ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల మధ్య జల వివాదం వచ్చిన సంగతి తెలిసిందే. ఏడాది క్రితం రాయలసీమను రత్నాలు చేస్తా, బేసిన్లు భేషీజాలు లేవు అని చెప్పిన కేసీఆర్, అలాగే రాయలసీమకు అన్యాయం జరిగే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభానికి జగన్ వెళ్ళేంత స్నేహం ఇద్దరి మధ్య ఉన్నా, ఒక చిన్న ప్రాజెక్ట్ పై, ఇంత పెద్ద రచ్చ గత ఆరు నెలలుగా జరుగుతుంది. ఇద్దరూ ఒకరి దావత్ లకు ఒకరు వెళ్తారు కదా, కలిసి పరిష్కారం చేసుకోకుండా, మా మీద నిందలు ఎందుకు అని నిన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు కూడా. అయితే కేంద్రం, ఇరు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం, నిన్న అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గున్నారు. అయితే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య మాటల యుద్ధం నడించింది. ముఖ్యంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు, కేంద్ర మంత్రి స్పందించి, ఆపాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి.

ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి పోతిరెడ్డి పాడు ద్వారా తెలంగాణాకు అన్యాయం జరుగుతుందని, ఇది అక్రమ ప్రాజెక్ట్ అని, అసలకే అక్రమ ప్రాజెక్ట్ అనుకుంటే, దాన్ని మరింత విస్తరణ చేస్తాం అంటే చూస్తూ ఉండం అంటూ, కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు, జగన్ స్పందిస్తూ, మీ కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్ట్ ల కు కూడా అనుమతులు లేవు కదా అని బదులు ఇచ్చారు. అయితే కేసీఆర్ స్పందిస్తూ, కాళేశ్వరం ప్రాజెక్ట్ బేసిన్ లో భాగంగా కట్టిన ప్రాజెక్ట్ అని, దానికి అనుమతులు ఉన్నాయని, పోతిరెడ్డిపాడు బేసిన్ కు సంబంధం లేకుండా కట్టిన ప్రాజెక్ట్ అని, పోతిరెడ్డిపాడు ఆపకపోతే, అలంపూర్‌ వద్ద బ్యారేజీ కట్టి మేము తోడుకుపోతాం అని హెచ్చరించారు. శ్రీశైలం, సాగర్ బాధ్యత తమకే ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అయితే దీనికి స్పందించిన జగన్, మీకో న్యాయం, మాకో న్యాయమా, శ్రీశైలం ఎడమగట్టు, సాగర్‌ కుడికాలువ మాకు ఇవ్వండి అని కోరటంతో, కేంద్రం మంత్రి కలుగ చేసుకుని, ఇరు రాష్ట్రాలను ప్రాజెక్ట్ డీపీఆర్ లు సమర్పించాలని కోరారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ స్కాంలు జరుగుతున్నాయని, ముఖ్యంగా, ల్యాండ్, స్యాండ్ విషయంలో ఎన్నో వేల కోట్లు చేతులు మారుతున్నాయి అంటూ, అధికార వైసీపీకి చెందిన ఒక ఎంపీ ప్రధానికి లేఖ రాయటం, ప్రధాని కార్యాలయం స్పందించి, దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు తమకు ఇవ్వాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఆదేశించటంతో కలకలం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అయితే ఇందులోనే పెద్ద స్కాం జరిగిందని, కొంత మంది దగ్గర ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసే క్రమంలో, ఈ స్కాం జరిగినట్టు తెలిపారు. అక్కడ భూమి ధర కన్నా, రెట్టింపు రేట్లు చెల్లించి, ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టారని తెలిపారు. ముందుగానే ఆ భూమిని తక్కువ రేటుకు కొన్న కొంత మంది నాయకులు, తరువాత ప్రభుత్వం ఆ భూమి కొనుగోలు చేసేలా ప్లాన్ చేసారని ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. గోదావరి ముంపులో ఉండే ఆవ భూముల్లో, 600 ఎకరాలు ఇలాగే కొన్నారని తెలిపారు. ఈ ఒక్క చోటే 100 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని అన్నారు.

ఇందులో ముఖ్యమంత్రి బంధువు కూడా ఉన్నారని, ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. అలాగే ఇసుకలో కూడా భారీగా దోచుకుంటున్నారని, ఇసుక కొరతను సృష్టించి అధిక ధరలకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఇసుక పై భారీగా దోచుకుంటున్నారని, ప్రధానికి రాసిన లేఖలో తెలిపారు. అలాగే రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను, రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు. ఇలా అనేక అంశాల పై లేఖ రాసిన ఆ ఎంపీ, ఇవి కొన్ని మాత్రమే అని, మిగతా చాలా విషయాల పై, ప్రధాని విచారణ జరిపి, తగు చర్యలు తీసుకోవాలని, దేశాన్ని కాపాడుతున్న మీరు, రాష్ట్రాన్ని కూడా కాపాడాలని కోరారు. అయితే ఈ లేఖ పై స్పందించిన ప్రధాని కార్యాలయం, ఈ లేఖను కేంద్రం హోం శాఖకు పంపటంతో, కేంద్ర హోం శాఖ, ఈ అంశాల పై పూర్తి నివేదిక ఇవ్వాలని, రాష్ట్ర ప్రాధాన కార్యదర్శిని ఆదేశించింది. కేంద్ర హోం శాఖతో పాటు, ప్రధాని కార్యాలయానికి కూడా ఆ నివేదికను పంపాలని, చీఫ్ సెక్రటరీని కోరారు.

తెలుగు రాష్ట్రాలే కాదు, భారత దేశం మొత్తం, కేసులు ఉన్న ప్రజాప్రతినిధులు ఉలిక్కి పడే నిర్ణయం తీసుకుంది సుప్రీం కోర్టు. ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసుల విషయంలో, ఏడాదిలోపు తేల్చేయాలని, అన్ని రాష్ట్రాల హైకోర్టులకి, సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్ట్ ఆదేశాలు ప్రకారం, అన్ని రాష్ట్రాల హైకోర్టులు ప్రజా ప్రతినిధుల పై ఉన్న కేసుల విషయంలో రోడ్ మ్యాప్ ఇచ్చాయి. ఈ కేసు ఈ రోజు జస్టిస్ ఎన్.వి.రమణ బెంచ్ ముందు విచారణకు వచ్చింది. అన్ని రాష్టాలు ఇచ్చిన ప్రణాళికను, అమికస్ క్యూరీ, సుప్రీం కోర్టుకు సమర్పించారు. అయితే కొన్ని రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన వివరాల పై, సుప్రీం అభ్యంతరం చెప్తూ, వివరాలు సంపూర్ణంగా లేవని, కొన్ని అంశాలు లేవనెత్తింది. అలాగే కేంద్రం తాను సమర్పించాల్సిన వివరాలు ఇవ్వటానికి, మరికొంత సమయం కావాలని, సుప్రీం కోర్ట్ ని కోరింది. దీంతో వివిధ రాష్ట్రాల హైకోర్టులు ఇచ్చిన ప్రణాళికలు తీసుకున్న సుప్రీం, ఈ కేసు తదుపరి విచారణను, రెండు వారల పాటు వాయిదా వేసింది.

అయితే ఇది ఇలా ఉంటే, ఈ కేసుకు సంబంధించి తెలంగాణా హైకోర్టు పంపించిన వివరాలు ఆసక్తిని రేకెత్తించాయి. ఎందుకు అంటే, తెలంగాణా సిబిఐ కోర్టులో 17 పిటీషన్ లు ఉన్నాయని, ఈ కేసులను 9 నెలల్లో తేల్చాయాలి అంటూ, తెలంగాణా హైకోర్టు, సుప్రీం కోర్టుకు ప్రణాళికలు పంపించింది. అయితే ఇక్కడ ఎందుకు ఆసక్తి అంటే, ఈ 17 కేసుల్లో, జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు 16 ఉన్నాయి. ఇదే కేసులో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి, ఎంపీలు, ఉండటంతో, ఈ అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒక వేళ ఇవి రోజు వారీ విచారణకు వస్తే, పరిస్థితి ఎలా ఉంటుంది అనే చర్చ మొదలైంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధుల పై 131 కేసులు ఉంటె, తెలంగాణాలో 143 కేసులు ఉన్నాయి. ఇవన్నీ రోజు వారీ విచారణకు రానున్నాయి. ఎంత మంది ప్రజా ప్రతినిధులు ఈ కేసుల్లో దోషులుగా తెలుతారో, వారి రాజకీయ భవిష్యత్తు ఏమి అవుతుందో, కాలమే నిర్ణయిస్తుంది.

సోషల్ మీడియాలో, న్యాయమూర్తుల పై, కోర్టుల పై జరుగుతున్న దాడిలో కుట్ర కోణం ఉందని, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న కేసులో ఇంప్లీడ్ అవ్వటానికి అవకాసం ఇవ్వాలని, పూర్తి ఆధారాలతో పిటీషన్ దాఖలు చేసారు, కర్నూల్ కు చెందిన, మాజీ పోలీస్ అధికారి శివానంద రెడ్డి. రాజ్యాంగ వ్యవస్థ అయిన కోర్టుల పై, ఇలాంటి దాడి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని, దీని వెనుక కుట్ర కోణం ఉంది అంటూ, కోర్టుకు తన పిటీషన్ లో తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు, సోషల్ మీడియా వింగ్ లు పెట్టుకుని మరీ, కోర్టుల పై దాడి చేస్తున్నారని పిటీషన్ లో తెలిపారు. ఇప్పటికే హైకోర్టు రిజిస్టార్ ఫిర్యాదు చేసినా, ఎలాంటి మార్పు లేదని, రాష్ట్రంలో ఉన్న దర్యాప్తు సంస్థలు కూడా సహకరించటం లేదని తెలిపారు. వీటికి సంబంధించి పూర్తి ఆధారాలు ఇచ్చేందుకు అవకాసం ఇవ్వాలని కోరారు. అలాగే ఈ పిటీషన్ లో ప్రశాంత్ కిషోర్ కి సంబందించిన ఐ-ప్యాక్ అనే సంస్థ పై కూడా హైకోర్టు ముందుకు తెచ్చారు. గత ఎన్నికల్లో, వీళ్ళు వైసీపీ పార్టీకి పని చేసారని అన్నారు.

కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభజించి, సోషల్ మీడియాలో టార్గెట్ గా క్యంపైన్ చెయ్యటంలో వీళ్ళు సిద్ధహస్తులని అన్నారు. అయితే ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూడా, వీళ్ళు ప్రభుత్వ అజెండాను బలవతంగా స్లీపర్ సెల్స్ లాగా పని చేస్తూ, ఎక్కిస్తున్నారని, ఈ క్రమంలోనే హైకోర్టు పై దాడి కూడా, కుట్ర ప్రకారం, సోషల్ మీడియాలో చేస్తున్నారని తెలిపారు. న్యాయమూర్తుల పై దాడి చేసి, న్యాయ పాలనకు దూరం చెయ్యలనే వారి ఆలోచనలు అని అన్నారు. తమ నిర్ణయాలు ఎవరూ ప్రశ్నించకూడదు అనే ధోరణితో, ఆ ప్రతి ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా ఉన్నారని అన్నారు. ఇదే కోవలో కొంత మంది వైసీపీ కార్యకర్తలకు, అలాగే ఐ-ప్యాక్ లో పని చేసిన వారికి ప్రభుత్వంలో పదవి ఇచ్చారని, వీళ్ళు ఇదే పనిలో ఉన్నారని కొన్ని ఆధారాలు సమర్పించారు. ఇక విజయసాయి రెడ్డి, మరి కొంత మంది నేతలు కోర్టుల పై చేసిన వ్యాఖ్యలను కూడా సమర్పించారు. ఇది వరకు కోర్టు 98 మందికి నోటీసులు ఇస్తే, కేవలం 18 మందిని విచారణకు పిలిచారని, అధికార పార్టీకి తలొగ్గి పని చేస్తున్నారని, ఈ మొత్తం వ్యవహారం పై సిబిఐ విచారణ జరపాలని కోరారు.

Advertisements

Latest Articles

Most Read