రాష్ట్రంలో ఎప్పుడూ చూడని పోకడలు కనిపిస్తున్నాయి. ఏపి ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలు చూసి, ప్రజలు షాక్ అవుతున్నారు. అయితే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే, ప్రజలు ఏమి చేయలగలరు. దీని గురించి మాట్లాడుకుని వదిలేయటం తప్ప. మనం పుట్టిన రోజు కానే, ఇతర ముఖ్య దినాలు, మన ఇష్ట దైవం గుడికి కానీ, చర్చికి కానీ, మసీదుకు కానీ, వారి వారి నమ్మకాలను బట్టి వెళ్లి జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయి నేతలు అయితే, తిరుమల నుంచి వేద పండితులు కానీ, ఇతర మతాల గురువులు కానీ వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇవి మనం చూస్తూనే ఉంటాం. అయితే ఎప్పుడూ చూడని విధంగా, ఒక ప్రైవేటు స్వామి వారికి, ఇలాంటి సేవలే చేయండి అంటూ, ఏపి దేవాదాయ శాఖ ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు చర్చనీయంసం అయ్యాయి. విశాఖ శారదా పీఠం, స్వరుపానంద స్వామి అంటే, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధినేతలకు ఇష్టులు. బహిరంగంగానే నేను జగన్ గెలవాలని పూజలు చేసానని స్వరుపానంద చెప్పారు కూడా. అయితే అది ఇద్దరి వ్యక్తుల మధ్య ఇష్టంగా ఉన్నంత వరకు బాధ లేదు కానీ, ప్రభుత్వాల వరకు వచ్చేస్తేనే ఇబ్బంది. స్వరుపానంద స్వామి పుట్టిన రోజు నవంబర్ 18. ఆ రోజు ఆయనకు వివిధ ఆలయాల నుంచి వచ్చి ఆలయ మర్యాదులు చేయండి అంటూ, శారదా పీఠం నుంచి, ఏపి ప్రభుత్వానికి నవంబర్ 9 న ఒక లేఖ వెళ్ళింది. దానికి స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం, నిన్న దేవాదాయ శాఖ, రాష్ట్రంలోని 23 ప్రముఖ దేవాలయాలకు ఆదేశాలు ఇస్తూ, ఆ రోజున స్వామి వారికి ఆలయ మర్యాదలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.

swaroopa 14112020 2

ఇందులో తిరుపతి మినిహా, దాదాపుగా రాష్ట్రంలోని 23 ప్రముఖ దేవాలయాలు ఉన్నాయి. అంటే ఆ రోజు ఆ ఆలయాల్లో వివిధ దేవతా మూర్తులకు అలంకరించిన మాలలను, వేద పండితులు తీసుకు వెళ్లి, స్వరుపానంద స్వామిని ఆశీర్వదిస్తారు. అయితే ఇలా స్వామిజీలు పుట్టిన రోజు వేడుకలు జరపుకోవటమే ఆశ్చర్యం అంటుంటే, దానికి ప్రభుత్వం ఇలా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వటంతో ప్రజలు విస్మయం చెందారు. స్వరుపానంద స్వామికి ఏ అర్హతతో ఇలా చేస్తున్నారని, రేపు ఇంకో స్వామి కానీ, మరొక బడా బిజినెస్ మ్యాన్ కానీ, మరో నాయకుడు కానీ ఇలాగే అడిగితే ఇచ్చేస్తారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కంచి, శ్రింగేరి పీఠం వారికి కూడా దక్కని గౌరవాలు, ఒక సామాన్య స్వయం ప్రకటిత పీఠంకు దక్కటం పై విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభుత్వ అధికారులు, ఇవి ఆయా ఈవోలు ఇష్టం పై ఆధారపడి ఉంటాయని, కచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదని, మేము మాములుగా ఉత్తర్వ్యులు ఇచ్చామని చెప్తున్నారు. ఏది ఏమైనా, ఇలా నియమాలు లేకుండా, ఇష్టం వచ్చినట్టు చేస్తే, రేపు మరొకరు కూడా ఇలాగే అడుగుతారు, ఇవన్నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప ఏమి ఉండదు. అంతగా ప్రభుత్వాది నేతలకు ఇష్టం అయితే, వ్యక్తిగత హోదాలో చేసుకోవాలి కానీ, ఇలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వటం అభ్యంతరమే.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అవసరాలు కంటే, రాజకీయాలే ఎక్కువ. ముఖ్యంగా పదవిలో ఉన్న వారు, తమ బాధ్యత మర్చిపోయి, పక్క వాళ్ళ పై తప్పులు నెట్టి, సమస్య నుంచి ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏదో చిన్న విషయాల్లో అయితే అనుకోవచ్చు, రాజధాని విషయం, రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం విషయంలో కూడా అదే తంతు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపీ, కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్ర బీజేపీ శాఖ, ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పైనే తప్పు నెట్టేసి, పబ్బం గడిపేస్తున్నారు. చంద్రబాబు చేయలేదు, చేయలేడు అనే కదా ప్రజలు ఆయన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. మెడలు వంచేస్తాం అని ఒకరు, మాతోనే అభివృద్ధి అని మరొకరు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. 18 నెలలు పదవిలో ఉన్నారు. ఇప్పటికీ చంద్రబాబు వల్లే అంటే, ప్రజలు నమ్ముతారా ? మెడలు వంచేసి సాధిస్తామని, ఎందుకు సాధించలేదు అంటూ, చంద్రబాబు వైపు వేలు చూపిస్తే నమ్ముతారా ? మాతోనే దేశం వెలిగిపోతుందని అని నమ్మించి, ఇప్పుడు చంద్రబాబు వల్లే వెలుగులు లేవు అంటే ప్రజలు నమ్ముతారా ? తాజాగా జరుగుతున్న పోలవరం రచ్చలో, రెండు పార్టీల తీరు ఇలాగే ఉంది. చంద్రబాబు చంద్రబాబు చంద్రబాబు అంటూ నామస్మరణ చేస్తూ, కాలం గడిపేస్తున్నారు. గతంలో పోలవరం అంచనాలు రూ55 వేల కోట్లకు చంద్రబాబు ఆమోదింప చేసుకుంటే, ఇప్పుడు కేంద్రం 20 వేల కోట్లు మాత్రమే ఇస్తాం అంటుంది. ఇప్పటికే ఆమోదించి, తగ్గించారు. అయితే రాష్ట్రంలో ఉన్న వైసీపీ, ఎప్పుడో 2016లో చంద్రబాబు ఒప్పుకున్నారు, అందుకే కేంద్రం ఇలా చేసింది చంద్రబాబు నెట్టేసి, తమకు ఏమి సంబంధం లేదని తాము ఆంధ్రప్రదేశ్ కోసమే పుట్టామని చెప్తుంది.

verraju 13112020 2

ఇక అసలు ఇది చెయ్యాల్సిన కేంద్రం, ఆ కేంద్రంలో ఉన్న పార్టీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబునే నిందిస్తుంది. నిన్న తిరుపతిలో ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ, చంద్రబాబు అధికారుల్ని మ్యానేజ్ చేసి, పోలవరం అంచనాలు పెంచేసారని తేల్చేసారు. అంటే, చంద్రబాబుని తిట్టటం కోసం, కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వ అధికారులను కూడా నిందించే స్థాయికి వెళ్ళిపోయారు. ఒక పక్క కేంద్రం పోలవరంలో అవినీతి ఏమి జరగలేదు అంటే, చంద్రబాబు మొత్తం తినేసాడు అంటారు. పోలవరం కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాటానికి, నీతి అయోగ్ సిఫారుసు అయితే, దీని పై అనుమానం ఉంది అంటారు. అంటే పోలవరం అంచనాలు పెంచటం చంద్రబాబు కుట్ర అని చెప్తూ, కేంద్రం చర్య సమర్ధిస్తూ, మరో పక్క అధికారులను కూడా చంద్రబాబు మ్యానేజ్ చేసారు అంటూ, తమ ప్రభుత్వాన్నే సంకిస్తున్నారు. చంద్రబాబు మీద ఉన్న ద్వేషం, సోము వీర్రాజుకు ఈ స్థాయిలో ఉంది. అయితే ఇది రాష్ట్రానికి చెందిన అంశం. చంద్రబాబుకి ఏమి అవ్వదు. పోలవరం అంచనాలు కోసం పోరాడకుండా, ఈ చంద్రబాబు గోల ఏంటో. పోలవరం ప్రాజెక్ట్ అవ్వకపోతే చంద్రబాబుకు ఏమి అవుతుంది, ఇబ్బందులు పాడేది రాష్ట్ర ప్రజలు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరో మారు ఆగ్రహం వ్యక్తం చేసింది. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పై దాడి జరిగిన కేసులో, గత ప్రభుత్వం కేసులు పెట్టింది. 2018 మే నెలలో కొంత మంది యువకులు, ఒక పద్దతి ప్రకారం పోలేస్ స్టేషన్ పై దాడి చేసారు. దీంతో గత ప్రభుత్వంలో పోలీసులు కేసు నమోదు సెహ్సారు. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం, ఆగస్టు 12న, జీవో 776 ను విడుదల చేసి, ఈ కేసును ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపింది. అయితే దీని పై దుగ్గిరాలకు చెందిన పసుపులేటి గణేష్ అనే వ్యక్తి హైకోర్టులో దీని పై పిటీషన్ దాఖలు చేసారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద, పిటీషన్ దాఖలు చేసారు. దీని పై గతంలోనే ఒకసారి విచారణ జరిగింది. దీని పై స్టే ఇచ్చిన హైకోర్టు, ఎన్ఐఏని కూడా ప్రతివాదిగా చేర్చాలని పితీషినర్ ను కోరింది. అయితే ఈ కేసు ఇప్పుడ మరోసారి హైకోర్టు ముందుకు వచ్చింది. జస్టిస్‌ రాకేశ్‌కుమార్‌, జస్టిస్‌ ఉమాదేవి ధర్మాసనం ముందుకు ఈ కేసు వచ్చింది. పిటీషనర్ స్పందిస్తూ, కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్ఐఏను ప్రతివాదిగా చేరుస్తూ ఇంప్లీడ్ పిటీషన్ వేసినట్టు కోర్టుకు తెలిపారు. అయితే ఈ సందర్భంగా ఎన్ఐఏ తరుపు న్యాయవాది చేసిన వాదనతో, హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు షడ్యుల్ నేరాల క్రిందకు రాదని, నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సి తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

hc 121122020 2

కేంద్రం హెం శాఖ నుంచి తమకు అనుమతి రావాలని, అనుమతి రాకుండా తాము విచారణ చేయలేమని కోర్టుకు చెప్పారు. దీని పై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కేవలం ఎఫ్ఐఆర్ చూసేసి, ఇవి షడ్యుల్ నేరాల క్రిందకు రావాలని ఎలా చెప్తారు అంటూ, హైకోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ పోలీస్ ఆక్ట్ ప్రకారం నడుచుకునే సిబిఐ కూడా పరిమితులు ఉంటాయని, కానీ వారు తమ ఆదేశాలు పాటిస్తున్నారు కదా అని హైకోర్టు ప్రశ్నించింది. ఆర్టికల్ 226 ప్రకారం, మిమ్మల్ని దర్యాప్తు చేయమని చెప్పే హక్కు తమకు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు ఆగ్రహంతో ఎన్ఐఏ తరుపు న్యాయవాది స్పందిస్తూ, హైకోర్టు ఏమి ఆదేశాలు ఇస్తే అవి పాటిస్తామని, ఏది చెప్తే అది చేస్తామని కోర్టుకు తెలిపారు. ఇక మరో పక్క సిబిఐ తాము అఫిడవిట్ దాఖలు చేసామని, కోర్టు ఆదేశాల ప్రకారం నడుచుకుంటామని తెలిపింది. కౌంటర్ అఫిడవిట్ అందకపోవటంతో, అది జత చేయాలని హైకోర్టు ఆదేశిస్తూ, కేసుని నవంబర్ 18కి వాయిదా వేసింది. మరో పక్క తాము ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అప్పటి వరకు కొనసాగుతాయని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ లో ఆదాయం కంటే, ఖర్చులు ఎక్కువ. అందుకే అప్పులు తెచ్చి, భూములు అమ్మి నెట్టుకుని వస్తున్నారు. గత 18 నెలల కాలంలో లక్షా 20 వేల కోట్లు వరకు అప్పు చేసారు. అంటే గత ప్రభుత్వ హయంలో 5 ఏళ్ళలో చేసినంత అప్పు. పోనీ దీని నుంచి ఆదాయం వచ్చే పనులు చేస్తున్నారా అంటే అదీ లేదు. ఇలా మొత్తానికి ఏదో రకంగా అప్పులు చేసి నెట్టుకుని వస్తున్నారు. అయితే ఖర్చులు తగ్గిస్తున్నారా అంటే, ఎక్కడ చూసినా భారీ ఖర్చులే. ఇంకా చెప్పాలి అంటే అనవసరపు ఖర్చులు అని కూడా చెప్పవచ్చు. కానీ అది ప్రభుత్వానికి అవసరం ఏమో. ఇక విషయానికి వస్తే, అమరావతిని మూడు ముక్కలు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హైకోర్టులో ఉన్న సంగతి తెలిసిందే. అమరావతి రైతులు వివిధ కేసులు హైకోర్టులో వేసారు. ఈ కేసులు కోసం ప్రభుత్వం, బడా బడా లాయర్లను తీసుకుని వస్తుంది. అందులో ఢిల్లీలో ఉండే టాప్ లాయర్లు కూడా ఉన్నారు. గట్టిగా గంట వాదిస్తే, లక్షలు లక్షలు ఇవ్వాల్సిందే. అలాంటి లాయర్లను ప్రభుత్వం తన వాదనలు విపించటానికి పెట్టుకుంది. అయితే వీళ్ళు ఎంత వరకు సక్సెస్ అవుతారు అనేది పక్కన పెడితే, ప్రభుత్వం వారికి ఇచ్చిన మొదటి విడత ఫీజు చూస్తే దిమ్మ తిరగాల్సిందే. అప్పుడెప్పుడో ఒక లాయర్ కోసం 5 కోట్లు కేటాయిస్తూ జీవో విడుదల అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వివిధ పెద్ద పెద్ద లాయర్లకు డబ్బులు విడుదల చేసారు.

cases 12112020 2

నిన్న ప్రభుత్వం అమరావతి కేసులు విషయంలో, అటు సుప్రీం కోర్టులో, ఇటు హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులకు ఫీజులు కింద రూ.2.3 కోట్లు వరకు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. దీనికి సంబంధించి నిన్న ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఇందులో న్యాయవాదులు పరంగా వారికి చెల్లించిన ఫీజు వివరాలు చూస్తే, ప్రముఖ లాయర్ హరీష్‌ సాల్వేకి రూ.45 లక్షలు ఇస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక మరో ప్రముఖ లాయర్ రాకేష్‌ ద్వివేదికి రూ.73 లక్షలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది కూడా అయినా కపిల్‌ సిబల్‌కి రూ.25 లక్షలు విడుదల చేసారు. నిన్న నంద్యాల కేసులో టిడిపి లాయర్ పై నిందలు వేసారు, మరి ఇప్పుడు కాంగ్రెస్ లాయర్ ని ఎందుకు పెట్టుకున్నారు అని ప్రశ్నిస్తే ? సరే మనకు ఎందుకులే. ఇక ఆత్మారాం నాదకర్ణికి రూ.17.60 లక్షలు, అడ్వకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌కి రూ.18.10 లక్షలు, నిరంజన్‌రెడ్డికి రూ.22 లక్షలు ఇలా విడుదల చేస్తూ, అమరావతి కేసు విషయంలో ప్రభుత్వ వాదనను సమర్ధవంతంగా వినిపిస్తున్నారు. అయితే అమరావతిని మూడు ముక్కలు చేయటమే ఒక తెలివి తక్కువ నిర్ణయం అనుకుంటే, ఆ నిర్ణయం సమర్ధిస్తూ మళ్ళీ కోట్లు ఖర్చు పెట్టటం ఏమిటి అని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Advertisements

Latest Articles

Most Read