జగన్ రెడ్డి మాట తప్పడానికి బ్రాండ్ అంబాసిడర్. జగన్ మోహన్ రెడ్డి మడమ తిప్పడంలో ఆయనకి సరిసాటి ఎవరూ లేరు. అధికారంలోకి వచ్చాక సీపీఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తానన్నాడు నాలుగేళ్ల తరువాత అవగాహన లేక జగన్ అలా హామీ ఇచ్చారని సజ్జలతో చెప్పించేశారు. మద్యనిషేధం అని చెప్పిన జగన్ రెడ్డి, తన సొంత కంపెనీల మద్యం అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తున్నారు. అలాగే తనకి నచ్చనిది ధ్వంసం అయిపోవాలి, తనకి దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదనే క్రూర మనస్తత్వం ఉన్నందుకే జగన్ ని సైకో అని చంద్రబాబు అంటూ ఉంటారు. దీనికి కారణాలు లేకపోలేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం అని మర్చిపోయి, ఓటమిని అంగీకరించలేడు. సజావుగా ఎన్నికలు జరపాలని ప్రయత్నించిన ఎన్నికల కమిషనర్ రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నా అన్ని మార్గాల్లో ఆయనపై ముప్పేట దాడులు చేసిన మూర్ఖ చరిత్ర జగన్ రెడ్డిది. శాసనమండలిలో మూడు రాజధానుల బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించారనే అక్కసుతో ఏకంగా శాసనమండలి రద్దుకి బరితెగించిన నియంత మనస్తత్వం జగన్ రెడ్డిది. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమితో కూడా జగన్ రగిలిపోతున్నాడు. తననే ఓడిస్తారా అనే పగతో కుతకుతలాడుతూ ఉన్నాడు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఓటమితో సొంత పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాడు. ప్రజా వ్యతిరేకత తీవ్రమై, మరింత మంది వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారనే భయంతో ముందస్తు ఆలోచన చేస్తున్నారని రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. కానీ ముందస్తుకి వెళ్లడం అనేది జగన్ ఇష్టం కాదు, కేంద్రం ఇష్టం. మోడీ, షా ఏది చెప్తే జగన్ అదే చేయాలి. పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుపోయి తన జుట్టుని కేంద్రంలోని బీజేపీ పెద్దల చేతిలో పెట్టేసరికి, వారు కీలుబొమ్మలా జగన్ రెడ్డిని ఆడిస్తున్నారు. మళ్లీ అధికారం నిలుపుకోవాలంటే ముందస్తుకి వెళ్లాలనేది జగన్ ఆలోచనే అయినా బీజేపీ పెద్దలు ఒప్పుకుంటేనే అడుగు ముందుకు వేయగలడు. జగన్ ఏమి చేసినా, కేంద్రం ఎంత ఆదుకున్నా ఈ సారి వైసీపీ గెలిచే అవకాశమే లేదు. అందుకే ముందస్తుకి వెళ్లకుండా ఐదేళ్లపాటు దొరికినంత దోచుకునేందుకే మొగ్గు చూపుతున్నారని ప్రచారం సాగుతోంది. ముందస్తుకి వెళ్లనప్పుడు మరింత మంది ఎమ్మెల్యేలతో వైరం ఎందుకు అనే ఆలోచనతోనే నేటి సమావేశంలో ఆల్ ఈజ్ వెల్ అంటూ కొత్త రాగం అందుకున్నారు.
news
ధర్మవరం టికెట్ ప్రకటనతో, మరోసారి తన మార్క్ చూపించిన లోకేష్..
తండ్రి చంద్రబాబులాగే తనయుడు లోకేష్ విజనరీలోనూ నెంబర్ వన్. సీబీఎన్ మాదిరిగానే దూరదృష్టితో లోకేష్ ఆరంభించిన పథకాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. రాజకీయ వ్యూహాలలోకి వచ్చేసరికి చంద్రబాబు నాన్చుడు దోరణికి పూర్తిగా భిన్నం లోకేష్ అని తేలిపోయింది. తనపైనా ఎవరైనా ఆరోపణలు చేస్తే, ఏళ్లుగా వారి ఆరోపణలు భరిస్తారే కానీ..నిజం ఇదని చంద్రబాబు చెప్పరు. ఇదే ఆయనకి పెద్ద నష్టం చేకూర్చే అంశం. బాబాయ్‌ని చంపేసి చంద్రబాబు మీద నెపం నెట్టేసి ``నారాసుర రక్తచరిత్ర`` అని రాస్తే సీబీఐ బాబాయ్ ని వేసేసింది ఇంటి గొడ్డలే..వేసింది బిడ్డలే అని ప్రకటించేవరకూ సీబీఎన్ స్పందించలేదు. లోకేష్‌కి చంద్రబాబు గారి లాగా సాగదీయటాలు, మొహమాటాలు లేవు.. ఉన్నది ఉన్నట్టు చెప్పేయటమే లోకేష్ స్టైల్. చంద్రబాబు ఎన్నికల తేదీలు ప్రకటించి నామినేషన్ గడువు దగ్గర పడుతున్నప్పుడు అభ్యర్థుల్ని ప్రకటిస్తారు. మొహమాటం, సీటు లేదంటే బాధపడతారోననే ఆలోచనలో బాబు తేల్చరు, ముంచరు. తనయుడు లోకేష్ యువగళం పాదయాత్రలో తండ్రి చంద్రబాబుకి భిన్నమైన తీరుతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యర్థులపై విమర్శలు చేయడంలోనూ, టిడిపిపై చేసే ఆరోపణలు తిప్పికొట్టడంలోనూ స్పాంటేనియస్‌గా రియాక్టవుతున్నారు. ధర్మవరంలో టిడిపి నుంచి అభ్యర్థి ఎవరు అనే డైలమాకి ఒక్క డైలాగ్ తో క్లారిటీ ఇచ్చేశారు. పరిటాల శ్రీరామ్ వస్తున్నాడు ఆశీర్వదించండి అని సభికుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పెనుగొండలో మాత్రం అభ్యర్థి విషయంలో ఆచితూచి వ్యవహరించి తన రాజకీయ పరిణతిని చాటారు. సీనియర్ నేతలు పార్ధసారధితో పాటు, సవితమ్మకు కూడా సమ ప్రాధాన్యం ఇచ్చిన లోకేష్.. ఇక్కడి సీటు విషయం మాత్రం ఎటువంటి ప్రకటనా చేయలేదు.
సత్తెనపల్లిలో అంబటి రాంబాబుని ముప్పు తిప్పలు పెడుతున్న వైసీపీ అంతర్గత పోరు, టిడిపి వ్యూహాలు...
నీటిపారుదల శాఖా మంత్రి అంబటి రాంబాబు అన్నివిధాలుగా వార్తల్లో వ్యక్తి. ఇప్పుడు మరో విషయంలోనూ అంబటిపై అందరి దృష్టి పడింది. అంబటిపై సొంత నియోజకవర్గంలో, సొంత పార్టీ వైసీపీ నుంచే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్నాయి. ఇవి ఏకంగా సత్తెనపల్లి సీటుకే ఎసరు పెట్టే స్థాయికి చేరాయి. సత్తెనపల్లి వైసీపీ నేత చిట్టా విజయభాస్కర్ రెడ్డి పార్టీ ఆత్మీయ సమావేశం పెట్టి అంబటి పేరు ప్రస్తావించకుండానే వైసీపీకి డ్యామేజ్ చేస్తున్నవాళ్లు ఎంత పెద్దవాళ్లయినా లెక్కచేయమంటూ వ్యాఖ్యానించారు. సత్తెనపల్లిలో బలమైన కేడర్ తనకు ఉందని, వచ్చే ఎన్నికలకు సత్తెనపల్లి టికెట్ తనకే ఇవ్వాలని విజయభాస్కర్ రెడ్డి ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. మరోవైపు సత్తెనపల్లికి చెందిన వైసీపీ నేత సయ్యద్ మాబుకు విభేదాలు మంత్రి అంబటి రాంబాబుకి విభేదాలు తీవ్రం అయ్యాయి. దీంతో మాబు కొంతకాలంగా వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అంబటి రాంబాబుతో అంటీముట్టనట్టు ఉంటున్నారు. దీంతో మాబు పార్టీ వీడుతారని ప్రచారం సాగుతోంది. ఇటీవలే టిడిపిలో చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లిలో వైసీపీ నేత సయ్యద్ మాబు ఇంటికి వెళ్లారు. సత్తెనపల్లి రాజకీయాలపై మాబుతో కన్నా చర్చలు జరిపారని సమాచారం. ఓ వైపు కీలక నేత టికెట్ రేసులో ఉన్నానని ప్రకటించడం, మరోవైపు మరో కీలక నేత పార్టీ వీడేలా కనిపిస్తుండడంతో అంబటికి సత్తెనపల్లిలో చెక్ పెట్టే దిశగా వైసీపీ అసంతృప్తులు పావులు కదుపుతున్నారు. అంబటి రాంబాబుకి సొంత పార్టీ నుంచే ఎదురవుతున్న ఇబ్బందులు తమకి ప్లస్సుగా మార్చుకునే వ్యూహంతో టిడిపి చురుగ్గా తమ వ్యూహాన్ని అమలు చేస్తోంది.
పవన్ కళ్యాణ్ సడన్ ఢిల్లీ టూర్, ఆరా తీస్తున్న వైసీపీ...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నట్టు ఉండి ఢిల్లీ వెళ్ళటం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయంసం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పర్యటన ఆసక్తి రేపుతుంది. పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా, తాను ప్రభుత్వ ఓటు చీలనివ్వను అని, ప్రకటనలు చేస్తూ వస్తున్నారు. అంతే కాదు ఇక్కడ ఏపిలో జగన్ కు సహకరిస్తున్న బీజేపీ నాయకత్వం పై ఆగ్రహంగా ఉన్నారు. ఇక్కడ ఏపి బీజేపీ నేతలు కొంత మంది, జగన్ పై ఇస్తున్న ఫీడ్ బ్యాక్ వల్లే, జగన్ కు ఢిల్లీ లో షీల్డ్ దొరుకుంటుందని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఆవిర్భావ దినోత్సవం రోజు కూడా, ఇక్కడ బీజేపీ నేతల పై అసహనం వ్యక్తం చేసారు. ఈ నేపధ్యంలోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లారు. హోం మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో ఆయన భేటీ అవ్వనున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ టూర్ గురించి మీడియాకు సమాచారం ఇవ్వలేదు. మీడియా వాళ్ళు జనసేనని సంప్రదించగా, వ్యక్తిగత పర్యటన అంటూ చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ముందుగా లీక్ ఇవ్వకుండా ఉండటానే, ఇలా చేసారని తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారం పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. పవన్ ఢిల్లీ టూర్ పై వైసీపీ కూడా ఆరా తీస్తుంది. తమకు బీజేపీతో ఉన్న సంబంధాలు ఎక్కడ దెబ్బ తింటాయా అని భయపడుతుంది.