రాష్ట్రం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ఎదురు తిరిగింది... చివరకు ఎంతో సహనంతో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, మిత్రపక్షం అనే ఇది కూడా లేకుండా, మోడీ చేస్తున్న పనులు అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు... చివరకు టిడిపి మంత్రుల్ని రాజీనామా చేపించారు కూడా... ఢిల్లీ పై ఇక యుద్ధమే అనే సంకేతాలు పంపించారు... ఈ పరిణామాలకు ప్రధాన కారణం అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టి, ఇంకా ఇంతకు మించి మేము సాయం చెయ్యలేము అంటూ, ఇక హోదా అనే మాటే లేదు అని తెగేసి చెప్పటం... దీంతో చంద్రబాబు ఇక కేంద్రంతో తేల్చుకునే పనిలో పడ్డారు...

vijasayi 09032018

కాని ప్రధాన ప్రతిపక్షం మాత్రం, దొంగ నాటకాలు ఆడుతుంది... తన కేసులు మాఫీ కోసం, నటనలు చేస్తూ సీన్ పండిస్తున్నారు... మోడీని ఒక్క మాట, ఒక్క ప్రశ్న అడిగే దమ్ము ఒక్కరికి కూడా లేదు... ఎంత సేపు చంద్రబాబు చంద్రబాబు అనే జపం చెయ్యటమే... తాజగా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, విజయసాయి రెడ్డి, నిస్సిగ్గుగా వాళ్ళ ప్లాన్ ఏంటో బయట పెట్టాడు... మాకు రాష్ట్రం ముఖ్యం కాదు, మా కేసులే ముఖ్యం అనే విధంగా మాట్లాడారు... ఇండియా టుడే ఇంటర్వ్యూ లో, విజయసాయిని యాంకర్ ఒక ప్రశ్న అడిగారు... "బీజేపీ హోదా ఇవ్వను అంటుంది రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇస్తాను అంటున్నాడు, మీరేమో ఎవరు హోదా ఇస్తే వారితో కలుస్తా అంటున్నారు, మరి రాహుల్ తో కలుస్తారా అని ప్రశ్నించారు"

vijasayi 09032018

అప్పుడు విజయసాయి మాట్లాడుతూ, రాహుల్ అంటే నమ్మకం లేదు అని చెప్పారు... కాని మోడీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది అని, మోడీ తప్పకుండ హోదా ఇస్తారంటూ, విస్మయం కలిగించే సమాధానం చెప్పారు.. తన నోటితో తానే, వాళ్ళ రాజకీయ వ్యూహం బయటపెట్టారు.. అంటే కొన్ని రోజులుగా ప్రచారంలో ఉనట్టు, వైసిపీతో పొత్తు కోసం, టిడిపిని బయటకు గెంటారు... ఇప్పుడు హోదా అనో, ఎదో ఒక సోది చెప్పి, టిడిపి మీద నెపం నెడతారు... అప్పుడు జగన్ వెళ్లి బీజేపీతో చేరతాడు.. ఇదే వీరి వ్యూహం అని చెప్పకనే చెప్పారు.. ఎందుకంటే, ప్రస్తుతం, బీజేపీ హోదా అనే మాటే లేదు అంది... రాహుల్ నేను మొదటి సంతకం హోదా మీద అంటున్నాడు... మరి హోదా ఎవరు ఇస్తే వారే మాకు కావలి అనే జగన్, ఇప్పటికీ మోడీ మీద ఎలా నమ్మకం పెట్టుకున్నాడు ? రాహుల్ ఇస్తాను అంటున్నా, కనీసం ఎందుకు స్వాగాతించటం లేదు ? రాబోయే రోజుల్లో, వీరి నాటకాలు బయట పడతాయి...

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వై విజయసాయిరెడ్డికి, తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఢిల్లీ వేదికగా సవాల్ విసిరారు. విజసాయి రెడ్డి, నేను రాజీనామాకు సిద్ధం, వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా, నాతొ పాటు వచ్చి తన పదవికి రాజీనామా చెయ్యి... ఇద్దరం ప్రజల్లోకి వెళ్దాం, ఎవరు ఏంటో ప్రజలే చెప్తారు అంటూ, జేసీ దివాకర్ రెడ్డి, విజసాయి రెడ్డికి సవాల్ విసిరారు... ఊరికే రాజీనామాలు అంటూ మీడియాలో హడావిడి కాదు, జైట్లీ స్పష్టం చెయ్యగానే మా మంత్రులు రాజీనామా చేసారు, వీరు మాత్రం ఏప్రిల్ 6 దాకా ఆగుతారంట, అంటూ ఎద్దేవా చేసారు...

diwakar 09032018

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విజయసాయికి చిత్తశుద్ధి, రాష్ట్రంపై ప్రేమ ఉంటే వెంటనే రాజీనామాకు కలిసిరావాలని అన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య ట్రిపుల్ తలాక్ అయిపోయిందని, వారి పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించాలని అన్నారు. తాము వదిలేసిన బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖాకు సిద్ధమైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన థర్డ్ ఫ్రంట్ వెనుక చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం లేదని, చంద్రబాబు వెనుకే అందరూ రావాల్సి వుంటుందని అన్నారు.

diwakar 09032018

మరో పక్క, టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజుకో విధంగా వేషం వేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. మొదటి కృష్ణుడిగా, ఆపై ఎన్టీఆర్ వేషధారణలో మొన్న రైతులా వచ్చిన ఎంపీ నేడు కోయదొర వేషంలో పార్లమెంటుకు వచ్చారు. పార్లమెంటు ఆవరణలో కుర్రోకుర్రు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘చెప్పినవాట వింటే హుర్రో హుర్రు...వినకపోతే పుర్రోపుర్రు. ఇందిరాగాంధీకి చెప్పినా...ఎన్టీఆర్‌తో పెట్టుకోవద్దని. నా మాట వినలేదు. దాంతో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సోనియాతో చెప్పినా... తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని...నా మాట వినకుండా విభజన చేశారు. ఇప్పుడు ఆ పార్టీ ఎన్ని కష్టాలు పడుతుందో అందరికి తెలుసు. మోదీ...సఖ్యంగా ఉండేది ఇష్టాం లేదా?...మీకు మూడిందా ఏంది? తెలుగు ప్రజల ఆత్మగౌరవ నాడి తెలియలేదా ఏంది? ఇలానే ఉంటే మీ పని పుర్రోపుర్రు. దీని అర్థం ఆంగ్లంలో ‘అవుట్’ అని కోయదొర వేషంలో ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు... శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి సుజనాచౌదరి తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే... తరువాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా, అశోక్‌గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ పై చేసిన కామెంట్, శభాష్ అనిపించేలా ఉన్నాయి... ‘‘ఆనాడు అసెంబ్లీ వ్యతిరేకించినా జాతీయపార్టీలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను విభజించాయి. ఆరోజు భాజపా మద్దతు ఇవ్వకపోతే విభజన జరిగి ఉండేది కాదు. అందువల్ల న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపైనా ఉంది. ఇప్పుడు మళ్లీ మేం గడియారాన్ని వెనక్కు తిప్పమని అడగడం లేదు. ఇచ్చిన హామీలను గౌరవించండి." అని అన్నారు....

ashok 09032018

"మేం భారతీయులం... సోమరిపోతులంకాదు. కష్టపడి దేశానికి మా వంతు చేయూతనందిస్తాం. ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. ప్రభుత్వ స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేసి రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కష్టం ధారపోస్తున్నారు. ఇందుకు కేంద్రం చేయూత తోడైతే రాష్ట్రం మరింత ముందుకెళ్తుంది. మా గురజాడ అన్నట్లు... దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అని గుర్తుంచుకుంటే చాలు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలి. దాన్ని ఎలా చేయగులుగుతారో చెప్పాలి...’’ అంటూ ఆంధ్రా వాడి సత్తా ఏంటో చాటి చెప్పారు...

ashok 09032018

మరో పక్క సుజనా మాట్లాడుతూ, ‘‘ఆ రోజు పూర్తి అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజన బిల్లును పాస్‌ చేసిన విధానం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియగా జరగలేదు. పార్లమెంటు ఉభయసభల్లో నాడు విభజన బిల్లు ఎలా పాసైందో అందరికీ తెలుసు. అయినా ఆ గాయాలను మరిచి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఎన్డీయేతో కలిశాం. ప్రత్యేకహోదా అంశాన్ని సరైన సమయంలో పరిష్కరించలేదు. ఇది వరకు చెప్పిన ప్రత్యేకప్యాకేజీనైనా ప్రకటించిన వెంటనే అమలు చేసి ఉంటే బాగుండేది. కనీసం అది కూడా చేయలేదు. ఒక జాతీయపార్టీ దగా చేస్తే... మరో జాతీయ పార్టీ మోసం చేసింది. దానివల్లే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. " అంటూ కుండ బద్దలు కొట్టారు...

టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనతో ప్రధాని ఫోన్‌ సంభాషణను ఎంపీలకు సీఎం వివరించారు. జాతీయ స్థాయిలో పార్టీల అభిప్రాయాలను చంద్రబాబు, ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. మిగతా జాతీయ పార్టీలు కూడా మన కోసం కలిసి వచ్చి పోరాడేలా, మనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని చెప్పారు.. ఇదే సందర్భంలో నిన్న జగన్ చేసిన సూచన పై చంద్రబాబు స్పందించారు... మంత్రుల రాజీనామాతో ఏమీ కాదు, మంత్రులు రాజీనామా చెయ్యాలి, అవిస్వాసం పెట్టాలి, నన్ను ఫాలో అవ్వండి అంటూ, నిన్న జగన్ చేసిన సూచన పై చంద్రబాబు ఒకింత విస్మయం వ్యక్తం చేసారు...

cbn 089032018 2

జగన్ లాంటి వాడి దగ్గర నుంచి, జాతీయ జకీయాలు గురించి నేను నేర్చుకోవాలా ? జాతీయ రాజకీయాలను జగన్ దగ్గర తానిప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ఆక్రమాస్తులు, క్విడ్ ప్రోకోలకు సంబంధించి 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాను అనుసరించడం ఏంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.. మేము తీసుకున్న నిర్ణయం, తీసుకోబోయే నిర్ణయాలు జగన్ లాగా సొంత ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనల కోసమని స్పష్టం చేసారు...

cbn 089032018 3

టీడీపీ తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో పలు పార్టీల అభిప్రాయాలను ఇప్పటికే అడిగి తెలుసుకున్నానని, ఎన్నో పార్టీలు మద్దతు పలికాయని వెల్లడించారు. పలు పార్టీలు టీడీపీకి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మనమేమీ గొంతెమ్మ కోరికలను కోరడం లేదని, చట్టంలో ఉన్నవే అడుగుతున్నామని స్పష్టం చేశారు. నాలుగేళ్ల పాటు ఎదురుచూసినా ఫలితం రానందునే రాజీనామాలు చేశామని తెలిపారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రజా ప్రయోజనాల కోసమే కేంద్రం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. పార్లమెంట్ వేదికగా ఎంపీలు తమ నిరసనలను కొనసాగించాలని ఆదేశించారు.

Advertisements

Latest Articles

Most Read