ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మిస్టరీగా మారిన హైప్రొఫైల్ కేసు అయిన, వైఎస్ వి-వే-క హ-త్య కేసు, హైకోర్టు ఆదేశాలు ప్రకారం సిబిఐకి విచారణ చేయమని ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు వైఎస్ వి-వే-క కేసు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ రోజు ఈ కేసు పై, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైఎస్ వి-వే-క కేసుకు సంబంధించి, తమకు మొత్తం రికార్డులు అన్నీ ఇవ్వాలని చెప్పి, సిబిఐ అధికారుల బృందం, పులివెందుల మాజిస్త్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. అయితే తమకు పై నుంచి, ఎటువంటి ఆదేశాలు లేవని, అందుకనే ఈ కేసుకు సంబంధించి ఎటువంటి రికార్డులు ఇవ్వటం కుదరదని, పులివెందుల మేజిస్ట్రేట్, సిబిఐ అధికారులకు తెలియ చేసారు. దీంతో సిబిఐ బృందం ఈ కేసు విషయమై మొత్తం హైకోర్టు చూస్తుంది కాబట్టి, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. దాదాపుగా 15 రోజులు క్రితం, తమకు పులివెందుల కోర్టు నుంచి, ఈ కేసుకు సంబంధించి పూర్తి రికార్డులు కావాలని, హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. ఈ పిటీషన్ కు సంబంధించి విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ రోజు ఆదేశాలు జరీ చేసింది. వైఎస్ వి-వే-క కేసుకు సంబధించి ఏమైతే రికార్డులు ఉన్నాయో, ఆ రికార్డులు అన్నీ కూడా సిబిఐకు వెంటనే ఇవ్వాలని, పులివెందుల మేజిస్ట్రేట్ ను ఆదేశిస్తూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, ఆదేశాలు జారీ చేసింది.

viveka 1112020 2

దీనికి సంబంధించి, అన్ని వివరాలు, రికార్డులు, ఏమైతే సిబిఐ అధికారులు , పులివెందుల మేజిస్ట్రేట్ కోర్టులో కోరారో ఆ వివిరాలు, అదే విధంగా హైకోర్టుని కోరారో, దానికి సంబధించిన అన్ని రికార్డులు వెంటనే సిబిఐ అధికారులకు అప్పగించాలని, ఇవి దర్యాప్తులో ఎంతో కీలకం అని, అందుకే ఈ రికార్డులు అన్నీ కూడా ఈ దర్యాప్తులో పూర్తి స్థాయిలో అవసరం అవుతాయి కాబట్టి, తమకు ఆ రికార్డులు ఇవ్వాలని సిబిఐ కోరటంతో, హైకోర్టు, ఆ రికార్డు లు ఇవ్వటానికి ఒప్పుకొంది. దీంతో ఈ విచారణ ముగిసింది. హైకోర్టు ఆర్డర్ కాపీ అందగానే, పులివెందుల కోర్టు నుంచి, ఈ కేసుకు సంబదించిన అన్ని రికార్డులు తీసుకోనున్నారు. ఇందులో ముఖ్యంగా పో-స్ట్ మా-ర్టం రిపోర్ట్ తో పాటు, అనేక రికార్డులు, పోలీస్ దర్యాప్తు, సిట్ దర్యాప్తు, ఇవన్నీ రికార్డులు సిబిఐ అధికారులు తీసుకునే అవకాసం ఉంది. ఇప్పటికే ఈ కేసు పై రెండు దఫాలుగా సిబిఐ విచారణ చేసింది. పులివెందుల, కడప వేదికగా విచారణ జరిగింది. సిబిఐ అధికారులకు క-రో-నా రావటంతో, దర్యాప్తు నెమ్మదించింది. తన తండ్రి కేసు దర్యాప్తు పై, ఏపి పోలీసుల పై నమ్మకం లేదని, తమకు సిబిఐ కావాలని వి-వే-క కూతురు కోరటంతో, హైకోర్టు ఇందుకు ఒప్పుకున్న సంగతి తెలిసిందే.

నిన్న బీహార్ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అన్నిట్లో బీజేపీ ముందంజులో ఉండి విజయం సాధించింది. ముఖ్యంగా తెలంగాణాలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అనూహ్య విజయం సాధించింది. మెజారిటీ పెద్దగా ఎక్కువ లేకపోయినా, టీఆర్ఎస్ పై విజయం సాధించింది. ముఖ్యంగా దుబ్బాకలో గత మూడు సార్లుగా బీజేపీ నుంచి రఘునందన్ రావు పోటీ చేస్తూ వస్తున్నారు. ఆయన పై సానుభూతి ఉంది. ఇక సహజంగానే అక్కడ కాంగ్రెస్ వీక్, గతంలో వచ్చిన ఓట్లే ఇప్పుడు కాంగ్రస్ కు వచ్చాయి. అయితే ఇక్కడ బీజేపీ విజయం కన్నా, రఘునందన్ రావు ఎక్కువ పని చేసిందని భావిస్తున్నారు. ఇక మరో పక్క తెలంగాణాలో బీజేపీ మొదటి నుంచి ఒక శక్తిగానే ఉంది. గట్టి పోటీ ఇస్తూనే ఉంది. ఎంపీలుగా కూడా ఉన్నారు. తెలంగాణాలో అలాంటి చోట బీజేపీ గెలిచింది అంటే అర్ధం ఉంది. అయితే ఈ వెయ్యి ఓట్ల మెజారిటీ విజయం చూసి, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలు ఉత్సాహ పడుతున్నారు. ఇక మా అడుగులు ఆంధ్రప్రదేశ్ వైపే అంటూ, ప్రగల్భాలు పలుకుతున్నారు. ఎంతో కొంత క్యాడర్ ఉండి, బలం ఉన్న తెలంగాణాలోనే వాళ్లకు ఉంది ఇద్దరు ఎమ్మేల్యేలు. టీఆర్ఎస్, కాంగ్రెస్ ని దాటుకుని రావాలి అంటే, ఈ స్థాయిలో పని చేస్తే, మరో రెండు టర్మ్ లకు, అక్కడ అధికారానికి దగ్గర కావచ్చు. అయితే అలాంటి చోటే, బీజేపీకి అధికారం అందని ద్రాక్ష అంటుంటే, ఇక్కడ బీజేపీ నేతలు మాత్రం, మేమే కాబోయే కింగ్ అంటున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు ట్విట్టర్ లో ప్రాసలతో ట్వీట్లు వేస్తుంటే, సోము వీర్రాజు లాంటి వాళ్ళు, ప్రెస్ మీట్లు పెట్టి మాదే అధికారం అంటున్నారు. అయితే ఏ పార్టీ అయినా అధికారం కోసమే పని చేస్తుంది. ఇందులో రెండో ఆలోచన లేదు. ఎంత చిన్న పార్టీ అయినా గెలుస్తుందని, ఇదే బీజేపీ, రెండు సీట్లు నుంచి దేశాన్ని ఏలే స్థాయికి వచ్చింది.

bjp 1112020 2

అయితే ఇక్కడ బీజేపీకి ఆ అవకాశమే లేదు. ఎందుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసారు, చేస్తూనే ఉన్నారు అనే భావన ప్రజల్లో ఉంది. అందుకే 2019లో, వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి, నోటా కంటే, ఇంకా చెప్పాలి అంటే రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్ కంటే, బీజేపీకి తక్కువ సీట్లు ఇచ్చారు. 2019లో బీజేపీకి 0.84 శాతం ఓట్లు వస్తే, కాంగ్రెస్ కు 1.17 శాతం, నోటా కి 1.2 8 శాతం ఓట్లు వచ్చాయి. ఇది ఏపిలో బీజేపీ పరిస్థితి. ఈ 18 నెలల్లో ఏమైనా బలపదిండా అంటే, చంద్రబాబు నామస్మరణ ఎక్కువగా, జగన్ ని టార్గెట్ చేయటం అతి తక్కువగా కనిపిస్తుంది. మరి అధికార పార్టీకి తోక పార్టీ అనే అభిప్రాయంతో, కేంద్రం నుంచి విభజన హామీలు ఏమి పూర్తి కాకుండా, అమరావతిని ఆపేస్తే నోరు ఎత్తకుండా, పోలవరం ప్రాజెక్ట్ ని గాల్లో పెట్టి, ప్రత్యెక హోదాని పడుకోబెట్టిన బీజేపీ, ఇవేమీ ఏపి ప్రజలకు చేయకుండా ఎలా అధికారంలోకి వస్తుంది ? కోడి గుడ్లు ఇచ్చాం, అది ఇచ్చాం ఇది ఇచ్చాం అంటారు, ఇవన్నీ అన్ని రాష్ట్రాలకు ఇస్తారు, రాష్ట్రాల డబ్బులు తీసుకునే ఇస్తారు, కానీ ఏపికి మాత్రం ప్రత్యేకంగా విభజన చట్టం ఉంది. అది నెరవేర్చకుండా అన్యాయం చేస్తూ ఉంటే, ఈ సారి కూడా నోటా దాటలేరు. ప్రజలకు మేలు చేసే పనులు చేస్తేనే, బీజేపీ నేతలు కంటున్న కలలు సాకారం అయ్యేది. వైసిపీ, తెలుగుదేశం పార్టీలను ఓడించేది.

అధికార వైసీపీలో వర్గ విబేధాలు గుప్పు మంటున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే అనేక లుకలుకలు బయట పడగా, అవి రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. నిన్న విశాఖలో ఏకంగా విజయసాయి రెడ్డి పైనే, బహిరంగ వేదిక పై, ఎమ్మల్యేలు ఆయన వ్యాఖ్యలు ఖండించారు. ఇక అమరావతిలో ఉండవల్లి శ్రీదేవి ఉదంతం తెలిసిందే. సొంత పార్టీ నేతలే ఆమె పేకాట వ్యవహారం అంటూ బయట పెట్టారు. ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది. మరో పక్క అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారు అంటూ సొంత పార్టీ నేతలే రచ్చ చేసి కోర్టు మెట్లు కూడా ఎక్కారు. ఇక నెల్లూరులో సీనియర్ నేత ఆనం, అలాగే మరో ఎమ్మల్యే వరప్రసాద్ బహిరంగంగానే విమర్శించారు. ఇక గన్నవరంలో రచ్చ అందరూ చూసారు. మరో పక్క ఎంపీ రఘురామరాజు, రోజు రచ్చబండే పెట్టేస్తున్నారు. ఇలా ప్రతి జిల్లాలో, ఏదో ఒక చోట, ప్రతి రోజు అసంతృప్తి బయట పడుతూనే ఉంది. తాజాగా ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా, పి గన్నవరం నియోజకవర్గానికి చెందిన, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు సొంత పార్టీ మంత్రులు పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏకంగా రాష్ట్ర మంత్రులను విమర్శిస్తూ, కొంత మందిని దుష్ట శక్తులతో పోల్చి, సంచలన వ్యాఖ్యలు చేసారు. శంకరాయగూడెం గ్రామంలో నిన్న ఒక కార్యక్రమంలో పాల్గున్న ఎమ్మెల్యే సొంత పార్టీ నేతల పైనే విమర్శలు గుప్పించారు.

kondeti 1112020 2

గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చేయలేకపోతున్నాం అని, మంత్రులు సహకరించటం లేదని, నేను మొదటి సారి ఎమ్మెల్యే అని పట్టించుకోవటం లేదని చెప్తూ మంత్రుల్ని దుష్ట శక్తులతో పోల్చినట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి అర్ధం అవుతుంది. ఈ గ్రామంలో సచివాలయ నిర్మాణం చేయలేక పోతున్నామని, అయితే తాను ప్రయత్నం చేస్తూనే ఉంటానని అన్నారు. తన దగ్గర ఒక విధంగా, మరొకరి దగ్గర మరో విధంగా చెప్పి, గ్యాప్ తెస్తున్నారని విమర్శించారు. బహిరంగ వేదిక పై ఎమ్మెల్యే ఏమన్నారు అంటే. "ఇవన్నీ మీకు చెప్పేవి కాదు. దుష్టశక్తులు కొన్ని వచ్చాయి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అవ్వటం వలన మంత్రులు అందరూ కూడా, నాకు పూర్తిగా సహకరించటం లేదు. మీ దగ్గర మీకు చెప్పే లాగా, మా దగ్గర మాకు చెప్పే లాగా, ఈ రోజు సంకరాయగూడెంకు అన్యాయం జరిగింది అంటే కేవలం మంత్రులు వల్లే. చూద్దాం, ఇప్పటికైనా జరుగుతుంది ఏమో. నా ప్రయత్నాలు నేను చేస్తాను. " అంటూ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేసారు.

తిరుమల విశిష్టతను పెంచుతూ, వెంకన్న సేవలో తరించే భక్తుల కోసం ఎస్వీబీసీ ఛానల్ ని తిరుమల తిరుపతి దేవస్థానం పెట్టిన విషయం తెలిసిందే. అయితే 5 నెలల క్రితం ఎస్వీబీసీ ఛానల్ లో ఉన్న ప్రముఖ నటుడు పృధ్వీ అశ్లీల ఆడియో లీక్ బయట పడటంతో ఆయన్ను తప్పించారు. అయితే ఇప్పుడ మరోసారి ఇలాంటి అశ్లీల ఘటనలతో విరక్తి పుట్టించే ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో, ఇలాంటి మనుషులతో టిటిడి పరువు కూడా పోయే పరిస్థితి ఉంది. శ్రీవారి భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినే అవకాసం ఉంది. గత కొద్ది రోజులుగా క్రితమే, ఈ ఘోరం బయట పడింది. హైదరాబాద్ నుంచి ట్రాన్స్ఫర్ పై వచ్చిన ఒక వ్యక్తి, హైదరాబాద్ ఆఫీస్ లో శతమానం భవతి కార్యక్రమం కోసం పని చేస్తున్న ఒక ఆంకర్ కి, గత కొద్ది రోజులుగా పో-ర్న్ సైట్ కి సంబంధించిన కొన్ని లింక్స్ పంపించారు. దీంతో ఆమె విస్తు పోయి, ఆధారాలతో సహా పై స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసారు. ఈ నేపధ్యంలో, ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించిన టిటిడి అధికార యంత్రాంగం, ఎస్వీబీసీ పై దాడులు చేయాలని టిటిడి విజిలెన్స్ అధికారులను, నూతనంగా ప్రరంభించిన సైబర్ క్రైమ్ ని కూడా ఆదేశించటంతో, వాళ్ళు రంగంలోకి దిగారు. ఎస్వీబీసీ తిరుపతి కార్యాలయంకు వెళ్లి సోదాలు చేసారు. అ సమయంలో, పో-ర్న్ సైట్ లింక్స్ పంపించిన వ్యక్తి వాడె మెయిల్స్, అన్నీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మిగతా సిబ్బంది కంప్యూటర్ లు కూడా, చెక్ చేయటంతో, మరో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి.

svbc 11112020 2

మరో ముగ్గురు కూడా, ఇలాగే పో-ర్న్ సైట్ లు ఎస్వీబీసీ ఆఫీస్ లో చూస్తునట్టు గుర్తించారు. దీంతో వీరి నలుగురు పై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. మెయిల్ పంపించిన ఉద్యోగస్తుడిని, ఉద్యోగం నుంచే తప్పించాలని సూచన చేసారు. అయితే ముగ్గురు కాదని, 25 మంది ఇలాగే చూసినట్టు గుర్తించారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎంతో పవిత్రంగా ఉండాల్సిన చోట, ఇలా పో-ర్న్ సైట్ లు చూడటం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల పవిత్రత రోజు రోజుకీ ఎదో ఒక వివాదంతో, పడిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారు ఇచ్చే భక్తుల కానుకలతో జీతాలు తీసుకుంటూ ఇలా ప్రవర్తించడం హేయమైన చర్య అంటూ టీటీడీ భక్తి ఛానల్ ఎదుట ఆందోళన కూడా చేసారు. భక్తి ఛానల్ పునరావాస కేంద్రంగా మార్చారని భక్తితో ఉండాల్సిన చానల్లో గతంలో ఒక కమెడియన్ ని తీసుకుని పెట్టి నాశనం చేయడంతో పాటు భక్తి ఛానల్ లో బాధ్యతారహితంగా ఎంప్లాయిస్ ప్రవర్తించేలా CEO లు ఉన్నతాధికారులు పని చేస్తున్నారని దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని సిబిసిఐడి ఎంక్వయిరీ చేసి బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నారు ఉద్యోగస్తుల ప్రక్షాళన మొదలుపెట్టాలని వారు అన్నారు.

Advertisements

Latest Articles

Most Read