తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాల పై, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు , కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి, ఇక్కడ జరుగుతున్న అరాచకాల పై ఫిర్యాదు చేసారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీస్ లోనే, ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో, వాలంటీర్లని ఉపయోగిస్తున్నారు అంటూ, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఎన్నికల కమిషన్ కు ఇచ్చారు. వారు ఎన్నికల ప్రచారం చేయకుండా తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కేంద్ర బలగాలతోనే ఎన్నికలు నిర్వహించాలి అంటూ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు కోరారు. ఇక చంద్రబాబు పై జరిగిన రాళ్ళ దాడి ఘటన పై కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ, ఈ కేసు విషయంలో డిఐజి వ్యవహరించిన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క రాళ్ళ దా-డి జరిగితే, అలా ఏమి జరగలేదని ఏకంగా డీఐజి ప్రెస్ మీట్ లో చెప్పారని, ఆధారాలు ఉంటే ఇవ్వాలని, అప్పుడు విచారణ మరింతగా చేస్తామని అంటున్నారని, ఆయన పై చర్యలు తీసుకోవాలి అంటూ టిడిపి నేతలు ఫిర్యాదు చేసారు.

ec 15042021 2

అయితే తెలుగుదేశం నేతలు ఫిర్యాదు పై, కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసిన లేఖకు బదులు ఇస్తూ, మరో లేఖ రాసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎక్కువ శాతం పోలింగ్ బుతుల్లో, కేంద్రం ఎన్నికల బలగాలను దించామని సమాధానం ఇచ్చింది. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలను పంపించమని, ఎక్కువ చోట్ల వారే ఉంటారని కేంద్ర ఎన్నికల సంఘం తమ లేఖలో తెలిపింది. అలాగే వాలంటీర్ల విషయంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు ఎక్కడా ప్రచారం చెయకూడదు అని, వాలంటీర్లు ఎక్కడా కూడా ఎన్నికల ఏజెంట్లు గా ఉండ కూడదు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుగుదేశం ఎంపీలకు రాసిన లేఖలో తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో, ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు, అన్ని విధాలుగా సమాయత్తం అవుతున్నాం అంటూ, తెలుగుదేశం ఎంపీలకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, సిబిఐ మాజీ జేడీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసారు. దీని పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, డిజ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో, అందులో జోక్యం చేసుకోకూడదు అని చెప్పి, గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాల సూత్రాల ప్రకారం తమ పరిధి పరిమితం అని చెప్పి వ్యాఖ్యానిస్తూనే, ఇందులో ఉండే స్టేక్ హోల్డర్స్ ఎవరు అయితే ఉన్నారో, ఉద్యోగులు, నిర్వాసితులు, ఇతర వర్గాల వారు, ఇలా వాళ్ళ ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయం పై మాత్రమే, దానికి సమాధానం ఇవ్వాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసారు. నాలుగు వారాల్లో కేంద్ర ప్రభుత్వం ఈ సమాధానాన్ని హైకోర్టులో దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా ఈ కేసు విచారణను కూడా నాలుగు వారాల పాటు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తరుపున, సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణ రావు, హైదరాబాద్ కు చెందిన బాలాజీ , వీరు ఇద్దరూ, పిటీషనర్ తరుపున తమ వాదనలు వినిపించారు.

సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులను అన్యాయంగా బెదిరిస్తున్న వాకాడు సిఐ నరసింహారావు, ఎస్ఐ శేఖర్ బాబులను తక్షణమే విధులనుంచి తప్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బూత్ ఏజంట్లను పెట్టవద్దని, ఒకవేళ పెడితే మీ సంగతి చూస్తామని సిఐ, ఎస్ఐ లు బెదిరిస్తున్నారని...వారిద్దరూ పోలీసు శాఖలో పనిచేస్తున్నారో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.  ఎన్నికలయ్యాక వైసిపి ప్రభుత్వం ఇంకా మూడేళ్లు ఉంటుందని, తర్వాత మీ పరిస్థితి ఏమిటో చూసుకోవాలని అంటున్నారని, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మూడేళ్ల తర్వాత వైసిపి ప్రభుత్వం ఉండదని, ఆ తర్వాత కూడా పోలీసులు ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని  గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించపోతే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు.  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులని, మిగిలిన వారు  ఎవరైనా, ఎంతటివారైనా వారికి సేవకులేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మసలు కోవాలని అన్నారు. బెదిరింపులు, తప్పుడు కేసులతో తిరుపతి ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఉపఎన్నికలు తిరుపతి పార్లమెంట్ వరకే సంబంధించినది కాదు.. ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ను కాపాడుకోవడానికి ఇదొక సదవకాశం. ఈ అవకాశాన్ని రాష్ట్రం కోసం తిరుపతి ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలి. వైసీపీ రెండేళ్ల పాలనలో ఏం జరిగిందో ప్రజలు నెమరువేసుకోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తిరుపతి ఓటర్లపై ఉంది. తిరుపతి ప్రజల చేతిలో ఓటనే వజ్రాయుధం ఉంది. దీంతో అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకే విజ్ఞతతో ఆలోచించాలి. టీడీపీ పాలనలో సన్ రైజ్ స్టేట్ పాలసీతో అనేక పరిశ్రమలు వచ్చాయి. పెద్దఎత్తున అభివృద్ధి జరిగింది. 8 రోజులుగా తిరుపతిలో ప్రజల బాధలు విన్నా. ధరలు పెరుగుదల, ప్రజలపై దాడి, ఎక్కడ చూసినా సహజ వనరుల దోపిడీ, అవినీతి జరుగుతోంది. రాష్ట్రాన్ని అన్ని విధాల అన్యాయం చేశారు. అప్పుల్లో, ధరల పెరుగుదలలో నెం.1గా ఉన్నాం. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. యూఎస్ ప్రభుత్వ రిపోర్ట్ లో కూడా 150 దా-డు-లు ఎస్సీలపై దా-డు-లు జరిగాయని చెప్పారు. మన కీర్తి ప్రతిష్టలు అంతర్జాకీయ స్థాయికి వెళ్లారు. అక్రమ కేసులు పెట్టడంలో రికార్డ్ స్థాయి. 10 వేల మందిపై తప్పుడు కేసులు, ఆస్తుల ధ్వం-సం-తో పాటు 2 లక్షల మందిపై బైండోవర్ కేసులు పెట్టారు. ఇన్ని జరిగితే జగన్ రెడ్డి ఏం చేస్తున్నారు? మొద్దునిద్ర పోతున్నారా? DND బోర్డు పెట్టారు. డునాట్ డిస్ట్రర్బ్ మీ అని. 365 రోజులూ సీఎం ఇంటి వద్ద 144 సెక్షన్ పెట్టారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో తిండి పెట్టలేక మూసివేస్తుండటం నీకు సిగ్గనిపించడం లేదా? ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయింది. అప్పులు విపరీతంగా చేశారు. వ్యవస్థలన్నీ పతనావస్థకు చేరుకున్నాయి. నాసిరకం మద్యంతో ఇబ్బందులు పడుతున్నారు. అనారోగ్యం పాలవుతున్నారు. సీఎం మాత్రం ఆనంద పడుతున్నారు. మద్యపాన నిషేధం అన్నారు ఏమైంది? ఎప్పుడు మద్యాన్ని నిషేదిస్తారు? మద్యంపై వచ్చే ఆదాయం చూపి అప్పు తెచ్చుకోవాలని ప్రయత్నించే వారు మద్యం పాన నిషేదం చేస్తారా? ఇసుక విషయంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు పని లేదు. జగన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ కోసం రూ.150 ధర పెంచారు.

25కు 25 ఎంపీలు ఇస్తే ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్నారు. ఇప్పుడు 27 మంది ఎంపీలు ఉన్నారు. ఏం సాధించారు? కేంద్రం మెడలు వంచుతామన్నారు, కానీ ఇప్పుడు కేంద్రాన్ని చూస్తే భయంతో వణికిపోతున్నారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఎందుకు అడ్డుకోలేక పోతున్నారు. విభజన చట్టంలో ఉండే హామీలు ఏమయ్యాయి? రాష్ట్ర హక్కులు కాపాడటంలో విఫలమయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ ఏమైంది? విశాఖ రైల్వే జోన్ ఏమైంది? దోచుకోవడం విదేశాల్లో దాచుకోవడమే పని. తిరుపతి పవిత్రత పూర్తిగా దెబ్బతింది. ఎర్రచందనం స్మ-గ్లిం-గ్ తో డెన్ గా తయారైంది. ఉచిత ఇసుక ఇవ్వాలని మేం డిమాండ్ చేశాం. ఇవాళ 135 వృత్తుల వారు రోడ్డున పడ్డారు. నవరత్నాల పేరుతో నవ మోసాలు చేస్తున్నారు. అమ్మఒడికి రూ.14 వేలు ఇచ్చి.. నాన్న బుడ్డితో రూ.36 వేలు లాగేస్తున్నారు. వాహన మిత్ర పేరుతో రూ.10 వేలు ఇచ్చి జరిమానాల పేరుతో 20వేలు లాగేస్తున్నారు. సెంట్ భూమి పేరుతో రూ.6,500 కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 2.60 లక్షల మంది వాలంటీర్ల ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకు ఇచ్చి, 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి రద్దు చేశారు. రైతు భరోసా రూ.12,500 ఇస్తామని చెప్పి రూ.7,500 ఇస్తామంటున్నారు. పోలీసులు వాళ్ల ఉద్యోగాల కోసం అధికార పార్టీ నాయకులు చెప్పినట్లు కేసులు పెడుతున్నారు. దేవినేని ఉమా వీడియో ప్రదర్శించినందుకు సీఐడీ కేసు పెట్టారు. ఆ వీడియోలో తిరుపతిని కించపరుస్తూ మాట్లాడిన వ్యాఖ్యలు జగన్ వి కాదా? కేసు పెట్టాల్సింది ఉమా మీద కాదు, జగన్ మీదే పెట్టాలి. హిందువులకు పవిత్రమైన తిరుపతిని కించపరుస్తూ తిరిగి టీడీపీ నేతలపై కేసులు పెడుతున్నారు. బాహుబలిని చం-పిం-దెవరో తేలిపోయింది, కానీ బా-బా-యి-ని చం-పిం-దె-వ-రో ఇంతవరకు తేలలేదు. దీనికి జగన్ సమాధానం చెప్పాలి.

మీడియా గొంతు నొక్కేందుకు 2430 జీవో తెచ్చారు. రాష్ర్టంలో మీడియాకు స్వేచ్చ లేదా? మీ పేపర్ లో అసత్యాలు రాసుకుని నిజాలు రాసిన మీడియా గొంతు నొక్కుతారా? ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఓటర్లకు డబ్బులిస్తారు, వాలంటీర్ల ద్వారా బెదిరిస్తారు. వీటిని కూడా ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. ప్రతి బూత్ కి సీసీ కెమెరా ఉండాలి. బోగస్ ఓట్లేసినవారిపై ఈసీ చర్యలు తీసుకోవాలి. మైక్రో అబ్జర్వర్ లు పెట్టి నివేదిక రిటర్నింట్ అధికారికి ఇవ్వాలి. దొంగ ఓట్లు వేసేవారిని, గొడవలు సృష్టించేవారిపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో పోలీసు వ్యవస్ధ నిర్వీర్యమైంది. నాపై రాళ్ల దా-డి జరిగితే.. దా-డి జరగలేదని పోలీసులు బుకాయిస్తున్నారు. నిన్న ప్రచార సభకు కరెంట్ కట్ చేశారు. ఈ పోలీసులు ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. కాబట్టి కేంద్ర బలగాల ద్వారా ఈ ఎన్నికలు నిర్వహించాలి. తిరుపతిలో ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్ జరగాలి. అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలుంటాయి. ప్రభుత్వంపై మా బాధ్యతగా మేం పోరాటం చేస్తున్నాం. ఇందులో ప్రజలకు కూడా తమ వంత బాధ్యత నిర్వర్తించాలి. ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. పనబాక లక్ష్మి, నాయకులందరూ బాగా ప్రచారం చేశారు. నాలుగు సార్లు గెలిచిన పనబాక లక్ష్మిని బూతుల మంత్రి వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఆంబోతుల్లా మాట్లాడుతున్నారు, కానీ వారు మాట్లాడిన ప్రతి మాటకు రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. తిరుపతి ఎన్నిక దేవుడిచ్చిన అవకాశం. ఆకాశంలో తిరిగే వారికి, అహంకారంతో వ్యవహరించే వారికి గుణపాఠం చెప్పే అవకాశం ప్రజలకు వచ్చింది. ధరలు పెంచారు, పంచాయితీ ఎన్నికల్లో దౌ-ర్జ-న్యా-లు చేసి గెలిచారు, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచారు, వీరి పద్ధతి మారలేదు. ఈ ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి వైసీపీకి గుణపాఠం చెబితే.. ఈ ప్రభుత్వం ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తుంది. దీని వల్ల ప్రజలకు న్యాయం జరుగుతుంది. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే 7557557744 నెం.కి పోన్ చేయండి. వీటిని ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. ఎన్నికలయ్యే వరకు 24 గంటలు పనిచేస్తుంది. ప్రజలు వీరోచితంగా ముందుకు వచ్చి ఓటేయాలి.

Advertisements

Latest Articles

Most Read