వైసీపీ వై నాట్ 175 నినాదం ఏమో కానీ, పార్టీలో ఎవ‌రు ఉంటారో, ఎవ‌రు పోతారో తెలియ‌ని గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. ఇప్ప‌టికే ఉన్న 22 మంది ఎంపీల‌లో ర‌ఘురామ‌కృష్ణంరాజు కొర‌క‌రాని కొయ్య‌గా మారారు. ఇప్పుడు మ‌రో ముగ్గురు ఎంపీలు అరెస్టు కాక త‌ప్ప‌ద‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి. వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసులో ఇప్ప‌టికే రెండుసార్లు విచార‌ణ‌కి వెళ్లి వ‌చ్చిన క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డిని నేడో రేపో అరెస్టు చేస్తార‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. 24వ తేదీన అరెస్ట్ చేస్తార‌ని వైసీపీ నేత‌లే ఫిక్స‌య్యారు. కానీ కాస్తంత ఆల‌స్యంగా మ‌రింత ప‌క‌డ్బందీగా అరెస్టు చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. జ‌గ‌న్ రెడ్డికి కుడి చేయిలాంటి క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు భ‌యంతో వైసీపీలో ప్ర‌కంప‌న‌లు రేగుతున్నాయి. ఇదే స‌మ‌యంలో ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్టుతో వైసీపీ ఉలిక్కి ప‌డింది.  సిసోడియాను అరెస్ట్ చేసిన సీబీఐ వైసీపీలో ఇద్ద‌రి ఎంపీల కుటుంబ‌స‌భ్యుల‌ని ఆల్రెడీ అరెస్టు చేసింది. సిసోడియా అరెస్టు నేప‌థ్యంలో నెక్ట్స్ సౌత్ గ్రూప్ నే సీబీఐ టార్గెట్ చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడు అన్న శ‌ర‌త్చంద్రారెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల‌రెడ్డి త‌న‌యుడు రాఘ‌వ‌రెడ్డిని అరెస్టు చేసింది. వీళ్ల‌కి బెయిల్ కూడా రాలేదు. సౌత్ గ్రూప్ పై దృష్టి సారిస్తే విజ‌య‌సాయిరెడ్డి, మాగుంట శ్రీనివాసుల‌రెడ్డిల‌ని కూడా అరెస్టు చేస్తార‌ని ప్ర‌చారం సాగుతోంది. అదే నిజ‌మైతే వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు అరెస్టు కాక త‌ప్ప‌ద‌ని తెలుస్తోంది.

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యసాయిరెడ్డికి పెద్ద క‌ష్టం వ‌చ్చింది. మ‌ర‌ద‌లి అల్లుడు నంద‌మూరి తార‌క‌ర‌త్న మ‌ర‌ణంతో తీవ్ర విషాదంలో ఉన్న సాయిరెడ్డికి వ‌ర‌స షాకుల మీద షాకులు త‌గులుతున్నాయి. తార‌క‌ర‌త్న చంద్ర‌బాబుకి మేన‌ల్లుడు అయితే, సాయిరెడ్డికి అల్లుడు అవుతాడు. అప్ప‌ట్లో ఈ బంధుత్వాన్ని గురించి సాయిరెడ్డి చెబుతూ త‌న‌కి చంద్ర‌బాబు అన్న అవుతాడ‌ని వెట‌కారంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ అన్న చంద్ర‌బాబుని క‌లిసినందుకే సాయిరెడ్డిపై జ‌గ‌న్ రెడ్డి పీక‌ల్లోతు క‌క్ష పెట్టుకున్నాడు. త‌న బిడ్డ అయ్యే అలేఖ్య‌రెడ్డికి వ‌చ్చిన క‌ష్టంలో చంద్రబాబు కుటుంబం అండ‌గా నిల‌వ‌డంతో విజయసాయి రెడ్డి కృత‌జ్ఞ‌త‌లు చెప్పాడు. దీంతోపాటు అంత్య‌క్రియ‌ల సంద‌ర్భంగా చంద్ర‌బాబు ప‌క్క‌నే కూర్చున్న సాయిరెడ్డి ఆయ‌న‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యారు. మ‌ర‌ణ సంద‌ర్భం కావ‌డం ఇరువురికి ద‌గ్గ‌ర బంధువు కావ‌డంతో అంతా విషాదంలో రాజ‌కీయాలేంటి అనుకున్నారు. కానీ జ‌గ‌న్ రెడ్డి మాత్రం సాయిరెడ్డిని క్ష‌మించలేదు. ఇప్ప‌టికే చాలా బాధ్య‌త‌లు పీకేసిన జ‌గ‌న్ తాజాగా పార్టీ ప‌ద‌వులు కూడా పీకేశాడు. త‌ల్లి విజ‌య‌మ్మ‌ని బ‌ల‌వంతంగా గౌర‌వ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయించి త‌రిమేసిన జ‌గ‌న్, అంత‌కుముందే చెల్లి ష‌ర్మిల‌ని అన్నివిధాలుగా అన్యాయం చేసి దిక్కున్న‌కాడ చెప్పుకోమంటూ పంపేశాడు. ఇప్పుడు త‌న‌కి ఆత్మ‌లా వెన్నంటి ఉండే సాయిరెడ్డిని కూడా చంద్ర‌బాబుతో క‌లిశాడ‌నే ఒకే ఒక కార‌ణంతో ప‌ద‌వుల‌న్నీ పీకేసి దూరం పెట్టార‌ని తెలుస్తోంది. ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌లు, సోష‌ల్మీడియా ఇన్చార్జి, అనుబంధ‌సంఘాల క‌న్వీన‌ర్ ప‌ద‌వుల‌న్నీ పోయిన సాయిరెడ్డి ఉత్తి రాజ్య‌స‌భ ఎంపీగా మిగిలిపోయారు.

సిఐడి మాజీ డీజీ సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్ర నాద్ రెడ్డికి నిన్న లేఖ రాసారు. సిఐడి డీజీగా సునీల్ కుమార్ ఉన్న సందర్భంలో అక్రమ నిర్బంధాలు, తెలుగుదేశం పార్టీ నేతల పై అక్రమ కేసులు, థర్డ్ డిగ్రీ ప్రయోగంతో పాటుగా, సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా పలు నిబంధనలను ఉల్లంఘిస్తూ, చట్టం, రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించారు అని, ఎంపీ రఘురామరాజుతో పాటు పలువిరి పై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, కేంద్ర హోంశాఖకు లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదు పై స్పందించిన కేంద్ర హోంశాఖ, ఈ నెల 3న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసి, సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలు ప్రకారం, చీఫ్ సెక్రటరీ నిన్న డీజీపీకి లేఖ రాసి, వెంటనే నిబంధనలు ప్రకారం సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇప్పటికే సునీల్ కుమార్ ని సిఐడి డీజీ నుంచి తప్పించి, ప్రసుత్తం ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, నిబంధనలు అతిక్రమించిన ఎవరైనా, చివరకు ఇలా బలి అవ్వాల్సిందే అనే దానికి ఇది మరో ఉదాహరణ

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌-త్య‌కేసులో అడ్డంగా బుక్క‌యిపోయిన వైసీపీ దిక్కుతోచ‌ని స్థితిలో రోజుకొక దివాలాకోరు వాద‌న‌తో మీడియా ముందుకు వ‌స్తూ అభాసు పాల‌వుతోంది. స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి జ‌గ‌న్ రెడ్డి ర‌క్షించాల‌నుకుని అడ్డంగా ఇరికిస్తున్నార‌ని వైసీపీ కుల మీడియా , బ్లూ మీడియా ల‌బోదిబోమంటూ వ్యాసాలు రాసుకుంటోంది. వైఎస్‌ వివేకానంద రెడ్డి హ-త్య కేసు సీఎం జగన్‌ మెడకు చుట్టుకునేలా సీబీఐ కుట్ర పన్నుతోంద‌ని, చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా సీబీఐ డ్రామా ఆడుతోంద‌ని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. వివేకా హ-త్యతో అవినాశ్‌ రెడ్డికి ఎలాంటి సంబంధమూ లేదని, ఇదంతా చంద్రబాబు కుట్ర అని తేల్చేశారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి పాత్రపై సీబీఐ వద్ద ఆధారాల్లేవు. కానీ... ఈ కేసునంతటినీ జగన్‌వైపు తిప్పడం ద్వారా రాజకీయ లబ్ధిని పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నార‌ని స‌జ్జ‌ల ఆరోపించారు.  వివేకానంద‌రెడ్డి హ‌-త్య కేసుని సీబీఐకి ఇవ్వాల‌ని తొలిగా డిమాండ్ చేసింది జ‌గ‌న్ రెడ్డి. అటువంటి జ‌గ‌న్ రెడ్డిని కాపాడేందుకు అనుకుని అదే సీబీఐపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు స‌ల‌హాదారుడు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి. కేంద్ర ప్ర‌భుత్వంతో వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి స‌త్సంబంధాలు ఉన్నాయ‌ని దేశ‌మంత‌టికీ తెలుసు. ఏపీ ప్ర‌యోజ‌నాలు కూడా కాద‌నుకుని, కేంద్రం చెప్పిన‌ట్ట‌ల్లా త‌లూపే జ‌గ‌న్ రెడ్డిని కాద‌ని కేంద్రంలో బీజేపీ చేతిలో ఉన్న సీబీఐ చంద్ర‌బాబు మాట వింటోంద‌ని చెప్ప‌డంపై వైసీపీలోనే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ ఆధీనంలో ఉన్న సీబీఐని మేనేజ్ చేస్తున్న చంద్ర‌బాబు చివ‌రికి గూగుల్ ని మేనేజ్ చేస్తున్నార‌న‌డం వైసీపీ నేత‌లే కాదు, మ‌ద్ద‌తు మీడియా సంస్థ‌లే ల‌బోదిబోమంటున్నాయి.

Advertisements

Latest Articles

Most Read