ఈ రోజు మిషన్ బిల్డ్ ఏపి పిటీషన్ పై, జస్టిస్ రాకేశ్ కుమార్ తప్పుకోవాలి అంటూ ప్రభుత్వం వేసిన పిటీషన్ పై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధానంగా ఇందులో పరిశీలించాల్సిన అంశం ఏమిటి అంటే, ఐఏఎస్ అధికారి, మిషన్ బిల్డ్ ఏపి అధికారి ప్రవీణ్ కుమార్ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ తప్పుగా ఉందనే అసంతృప్తి ఉందని చెప్తూ, అందులో జడ్జి అనని మాటలు అన్నారు అంటూ, వక్రీకరించారు అంటూ కోర్టు భావించింది. ఈ అంశం కోర్టు ధిక్కరణ కేసు కిందకు వస్తుందని, అంతే కాకుండా క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని, మొత్తంగా ఐఏఎస్ ప్రవీణ్ కుమార్ పై కోర్టు ధిక్కరణ కేసుతో పాటుగా, క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేయటం పెను సంచలనంగా మారింది. మీ మీద ఎందుకు కోర్టు ధిక్కరణ కేసు కింద నమోదు చేయకూడదు అంటూ హైకోర్టు ప్రశ్నిస్తూ, రెండు వారాల్లో సమాధానం చెప్పాలని కోరింది. ఆయన పై క్రిమినల్ చర్యల కింద కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాలనీ రిజిస్ట్రీని కోర్టు ఆదేశించింది. ఈ కేసుని ఫిబ్రవరి రెండో వారినికి వాయిదా వేసింది హైకోర్టు. అయితే ఈ సందర్భంగా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా, కోర్టులో తప్పుడు అఫిడవిట్ వేయకుండా, అనని మాటలు, అన్నారని చెప్పకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం ఎక్కువగా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కోర్టు అభిప్రాయ పడింది.

hc 30122020 2

ఇక ఈ కేసు పూర్వపరాలు చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మిషన్ బిల్డ్ ఏపి అనే పేరుతో, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ అధీనంలో ఉన్న స్థలాలు కొన్ని అమ్మేసి, సొమ్ము చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. వాటిని వివిధ పధకాలకు, ఇతర అవసరాలకు వాడుకోవచ్చు అని ప్రభుత్వం ఆలోచన. ఒక పక్క భారీగా అప్పులు చేస్తూ, ఇలా ఆస్తులు కూడా అమ్మే ప్రక్రియ మొదలు పెట్టటంతో, కొంత మంది కోర్టుకు వెళ్లారు. ఈ సందర్బంగా జస్టిస్ రాకేశ్ కుమార్ ధర్మాసనం, ప్రభుత్వ తీరుని తప్పు బట్టింది. అయితే ప్రభుత్వం ఈ సందర్భంగా రాకేశ్ కుమార్ తమ ప్రభుత్వం పై కొన్ని వ్యాఖ్యలు చేసారు, కేంద్రానికి పాలన అప్పగిస్తాం అన్నారు, ఆయన ఈ కేసు విచారణ చేయటానికి వీలు లేదు అంటూ కేసు వేసింది. ఈ కేసు పై వాదనల సందర్భంలో తాను ఆ మాటలు అనలేదని, ఎక్కడ అన్నానో, ఏ పత్రికలో ఆ వార్త వచ్చిందో చూపించాలని రాకేశ్ కుమార్ కోరారు. అయితే ప్రభుత్వ తరుపు వాదనలు, తాము అఫిడవిట్ లో చెప్పిన వాటికి, ఆధారాలు చూపించలేదు. ఈ అంశం పైనే ఈ రోజు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. తాము చెప్పని మాటలు, చెప్పినట్టుగా అఫిడవిట్ లో వేసారు అంటూ, కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేసింది.

కోర్టుల్లో దాఖలు అయ్యే వివిధ పిటీషన్ లు ఏ బెంచ్ ముందుకు వెళ్ళాలి, ఎవరు వాదించాలి అనే అంశాలు ఆయా కోర్టుల చీఫ్ జస్టిస్ లు నిర్ణయిస్తూ ఉంటారు. జడ్జిల అనుభవం, ఆ సబ్జెక్ట్ పై ఉన్న సామర్ధ్యం, ఇలా వివిధ అంశాలు తీసుకుని, రోస్టర్ విధానంలో కేసులు, ఆయా బెంచ్ లకు కేటాయిస్తూ ఉంటారు. ఒక్కో బెంచ్ ముందుకు, ఒక్క రకం వ్యాజ్యాలు వచ్చేలా, రోస్టర్ పై, ఆయా కోర్టుల చీఫ్ జస్టిస్ లకు అధికారం ఉంటుంది. ఆయా కోర్టుల చీఫ్ జస్టిస్ లు ఈ నిర్ణయం తీసుకుంటారు. సుప్రీం కోర్టులో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టులో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఇవి ప్రతిసారి కొంత సమయానికి మారిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్తు చీఫ్ జస్టిస్ కొత్త రోస్టర్ విడుదల చేసారు. ఏ కేసు, ఏ బెంచ్ తీసుకోవాలి అనే అంశం పై, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ బాబ్డే రోస్టర్ విడుదల చేసారు. జనవరి 4 నుంచి ఈ కొత్త రోస్టర్ ప్రకారమే, జడ్జిల ముందుకు ఆయా కేసులు వస్తాయి. అయితే ఈ కొత్త రోస్టర్ ప్రకారం, చీఫ్ జస్టిస్ బాబ్దే బెంచ్, కీలకమైన ఎన్నికలు, హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లు, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు, సోషల్ జస్టిస్ కు సంబంధించిన కేసులు, కోర్టు ధిక్కరణ, రాజ్యాంగ పరమైన అపాయింట్మెంట్ లు, మైన్స్, మినరల్స్, కమిషన్ ఎంక్వయిరీ లాంటివి, చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు వస్తాయి.

sc 29122020 2

అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన, కాబోయే చీఫ్ జస్టిస్, ఎన్వీ రమణకు కీలకమైన కేసులు అప్పగించారు. ప్రజాప్రయోజన వాజ్యాలు, సామాజిక న్యాయం, క్రిమినల్ మ్యాటర్స్, సివిల్ మ్యాటర్స్, ఆర్బిట్రేషన్ కు సంబంధించి, పరిహారంకు సంభందించి, సామాజిక విషయాలు, జ్యూడీషియల్‌ అధికారులకు సంభందించి, ఇలా పలు కీలక కేసులను జస్టిస్‌ ఎన్వీ రమణ బెంచ్ కు కేటాయించారు. అయితే ఈ బెంచ్ లలో ఇతర న్యాయమూర్తులు కూడా ఉంటారు. బ్యాంకింగ్ కు సంబందించిన కేసులను జస్టిస్‌ నారిమన్‌ బెంచ్ కు కేటాయించారు. అలాగే ఇతర సుప్రీం కోర్టు జడ్జీలు అయిన, జస్టిస్‌ లలిత్, జస్టిస్‌ ఖన్విల్కర్, జస్టిస్‌ చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ లావు నాగేశ్వర రావు బెంచ్ లకు కూడా వివిధ కేసులు కేటాయించారు. ఇలా సుప్రీం కోర్టు రోస్టర్ ను, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ప్రకటించారు. త్వరలోనే చీఫ్ జస్టిస్ బాబ్డే రిటైర్డ్ అవ్వనున్నారు. ఈ లోపే జస్టిస్ ఎన్వీ రమణను చీఫ్ జస్టిస్ గా నామినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు ఈ రోస్టర్ విధానం కొనసాగే అవకాసం ఉంది, లేకపోతే సిజీ నిర్ణయం తీసుకుంటే, మళ్ళీ మధ్యలో మారొచ్చు కూడా.

కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుడు నందం సుబ్బయ్య హ-త్య తీవ్ర కలకలం రేపింది. ఇళ్ళ పట్టాల విషయంలో అతి పెద్ద స్కాంను ప్రశ్నించినందుకే ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఇప్పటి వరకు అయితే పోలీసులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ కేసు విషయానికి వస్తే, తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిగా నందం సుబ్బయ్య ఉన్నారు. ఈ మధ్య కాలంలో పార్టీ తరుపున ఆక్టివ్ గా ఉంటూ, పార్టీ కార్యక్రమాలు భారీగా చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‍రెడ్డి చేస్తున్న పనుల పై రాజకీయంగా టార్గెట్ చేసారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‍రెడ్డి అనేక అవినీతి కార్యక్రమాలు చేస్తున్నారు అంటూ, ఆయన వీడియోలు, ప్రెస్ మీట్ల రూపంలో అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ఆయన పెట్టిన వీడియోలలో కూడా ప్రధానంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‍రెడ్డి ఈ మధ్య కాలంలో చేసిన అవినీతి ఏమిటి అనేది అన్ని అంశాలు అందులో ప్రస్తావిస్తూ వచ్చారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‍రెడ్డి ప్రస్తానం ఎక్కడ నుంచి ప్రారంభం అయ్యింది, ఏ విధంగా ఆయన ఎదిగారు, ఏ విధంగా ఆయన సంపాదించారు, ఏ విధంగా అవినీతి చేసారు అంటూ, అన్ని అంశాల పై ఆరోపణలు చేస్తూ, నందం సుబ్బయ్య ఆ వీడియోల్లో చెప్పటం జరిగింది. దీంతో పాటు ఇళ్ళ స్థలాల విషయంలో కూడా ఆయన అనేక ప్రశ్నలు సంధిస్తూ వచ్చారు.

suresh 29122020 2

ఈ రోజు హ-త్య జరిగిన కొన్ని రోజులు ముందు కూడా ఒక వీడియో విడుదల చేసారు. ఈ క్రమంలోనే ఇళ్ళ స్థలాల విషయంలో ఎమ్మెల్యే, అతని బావమరిది అనేక ఆరోపణలు చేసారు. అయితే ఈ రోజు అదే ఇళ్ళ స్థలాలలో ఆయన విగత జీవిగా పడి ఉన్నాడు. తన కొడుకుని ఎమ్మెల్యేని చంపించారు అంటూ, నందం సుబ్బయ్య తల్లి లక్ష్మీదేవి, భార్య అపరాజిత సంచలన ఆరోపణలు చేసారు. ఇళ్ళ స్థలాల విషయంలో అవినీతిని ప్రశ్నించినందుకే ఇలా చేసారు అంటూ, సంచలన ఆరోపణలు చేసారు. అయితే ఈ ఆరోపణలు ఎమ్మెల్యే ఖండించారు. తన పేరుతొ ఎలాంటి కంప్లైంట్ వాళ్ళు ఇవ్వలేదని అన్నారు. అయినా చనిపోయిన వ్యక్తి, అనేక కేసుల్లో ముద్దాయి అని, ఎవరు చేసారో ఏమిటో అంటూ చెప్పుకొచ్చారు. అయితే తాను ఏ భూములు కోసం పోరాడారో, అదే భూమిలో చనిపోయారు. రేపు నారా లోకేష్ కడప వెళ్లనున్నారు. తెలుగుదేశం పార్టీ ఈ విషయన్ని సీరియస్ గా తీసుకుంది. అలాగే ఈ విషయం పై జగన్, డీజీపీకి కూడా చంద్రబాబు లేఖ రాసారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విచిత్రమైన జీవోని తీసుకుని వచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసిన ఈ జీవో, ఇప్పుడు చర్చనీయంసం అయ్యింది. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా మందికి పెంపుడు జంతువుగా కుక్కను పెంచుకుంటూ ఉంటారు. అలా కుక్కలను పెంచుకునే వారికి, ఈ జీవో వర్తిస్తుంది. కుక్కలే కాదు, పందులను పెంచుకునే వారికి కూడా ఈ జీవో వర్తిస్తుంది. మొత్తంగా చూస్తే, రాష్ట్రంలో కుక్కలు, పందులు పెరిగిపోకుండా, వారికి లైసెన్స్ లు ఉండాలని ప్రభుత్వం ఈ జీవోని తీసుకుని వచ్చింది. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ శాఖ ఈ జీవో ప్రకారం, ప్రతి కుక్కకి, పందులకు లైసెన్స్ ఉండాలి. ప్రభుత్వం చెప్పినట్టు లైసెన్స్ తీసుకోకపోతే ఫైన్ కూడా ఉంటుంది. ఒక వేళ మీరు లైసెన్స్ తీసుకోక పొతే, అధికారులు కనుక పట్టుకుంటే, రూ.500 ఫైన్ కట్టాలి. అంతే కాదు, లైసెన్స్ పొందే వారకు ప్రతి రోజు రూ.250 ఫైన్ కట్టాల్సి ఉంటుంది. ఒక వేళ, ఆ కుక్కలతో మాకు సంబంధం లేదు అని కానీ, లైసెన్స్ కానీ తీసుకోకపొతే వాటిని వీధి కుక్కలుగానూ, అలాగే పందులని కూడా అలాగే పరిగణిస్తారు. అలా పట్టుకున్న వాటిని కుటుంబ నియంత్రణ చేస్తారని, ఆ జీవోలో పేర్కొన్నారు. ఒక వేళ, మీ కుక్కకు, పందికి తీసుకున్న లైసెన్స్ కనుక గడువు అయిపోతే, దాన్ని మళ్ళీ రెన్యూ చేయాలి.

pet 29122020 2

మళ్ళీ 10 రోజులులోగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతే కాదు, లైసెన్స్ పొందాలి అంటూ, ముందుగా వాటి హెల్త్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. హెల్త్ సర్టిఫికేట్ ఉంటేనే, వాటికి లైసెన్స్ ఇస్తారు. కుక్కలు విషయంలో యజమాని హెల్త్ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. అలాగే పందుల విషయంలో ప్రభుత్వం వెటర్నరీ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెవాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ పొందిన సందర్భంలో కుక్కలకు పందులకు టోకెన్ లు సితారు. ఆ టోకెన్ నెంబర్ లు, కుక్కలు, పందుల మెడలో నిరంతరం వేలాడుతూ ఉండాలి. ఇలా అనేక నిబంధనలతో, ఈ జీవో విడుదల చేసారు. జీవో నెంబర్ 693తో, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఈ జీవోని విడుదల చేసారు. మరి ప్రజలు ఈ జీవో పై ఎలా స్పందిస్తారు అనేది చూడాలి ఉంది. ఇవన్నీ ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ అవుతాయా, ప్రజలు ఫైన్ లు కట్టాలి అంటే ఒప్పుకుంటారా ? ఇందులో ఉండే ఇబ్బందులు ఏమిటో రోజులు గడిచే కొద్దీ అర్ధం అవుతాయి.

Advertisements

Latest Articles

Most Read