ప్లేటూ గ‌రిటె విసిరేశాడు. కాపు ఉద్య‌మాన్ని తాడేప‌ల్లి ప్యాలెస్‌కి తాక‌ట్టు పెట్టేశాడు. ఎన్నిక‌లు వ‌చ్చే వేళ‌కి ఉద్య‌మ‌నాయ‌కుడి ముసుగు తీసేసి, వైకాపా ప్రీపెయిడ్ ఆర్టిస్ట్ అని త‌న‌కి తానే స‌ర్టిఫికెట్ ఇస్తున్నాడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం. గ‌త  ఎన్నిక‌ల‌కి ముందు ఈబీసీల రిజ‌ర్వేష‌న్‌లో 5 శాతాన్ని కాపుల‌కి కేటాయిస్తూ చంద్ర‌బాబు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేసి వేల‌కోట్లు కాపుల సంక్షేమానికి ఖ‌ర్చుచేసింది. అయినా కాపు రిజ‌ర్వేష‌న్లు పేరుతో టిడిపి అధికారం కోల్పోయేవ‌ర‌కూ ప్లేట్లు, గ‌రిటెలు కొడుతూ డ్రామా ఆడిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం...వైకాపా అధికారంలోకి రావ‌డంతోనే ప్లేటుగ‌రిటెలు వ‌దిలేసి అస్త్ర‌స‌న్యాసం చేసేశారు. చంద్ర‌బాబు క‌ల్పించిన 5 శాతం రిజ‌ర్వేష‌న్ కాపుల‌కి జ‌గ‌న్ ఎత్తేసినా నోరు మెద‌ప‌లేదు. వైకాపా ప్ర‌భుత్వంపై అన్నివ‌ర్గాల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న నేప‌థ్యంలో పుట్ట‌లోంచి పాములా మెల్ల‌గా బ‌య‌ట‌కొస్తున్నారు. కాపు ఓట్లు చీల్చి టిడిపి-జ‌న‌సేన‌ని దెబ్బ‌కొట్టే వ్యూహంతో కుంభ‌క‌ర్ణుడి నిద్ర‌వీడి రాజ‌కీయ రంగ ప్ర‌వేశ‌ప్ర‌క‌ట‌న చేశారు. విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు వైకాపా కాకినాడ ఎంపీ అభ్య‌ర్థిగా ముద్ర‌గ‌డ పోటీ చేస్తార‌ని స‌మాచారం. తాజాగా రాష్ట్ర‌ ప్రజలకు రాసిన లేఖలో త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశం గురించి ప్ర‌క‌టించారు. త్వరలోనే తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు. కాపు ఉద్యమం ద్వారా, రాజకీయాల్లో చేరి డబ్బు సంపాదించాలనే ఆలోచన త‌న‌కు ఎప్పుడు రాలేదన్నారు. తమ జాతి రిజర్వేషన్ ఉద్య‌మం జోక‌ర్  కార్డులా అయిపోయింద‌ని తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మాన్ని పేక‌ల్లో జోక‌ర్‌లా మార్చింది తానేన‌ని ముద్ర‌గ‌డ‌కీ తెలిసిన విష‌యం. వైకాపా లైఫ్ అయితే, ముద్ర‌గ‌డ జోక‌ర్ అనేది తెలుగు రాష్ట్ర రాజ‌కీయాల్లో బ‌హిరంగ ర‌హ‌స్యం. కానీ ఆయ‌నేదో జాతి ఉద్ధార‌కుడిలా ఏమండి అంటూ దీర్ఘాలు తీస్తూ రాసే లేఖ‌ల్లో తెలుగుదేశంపై ద్వేషం, వైకాపాపై ప్రేమ కొట్టొచ్చిన‌ట్టు క‌నిపిస్తూనే ఉంటాయి. చాలా నీతి క‌బుర్లు చెప్పే ముద్ర‌గ‌డ 5 శాతం రిజ‌ర్వేష‌న్ కాపుల‌కి ఇచ్చిన చంద్ర‌బాబుపై ద్వేషం చిమ్ముతూ ఉద్య‌మించి విధ్వంసం సృష్టించి, అదే రిజ‌ర్వేష‌న్ ఎత్తేసిన జ‌గ‌న్ రెడ్డిపై ప్రేమ కురిపిస్తూ..ఉద్య‌మాన్ని మూట‌క‌ట్టి, మూతి మూసుకుని కూర్చోవ‌డం ఏ జాతి ప్ర‌యోజ‌నాల కోస‌మో ఏనాడూ ముద్ర‌గ‌డ మాట్లాడ‌రు.

వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి డ‌బ్బు అంటే విప‌రీత‌మైన ప్రేమ అని, రోజుకి ఇన్ని కోట్లు వ‌స్తే కానీ నిద్ర‌పోడ‌ని టిడిపి యువ‌నేత నారా లోకేష్ ఇటీవ‌ల త‌ర‌చూ చెబుతున్నారు. డ‌బ్బు కోసం ఎంత‌కైనా తెగించే మ‌న‌స్త‌త్వం అని కూడా వివిధ సంఘ‌ట‌న‌ల‌తో వివ‌రిస్తున్నారు. ఇసుక‌లో రోజుకి 3 కోట్లు తాడేప‌ల్లి ప్యాలెస్ క‌ప్పం చేరుతుంద‌ని లోకేష్ ఆరోపించారు. ఇవ‌న్నీ నిజాలేన‌ని, డ‌బ్బు-ఆస్తి కోసం జ‌గ‌న్ ఎంత‌కైనా తెగిస్తాడ‌ని ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ బ‌య‌ట‌పెట్టారు. వారం వారం తాను రాసే కొత్త ప‌లుకు శీర్షిక‌తో అందించే ప్ర‌త్యేక క‌థ‌నం వైకాపాలో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది. రెండు వారాల క్రితం వివేకా హ‌త్య జ‌రుగుతున్న‌ప్పుడు జ‌గ‌న్ రెడ్డికి స‌మాచారం ఉంద‌ని, అప్పుడు జ‌గ‌న్ రెడ్డితోపాటు న‌లుగురున్నార‌ని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. దీనిపై ఆ న‌లుగురు కానీ, జ‌గ‌న్ రెడ్డి కానీ, వైకాపాలో ఏ ఒక్క గొంతూ లేవ‌క‌పోవ‌డం అది నూటికి నూరుశాతం నిజ‌మేన‌ని జ‌నం నిర్ధారించుకున్నారు. తాజాగా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వైఎస్ షర్మిలకు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు పంచ‌డంలేద‌నే విష‌యాన్ని వెల్ల‌డించారు. జగన్, షర్మిల మధ్య జెరూసలెంలోనే ఆస్తుల పంపకం మధ్య చర్చలు జరిగాయని ఆర్కే కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు. ఆ తర్వాత కూడా ఆస్తుల పంపకంలో జ‌గ‌న్ రెడ్డి విక్ర‌మార్కుడు సినిమాలో ర‌వితేజ పాత్ర పోషించార‌ని..ఈ అన్యాయ‌పు పంప‌కాల‌ను ష‌ర్మిల ఒప్పుకోలేద‌ని వివ‌రించారు. దీనిపైనా వైకాపా క్యాంపు మౌన‌మే మెయింటెన్ చేస్తోంది. అంటే ఇదీ వెయ్యిశాతం నిజ‌మేన‌ని వైకాపా ఒప్పుకుంటున్న‌ట్టే.

చిట్ ఫండ్ కేసులో అరెస్ట్ అయిన, జగజ్జనని చిట్‍ఫండ్ అధినేతలు, అలాగే టిడిపి నేతలు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులకు ఇద్దరికీ కూడా హైకోర్టు, కొద్దిసేపటి క్రితం బెయిల్ మంజూరు చేసింది. దాదాపుగా పది రోజులు క్రితం, చిట్ ఫండ్స్ డబ్బు వేరే అవసరాలకు వాడారు అంటూ, వీరి ఇద్దరినీ కూడా, సిఐడి అరెస్ట్ చేసింది. దీంతో ఇద్దరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసుని తమ కస్టడీకి ఇవ్వాలని సిఐడి వేసిన పిటీషన్ ని, రాజమండ్రి సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ నేపధ్యంలోనే ఇద్దరూ హైకోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసారు. వారం రోజుల క్రితమే బెయిల్ పిటీషన్ దాఖలు చేయటం, సీనియర్ న్యాయవాదులు దమ్మలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. వీరికి చిట్ ఫండ్ చట్టం వర్తించదు అని, ఎవరూ ఫిర్యాదు చేయలేదని వాదించారు. ఈ వాదనలు విన్న తరువాత, కోర్ట్ బెయిల్ ఇచ్చింది. అయితే ఇదంతా కావాలనే కక్ష సాధింపు చర్యల్లోనే, ఇలా చేసారని టిడిపి ఆరోపించింది. చంద్రబాబు కూడా జైలుకి వెళ్లి, వీరిని పరామర్శించిన సంగతి తెలిసిందే.

అనంతపురం జిల్లా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డికి నిరసన సెగ ఎదురు అయ్యింది. గుడ్ మార్నింగ్ అంటూ వెళ్లిన ఎమ్మెల్యే కేతిరెడ్డిని షాక్ ఇచ్చాడు యువకుడు. మూడేళ్లయినా తనకు ఇంటిపట్టా రాలేదని కేతిరెడ్డిని నిలదీసాడు యువకుడు. కేతిరెడ్డి పై ప్రశ్నల వర్షం కురిపించాడు, ఆ యువకుడు. తనను నిలదీసిన యువకుడు ఆసిఫ్ పై ఎమ్మెల్యే కేతిరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే గత నెలలో లోకేష్ పాదయాత్ర ధర్మవరంలో జరిగిన తరువాత, కేతిరెడ్డి డ్రామాలు అన్నీ బయట పడ్డాయి. లోకేష్ , కేతిరెడ్డి గుట్టు మొత్తం బయట పెట్టాడు. అప్పటి నుంచి కేతిరెడ్డి తీవ్ర అసహనంతో ఉంటున్నారు. వారం క్రితం కూడా, ప్రజల పై రుసరుసలాడుతూ, మా ఫ్యామిలీ మొత్తం, మీ కొంపలు చుట్టూ తిరుగుతున్నాం అంటూ ప్రజల పై అసహనం వ్యక్తం చేసారు. ఇప్పుడు మరోసారి ఈ రోజు, తన అసహనం బయట పెట్టాడు కేతిరెడ్డి.

Advertisements

Latest Articles

Most Read