ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మునిసిపల్ ఎన్నికలు తరువాత, ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న సమయంలో, ఒక్కసారిగా అమరావతి భూములు స్కాం అంటూ ఏకంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సిఐడి, ఆయన్ను విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు ఈ వ్యవహారం పై కోర్టుకు వెళ్ళే నిర్ణయం పై, న్యాయనిపుణులు ఆలోచిస్తున్న సమయంలో, ఈ రోజు మాజీ మంత్రి నారాయణకు షాక్ ఇచ్చారు ఏసీబీ అధికారులు. మాజీ మంత్రి నారాయణకు చెందిన పది ప్రాంతాల్లో ఏకకాలంలో సీఐడీ దాడులు చేస్తుంది. ప్రధానంగా రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించి, కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేస్తున్న నేపధ్యంలోనే, నిన్న చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సిఐడి, ఈ రోజు మాజీ మంత్రి నారాయణకు కూడా నోటీసులు జారీ చేయటం జరిగింది. అయితే మాజీ మంత్రి నారాయణ అందుబాటులో లేకపోవటంతో, ఆయన భార్య రమా దేవికి నోటీసులు ఇచ్చారు. 22వ తారీఖున ఉదయం 11 గంటలకు, విజయవాడలో ఉన్న ఏపి సిఐడి కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని, ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే, అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి అంటూ, ఆ నోటీసులో పేర్కొన్నారు.

narayana 17032021 2

అయితే నోటీసులు ఇచ్చిన సిఐడి, హైదరాబాద్ లోని ఆయన ఆస్తులతో పాటుగా, నెల్లూరు, విజయవాడలోని ఆయనకు సంబందించిన ఆస్తులు పై కూడా సోదాలు చేస్తున్నారు. నారాయణ విద్యా సంస్థలకు సంబందించిన రికార్డులు అన్నీ కూడా పరిశీలిస్తున్నారు. అలాగే నారాయణకు దగ్గరగా ఉన్నటు వంటి వ్యక్తులకు, రాజధానిలో భూములు కేటాయించారని అనుమానిస్తున్న సిఐడి, దానికి సంబంధించి ఆధారాలు ఏమైనా దొరుకుతాయా అనే విషయం పై కూడా సోదాలు చేస్తున్నాటు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ తో పాటుగా, నెల్లూరు, విజయవాడలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగుతాయని చెప్తున్నారు. ఇప్పటికే ఈ కేసు విషయం పై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సిఐడి, ఆయన్ను 23న విచారణకు హాజరు కావాలని చెప్పగా, నారాయణకు 22వ తేదీన రావాలని నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నోటీసులు పై, ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించిన తెలుగుదేశం పార్టీ, రేపు హైకోర్టులో పిటీషన్ వేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై నమోదు అయిన సిఐడి కేసుకు సంబంధించి, తెలుగుదేశం పార్టీ న్యాయ నిపుణులతో సంప్రదింపులు చేస్తుంది. ఎఫ్ఆర్ సర్టిఫైడ్ కాపీ కోసం నిన్న ఉదయం దరఖాస్తు చేసారు. 24 గంటల్లో సర్టిఫైడ్ కాపీ ఇవ్వాలని కోరుతూ నిబంధనలు ఉన్నాయి. ఈ రోజు సర్టిఫైడ్ కాపీ వచ్చే అవకాసం ఉంది. సర్టిఫైడ్ కాపీ వచ్చిన వెంటనే, వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి ఇచ్చిన కంప్లైంట్, దాని పై నమోదు అయిన ఎఫ్ఐఆర్ పై క్వాష్ పిటీషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి 23వ తేదీ వరకు వైట్ చేయటం, దాని పై చర్చ జరగటం ఇవన్నీ అనవసరమైన వివాదాలకు తావు ఇచ్చినట్టు అవుతుందని, అందువల్ల ఈ లోపే, ఈ ఎఫ్ఐఆర్ పై క్వాష్ పిటీషన్ వేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా 2015లో ఆంధ్రప్రదేశ్ లో సిఆర్డీఏ చట్టం అమలులోకి వచ్చింది. ఈ సీఆర్డీఏ చట్టానికి అసెంబ్లీ ఆమోదం కూడా తెలిపింది. ఈ సిఆర్డీఏ చట్టంలో నిబంధాలు ప్రకారమే జీవో ఇచ్చారని, నిబంధనలకు అనుగుణంగానే, రాజధానిలోని అసైన్డ్ భూములు, దేవాదాయ భూములు, ఇలా ఆరు రకాల భూములుకు సంబంధించి జీవో ఇచ్చారని తెలుగుదేశం నేతలు చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఒక జీవోకి దురుద్దేశాలు ఆపాదించటం సరికాదని న్యాయవాదులు చెప్తున్నారు.

cbn 17032021 2

రాజధాని నిర్మాణం అనేది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందని, అటువంటి అప్పుడు ఆ రాజధాని ప్రజా ప్రయోజనాల కోసం అయినప్పుడు, భూములు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుందని, అలాగే బయట జరిగిన లావాదేవీలతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం ఉండదని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఎఫ్ఐఆర్ లో పేర్కున్న అంశాలు కూడా అభ్యంతరంగా ఉన్నాయని, ఎవరో రైతులు, ఎవరో మధ్యవర్తులు అంటూ, ఎక్కడ భూమీ, ఏ ఊరిలో భూమి, ఇలా ఏమి చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు ఎఫ్ఐఆర్ లో చెప్పటం, దానికి సంబంధం లేని సెక్షన్ల కింద కేసు నమోదు చేయటం పై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టటం పై కూడా అభ్యంతరం వ్యక్తం అవుతుంది. అసలు ఈ సెక్షన్ కింద కేసు ఎలా పెట్టారో కూడా ఆశ్చర్యం వేస్తుందని అంటున్నారు. అందుకే ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగం అని, ఎక్కడా ఏమి చెప్పకుండా, కేవలం గాల్లో ఆరోపణలు చేసి, చంద్రబాబుని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టే, దీని పై క్వాష్ పిటీషన్ వేస్తామని టిడిపి లీగల్ సెల్ అంటుంది.

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవెంకటేశ్వరరావుపై ఈ నెల 18న సచివాలయంలో శాఖాపరమైన విచారణ జరగనున్నది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నేతృత్వంలో అభియోగాలపై విచారణ జరపనున్నారు. సాక్షులుగా మాజీ డీజీలు రాముడు, సాంబశివరావు, మాల కొండయ్య, ఆర్పీ ఠాకూరులు ఉన్నారు. సాక్షులుగా విచా రణకు హాజరు కావాలని మాజీ డీజీలకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ మెమోలు పంపింది. ఏబీవెంకటేశ్వరరావుపై శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణను చేపట్టాలని విచారణాధి కారికి సుప్రీం ఆదేశాలు ఇచ్చింది. విచారణ నివేదికను మే 3 తేదీ నాటికి కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది. రోజు వారీ విచారణ చేసి, కేసుని త్వరగా ముగించాలని కోర్టు ఆదేశించింది. దీంతో సుప్రీం కోర్టు ఆదేశాలు ఇవ్వటంతో, ఈ కేసు విచారణ చేయకుండా ఇంకా ఇంకా పొడిగించాలని ప్రభుత్వం వేసిన పాచిక అపరలేదు. దీంతో విచారన షురు అయ్యింది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ చేపట్టే విచారణను ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో చేపట్టాలని ఏబీ వెంకటేశ్వరరావు అభ్యర్థించారు. క్వాసీ జ్యూడీషియల్ సంస్థగా కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ విచారణ గోప్యంగానే జరుగుతుందని తెలిపింది. ఆర్పీ సిసోడియా నేతృత్వంలో ఈ విచారణ జరగనుంది.

abv 16032021 2

ఇక కేసు విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, ఏబీవెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసారు. అయితే అప్పటి నుంచి ఆయన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తూ వచ్చింది. అధికారంలోకి రాగానే, ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టింది. తరువాత ఆయన నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో కుంభకోణం చేసారు అంటూ, ఆయన్ను సస్పెండ్ చేసారు. అయితే చార్జెస్ పెట్టటానికి ఏడాది కాలం పెట్టింది. చివరకు ఆయన వల్ల, రాష్ట్ర ఖజానాకు పది లక్షల నష్టం వచ్చింది అంటూ కేసుని తేల్చారు. వందల కోట్లు కుంభకోణం అని మీడియాలో ఊదరగొట్టి, చివరకు ఆయన ఏమి డబ్బులు తీసుకోలేదు కానీ, ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల, రాష్ట్ర ఖజానాకు పది లక్షల నష్టం అని తేల్చారు. అయితే ఆయన సస్పెన్షన్ మరో ఏడాది పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. విచారణ చేయకుండా, ఏమి చేయకుండా, కేవలం ఆరోపణలు చేసి, ఇప్పటి వరకు సస్పెండ్ చేసారని, ఇప్పుడు మరో ఏడాది సస్పెండ్ అంటున్నారని సుప్రీం కోర్టుకు వెళ్ళటంతో, కోర్టు వెంటనే విచారణ చేసి, తేల్చమని ఆదేశాలు ఇచ్చింది.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, నారా చంద్రబాబు నాయుడు రేపు ఏలూరులో పర్యటన చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకునే చంద్రబాబు, మధ్యాహ్నం 1:15 నిమిషాలకు ఏలూరులోని టిడిపి సీనియర్ నేత, మాజీ మాగంటి బాబు గారు నివాసానికి వెళ్లి, వారి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇటీవల మాగంటి బాబు కుమారుడు, మాగంటి రాంజీ అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. కుమారుడిని కోల్పోయి విషాదంలో మునిగిపోయిన, మాగంటి బాబు కుటుంబాన్ని చంద్రబాబు పరామర్శించి, ధైర్యం చెప్పనున్నారు. తరువాత, 2 గంటలకు క్రాంతి కళ్యాణ మండపనికి చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పరిమితం అవుతారా, లేదా తరువాత స్థానిక తెలుగుదేశం నేతలు, కార్యకర్తలతో ఏమైనా మాట్లాడతారా అనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఈ రోజు సిఐడి నోటీసులు ఇచ్చిన తరువాత, చంద్రబాబుని అరెస్ట్ చేస్తాం అంటూ, హడవిడి చేస్తున్న వైసీపీ నేతలకు సమాధానంగా చంద్రబాబు ఏమైనా మీడియాతో మాట్లాడతారా అనేది కూడా చూడాల్సి ఉంది. సిఐడి నోటీసులు ఇచ్చిన తరువాత, ఈ రోజు న్యాయనిపుణులతో చర్చించిన చంద్రబాబు, ఈ విషయం పై ఎలా ముందుకు వెళ్తారు అనేది చంద్రబాబు ఏమైనా చెప్తారా అనే అంశం పై ఆసక్తి నెలకొంది.

 

Advertisements

Latest Articles

Most Read