ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నమ్మకంతో, భారత రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌, కార్పొరేట్‌ దిగ్గజాలు, ప్రముఖ విద్యావేత్తల సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో లిబరల్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు కానుంది.... దాతృత్వ కార్యకలాపాల్లో భాగంగా పలు కార్పొరేట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్న ఈ యూనివర్సిటీకోసం తొలి విడుత రూ.750 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ చైర్మన్‌, యూనివర్సిటీ సూపర్‌ వైజరీ బోర్డ్‌ చైర్మన్‌ ఆర్‌ శేషసాయి ఒక ప్రకటనలో వెల్లడించారు. .. క్రెయా యూనివర్సిటీ పేరుతో దీన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు... ఈ యూనివర్సిటీలో మొదటి బ్యాచ్‌ 2019 జూలైలో ప్రారంభం అవుతుందని, ప్రవేశాలు నవంబరులో ప్రారంభం అవుతాయన్నారు. హాస్టల్‌తో కలిపి ఫీజు 7-8 లక్షల రూపాయలుంటుందని చెప్పారు.

rbi 24032018 2

తొలుత శ్రీసిటీలోని ఐఎ్‌ఫఎంఆర్‌ క్యాంపస్‌ నుంచి కోర్సుల నిర్వహణ జరుగుతుందని, తర్వాతి కాలంలో యూనివర్సిటీకి మారిపోతుందన్నారు. శ్రీసిటీలో 200 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న ఈ క్యాంపస్ 2020 నాటికి సిద్ధంకానున్నది. లిబరల్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌లో నాలుగేళ్ల రెసిడెన్షియల్‌ అండర్‌గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రామ్‌ను ఆఫర్‌ చేస్తామని, బిఎ (హానర్స్‌), బిఎ్‌సఇ (హానర్స్‌)కు ఇవి సమానమని తెలిపారు. వీటికి యుజిసి నుంచి అనుమతులు కోరినట్టు ఆ ప్రకటనలో తెలిపారు.

rbi 24032018 3

విశ్వవిద్యాలయ పాలక మండలి సలహాదారు రఘురాం రాజన్‌ మాట్లాడుతూ... ప్రపంచ అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యే భారతీయ విద్యార్థుల తరాన్ని తయారు చేసేందుకు తమవంతు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం మనదగ్గర లేని విధానాన్ని అందుబాటులోకి తేదలిచామనీ, ఇది తప్పకుండా మంచి భవిష్యత్తుకు భరోసా కల్పిస్తుందన్నారు. భారతీయ, అంతర్జాతీయ స్థాయి మేధస్సును మేళవించే వేదికగా ఈ విశ్వవిద్యాలయం ఉంటుందని పాలకమండలి మరో సభ్యుడు, ఎస్‌జేడబ్ల్యూ గ్రూప్‌నకు చెందిన సజ్జన్‌ జిందాల్‌ అన్నారు.

బీజేపీ అధ్యక్షడు అమిత్ షా రాసిన 9 పేజీల లేఖ పై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పందించారు... అమిత్ షా అబద్ధాలు చెప్తున్నారని, 9 పేజీల లేఖలో ప్రతి విషయం వివరిస్తూ, అమిత్ షా అబద్దాలని ఏకి పడేసారు... ఇన్నాళ్ళు తమ మాటలతో, చేతలతో, అన్ని రాష్ట్రాల మీద పై చేయి సాధించిన మోడీ - షా, ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ, ఇలాగే తప్పుడు కధనాలతో, ఫేక్ ప్రోపగండాతో, బుల్డోజ్ చెయ్యాలని ప్రయత్నించారు... కాని, ఇక్కడ ఉంది చంద్రబాబు నాయుడు... ఈయనకి సహనం ఎక్కువ... కాని ఒక్కసారి, ఆ సహనం నశిస్తే, ఎంతటి వాడైనా, ఆయనకు ఒక్కటే... ఇన్నాళ్ళు ఎడా పెడా రెచ్చిపోయిన అమిత్ షా, మోడీకి, ఇప్పుడు చంద్రబాబు ఒక స్పీడ్ బ్రేకర్ లా తగిలారు...

mamata 24032018

చంద్రబాబు అసెంబ్లీలో వాయించిన వాయింపు, ఇప్పుడు నేషనల్ టాపిక్ అయ్యింది... అమిత్ షా చెప్పిన అబద్ధాలు, చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ఎండగట్టిన విధానం, అందరి మన్ననలు పొందుతుంది... పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, చంద్రబాబు అసెంబ్లీలో అమిత్ షా ను, చాకిరేవు పెట్టిన విధానం పై ట్వీట్ చేసారు... చంద్రబాబుని అభినందిస్తున్నా, ఇలాంటి వారి అబద్ధాలు చంద్రబాబు సమర్ధవంతంగా తిప్పి కొట్టారు... ఇలా అబద్ధాలు చెప్పటం వారికి బాగా అలవాటు అయ్యింది... అంటూ చంద్రబాబు పై ట్వీట్ చేసారు...

mamata 24032018

ఆ ట్వీట్ సారంశం ఇది... "I appreciate that Chandrababu Naidu Ji @ncbn has stated the facts. Very good. There are many so called leaders who spread lies. They make this a habit. They try and bulldoze States and show that they are doing the States a favour by giving funds. This is fake federalism"

చంద్రబాబుకు మోడీ అంటే భయం... చంద్రబాబు కేసులకి భయపడుతున్నాడు... చంద్రబాబు ఓటుకి నోటు కేసులో జైలుకు వెళ్తాడు అందుకే మోడీ అంటే భయం... చంద్రబాబు మీద సిబిఐ కేసు వేస్తారని భయం... ఇలా ప్రతి పిల్లకాయి గాడు, ఒక నాలుగురుని పోగేసి రెచ్చిపోవటమే... కట్ చేస్తే, ప్రతి రోజు మోడీ, అమిత్ షా కు, చంద్రబాబు చాకిరేవు పెడుతున్నాడు... ఆ రోజు చంద్రబాబుకి మోడీ అంటే భయం అన్న పోటుగాళ్ళు, మోడీ పేరు పలకటానికి కూడా భయపడి నాటకాలు ఆడుతూ, ఎదురు చంద్రబాబుని తిడుతున్నారు... పోలవరానికి డబ్బులు తక్కువ ఇచ్చినా బయటకు రారు, ఈశాన్య రాష్ట్రాలకు హోదా బెనిఫిట్స్ ఇచ్చినా బయటకు రారు.. కాని చంద్రబాబు మాత్రం మోడీ, అమిత్ షా ని చీల్చి చెండాడుతున్నాడు...

cbn 24032018 1

ఈ రోజు అమిత్ షా, చంద్రబాబుకి 9 పేజిల లేఖ రాసారు... దాంట్లో చెప్పని అబద్ధం లేదు... ఆ స్క్రిప్ట్ ఎవరు రాసారో కాని, పచ్చి అబద్ధాలు.. దీంతో చంద్రబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది... అసెంబ్లీ వేదికగా చాకిరేవు పెట్టారు... ‘‘అమిత్‌షా రాసిన లేఖ నాకు కాదు. రాష్ట్రాన్ని కించపరుస్తూ అమిత్‌షా లేఖ రాశారు. కేంద్రానికి ఏపీ ప్రజలు నీచంగా కనిపిస్తున్నారా?. యుద్దానికి వాడే డబ్బులు అడిగామా మనం?. విభజన చట్టంలో పెట్టినవే ఇవ్వమన్నాం. ఇవ్వాల్సినవి ఇవ్వకుండా వక్రీకరిస్తూ లేఖలు రాస్తారా?’’ అంటూ మొదలు పెట్టి, 9 పేజిల లేఖలో పాయింట్ బై పాయింట్ చదువుతూ, లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు...

cbn 24032018 1

అమిత్‌షా ప్రకటించిన 9 పేజీల లేఖలో అన్నీ అసత్యాలే ఉన్నాయని.. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అసత్యాలు చెబుతారా అని ప్రశ్నించారు. అసత్యాలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అడుగుతున్నానన్నారు. ఎవరిపై ఎదురుదాడి చేయాలని మీ ఉద్దేశం.. రాష్ట్రానికి ఏం మేలు చేశారన్నారు. మాకు రావాల్సిన వాటిని అడిగితే కేంద్రం భాద్యతలేకుండా తిరిగి ఎదురుదాడి చేయడం ఎంతవరకూ సబబు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా లెక్కలేనితనంగా వ్యవహరిస్తున్నారని చెప్తూ, ప్రతి విషయం పై అమిత్ షా రాసిన అబద్ధాలాను అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు...

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా త‌న‌కు రాసిన 9 పేజీల లేఖ పై స్పందిస్తూ, చంద్రబాబు సినిమా పంచ్ లకు మించిన పంచ్ లు వేసారు... శనివారం ఆ లేఖను అసెంబ్లీలో చదివి వినిపించారు... ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక పక్క వాస్తవాలు చెప్తూ, ఎక్కడ చురకలు అంటించాలో అక్కడ అంటించారు.... కేంద్రం ఇస్తున్న పధకాలకు, మోడీ ఫోటో పెట్టటం లేదంటూ చెప్తున్నారు, మీ మోడీ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు కేంద్ర పధకాలకి మన్మోహన్ ఫోటో పెట్టారా ? సోనియా గాంధి ఫోటో పెట్టారా అంటూ పంచ్ వేసారు.. అంతే ఒక్క బీజేపీ ఎమ్మల్యేకు సౌండ్ లేదు...

cbn modi 24032018 2

మరో పక్క, నేను తెలుగుదేశం పార్టీకి, రాష్ట్రానికి శ్రేయోభిలాషిని అని అమిత్ షా అంటున్నారు, ఆయాన అంత పెద్ద శ్రేయోభిలాషి అయితే నేను ఎందుకు వదులుకుంటాను ? దండలు, సాలువాలు నాలుగు ఎక్కువ కప్పేవాడిని అంటూ, కౌంటర్ ఇచ్చారు... అలాగే, మిత్రధ‌ర్మాన్ని పాటించ‌కుండా త‌మ పార్టీతో టీడీపీ తెగ‌దెంపులు చేసుకుంద‌ని బీజేపీ నేత‌లు అంటున్నార‌ని, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తెలంగాణలో ఎవరిని అడిగి టీడీపీతో బీజేపీ తెగదెంపులు చేసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్ర‌శ్నించారు... మిత్ర‌ధ‌ర్మం విష‌యంలో తాను తొంద‌ర‌ప‌డ్డానా? బీజేపీ తొంద‌ర‌ప‌డిందా? అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు.

cbn modi 24032018 3

ప్రజలు కట్టిన పన్నుల్లోంచే రాష్ట్రానికి వాటా ఇస్తున్నారని, కేంద్ర విద్యాసంస్థలకు రూ.11672 కోట్లు అవసరమైతే 576 కోట్లు ఇచ్చారని చెప్పారు. కేంద్ర విద్యాసంస్థలకు రూ.11584 కోట్ల విలువైన భూములు ఇచ్చామని ఈ సందర్భంగా బాబు గుర్తుచేశారు... అలాగే, ఆంధ్రప్రదేశ్ కోసం ఆరోజు పార్లమెంట్ లో పోరాడింది బీజేపీ మాత్రమే అని గుర్తుంచుకోవాలని అమిత్ షా రాసిన రాతల పై స్పందిస్తూ, ఈయన ఆరోజు ఢిల్లీలో లేడేమో ..నేనున్నా ..20 నిమిషాల్లో పాసైన ఆ బిల్లులో, వీళ్ళు పోరాడింది ఏంటి ? కాంగ్రెస్ కి వీళ్ళు ఏమి డిస్కషన్ లేకుండా మద్దతిచ్చారు... కనీస స్పృహ ఉండక్కర్లా ...ఇలాంటివి రాసేముందు.. ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాం,అనే కనీస స్పృహ ,పద్దతి,హుందా లేకుండా రాసిన లెటర్ అది... చట్టం అమలు చేయమన్నాం..వీళ్ళు సాయంచేసినా..ఊరికే తీసుకోమ్..ఆంతకంత తిరిగిస్తారు ఆంధ్రులు అంటూ చంద్రబాబు అమిత్ షా ని వాయించి పెట్టారు...

Advertisements

Latest Articles

Most Read