నిన్న ఢిల్లీలో, రాష్ట్ర విభజన చట్టంలోని 13వ షెడ్యూల్‌లో పేర్కొన్న హామీల అమలు పురోగతిని సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గాబాతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్ కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏపీ అధికారులు రైల్వే జోన్ గురించి ప్రస్తావించగా రాజీవ్ గాబా మాట్లాడుతూ ప్రత్యేక రైల్వే జోన్ వల్ల ఏపీకి ప్రత్యేకంగా ఒరిగేది ఏమీ ఉండబోదన్నారు.

modi 13032018 2

దీంతో అక్కడ మన ఆంధ్రప్రదేశ్ అధికారులు గట్టిగా గొడవ చెయ్యటంతో, మేమైతే ఇది కుదరదు అని చెప్తున్నామని అధికారులు చెప్పారు.. కేంద్రం ముందుకు వెళ్ళాలి అనుకుంటే, ఈ విషయంలో రాజకీయ నిర్ణయం అవసరమని, నెల రోజుల్లో కేంద్ర హోంమంత్రితో సమావేశం ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబును కూడా పిలుద్దామని అన్నారు... దీంతో రాష్ట్ర అధికారులు తీవ్ర నిరాశతో, విషయన్ని ముఖ్యమంత్రికి చెప్పారు... రైల్వే జోన్ కూడా ఇక ఇవ్వరు అనే అభిప్రాయం కలుగుతుందని, అధికారులుగా ఇక మేము ఏమి చెయ్యలేని స్థితి ఉందని, కేంద్ర అధికారులు తెగేసి ఇది లాభం కాదని చెప్తున్నారని చెప్పారు...

modi 13032018 3

దీంతో రాజకీయంగా దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనేది అలోచించి, ముందుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ ని కలవాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను చంద్రబాబు ఆదేశించారు... దీంతో ఈ రోజు సాయంత్రం, నాలుగు గంటలకు ఎంపీలు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ కానున్నారు... ఈ సందర్బంగా విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఇవ్వాల్సిందే అని గట్టిగా చెప్పనున్నారు... దీంతో ఈ రోజుతో, రైల్వే జోన్ కేంద్రం ఆమోదిస్తుందో లేదో, తేలిపోనుంది... పీయూష్ గోయల్‌ కి చంద్రబాబుకి ఎంతో సాన్నిహిత్యం ఉంది... చాలా సందర్భాల్లో పీయూష్ గోయల్‌, నేను చంద్రబాబుకి వీరభిమానని అని చెప్పుకున్నారు కూడా... అయితే, ఈ విషయంలో మోడీ డైరెక్ట్ ప్రమేయం ఉండటంతో, ఏమి చెయ్యలేని పరిస్థితి...

ముఖ్యమంత్రి చంద్రబాబు రోజు రోజుకీ స్వరం పెంచుతున్నారు... ఢిల్లీ పై జరుగుతున్న పోరాటంలో, వారు ఆడుతున్న నాటకాలని బయట పెడుతున్నారు... రాష్ట్రంలో మోడీ పేరు చెప్పి మరీ, విమర్శలు చేస్తున్నది చంద్రబాబు ఒక్కరే... ఈ రోజు కూడా, ఢిల్లీలో ఉన్న టీడీపీ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, తీవ్ర వ్యాఖ్యలు చేసారు... ఆర్థిక నేరస్థులు ప్రధానిని కలవడం ఎక్కడైనా ఉందా ? అలాగే పీఎంవో చుట్టూ ఏ2 నిందితుడి ప్రదక్షిణలు ఏం సంకేతాలు పంపిస్తున్నాయి..? అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని, పీఎంవోని ఉద్దేశించి పేర్కొన్నారు.... ఒకవైపు విశ్వాసం ఉందంటారు,మరోవైపు అవిశ్వాసం పెడతామంటారా అని ఆయన ఆగ్రహాం వ్యక్తంచేశారు. ఎందుకీ డ్రామాలు...?నాటకాలు...అని ప్రశ్నించారు.

cbn pmo 13032018 2

ప్రజలు వైకాపాను అసహ్యించుకునే రోజు దగ్గరలోనే ఉందన్నారు. తెదేపా ఎంపీలు కలిసికట్టుగా ఉండి..చిత్తశుద్ధితో పోరాటం చేయాలని హితవు పలికారు. ఇది కీలక సమయమని...సభకు ఎవరూ గైర్హాజరు కావొద్దని కోరారు. కేంద్రం నుంచి ఎంత వచ్చింది, ఇంకా ఎంత రావాలి అనే వివరాలను ఆన్ లైన్‌లో ఉంచామని తెలిపారు. ఈ సమాచారాన్ని ఎంపీలు వినియోగించుకోవాలన్నారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే తెదేపా ఎంపీల పోరాటం ఉండాలని... పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీలను కూడా సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఆ రోజు సెంటిమెంటుకు ప్రత్యేక రాష్ట్రమే ఇచ్చారన్నా ముఖ్యమంత్రి.. ఈ రోజు సెంటిమెంటు చూసి డబ్బులు ఇవ్వలేమంటారా? అని ప్రశ్నించారు. ఇదేం న్యాయం.. అని మండిపడ్డారు.

cbn pmo 13032018 3

ప్రజల తరఫునే ప్రతినిధులు నిలబడాలని...,ప్రజల గొంతు పార్లమెంటులో ప్రతిధ్వనించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. 5 కోట్ల ప్రజల మనోభావాలపై కేంద్రం ఉదాసీనత భావ్యంకాదన్న ముఖ్యమంత్రి ....అభివృద్ధి ఆగిపోకుండా పోరాటం నిర్మాణాత్మకంగా జరగాలన్నారు. మన హక్కులలో రాజీలేదని, ప్రత్యేక హోదా తమ హక్కు.. ఎందుకివ్వరు? అని ప్రజలు భావిస్తున్నారని సీఎం తెలిపారు. పునర్వవస్థీకరణ చట్టం, హామీల అమలుపై ఈ రోజు శాసనసభలో ప్రత్యేక తీర్మానం చేయనున్నట్లు సీఎం తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు... కేంద్రం ఎంతకూ దిగి రాకపోవటంతో, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నారు... ఇందుకోసం, ముందుగా ప్రజల్లోకి వెళ్ళాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు... అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జనంలోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించుకున్నారు. జిల్లాల్లో పర్యటించి తాజా పరిణామాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిశ్చయించుకున్నారు. కేంద్ర వ్యవహరించిన తీరు, రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నేరుగా ప్రజలకు వివరించేందుకు ముఖ్యమంత్రి స్వయంగా ప్రజల్లోకి వెళ్లనున్నారు.

cbn 13032018 2

రాష్ట్రంలో అనూహ్యంగా మారిన రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రజల్లో కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని వివరించి, తమ వాదన వినిపించేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం... కొన్ని చానల్స్ లో పాదయాత్ర అనే వార్తలు వస్తున్నా, అది కుదరకపోవచ్చు అని తెలుస్తుంది... బస్సు యాత్ర ద్వారానే ప్రజల వద్దకు చంద్రబాబు వచ్చే అవకాసం ఉంది... ఎదో జిల్లాల పర్యటన కాకుండా, ఒక యాత్ర ద్వారానే, జిల్లాలు చుట్టి వచ్చే అవకాసం ఉంది..

cbn 13032018 3

కేంద్రం చేస్తున్న అన్యాయంతో పాటు, రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం తిప్పి కొట్టటం, అలాగే జగన్ ఆడుతున్న డ్రామాలు ప్రజల వద్దకు వెళ్లి, వారికే వివరించనున్నారు... అలాగే అప్పుడు హోదా వద్దని, ప్యాకీజికి ఎందుకు ఒప్పుకున్నారు, తరువాత కేంద్రం ఎలా మోసం చేసింది, మిగలిన రాష్ట్రాలకు హోదా ఇస్తున్నప్పుడు, మనకు ఎందుకు ఇవ్వరు అంటూ అడుగుతున్న అంశాల పై, ఈ యాత్రలో చంద్రబాబే స్వయంగా ప్రజలకు వివరించనున్నారు..

మనకు ఇది వరకు తెలిసింది, ఇరిగేషన్‌ ప్రాజెక్ట్ లు అంటే, ధన యజ్ఞం... అలాంటిది, చంద్రబాబు వచ్చిన తరువాత, సంవత్సరం లోపే, పట్టిసీమ పూర్తి చేసి, అసలైన జల యజ్ఞం అంటే ఏంటో చేసి చూపించారు... అదే స్ఫూర్తితో, ప్రాధాన్యతా క్రమంలో, రాష్ట్రంలో ప్రాజెక్ట్ లు పూర్తి చేసుకుంటూ వస్తున్నారు... అదే క్రమంలో, మొన్నటి దాక 28 ప్రాజెక్ట్ లు ప్రాధాన్యతా క్రమంలో పెడితే, వాటిని 50 కి పెంచారు... ఇప్పుడు, ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో మరో రెండు ప్రాజెక్టులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేర్చారు. పోలవరం సహా వివిధ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన సోమవారం వెలగపూడి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

cbn 13032018 2

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల రిజర్వాయర్, తోటపల్లి కుడి, ఎడమ కాలువల అభివృద్ధి పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ రెండింటితో ప్రాధాన్య ప్రాజెక్టుల సంఖ్య 52కు చేరింది. ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభించగా మరో 5 పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 15 నాటికి మరో 15 ప్రాజెక్టులు పూర్తికానున్నాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు 54శాతం పూర్తయిందని తెలిపారు. జలసంరక్షణ ఉద్యమం చేపట్టి నెల రోజులు కావస్తోందని, 247 కోట్ల రూపాయల పనులు చేపట్టామన్నారు.

cbn 13032018 3

రాష్ట్రంలో 52 ప్రాజెక్టులను ప్రాధాన్యతాపరంగా గుర్తించగా, వాటిలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని , రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ప్రస్తుతం ప్రారంభానికి 5 ప్రాజెక్టులు సిద్ధంగా ఉండగా, వచ్చే జూన్ నాటికి 15 ప్రాజెక్టులను పూర్తిచేయనున్నామన్నారు. ఇవే కాకుండా ఈ ఏడాది డిసెంబర్ నాటికి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తిచేసేలా ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్‌ వే, స్పిల్‌ చానెల్‌, అప్రోచ్‌, పైలెట్‌ చానల్‌, స్పిల్‌ చానల్‌ బ్రిడ్జి, డయాఫ్రమ్‌వాల్‌, రేడియల్‌ గేట్ల నిర్మాణం ద్వారా వరద నీటి మళ్లింపునకు మొత్తం రూ.9,189.81 కోట్ల వ్యయమయ్యిందన్నారు.

Advertisements

Latest Articles

Most Read