్యం చేసిన బీజేపీ వైపు ఉంటారో నిర్ణయించుకోవాలన్నారు.

cbn 26032018

ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చేవి కూడా ఏపీకి ఇవ్వడం బీజేపీకి ఇష్టం లేదన్నారు. తొలి బడ్జెట్‌లోనే రెక్కలు విరిచి ఎగరమంటే ఎలా? అని కేంద్రాన్ని తాను నాలుగేళ్ల క్రితమే నిలదీశానని చెప్పారు. 29సార్లు ఢిల్లీ వెళ్లి రాష్ట్రాన్ని ఆదుకోమన్నాం. అయినా కేంద్రంలో స్పందన లేదు. అందుకే కేంద్రం నుంచి బయటకొచ్చాం. ఎన్డీయే నుంచి వైదొలిగాం. నిధులు రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేశాం. విధిలేని పరిస్థితుల్లోనే పోరాటమార్గం పట్టాం’ అని చంద్రబాబు చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ.1050కోట్లలో రూ.940కోట్లకు యూసీలిచ్చాం. అమరావతికి ఇచ్చిన వెయ్యి కోట్లకు యూసీలిచ్చాం. గుంటూరు, విజయవాడకు ఇచ్చిన నిధుల్లో రూ.350కోట్లకు యూసీలిచ్చాం. ఆర్థికలోటుకు యూసీలు ఇవ్వనవసరం లేదు. రాష్ట్రానికి చేసిన అన్యాయం ప్రజలకు వివరించాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.

గత పది రోజులుగా కేంద్రం, కెసిఆర్ తో ఆడిస్తున్న అవిశ్వాస డ్రామా ముగిసింది... కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో, ఇక అవిశ్వాస తీర్మానానికి అడ్డు పడ కూడదు అని తెరాస నిర్ణయం తీసుకుంది... గత పది రోజులుగా, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ఇవ్వటం, డ్రామా ప్రకారం, కెసిఆర్ ఎంపీలు, అన్నాడీఏంకే ఎంపీలు వెల్ లో గోల గోల చెయ్యటం, నేను సభ్యులని లెక్కపెట్టాలి అని స్పీకర్ అనటం, వీళ్ళు మరింత ఆందోళన చెయ్యటం, దీంతో సభ్యుల ఆందోళన మధ్య స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభను రేపటికి వాయిదా వెయ్యటం, ఇది రోజు జరుగుతుంది...

modi shah 26032018

అవిశ్వాసాని భయం లేదంటూనే, బీజేపీ ఇలా డ్రామాలు ఆడిస్తుంది అని, విపక్షలాన్నీ అంటున్నాయి... కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ అంటూ డ్రామాలు ఆడుతున్నారని, సాటి తెలుగు వాడికి సాయం చెయ్యలేని వాడు, దేశాన్ని ఉద్దరిస్తాడా అంటూ, ఎద్దేవా చేసాయి... అయితే, దీని వెనుక కెసిఆర్ కు రాజ్యసభ ఎన్నికలు, అలాగే బీజేపీకి సొంత పార్టీ ఎంపీల నుంచి భయంతో ఇన్నాళ్ళు సాగదీసారు.. అయితే, అటు రాజ్యసభ ఎన్నికలు అయిపోవటం, ఇటు బీజేపీ అన్నీ సెట్ చేసుకోవటంతో, రేపు కాని, ఎల్లుండి కాని, అవిశ్వాసం పై, చర్చకు బీజేపీ రెడీ అవుతుంది.. అందులో భాగంగా, రేపు తెరాస కాని, అన్నాడీయంకే కాని ఆందోళన చెయ్యవు... తెరాస అయితే, ఈ విషయం ఇప్పటికే ప్రకటించింది కూడా...

modi shah 26032018

ఇక రేపు అవిశ్వాసం ఎదుర్కుంటానికి బీజేపీ రెడీ అవుతుంది... అటు అద్వానీ వర్గం ఎంపీలను ఇప్పటికే చల్లబరిచారు.. ఇటు కొంత మంది విపక్షాలను కూడా లొంగదీసుకున్నారు.. ప్రభుత్వానికి భయం లేదు అని నిర్ధారణకు వచ్చిన తరువాత, ఇక ఇప్పుడు చర్చ అంటూ మొదలు పెట్టి, ఇక్కడ ఎన్ని డ్రామాలు ఆడుతారో చూడాల్సి ఉంది... ఏది ఏమైనా, మన రాష్ట్ర సమస్యలు దేశం మొత్తం వినిపించి, కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని దేశానికీ చెప్పే అవకాసం ఉంది... మరి, అంత అవకాశం వీళ్ళు ఇస్తారో, బుల్డోజ్ చేసి పడేస్తారో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read