ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య గత 15 రోజులుగా నీళ్ళ డ్రామా నడుస్తుంది. నువ్వు కొట్టినట్టు నటించు, నేడు ఏడ్చినట్టు నటిస్తే అనే చందాన ఇక్కడ వ్యవహారాలు నడుస్తున్నాయి. ఈ నాటకంలో లబ్ది పొందుతుంది మాత్రం తెలంగాణా అనే చెప్పాలి. ఒక పక్క తెలంగాణా రాష్ట్రం మన ప్రాజెక్టుల పై అభ్యంతరం చెప్పింది. తరువాత గత వారం రోజులుగా కరెంటు ఉత్పత్తి చేస్తూ, నీళ్ళు వాడేసుకుంటుంది. దీంతో అటు శ్రీశైలంలో, అలాగే ఇక్కడ పులించింతలలో కరెంటు ఉత్పాత్తి చేస్తూ ఉండటంతో, ఆ నీళ్ళు కిందకు వస్తున్నాయి. అయితే ఇక్కడ ఏపి ప్రభుత్వం ఆ నీటిని కాలువలకు మళ్ళించకుండా, సముద్రంలోకి వదులుతుంది. ఇలా ఎందుకు చేస్తుందో ఎవరికీ అర్ధం కావటం లేదు. మరో పక్క రాజశేఖర్ రెడ్డిని తిడుతున్నా, ఇటు వైపు నుంచి రెస్పాన్స్ లేదు. అదేమిటి అంటే, అక్కడ ఆంధ్రా వాళ్ళు ఉన్నారు కాబట్టే మౌనం అంటూ, కేవలం ప్రధానికి లేఖ రాసి ఊరుకున్నారు. ఇప్పటి వరకు తెలంగాణా ఇష్టం వస్తున్నట్టు చేస్తున్నా, ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి సరైన రెస్పాన్స్ లేదు. ఈ నేపధ్యంలోనే తెలంగాణా హైకోర్టులో కృష్ణా జిల్లా వాసి, హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. తెలంగాణా ఒప్పందాలు ఉల్లంఘించి విద్యుత్ ఉత్పత్తి చేసి ఏపికి అన్యాయం చేస్తుందని, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఇచ్చిన జీవో రద్దు చేయాలి అంటూ, పిటీషన్ దాఖలు చేసారు. మరి తెలంగాణా హైకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఈ వివాదం కోర్టుకు చేరటంతో, అసలు వాస్తవం ఏదో, డ్రామా ఏదో తేలిపోనుంది అనే చెప్పాలి.
news
జగన్ కేసులు విషయంలో మరో కీలక పరిణామం... సిబిఐ, ఈడీలకు షాక్ ఇస్తూ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళిన రఘురామరాజు...
జగన్ మోహన్ రెడ్డిని, ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణం రాజు వదిలి పెట్టేలా లేరు. జగన్ మోహన్ రెడ్డిని ముప్పు తిప్పలు పెడుతూ, తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న రఘురామరాజు, చివరకు ఏమి చేస్తారో తెలియదు కానీ, జగన్ మోహన్ రెడ్డికి మాత్రం చెవిలో జోరీగలా తయారయ్యారు. జగన్ మోహన్ రెడ్డి పై, 2012లో సిబిఐ అక్రమ ఆస్తులు కేసు కింద అభియోగాలు మోపటం, ఆ తరువాత ఈడీ కూడా రంగంలోకి దిగటంతో, మొత్తం మీద జగన్ మోహన్ రెడ్డి పై 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసులు నమోదు అయ్యాయి. జగన్ మోహన్ రెడ్డి 16 నెలలు జైలు జీవితం కూడా అనుభవించి, తరువాత కండీషనల్ బెయిల్ పై బయటకు వచ్చారు. అయితే ఇక్కడ అనూహ్యంగా 10 ఏళ్ళు అవుతున్నా, ఇంకా జగన్ కేసులు ట్రైల్స్ వరకు రాలేదు. ఇంకా డిశ్చార్జ్ పిటీషన్లు దగ్గరే కేసులు ఉండి పోయాయి. ఎందుకు జగన్ మోహన్ రెడ్డి కేసులు ఇంకా విచారణ ప్రారంభం కాకుండా, ఆలస్యం అవుతున్నాయో అర్ధం కావటం లేదు. అటు సిబిఐ కూడా ఈ విషయంలో దూకుడుగా వెళ్ళటం లేదు. అయితే ఈ తరుణంలో రఘురామకృష్ణం రాజు తగులుకున్నారు. ఇప్పటికే ఆయన జగన్ మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అంటూ, సిబిఐ కోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటీషన్ విషయంలో చివరకు సిబిఐ కూడా స్పందించాల్సిన పరిస్థితి తెచ్చారు.

ఇప్పుడు రఘరామకృష్ణం రాజు మరో ఎత్తుగడతో జగన్ ను ఇరికించే ప్రయత్నం చేసారు. అదే విధంగా, సిబిఐ, ఈడీని కూడా టార్గెట్ చేసారు. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో సిబిఐతో పాటు ఈడీ కూడా సరిగ్గా విచారణ చేయటం లేదు అంటూ, తెలంగాణా హైకోర్టులో పిటీషన్ వేసి, రఘురామకృష్ణం రాజు మరో సంచలనానికి తెర లేపారు. ఇప్పటికే దర్యాప్తులో అనేక అంశాలను సిబిఐ, ఈడీ గుర్తించాయని, అయితే వాటి పై విచారణ మాత్రం జరగటం లేదని, సరైన విచారణ జరిగేలా అటు సిబిఐని, ఇటు ఈడీని ఆదేశించాలి అంటూ రఘురామకృష్ణం రాజు, తెలంగాణా హైకోర్టుని అభ్యర్ధిస్తూ పిటీషన్ దాఖలు చేసారు. సిబిఐ, ఈడీకి అనేక అంశాలు వారి దృష్టికి వచ్చిన, విచారణ చేయకుండా వదిలేసాయని పిటీషన్ లో తెలిపారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో సరైన ముగింపు ఇవ్వకుండా, సిబిఐ, ఈడీ విఫలం అయ్యాయని తెలిపారు. అందుకే దర్యాప్తులో గుర్తించిన అన్ని అంశాల పై విచారణ చేసేలా, సిబిఐ, ఈడీని ఆదేశించాలని రఘరామరాజు తెలంగాణా హైకోర్టుని అభ్యర్ధించారు.
సిఐడి సునీల్ కుమార్ కు షాక్.. చీఫ్ సెక్రటరీకి సంచలన లేఖ రాసిన కేంద్ర హోం శాఖ...
ఆంధ్రప్రదేశ్ సిఐడి అడిషనల్ డీజీ పీవీ సునీల్ కుమార్ చేస్తున్న చర్యల పై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబేద్కర్ మిషన్ పేరుతో, అనేక చోట్ల ఆయన చేస్తున్న విద్వేషపూరిత ప్రసంగాలు, హిందూ వ్యతిరేక ప్రచారాలు చేస్తూ, క్రిస్టియానిటీ ఒక్కటే అందరినీ కాపాడేది అంటూ హిందూ దేవుళ్ళకు, హిందువులకు వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలను కేంద్ర హోం శాఖకు పంపుతూ, ఆయన పై చర్యలు తీసుకోవాలి అంటూ లీగల్ రైట్స్ అబ్జరవేటరీ కన్వీనర్ జోషితో పాటు, ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసారు. అలాగే ఆ ప్రసంగాలకు సంబంధించి వీడియోలు కూడా ఒక పెన్ డ్రైవ్ లో పెట్టి కేంద్ర హోంశాఖకు అందచేసారు. అయితే ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆ వీడియోలను సునీల్ కుమార్ యుట్యూబ్ నుంచి తీసేశారు. అయితే అప్పటికే అవన్నీ పెన్ డ్రైవ్ లో కేంద్రానికి చేరాయి. వీటి పై కేంద్ర హోం శాఖ విచారణ చేసింది. అవన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీకి కూడా పంపిస్తూ, సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలి అంటూ, చీఫ్ సెక్రటరీకి రాసిన లేఖలో కేంద్ర హోం శాఖ తెలిపింది. లీగల్ రైట్స్ అబ్జరవేటరీ కన్వీనర్ జోషితో పాటు, ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇచ్చిన ఫిర్యాదు పై చర్యలు తీసుకోవాలని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ, సునీల్ కుమార్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమకు చెప్పాలని కేంద్రం ఆ లేఖలో స్పష్టం చేసింది. వీరిద్దరూ రాసిన లేఖ, ఆ వీడియోలు పై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి , కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఐపీఎస్ నిభంధనలకు విరుద్ధంగా, పీవీ సునీల్ కుమార్, ఒక మతం పై విద్వేష ప్రసంగాలు చేస్తున్నారు అంటూ, వీరిద్దరూ ఫిర్యాదు చేసారు. ఐపిఎస్ నిబంధనలకు విరుద్ధంగా, ఈ విధంగా ఒక సంస్థను ఏర్పాటు చేయటం, సంస్థ ద్వారా విదేశాల నుంచి విరాళాలు సేకరించటం, ఆ విరాళాల పై కూడా ఆడిట్ చేయాలి అంటూ, వీరిద్దరూ ఆధారాలు చూపిస్తూ, కేంద్రానికి లేఖ రాసారు. ఆ ఫిర్యాదులో తీవ్రతను అర్ధం చేసుకున్న కేంద్ర హోం శాఖ, ఆ లేఖలను ఏపి చీఫ్ సెక్రటరీకు లేఖ రాసి, చర్యలు తీసుకోవాలని, ఏమి చర్యలు తీసుకున్నారో కూడా తమకు తెలిపాలి అంటూ కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ప్రాధమికంగా విచారణ చేసిన తరువాతే, చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తుంది.
విజయసాయి రెడ్డి తన పై పెట్టిన ట్వీట్లకు, వెరైటీగా స్పందిస్తూ, కౌంటర్ ఇచ్చిన రేవంత్ రెడ్డి...
తెలంగాణా రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవటం మానేసి చాలా రోజులు అయ్యింది. ఏదైనా ప్రముఖ వార్తలు ఉంటే తప్ప, రోజు వారీ తెలంగాణాలో జరిగే రాజకీయం గురించి ఏపిలో పెద్దగా చర్చ ఉండదు అని చెప్పాలి. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తెలంగాణా రాజకీయాల గురించి ఏపిలో కూడా ఆసక్తి పెరిగింది. అందుకు కారణం రేవంత్ రెడ్డి. మొన్నటి వరకు తెలంగాణాలో సరైన ప్రత్యర్ధి లేకపోవటం, కేసీఆర్ కు ఎదురు లేకపోవటంతో, చప్పగా సాగిన రాజకీయాలు, రేవంత్ రాకతో హీట్ ఎక్కాయి. సహజంగా అందరికీ తెలంగాణా రాజకీయాలు పట్ల కూడా, రేవంత్ దూకుడుగా కేసీఆర్ ని ఎలా ఎదుర్కుంటారు అనే ఆసక్తి పెరిగింది. సీనియర్లు అందరినీ కాదని, రేవంత్ రెడ్డికి పీసీసి పగ్గాలు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి కేసీఆర్ ని ఎదుర్కోవాలి అంటే, రేవంత్ లాంటి దూకుడు ఉన్న నేత ఉండాలని అధిష్టానం భావన. ఇప్పుడు ప్రజల్లో వస్తున్న రెస్పాన్స్ చూస్తే అది సరైన నిర్ణయమే అనిపిస్తుంది. అయితే అన్నిట్లో వేలు పెట్టి, అందరి చేత తిట్టించుకునే విజయసాయి రెడ్డి, రేవంత్ రెడ్డికి పీసీసి పదవి ఇవ్వటం పై కూడా, తన సహజ పైత్యం ఉన్న ధోరణిలో స్పందించారు. వరుస ట్వీట్లు పెడుతూ, రేవంత్ రెడ్డిని, తద్వారా చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు.

చంద్రబాబు వల్లే రేవంత్ రెడ్డికి పీసిసి పదవి వచ్చిందని, చంద్రబాబు కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి ఇప్పించారు అంటూ, ఏవేవో ట్వీట్లు పెట్టారు. ఇష్టం వచ్చినట్టు రేవంత్ పై ట్వీట్లు పెట్టారు. అయితే విజయసాయి రెడ్డి కామెంట్స్ పై రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారా అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా, ఈ రోజు ఒక ప్రముఖ మీడియా ఛానల్ లో స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చిన రేవంత్ రెడ్డి, విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్లకు ఒక్క మాటతో వెరైటీగా తిప్పి కొట్టారు. చంద్రబాబు మీకు పదవి ఇప్పించారు అంట కదా అని విజయసాయ రెడ్డి చెప్పారు అంటూ, రేవంత్ ని అడగగా, ఆ తిక్కలోడు గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే మనకు అంత సమయం కలిసి వస్తుంది, కనకపు సింహాసనం మీద శునకం టైపు ఈ విజయసాయి రెడ్డి, ఆర్ధిక నేరస్తుడు, ఉగ్రవాది లాంటి ఈ విజయసాయి రెడ్డి లాంటి వాడి మాటలు కూడా మనం పట్టించుకుంటే ఎలా అంటూ, ఒక్క ముక్కలో విజయసాయి రెడ్డి మాటలకు, రేవంత్ రెడ్డి కౌంటర్ ఇస్తూ, తీసి పడేసారు. మరి దీని పై విజయసాయి రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.