తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం నేపధ్యంలో, మాజీ మంత్రి దేవినేని ఉమా, జగన్ మోహన్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసారు అంటూ, నారాయణ రెడ్డి అనే అడ్వొకేట్ ఫిర్యాదు మేరకు సిఐడి అధికారులు కేసు నమోదు చేయటం జరిగింది. ఈ మేరకు సిఐడి అధికారులు, రెండు రోజుల క్రితం నోటీసులు జారీ చేసారు. అయితే ఆ నోటీసులు కొంత వివాదస్పదానికి దారి తీసాయి. మొన్న నోటీసులు జారీ చేసిన సమయంలో ఉదయం పది గంటల సమయంలో బెజవాడలోని ఇంటికి నోటీసులు ఇచ్చి, తిరుపతిలో ఉన్న దేవినేని ఉమాని, కర్నూల్ కు 10.30 గంటలకు విచారణకు రావాలని నోటీసులు ఇవ్వటం జరిగింది. అయితే దానికి దేవినేని ఉమా తిరిగి ఒక లేఖ రాసారు. అసలు పది నిమిషాల్లో, విచారణకు రావటం ఎలా సాధ్యం అని దేవినేని ఉమా ప్రశ్నించారు. పెద్ద ఎత్తున దీని పై విమర్శలు వచ్చాయి. దేవినేని ఉమా కూడా దీని పై, సిఐడికి లేఖ రాసారు. తాను పార్టీ ఆదేశాల మేరకు, తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను, క-రో-నా సంరక్షణ చర్యలు కూడా తీసుకుంటున్నాను కావున, నాకు పది రోజులు సమయం కావాలని దేవినేని ఉమా, సిఐడికి లేఖ రాసారు. ఈ లేఖని సిఐడి అధికారులకు కూడా దేవినేని ఉమా అందించారు. అయితే ఇప్పుడు మరోసారి సిఐడి అధికారులు, దేవినేని ఉమాకు నోటీసులు ఇవ్వటంతో, మళ్ళీ చర్చకు దారి తీసింది.

uma 17042021 2

ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో, రెండో నోటీసు దేవినేని ఉమాకు సిఐడి అందచేసింది. ఆయన నివాసం ఉన్న గొల్లపూడిలో, ఈ నోటీసులు అంటించారు. ఈ నోటీసులో ప్రధానంగా చూస్తే, ఈ నెల 19వ తేదీన, 10.30 గంటలకు సిఐడి కార్యాలయానికి విచారణకు రావాలని దేవినేని ఉమకు నోటీసులు జారీ చేసారు. అయితే దీనికి రిప్లై గా దేవినేని ఉమా మరో లేఖ రాస్తారా, లేదా విచారణకు హాజరు అవుతారా అనేది చూడాల్సి ఉంది. అయితే మొన్నటి దాక ఇరిగేషన్ లో లక్షల కోట్లు ఉమా దోపిడీ చేసారు, ఆయన్ను ఆధారాలతో పట్టుకుంటాం, జైలుకు పంపిస్తాం అని చెప్పిన వైసీపీ నేతలు, ఇలా జగన్ మోహన్ రెడ్డిని తిట్టారని కేసులు పెట్టి, నోటీసులు ఇచ్చి, చివరకు అరెస్ట్ చేసే ప్లాన్ వేసారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఆ వీడియోలో, జగన్ మోహన్ రెడ్డి తిరుపతిని కించపరిచినట్టు ఉందని, వీడియో మారినంత మాత్రాన, జగన్ మోహన్ రెడ్డి ఆ మాటలు అనలేదు అని చెప్పగలరా అంటూ, ఒరిజినల్ వీడియో చూపించి కౌంటర్ ఇస్తున్నారు. మరి సిఐడి ఏమి చేస్తుందో చూడాలి...

తిరుపటి ఉప ఎన్నిక జరిగిన తీరు పై చంద్రబాబు, మీడియాతో మాట్లడారు. ఆయన మాటల్లో.. "తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో అన్నీ పార్టీలు పాల్గొన్నాయి. వైసీపీ చేసిన దుర్మార్గాలను అన్ని పార్టీలు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాయి. ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం 2,200 మంది సెంట్రల్ ఫోర్స్, 800 మంది మైక్రో అబ్జవర్స్, అన్ని బూతుల్లో వెబ్ కెమార్లు పెడతామని చెప్పింది. వందలాది బస్సులు, కార్లలో జనాలను తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి మహిళలను దొంగ ఓట్లు వేయించేందుకు తీసుకొచ్చారు. వందల మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాం. మామూలుగానైతే ఎన్నికల జరిగే సరిహద్దు ప్రాంతాల్లో పటిష్టమైన బలగాలతో తనిఖీ చేస్తారు.. కానీ అది ఎక్కడా జరగలేదు. ఇన్ని వేల వాహనాలను పోలీసులను ఎలా అనుమతించారు? ఎందుకు చెక్ పోస్టులను తీసేశారు? తెల్లవారు జాము నుంచి దొంగ ఓట్లు వేసేందుకు వస్తున్న వారిని అన్ని రాజకీయ పార్టీలు పట్టుకున్నా ఎందుకు సెంట్రల్ అబ్జర్వర్లు పట్టించుకోలేదు? దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని బీజేపీ నాయకురాలు శాంతారెడ్డి ప్రశ్నిస్తే తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితి. భర్త పేరు తెలియని భార్య, తండ్రి పేరు తెలియని కుమారులు వచ్చి అడ్డంగా దొరికితే పారిపోయారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన పీఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లోకి కొన్ని వేల మందిని తరలిస్తే పోలీసులు ఎక్కడున్నారు? ప్రశ్నించిన టీడీపీ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. ఇదేనా న్యాయం, ధర్మం, ఇదేనా ప్రజాస్వామ్యం కాపాడటం అంటే? రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్న జగన్ రెడ్డి కోసం పోలీసులు పని చేస్తున్నారు. పనబాక లక్ష్మీ దొంగ ఓటర్లను పట్టుకొని పోలీసులకు అప్పగిస్తే మా నాయకులను అరెస్టు చేశారు. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులందరూ పోరాడుతున్నారు. బందిపోట్లను మరిపించేలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. దీనిని ప్రజలంతా గమనించాలి. వైసీపీ ముఠా గ్యాంగ్ తో తిరుపతి నాశనం కావాల్సిందేనా? పోలీసులు వాలంటీర్లు, వైసీపీ నాయకులతో కుమ్మక్కై ఎన్నికలను ప్రహసనంగా మార్చారు. మా ఓట్లు ఏమయ్యాయని ఓటర్లు ప్రశ్నిస్తుంటే అధికారులకు సిగ్గనిపించడం లేదా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్థానిక వ్యక్తి కాకపోయినా తిరుపతిలో బరితెగించి మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నికల జరిగే ప్రాంతాల్లో మంత్రులు ఎందుకు ఉన్నారు? ఒక్క ప్రతిపక్ష నాయకులనే అరెస్టు చేస్తాం, అధికారపక్షానికి ఊడిగం చేస్తామన్నట్లుగా పోలీసులు ప్రవర్తిస్తున్నారు. ఇదెక్కడి ప్రజాస్వామ్యం.? ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అందరూ ప్రయత్నిస్తుంటే వైసీపీ మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తుంది. ఏది చేసినా ప్రజలు నమ్మేస్తారని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.

స్కూల్, కాలేజీ బస్సుల్లో తిరుపతికి అక్రమంగా దొంగ ఓటర్లను తరలించారు. దొంగల్ని పట్టుకోకుండా అమాయకులను అరెస్టు చేసి వీరంగం సృష్టించిన చంద్రగిరి ఎస్ఐ తీరు అందరూ గమనించారు. టీడీపీ నేతలు తెల్లవారు జామునుంచి పోరాడుతున్నారు. పోలీస్ వ్యవస్థ ఎందుకు నిర్వీర్యమైంది? ఎన్నికల కమిషన్ ఎందుకు పట్టించుకోవడం లేదు? వైసీపీ చేస్తున్న అరాచకాలకు సీఈసీ సమాధానం చెప్పాలి.? పోలీసు, పోలింగ్ సిబ్బంది ఏకపక్షంగా ప్రవర్తించారు. 10 ఏళ్లు కేంద్రంలో పని చేసిన వ్యక్తి, 4 సార్లు ఎంపీగా చేసిన మహిళ దొంగల్ని పట్టించినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం కేంద్రం ఎన్నికల కమీషన్ కూడా అదే తోవలో పోతుంటే మేం ఎవరికి చెప్పాలి.? వైసీపీ అరచకాలను గట్టిగా ఖండిస్తున్నాం. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా తిరుపతి ఉప ఎన్నికల్లో వైఫల్యం చెందిందా? వైసీపీ చేసిన దుర్మార్గాలను వీడియా ఆధారాలతో సహా సీఈసీకి అందిస్తాం. అవ్వన్నీ పరిగణలోకి తీసుకుని తిరుపతి ఎన్నికను రద్దు చేసి సెంట్రల్ ఫోర్స్ తో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాం. పూర్తిగా కేంద్రం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి ధర్మాన్ని కాపాడాలి. వాలంటీర్ లు, పోలీసులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. అవసరమైన చోట రీపోలింగ్ పెట్టాలి. బరితెగించిన అధికారులపైనా సీఈసీ చర్యలు తీసుకోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా వారికి వంతపాడటం ఏమాత్రం సమంజసం కాదు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు నిర్వహించాలి. ఢిల్లీలోని టీడీపీ ఎంపీలు ఎన్నికల కమిషన్ ను కలిసి తిరుపతిలో ఎన్నికను అడ్డు పెట్టుకొని చేసిన దుర్మార్గాలపై ఫిర్యాదు చేస్తారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ న్యాయం చేయాలి. వాస్తవాలను పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నికల సంఘంపై ఉన్న నమ్మకం పెంచడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి.

దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన వారిని ప్రశ్నిస్తుంటే తడబడుతున్నారు. తప్పు చేస్తున్నామని వాళ్లే బాధపడుతున్నారు. సామాన్యులతో వైసీపీ నాయకులు నేరాలు చేయిస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరగలేదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులపై ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫడవిట్ ప్రకారం తిరుపతి ఎన్నికల నియమావళిని అతిక్రమించి అక్కడే ఉన్నారు. అలాంటి వ్యక్తి మంత్రిగా ఉండటానికి అనర్హుడు. వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి. పెద్దిరెడ్డి చేసిన దొంగ పనికి సిగ్గుపడకుండా బరితెగించి మాట్లాడుతున్నారు. పబ్లిక్ మీటింగ్, పెళ్లికో వచ్చినట్లు వేల మంది వచ్చారు. ఓటర్లకు నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంది. తిరుపతిలో ఓటర్లందరికీ సాయంత్రం 7 గంటలకు ఓటు వేసే హక్కు ఉంటుంది. ఓటర్లు కేంద్రానికి వెళ్లినప్పుడు ఓటు వేసి ఉంటే ఛాలెంజ్ ఓటు వేస్తే ఎన్ని దొంగ ఓట్లు పడ్డాయో భయటపడుతుంది. నిజమైన ఓటర్లు ఓటు హక్కు వినియోగించకోకపోతే దొంగలదే పైచేయి అవుతుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి అందరం కలిసి ముందుకు రావాల్సి ఉంది. దుర్మార్గులను ఎక్కడికక్కడ నియంత్రణ చేయకపోతే రాజ్యాంగం మనకిచ్చిన హక్కులను కోల్పోవాల్సి వస్తుంది.

తిరుపతి ఉప ఎన్నికల పోలింగ్ లో అధికార వైకాపా అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ అనేక అంశాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చినా ఎటువంటి చర్యలు లేవు. స్థానిక ఎన్నికల అధికారులతో కుమ్మక్కై అధికార వైకాపా లెక్కలేనన్ని అక్రమాలకు పాల్పడుతోంది. ఫేక్ ఐడీలతో స్థానికంగా లేని వారి ఓట్లను బయట వారితో వేయించి వైసీపీ రిగ్గుంగులకు పాల్పడుతోంది. పేక్ ఓటర్ దారులు తండ్రిపేరు, సహచరి పేర్లు కూడా చెప్పలేపోతున్నారు. వారు ఫేక్ ఓటర్ దారులు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అఫిడవిట్ ప్రకారం తిరుపతి పార్లమెంటుకు చెందిన వ్యక్తి కాదు. కానీ, ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఆయన తిరుపతి పార్లమెంటు పరిధిలోనే ఉన్నారు. పోలింగ్ రోజైన 17 వ తేదీన 11.15 AM కు పత్రికా సమావేశం నిర్వహించారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్దం. ఇతర మంత్రులు సైతం తిరుపతిలోనే తిష్ట వేశారు. ప్రజాస్వామ్యం కాపాడేందుకు తెలుగుదేశం నాయకులు ఫేక్ ఓటరుదారులను పట్టుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కానీ చర్యలు శూన్యం. స్థానిక అధికారులు, పోలీసులు ఫేక్ దారులను వదిలేసి తెదేపా నాయకులైన నరసింహ యాదవ్, దొరస్వామీ నాయుడు, శ్రీరాం చినబాబు, దేవనారాయణ రెడ్డి, వెంకటేష్, వెంకటరత్నం, రవి, మణికంఠ లను అరెస్టు చేశారు. పోలింగ్ అక్రమాలకు సంబంధించి వీడియో క్లిప్పింగులతో సహా ఎన్నికల అధికారులకు అందించాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవాలి. తిరుపతి అసెంబ్లీ సెంగ్మెంట్లలో ఎన్నికలను రద్దు చేసి తిరిగి రీ-పోలింగ్ నిర్వహించాలి.

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు వింటుంటే, దొంగే దొంగ అన్నట్లుగా ఉందని, ప్రభుత్వం, వైసీపీ చెప్పాల్పిన సమాధానాన్ని ఆయనే చెబుతున్నాడని, ఎన్నికల అథారిటీ మొత్తం తనేచూసినట్లుగా ఆయన మాట లున్నాయని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు . తిరుపతిలో ఉపఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా జరగడంలేదని, మూగవాణ్ణి కొడితే ఎలాగైతే తనబాధ చెప్పుకోలేడో, తిరుపతిలో ప్రజాస్వామ్యం పరిస్థితి కూడా అలాగే ఉందన్నారు. తిరుపతికి బయటివ్యక్తులు వేలల్లో వస్తుంటారని సజ్జల చెబుతున్నాడని, గత రెండు, మూడురోజులనుంచి చూస్తే రోజుకి 20వేలమంది కూడా తిరుమలకు వచ్చినట్టు లేదన్నారు. ఈ ఒక్కరోజే లక్షమంది వచ్చారని సజ్జల చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. తిరుపతికి వచ్చే భక్తులను అడ్డుకునే శక్తి తెలుగుదేశం వారికిలేదని, మేము ఒకవేళ అలా అడిగితే ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం చూస్తూ ఊరుకుంటాయా అని అశోక్ బాబు ప్రశ్నించారు. తిరుపతికి వచ్చే యాత్రికులు ఎవరూ ఓటర్ కార్డులు చూపరని, ఎవరని ప్రశ్నిస్తే, వారు ఆధార్ కార్డులు చూపుతారన్నారు. కానీ నేడు బయటినుంచి వచ్చిన వ్యక్తలు వద్ద పోలింగ్ స్లిప్పులు, ఓటర్ కార్డులేఉన్నాయని, ఈ లాజిక్ సజ్జల ఎందుకు గుర్తించలేదో విచిత్రంగా ఉందన్నారు. 75శాతం గెలుస్తామని, 90శాతం ప్రజల మద్ధతు తమకే ఉందని చెప్పుకుంటున్న సజ్జలకు, ఆయనప్రభుత్వానికి, లోపల భయంగానేఉందని, అసలు తిరుపతి ఎన్నికలో గెలుస్తామో లేదోనన్న ఆందోళన తోనే అధికారపార్టీ ఇటువంటి దాష్టీకాలకు పాల్పడిందన్నారు. 15 రోజుల్లో టీడీపీ చేసిన ప్రచారంలోనే వైసీపీ ఓడిపోయిందన్నారు. గెలుపుసాధ్యం కాదని భావించే వాలంటీర్ల వ్యవస్థను వాడుకొని, ప్రభుత్వసమాచారాన్ని దుర్వినియోగంచే శారని అశోక్ బాబు ఆక్షేపించారు. చనిపోయినవారు, ఇతరప్రాంతాల్లో ఉంటున్నవారు, విదేశాలకు వెళ్లినవారి సమాచారం తీసుకొని,వారిస్థానంలో దొంగఓటర్లతో ఓట్లు వేయించే ప్రక్రియకు ప్రభుత్వం పూనుకుందన్నారు. నకిలీ ఓటర్ కార్డులు సృష్టించి మరీ, దొంగఓటర్లను ప్రభుత్వం తిరుపతికి తరలించిందన్నారు. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా రోజుకి 20, 30వేలమందిభక్తులు తిరుపతికి రావడం కష్టంగా ఉంటే, ఒక్కరోజే లక్షమంది వచ్చారని రామకృష్ణారెడ్డి చెప్పడం పచ్చి అబద్ధమ న్నారు. ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్ధంగా వైసీపీప్రభుత్వం తిరుపతి ఉపఎన్నికలో ఖూనీ చేసిందనడానికి సజ్జల వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.

స్థానిక ఎన్నికల్లో గెలిచామంటూ సజ్జల బీరాలుపలుకుతున్నాడని, తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్, అసెంబ్లీ ఉపఎన్నికలో ఓడిపోయిందన్నారు. ప్రజల తీర్పులు ఎప్పుడెలా ఉంటాయో తెలియదని, వైసీపీని కార్పొరేటర్ స్థాయిలో చూస్తే, ఆపార్టీ అభ్యర్థులను ప్రజలు అక్కడ గెలిపిస్తారన్నారు. 90శాతంప్రజలు అధికారపార్టీకి మద్ధతుపలుకుతున్నప్పుడు, గెలుపుకోసం ఇంతలా దిగజారాల్సిన అవసరం అధికారపార్టీకి ఎందుకొచ్చిందో సజ్జల చెప్పాలన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తిరుపతిలో ఇల్లుఉంటే, ఆయన అక్కడ మాట్లాడితే తప్పేమిటని సజ్జల అంటున్నాడని, మంత్రిఓటు పుంగనూరులో ఉంటే, తిరుపతి లో ఆయనకేం పనో చెప్పాలన్నారు. ఒకమనిషికి నాలుగు ఇళ్లు ఉన్నంత మాత్రాన నాలుగుచోట్ల ఓట్లు ఉండవన్నారు. రిక్షాకార్మకుడైనా, మంత్రైనా ఓటు ఎక్కడుంటే అక్కడే వినియోగించుకోవాలనే కనీస ఇంగితంకూడా సజ్జలకు లేకపోవడం బాధాకరమన్నారు. తిరుపతి ఉపఎన్నికలో ఎంతమెజారిటీతో వైసీపీ గెలుస్తుందో, సజ్జల చెప్పగలడా అని అశోక్ బాబు నిలదీశారు. తిరుపతిలోని స్థానికులే వైసీపీ తీరుని అసహ్యించుకుంటున్నారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నిర్వహించినా, కిందపనిచేసే అధికారులు, పోలీసులు అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలప్రకారమే పనిచేశారని అశోక్ బాబు స్పష్టంచేశారు. బస్సులు కనపడుతున్నా... బయటివ్యక్తులు దొరికిపోయినా డీజీపీ సవాంగ్ ఏమీ లేదని చెప్పడం చూస్తేనే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందన్నారు. తిరుపతి ఉపఎన్నిక ఎలా జరిగిందో నేషనల్ మీడియాలో వచ్చిందని, అది సజ్జలకు అర్థం కాకపోవడం సిగ్గుచేటన్నారు. పిల్లిలా కళ్లుమూసుకొని పాలుతాగకుండా, 400 బస్సుల్లో వచ్చిన స్థానికేతరులపై సజ్జల ఏం సమాధానంచెబుతాడన్నారు. తిరుపతికి స్వామివారి దర్శనానికి వచ్చేవారు, ఓటర్ ఐడీలు, ఓటర్ స్లిప్పులు చూపడం, తండ్రిపేరు, భర్తపేరు అడిగితే కార్డులో ఉన్నాయి చూసుకోమనడం వంటిసమాధానాలే వారెవరో చెప్పకనే చెబుతున్నాయన్నారు. ఈ విధంగా స్థాని కేతరులైనవారిని తరలించి, వారితో దొంగఓట్లు వేయించి గెలవాలని చూసినప్పుడే వైసీపీ ఓడిపోయిందన్నారు. రాజకీయంగా గెలవడం, నైతికంగా గెలవడం రెండూ ఒక్కటి కాదన్నారు.

Advertisements

Latest Articles

Most Read