వివేకానంద‌రెడ్డి హ‌త్య‌కేసులో ఏ1 ఎర్ర గంగిరెడ్డి లొంగిపోయాడు. సీబీఐ విడుద‌ల చేసిన కాల్ మ్యాపులో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఒక్క‌డే మిగిలాడు. హైకోర్టు అరెస్టు చేయ‌కుండా ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను సుప్రీంకోర్టు అట్రాసియ‌స్ అని కొట్టేసింది. మ‌రి అవినాష్ రెడ్డి అరెస్టు ఎందుకు ఆగుతుంద‌నేది అంద‌రినీ తొలిచేసే ప్ర‌శ్న‌. అవినాష్ రెడ్డి అరెస్టునూ ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని, అవినాష్ రెడ్డి త‌రువాత పైనున్న వారిని సేఫ్ చేసే ప‌నిలో జాప్యం చేస్తున్నార‌ని న్యాయ‌నిపుణుల విశ్లేష‌ణ‌. మ‌రోవైపు క‌ర్ణాట‌క ఎన్నిక‌లు మ‌రో 5 రోజుల్లో ముగియ‌నున్నాయి. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఖ‌ర్చు బీజేపీది మొత్తం భ‌రిస్తున్న‌ది వైసీపీయేన‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగుతోంది. అక్క‌డ ఎన్నిక‌లు ముగిసేవ‌ర‌కూ వివేకానంద‌రెడ్డి కేసులోనూ ఎటువంటి అరెస్టులు ఉండ‌క‌పోవ‌చ్చని, అక్క‌డ పోలింగ్ ముగిసిన వెంట‌నే అవినాష్ రెడ్డి అరెస్టుతో మొత్తం మేట‌ర్ క్లోజ్ చేసే ఒప్పందం జ‌రిగింద‌ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అవినాష్ రెడ్డి వేకువ‌నే వైఎస్ జ‌గ‌న్ రెడ్డి ఓఎస్డీ, భార‌తి పీఏ న‌వీన్ ఫోన్ల‌కి కాల్ చేసిన అంశం చాలా కీల‌మైన‌ది తెర‌మ‌రుగు కావ‌డం వెనుక కేంద్రం ఆశీస్సులున్నాయ‌ని తెలుస్తోంది. ఎలాగూ అడ్డంగా బుక్క‌యిపోయాడు కాబ‌ట్టి అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కేసుని క్లోజ్ చేసి ఆ దంపతుల‌ని సేవ్ చేస్తార‌నే టాక్ వినిపిస్తోంది.

పందికేమి తెలుసు ప‌న్నీరు వాస‌న అన్న‌ట్టుంది వైసీపీ నేత‌ల తీరు. త‌లైవా ర‌జ‌నీకాంత్ గురించి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కూసిన కూత‌ల‌పై స‌భ్య‌స‌మాజం ఛీద‌రించుకుంది. కేవ‌లం చంద్ర‌బాబుని ప్ర‌శంసించార‌నే కార‌ణంతో వైకాపా నేత‌లు బూతుల‌తోనూ, మార్పింగ్ పోస్టుల‌తోనూ ర‌జ‌నీకాంత్ పై విరుచుకుప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో సినిమా ఇండ‌స్ట్రీ నుంచి ఇటు టిడిపి మ‌ద్ద‌తు నేత‌లు కానీ, అటు ర‌జ‌నీకాంత్ స్నేహితులు కానీ ఎవ‌రూ స్పందించి ఖండించ‌లేదు. అయితే అనూహ్యంగా జ‌గ‌ప‌తిబాబు ర‌జ‌నీకాంత్ కి మ‌ద్ద‌తుగా నిలిచారు. రజనీకాంత్ మాట్లాడేవన్నీ నిజాలేన‌ని హీరో జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ 100 శాతం రైట్ మాట్లాడారు. ఆయన మాట్లాడే విధానం, ఆయన అనే మాటలు పర్ఫెక్ట్ గా ఉంటాయంటా జ‌గ్గూ భాయ్ కితాబిచ్చారు. ర‌జ‌నీకాంత్ చక్కగా మాట్లాడతాడు.. నిజాయితీగా మాట్లాడతాడు.. నిజాలు మాట్లాడతాడు అంటూ జ‌గ‌ప‌తిబాబు వెన‌కేసుకురావ‌డం రాజ‌కీయాల్లోనూ, ఇండ‌స్ట్రీలోనూ సెన్సేష‌న్ అయ్యింది.

జ‌గ‌న్ రెడ్డికి ర‌హ‌స్య స్నేహితుడు. బీజేపీలో కీల‌క నేత‌. ఒక‌ప్పుడు ఏపీ చీఫ్ సెక్ర‌ట‌రీ. తెలుగుదేశం పార్టీ అన్నా, చంద్ర‌బాబు అన్నా ఒంటికాలిపై లేస్తాడు. ఆయ‌న ఐవైఆర్ కృష్ణారావు. భోగాపురం ఎయిర్ పోర్టుకి రెండోసారి శంకుస్థాప‌న చేసిన జ‌గ‌న్ రెడ్డి..శంషాబాద్ ఎయిర్ పోర్టు ఘ‌న‌త త‌న తండ్రిద‌ని..ఇది త‌న‌ద‌ని ఒక రేంజులో ప్ర‌చారం చేసుకున్నారు. దీనిపై తెలుగుదేశం పార్టీ తేదీలు, నిర్మాణాలు, ఫోటోలు, వీడియోల‌తో గ‌ట్టిగానే కౌంట‌ర్లు ఇచ్చింది. అయితే  టిడిపి అధికారంలో ఉన్న‌ప్పుడు చీఫ్ సెక్ర‌ట‌రీగా ప‌నిచేసిన ఐవైఆర్ కృష్ణారావు, టిడిపి ఆగ‌ర్భ శ‌త్రువుగా భావిస్తారు. టిడిపి ప్ర‌తీ నిర్ణ‌యాన్ని త‌ప్పుబ‌ట్ట‌డంలోనూ ముందుంటారు. అనూహ్యంగా ఎయిర్ పోర్టుల విష‌యంలో వైకాపా ప్ర‌చారానికి ఐవైఆర్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. నాటి శంషాబాద్ అయినా, నేటి భోగాపురం ఎయిర్ పోర్టుల నిర్మాణ‌మైనా చంద్ర‌బాబు కృషి విస్మ‌రించ‌లేనిద‌ని ట్విట్ట‌ర్‌లో ఇచ్చిన ఘాటు రిప్ల‌యి వైకాపాకి గ‌ట్టిగా త‌గిలింది.

య‌థా రాజా త‌థా అధికారి అన్న మాదిరిగా ఉంది ఏపీలో పాల‌న‌. రాజ్యాంగ‌సంస్థ‌లు, కోర్టులు అంటే ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తున్న లెక్క‌లేనిత‌నాన్ని బ్యూరోక్రాట్లూ ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఈ నిర్ల‌క్ష్య ఫ‌లితం త‌ర‌చూ కోర్టుల‌లో దోషులుగా అధికారుల‌ను నిల‌బెడుతోంది. దేశంలోనే అతి ఎక్కువ కోర్టు ధిక్క‌ర‌ణ కేసుల్లో ఏపీ టాప్ అని ఇటీవ‌ల గ‌ణాంకాలు వెల్ల‌డించాయి. తాజాగా మ‌రో కోర్టు ధిక్క‌ర‌ణ కేసులో ఏకంగా ఐదుగురు ఉన్న‌తాధికారులు జైలుశిక్ష ప‌డింది.  ఆర్టీసీ ఫీల్డ్‌మెన్లను క్రమబద్ధీకరించాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్య‌క్తం చేసింది.  హైకోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని ఫీల్డ్‌మెన్లు కోర్టు ధిక్కరణ పిటిషన్  దాఖ‌లు చేయ‌డంతో విచార‌ణ జ‌రిగింది.  కోర్టు ధిక్కరణ కేసులో ఐదుగురు అధికారులకు జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు తీర్పు చెబుతూ  ఈ నెల 2వ తేదీన హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబుకు నెల రోజులు,  ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుకు నెల రోజులు, మరో ముగ్గురు అధికారులకు కూడా నెల రోజుల జైలు శిక్ష చొప్పున విధించారు.  ఐదుగురు అధికారులకు రూ.వెయ్యి చొప్పున జరిమానా కూడా విధించారు.  ఈ నెల 16లోపు రిజిస్ట్రార్ జనరల్ వద్ద లొంగిపోవాలని కోర్టు ఆదేశించింది.

Advertisements

Latest Articles

Most Read