ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు పెద్దిరెడ్డి వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై విచారణ జరిగింది. ఈ రోజు ఆదివారం అయినా సరే, హౌస్ మోషన్ పిటీషన్ వేయటం, మంత్రిని నియంత్రిస్తూ ఆదేశాలు రావటంతో, హైకోర్టు ఈ కేసు తీవ్రత దృష్టిలో పెట్టుకుని విచారణ చేసింది. అయితే ఈ పిటీషన్ లో పెద్దిరెడ్డికి కొంత ఊరట లభించింది. మంత్రి పెద్దిరెడ్డిని ఇంటి వద్దే ఉండాలని నియంత్రణ చేయలేము కానీ, మంత్రి మీడియాతో మాట్లాడవద్దు అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు మాత్రం పాటించాల్సిందే అని తేల్చి చెప్పింది. మంత్రి మీడియాతో పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడటానికి వీలు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో పెద్దిరెడ్డికి ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. ఎందుకుంటే నిన్న ఎలక్షన్ కమిషన్ కూడా, మంత్రిగా విధులు నిర్వహించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. ఇప్పుడు కోర్టు మాత్రం, ఎక్కడికైనా వెళ్ళవచ్చు అని చెప్పింది. అయితే మీడియాతో మాట్లాడకూడదు అని హైకోర్టు కూడా సమర్ధించటం, మంత్రి కంట్రోల్ తప్పి మాట్లాడుతున్న మాటలకు కళ్ళెం వేసింది అనే చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ నిమ్మగడ్డ ఇచ్చిన ఆదేశాల పై నిన్న మంత్రి పెద్దిరెడ్డి హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేసారు. ఆ పిటీషన్ ని ఈ రోజు హైకోర్టు విచారణ చేసి ఈ ఉత్తర్వులు ఇచ్చింది.

hc 07022021 2

తన పై ఇచ్చిన ఉత్తర్వులు ఏకపక్షంగా ఉన్నాయని, కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా, ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది అంటూ, రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం పై, పెద్దిరెడ్డి హైకోర్టుకు వెళ్లారు. ఇక ఈ కేసు పూర్వాపరాలు చూస్తే, పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఏకాగ్రీవాల్లో, చిత్తూరు, గుంటూరు జిల్లాల ఏకాగ్రీవాలు అసాధారణంగా వచ్చాయి. మిగతా జిల్లాల్లో నామమాత్రంగా ఉంటే, ఈ రెండు జిల్లాల్లో అధికంగా రావటంతో, ఎన్నికల కమిషన్ వాటి పై పరిశీలన చేసిన తరువాతే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే మంత్రి పెద్దిరెడ్డి మీడియా సమావేశం పెట్టి, నిమ్మగడ్డ మాటలు విని ఏకాగ్రీవాలు ప్రకటించకపోతే, ఎన్నికలు అయిన తరువాత అధికారులను బ్లాక్ లిస్టు లో పెడతాం అని, వెంటనే అధికారులు ఏకాగ్రీవాలు ప్రకటించాలని హుకుం జారీ చేసారు. ఎన్నికల వ్యవహారాల్లో తల దూర్చటమే కాక, ఏకంగా ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులను బెదిరించటంతో, ఎన్నికల కమిషన్ పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చి, మీడియాతో మాట్లాడవద్దు అని చర్యలు తీసుకుంది. అయితే దీని పై స్పందించిన హైకోర్టు, హౌస్ అరెస్ట్ చేయమనే ఆదేశాలు కొట్టేస్తూ, మీడియాతో మాట్లాడ వద్దు అని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలు సమర్ధించింది.

స్థానిక సంస్థల ఎన్నికల డ్యూటీ నిర్వహించే అధికారులను బెదిరించే ధోరణిలో ఎంత పెద్ద స్థానంలో ఉన్న వారు మిమ్మల్ని భయపెట్టినా, ఎవరినీ లెక్క చేయాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ అధికారులకు స్పష్టం చేసారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే అధికారులును భయపట్టే విధంగా ఎవరినా ప్రయత్నం చేస్తే, ఎన్నికల కమిషన్ చూస్తూ ఉండదు అని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. చిత్తూరు, గుంటూరులో అసాధారణంగా వచ్చిన ఏకగ్రీవాల పై, రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిశీలిన చేసిన తరువాతే ప్రకటన చేయాలని చెప్పటం, ఆ తరువాత దాని పై పెద్దిరెడ్డి స్పందిస్తూ, ఎలక్షన్ కమిషన్ చెప్పిన మాటలు పట్టించుకోనవసరం లేదని, వెంటనే ఏకగ్రీవాల ప్రకటన చేయాలని, ఎవరైనా నిమ్మగడ్డ చెప్పినట్టు వింటే, మిమ్మల్ని బ్లాక్ లిస్టు లో పెడతాం అంటూ, అధికారులను బెదిరించే ధోరణిలో మాట్లాడారు. అయితే ప్రభుత్వం నుంచి, ఏకంగా ఒక మంత్రి ఎన్నికల కమిషన్ చెప్పిన మాటలు వినవద్దు అని ప్రకటన చేయటంతో, అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. అటు రాజ్యాంగం ప్రకారం ఎన్నికల కమిషన్ మాట వినాలని, కానీ ప్రభుత్వం బెదిరింపు ధోరణిలో ఎన్నికలు అయిన తరువాత, పరిస్థితి ఏమిటి అనే విధంగా, భయపడుతున్న అధికారులకు ఎన్నికల కమీషనర్ భరోసా ఇచ్చారు.

nimmagadda 06022021 2

ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కానీ, రిటర్నింగ్ అధికారులు కానీ ఎలాంటి భయం పెట్టుకోనవసరం లేదని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం, మీరు పని చేయండి, రాజ్యాంగమే మీకు రక్షణగా ఉంటుందని నిమ్మగడ్డ తేల్చి చెప్పారు. అధికారులు అందరూ ఎన్నికల కమిషన్ రక్షణ కవచంలో ఉంటారని, మీ పై అకారణంగా ఏ చర్య తీసుకోవాలి అని ఎవరైనా అనుకున్నా, ముందు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని గుర్తు చేసారు. దీని పై గతంలో సుప్రీం కోర్టు కూడా చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని, మీరు ఎవరినీ భయపడవద్దు అని భరోసా ఇచ్చారు. త్వరలోనే ఎన్నికల విధుల్లో ఉన్న అధికారుల పై, అనుమతి లేకుండా, తీసుకునే చర్యల పై నిషేధం విధిస్తూ, ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు ఇస్తుందని, అధికారులు రాజ్యాంగం ప్రకారం ధైర్యంగా పని చేయాలని భరోసా ఇచ్చారు. వ్యక్తులు శాశ్వతం కాదని, వ్యవస్థలు శాశ్వతం అనే విషయం, ఇలా బెదిరిస్తున్న వారు గుర్తు ఉంచుకోవాలని, ఎలక్షన్ కమిషన్ ఆ ప్రకటనలో తెలిపింది.

విశాఖ నార్త్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత గంటా శ్రీనివాస రావు, తన ఎమ్మల్యే పదవికి రాజీనామా చేస్తూ, స్పీకర్ తమ్మినేనిని లేఖ పమించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకంగా రాజీనామా చేస్తున్నాట్టు, గంటా శ్రీనివాస్ తన రాజీనామా లేఖలో తెలిపారు. పార్టీలకు అతీతంగా నాన్ పొలిటికల్ జేఏసి ఏర్పాటు చేస్తామని, అన్ని  పార్టీలతో కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటాం అని గంటా తెలిపారు. అయితే గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారో లేదో చూడాలి. ఇప్పటికే విశాఖ ఉక్కు పరిశ్రమ కాపాడుకోవటానికి, రెండు రోజులుగా పెద్ద ఉద్యమం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నా, జగన్ మోహన్ రెడ్డి మాత్రం, ఇప్పటి వరకు స్పందించకపోవటం గమనార్హం. అయితే, నిన్న వైసీపీ ఎంపీలు కూడా ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో, లైవ్ లో మైక్ అఫ్ లో ఉంది అనుకున్న, విశాఖ స్టీల్ ప్లాంట్ పై మనల్ని ఏమి మాట్లాడవద్దు అని చెప్పిన వీడియో బయటకు వచ్చింది. మొత్తంగా ఈ విషయంలో కేంద్రానికి తోడుగా, రాష్ట్ర ప్రభుత్వం కూడా గేమ్ ఆడుతుందని, ఈ చర్యలతో అర్ధం అవుతుంది. మరి దీని పై, ప్రజా ఉద్యమం చూసి అయినా, జగన్ మోహన్ రెడ్డి ఉద్యమం పై స్పందిస్తారేమో చూడాలి.

రాష్ట్రంలో ఒక పక్క ఎన్నికలు జరుగుతుంటే, ఎన్నికల కమిషన్ మాట అధికారులు వినవద్దు అంటూ, మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యల పై, ఈ రోజు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటూ, రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 21 వరకు మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు, మంత్రిగా విధులు నిర్వహించాల్సి వచ్చినప్పుడు ఆయన బయటకు రావచ్చు అని, మిగతా సమయం ఇంటికి పరిమితం అవ్వాలి అంటూ, ఆ సమయంలో మీడియాతో కూడా మాట్లాడకూడదు అని, డీజీపికి ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాల పై డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. తనకు ఇంకా ఆదేశాలు అందలేదని అన్నారు. గత 40 నిమిషాలుగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నానని, తనకు ఇంకా విషయం తెలియదు అని అన్నారు. మరి ఆదేశాలు చూసిన తరువాత డీజీపీ ఎలా స్పందిస్తారో చూడాలి. మరో పక్క ఈ ఆదేశాల పై స్పందించిన పెద్దిరెడ్డి, ఆ ఆదేశాలు అమలు అవుతాయో లేదో తెలుసుకుని, నిమ్మగడ్డ ఆదేశాలు ఇస్తే బాగుండేది అంటూ, వ్యాఖ్యలు చేసారు. తాను చేసేది తాను చేస్తాను అంటూ, మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. మరి ఇది ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

Advertisements

Latest Articles

Most Read