బుధవారం చంద్రబాబు అసెంబ్లీలో రాష్ట్ర విభజన హామీలపై కీలక ప్రసంగం చేశారు.. రాష్ట్ర విభజన సమయంలో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన భాజపా ఇప్పుడెందుకు ఇవ్వడంలేదని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. 14వ ఆర్థిక సంఘం వద్దని చెప్పినందువల్లే ఎవరికీ ప్రత్యేకహోదా ఇవ్వడంలేదని ఇప్పుడు భాజపా అంటోందని, అలాంటప్పుడు ప్రస్తుతం హోదా కింద ఇప్పుడు ఏయే రాష్ట్రాలకు ఎంతమేర నిధులు, సౌకర్యాలు కల్పిస్తున్నారో అవన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తప్పకుండా ఇవ్వాల్సిందేనని డిమాండ్‌ చేశారు.

cbn seats 07032018 2

అయితే ఇదే సందర్భంలో చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.. అసెంబ్లీ సీట్లు పెంచమని విభజన చట్టంలో ఉందని... కాని ఈ విషయాన్ని తాను అడగదల్చుకోలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు... ఇలా అడిగితే మళ్ళీ రాజకీయం చేస్తున్నా అంటారు... అన్ని విషయాలు వదిలేసి, ఇదే అడుగుతున్నా అంటారు... ఇది ఇవ్వకపోయినా పరవాలేదు, మిగతా అన్ని విభిజన హామీలు నెరవేర్చండి అంటూ కేంద్రాన్ని డిమాండ్ చేసారు.. నేను 29 సార్లు దిల్లీకి వెళ్లాను. అందరినీ కలిశాను. పదేపదే విజ్ఞప్తి చేశాను. మా మంత్రులను, అధికారులను, ఎంపీలను పంపాను. ప్రత్యేకహోదా ఇవ్వరు, నిధులు ఇవ్వరంటే చాలామంది ఆందోళన చెందారు. భయభ్రాంతుల‌కు గురయ్యారు. ఆ సమయంలో ప్రధానికి ఫోన్‌చేసి ఇక్కడి పరిస్థితిని వివరిస్తే.. ఆయన రమ్మన్నారు. దిల్లీకి వెళ్లాం. నీతిఆయోగ్‌ను పిలిచి చెబితే అన్నీ వివరించాం.

cbn seats 07032018 3

పార్లమెంట్‌లో బిల్లు పాస్‌ చేసినప్పుడు ప్రస్తుత కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పోరాడి బిల్లులో కొన్ని అంశాలు పెట్టి పాస్‌ చేయించారు. మరి దాన్ని అమలుచేయడంలో మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్‌ పట్ల ఎందుకింత ఉదాసీనత? అని అడుగుతున్నా. అప్పుడు ఆంధ్ర ప్రజలు పోరాడారు. ఇప్పటికీ పోరాడుతున్నారు. సరికాదని ప్రతిపక్ష పార్టీలన్నీ చెబుతున్నప్పుడు ఎందుకు కనికరించడంలేదు. ఎవరైతే రాష్ట్రానికి అన్యాయం చేశారో.. ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మళ్లీ మేం అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేకహోదాపైనేనని ప్రకటనలు చేసే పరిస్థితి ఉంటే మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో చెప్పాలి. నాలుగేళ్లు నేను ఆవేదనతో, బాధతో ఎంతో ఓపికగా 29సార్లు దిల్లీకి వెళ్లి అడిగితే కనీసం కనికరించలేదు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలనే ఎందుకు అమలుచేయడంలేదు. మేం సమాఖ్య స్ఫూర్తికి కట్టుబడి ఉన్నాం.

నూతన అసెంబ్లీలో రెండోసారి సమావేశాలు జరుపుకోవడం ఆనందంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చంద్రబాబు సభలో ప్రసంగించారు. రైతుల దయ వల్లే అమరావతిలో అసెంబ్లీ నిర్వహించుకుంటున్నామని.. రూ.40వేల కోట్ల విలువైన 34వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సందర్భంలో విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చెయ్యకుండా, ఎదురు రాష్ట్రము పై ఎలా బీజేపీ ఎదురు దాడి చేస్తుందో చంద్రబాబు చెప్పారు... ఏపీకి రావాల్సిన రెవెన్యూ లోటు నిధులను ఇచ్చేశామని చెప్పారని... గట్టిగా అడిగితే లెక్కలు ఇవ్వలేదని అంటున్నారని చంద్రబాబు విమర్శించారు...

cbn assembly 07032018 2

కాగ్ నివేదిక ప్రకారం లోటును భర్తీ చేయాలని మళ్లీ కోరుతున్నానని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటి వరకు రూ. 13000 కోట్లు ఖర్చయితే... కేంద్ర నుంచి ఇప్పటి వరకు కేవలం రూ. 5,349 కోట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు మెత్తం ఖర్చు కేంద్రమే భరించాల్సి ఉందని చెప్పారు. పోలవరం, అమరావతికి ఇచ్చిన నిధులకు లెక్కలు పంపించామని చంద్రబాబు తెలిపారు. అమరావతికి రూ. 2,500 కోట్లు ఇచ్చారని, ఆ లెక్కలు పంపించామని వెల్లడించారు. మౌలిక వసతులకు రూ. 42,900 కోట్లు ఖర్చవుతుందని... ఇప్పటి వరకు కేవలం రూ. 1500 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. యూసీలు ఇవ్వడం లేదు కాబట్టే నిధులు ఇవ్వడం లేదు అని చెప్పడం దారుణమని మండిపడ్డారు.

cbn assembly 07032018 3

రాష్ట్ర విభజన తర్వాత ఆరు నెలల్లో విశాఖ రైల్వే జోన్ పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారని... ఎన్నో కమిటీలు వేశారని... కానీ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే జోన్ ను ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీని పెండింగ్ లో పెట్టారని అన్నారు. ఐఐటీ తిరుపతికి రూ. 100 కోట్లు మాత్రమే ఇచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. 11 జాతీయ విద్యాసంస్థలకు రూ. 11 వేల కోట్ల విలువైన భూములను ఇచ్చామని... వీటి ఏర్పాటుకు రూ. 11,500 కోట్లు ఖర్చవుతుండగా... కేంద్ర ప్రభుత్వం కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. దుగరాజపట్నం పోర్టు కుదరదంటున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సీట్లను పెంచుతామన్న హామీ కూడా నెరవేరలేదని చెప్పారు. అది అడిగితే, రాజకీయం అంటారని, ఆ విషయం అడగటం కూడా మానేసాను అని చెప్పారు..

బీజేపీ వైఖరి పై విసిగెత్తిపోయిన చంద్రబాబు, ఈ రోజు అసెంబ్లీ వేదికగా ఫుల్ స్టాప్ చెప్పబోతున్నారా ? బీజేపీకి రాం రాం చెప్పి, బీజేపీ చేసిన అన్యాయం పై అసెంబ్లీ వేదికగా చెప్పబోతున్నారా ? అవును అనే సంకేతాలు అమరావతి నుంచి వార్తలు వస్తున్నాయి... గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు చెప్పే సమయంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడాల్సి ఉంటుంది... ఈ సమయంలో చంద్రబాబు కేంద్రం చేస్తున్న అన్యాయం పై అన్ని విషయాలు చెప్పి, చంద్రబాబు అసెంబ్లీ వేదికగానే బీజేపీ కి రాం రాం చెప్పే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది...

cbn 07032018 1 2

ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీ బీజేపీ హైకమాండ్ , రాష్ట్ర బీజేపీ మంత్రులకు, నేతలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.. చంద్రబాబు పొత్తుకు రాం రాం చెప్పినా, కేంద్ర మంత్రులు బయటకు వచ్చేస్తారని ప్రకటించినా, వెంటనే బీజేపీ మంత్రులు కూడా రాష్ట్రంలో రాజీనామా చెయ్యాలని, అమిత్ షా ఆదేశించినట్టు సమాచారం... అలాగే ఒకవేళ పొత్తు పై, ఏమి మాట్లాడుకుందా కేంద్రం చేస్తున్న అన్యాయం పై మాత్రమే చెప్తే, దానికి దీటుగా సమాధానం చెప్పాలని ఆదేశాలు వచ్చయి... దీంతో ఈ రోజు చంద్రబాబు ఏమి మాట్లాడుతారో అనే ఆసక్తి దేశం మొత్తం చూస్తుంది....

cbn 07032018 1 3

ఏపీ విషయంలో కేంద్రం వైఖరిపై టీడీపీ ఎంపీలు కూడా అసహనం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడం లేదన్న కేంద్రం వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. యూసీలు ఇవ్వడంలో దేశంలో మూడోస్థానంలో ఏపీ ఉందని గుర్తు చేశారు. పోలవరానికి ఇచ్చిన నిధులకు ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పిస్తున్నామని, యూసీలు ఇవ్వకుండా నిధులు ఎలా ఇస్తున్నారని సీఎం ప్రశ్నించారు. రెవెన్యూలోటు కింద ఇచ్చిన నిధులపై యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని, కేంద్ర సంస్థలకు ఇచ్చిన రూ.600కోట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్‌లు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, వాటి ఆధ్వర్యంలో ఉన్న శాఖలని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోని జాతీయమీడియాతో చెప్పాలని ఎంపీలకు ఆదేశించారు.

వినూత్న నిరసనలతో ప్రతి రోజు ఆంధ్రప్రదేశ్ సమస్యలు పై ఆందోళన చేసే టీడీపీ ఎంపీ శివప్రసాద్‌, ఈ రోజు మరో సారి పార్లమెంటు ఆవరణలో నిరసన తెలిపారు. రైతు వేషధారణలో వచ్చిన శివప్రసాద్‌ పార్లమెంటు ఆవరణలో నిరసనను వ్యక్తం చేశారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలను అమలు చేయాలని గత కొన్ని రోజులుగా టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ధర్నాలు, నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. నిరసనలో భాగంగా టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ కావడితో రైతు వేషాధారణలో వచ్చి కేంద్ర ప్రభుత్వానికి తన నిరసనను తెలిపారు.

sivaprasad 07032018 2

ఏపీ రాజధానికి ప్రధాని ఇచ్చిన మట్టి, నీటిని ఎంపీ శివప్రసాద్‌ రెండు కుండల్లో తీసుకొచ్చారు. కావడితో వచ్చిన శివప్రసాద్‌ పవిత్ర మట్టి, నీటిని స్పీకర్‌ ద్వారా తిరిగి మోడీకి ఇవ్వాలని పార్లమెంటులోకి వెళ్లేందుకు యత్నించారు. మెట్లు ఎక్కిన ఆయనను పార్లమెంటు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఇలాంటివాటిని లోపలకు అనుమతించబోమని నవ్వుతూ చెప్పారు. కాసేపు అక్కడే ఉన్న శివప్రసాద్... చివరకు మెట్లు దిగి, కిందకు వచ్చేశారు. శివప్రసాద్ నిరసన కార్యక్రమాన్ని వివిధ పార్టీలకు చెందిన ఎంపీలంతా ఆసక్తిగా గమనించారు.

sivaprasad 07032018 3

ఇదిలా ఉండగా సోమవారం నుంచి పార్లమెంటు మలివిడత సమావేశాలు ప్రారంభం కాగా మొదటి రోజు శ్రీకృష్ణుడి వేషం వేసిన ఎంపీ శివప్రసాద్.. రెండో రోజు ఎన్టీఆర్ గెటప్‌తో ఆకట్టుకున్నారు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో వినిపించిన ఎన్టీఆర్ వేషంలో పార్లమెంట్‌కు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. 'చెయ్యెత్తు జై కొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ' అంటూ పాట కూడా పాడారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బకొటితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని కేంద్రాన్ని హెచ్చరించారు.

Advertisements

Latest Articles

Most Read