ఈ నెల 24 వతేదీన ఆయాసంతో చికిత్స నిమిత్తం విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళిన 62 సంవత్సరాల వయస్సుగల తన భర్త వసంతరావు కనిపించడం లేదని అతని భార్య ధనలక్ష్మి, బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పట్నుంచి ఆస్పత్రి వారిని అడుగుతుంటే తమకు ఏమీ తెలియదని చెబుతున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు కూడా వివరాలు తీసుకున్నారు , కానీ ఇంత వరకు సమాచారం లేదని ఆమె చెబుతున్నారు. తన భర్త ఎక్కడున్నాడన్నది తమకు అంతుబట్టడం లేదని ఆమె విలపిస్తున్నారు. వీరికి సంతానం లేదు. పైగా వసంతరావు సోదరుడు కూడా కొద్దిరోజుల క్రితమే చనిపోయారు. ఆయన దశదిన కర్మలు మొదలవడానికి ముందు వసంతరావు ఆయాసంతో ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్ళారు. వసంతరావును పరిశీలించిన ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళమని చెప్పారు. దీంతో వసంతరావు, ధనలక్ష్మి ఆస్పత్రికి వెళ్ళారు. అక్కడ ఇద్దరు వసంతరావును ఆస్పత్రి లోపలికి తీసుకువెళ్ళారు, ధనలక్ష్మిని బయటే ఉండమన్నారు.

అయితే లోసల తన భర్త చికిత్స పొందుతున్నాడని ఆమె బయటే సాయంత్రం వరకు వేచి ఉంది. ఆమెకు ఎవరూ ఏమీ వివరాలు చెప్పలేదు. అక్కడి వారిని అడిగితే చికిత్స చేస్తున్నారన్నట్లుగా చెప్పడం, ఇక్కడ వద్దు రేపు రండి అని చెప్పటంతో ఆమె తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. మరునాడూ ఆస్పత్రికి వెళ్ళితే వసంతరావు అనే వ్యక్తి లేరంటూ సమాధానం వచ్చేసరికి ఆమె భయాందోళనకు గురయింది. అప్పట్నుంచి భర్త కోసం ఎదురు చూస్తేనే ఉంది,. అటు ఆస్పత్రిలోని వారు ఏమీ చెప్పడం లేదు, ఇటు పోలీసులూ ఏమీ చెప్పడం లేదని, తన భర్తను వెతికి పెట్టండి అంటూ ఆమె ఇప్పుడు బహిరంగంగా ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తన భర్త ఆచూకీ కనిపించడం లేదని ఆమె ఆరోపిస్తున్నది. ఆస్పత్రికి వెళ్ళిన రోజున చాలాసేపటికి గాని సిబ్బంది స్పందించలేదని, చివరికి బతిమాలుకుంటే తన భర్తను వీల్ చైర్ లో కూర్చోబెట్టి తీసుకువెళ్ళారని, ఆ తరువాత నుంచి తన భర్త జాడలేదని వాపోతున్నది. బంధువు శంకరనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆస్పత్రి లో తమకు సమాధానం చెప్పడం లేదని, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరుతున్నారు.

వైఎస్సార్సీ పార్టీ నర్సాపురం లోకసభ నియోజకవర్గ సభ్యుడు రఘురామకృష్ణంరాజు వ్యవహరాన్ని ఆ పార్టీ అధిషానం సీరియస్ గానే తీసుకుంది. ఆయన పై ఎంపి సభ్యత్వానికి అనర్హత వేటు వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు లోకసభ స్పీకరుకు లేఖను ఇచ్చేందుకు ఆ పార్టీ పార్లమెంటు సభ్యులు సిద్ధమయ్యారు. వారికి స్పీకరు ఓం ప్రకాశ్ బిర్లా అప్పాయింట్ మెంట్ ఇచ్చారు. ఇటీవల ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి పై, తన పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు చేసిన ఓవర్ ఆక్షన్ పై తీవ్ర విమర్శలు చేసిన రామకృష్ణంరాజుకు పార్టీ అధిష్టానం సంజాయిషీ నోటీసు ఇచ్చింది. దీనిపై కుడా స్పందించిన రాజు గారు, తాను యువజన శ్రామీక కాంగ్రెస్ నుంచి ఎంపిగా ఎన్నికయ్యాయని, తనకు వైఎస్సాఆర్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సంజాయిషీ లేఖ రాస్తే చెల్లుబాటు కదనీ, క్రమశిక్షణ సంఘం చెయ్యల్సింది, విజయసాయి రెడ్డికి ఏమి సంబంధం అని వ్యాఖ్యానించారు. తాను పార్టీకి, ముఖ్యమంత్రికి విదేయుడినంటునే సుతిమెత్తగా అంటించారు.

ఇక తన పై ఒక సామజివర్గం మనుషులు చేస్తున్న బెదిరింపులు విషయంలో, ఆయన ఎన్నికల కమిషనర్‌ను, లోక్ సభ స్పీకరును, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి తన రక్షణ కల్పించాలని కోరారు. దీంతో విసిగిపోయిన వైకాంగ్రెస్ పార్టీ రామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వంపైనే వేటు వేయాలని నిర్ణయించింది. ఆయన పై అనర్హత వేటు వేయాలంటూ లోకసభకు స్పీకర్‌కు లేఖ అందజేయాలని పార్లమెంటు సభ్యులకు ఆదేశాలిచ్చింది. దాంతో విజయవాడనుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వైకాంగ్రెస్ పార్లమెంటు సభ్యులు, కొందరు న్యాయవాదులు బయలుదేరి వెళ్లారు. అయితే ఈ పరిణామం చోటు చేసుకున్న సమయంలో రఘురామరాజు మరో అనూహ్యం నిర్ణయం తేసుకున్నారు. తన పై అనర్హత వేటు వేసే అధికారం వీళ్ళకు లేడని, వేరే పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీస్ ఇచ్చారని, అనర్హత ప్రాసెస్ ని అడ్డుకోవాలని కోర్టులో పిటీషన్ వేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు అని, తమ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. అలాగే తాను ఎక్కడా పార్టీని కాని, నాయకుడిని కానీ, ఎక్కడా ఒక్క మాట కూడా అనలేదని, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తేవటమే తన పాపమా అని రఘురామ రాజు అన్నారు. ఈ పార్టీ పేరు వ్యవహారం పై ఇప్పటికే ఈసీ దృష్టికి తెచ్చానని, ఆ నిర్ణయం ఏమిటో చూడాలని కోర్టుకు తెలిపారు.

రఘురామకృష్ణం రాజు ఇస్తున్న జర్కుల నుంచి, ఇక విముక్తి తీసుకోవాలని, వైసిపీ భావిస్తుంది. ఆయన పై అనర్హత వేటు వేసే దిశగా, వైసిపీ పావులు కదుపుతుంది. రేపు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ, లాయర్లు, ఎంపీలతో కలిసి, వైసీపీ నేతలు, రేపు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతో భేటీ అయ్యి, రఘురామరాజు పై అనర్హత పిటీషన్లు వేస్తారని తెలుస్తుంది. అయితే ఈ స్పెషల్ ఫ్లైట్ వేసుకుని, తన పై చర్యలు తీసుకోవాలి అంటూ, వస్తున్న వార్తల పై రఘురామ రాజు స్పందించారు. "వీళ్ళకు అసలు కంటెంట్ లేదు. నేను పార్టీని, సియం ని ఏమి అనలేదు. వీళ్ళు ఖాళీగా ఉన్నారు, విమానం ఉంది, ప్రభుత్వ ఖర్చు, తిరుగుతున్నారు. ప్రభుత్వ ఖర్చుతో విమానం వేసుకుని వచ్చి, ఏదో షో చేస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా, ప్రత్యేక విమానం వేసుకుని వచ్చి, ప్రభుత్వం ఖర్చులో వేస్తారు. ఇది అనవసర ఖర్చు. ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదు. టిటిడి భూములు వేలం ఆపమన్నాని, ఇసుకలో అక్రమాలు మంత్రులే మాట్లాడుతున్నారు, నేను అదే చెప్పా, ఇళ్ళ స్థలాల కుంభకోణం కూడా అంతే. మరి వీళ్ళు నా మీద ఎందుకు పడుతున్నారో. పార్టీకి దేవుడు భూములు అమ్మకానికి, పార్టీకి ఇసుక కుంభకోణానికి సంబంధం ఏమిటి ? ఇది ప్రభుత్వ సంగతి. రెండిటికీ తేడా ఉంది. "

"వీళ్ళకు విమాన ఖర్చులు కూడా దండగ. నన్ను స్పీకర్ సంజయషీ అడుగుతారు, నేను జగన్ గారికి ఏమి రిప్లై ఇచ్చానో, అదే స్పీకర్ గారికి చెప్తాను. అన్ని ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ప్రజల కష్టాలు, ఒక ఎంపీ, సియంకు తెలియ చెయకూడదు అనే వాదన ఏంటో అర్ధం కావటం లేదు. ప్రజల సమస్యలు లేవనెత్తటం తప్పా ? ఢిల్లీలో మొత్తం చక్రం తిప్పాను, రాజు గారి మీద ఆక్షన్ తీసుకోవచ్చు అని, అని మా పార్టీ ఎంపీ బాలసౌరి గారు, జగన్ గారికి భరోసా ఇచ్చారని, తరువాతే వీళ్ళు ఇక్కడకు వస్తున్నారని తెలిసింది. చూద్దాం ఏమి చేస్తారో. అయితే నా వరకు, ఇది వృధా. స్పెషల్ ఫ్లైట్ డబ్బులు, దాదాపుగా 14 లక్షలు అవుతుంది, ఆ నష్టం తప్ప ఏమి లేదు. నాకు అయితే ఒక క్లారిటీ వచ్చింది. ఇన్నాళ్ళు జగన్ గారికి తెలియకుండా జరిగింది అని అనుకున్నా, అయితే ఈ రోజు విమానం మొత్తం సెట్ చేసారు అంటే, జగన్ గారికి తెలిసే జరిగింది అని అర్ధం అవుతుంది." అని రఘురామకృష్ణం రాజు అన్నారు.

రాష్ట్ర రాజధానిని తరలించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రేపటితో 200 రోజులు గడిచిపోయాయి. డిసెంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో 2015లో రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చి న రైతులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఆ మరుసటి రోజు నుండే రాజధాని అమరావతినే కొనసాగించాలని రైతులు తలపెట్టిన ఉద్యమానికి రేపటితో 200 రోజులు పూర్తి కావస్తుందని రాజధాని జెఎసి ప్రకటించింది. మూడు ముక్కల రాజధానులకు వ్యతిరేకంగా ఏపికి ఏకైక రాజధానిగా ఆమరావతినే కొనసాగించాలని వేలాదిమంది రైతులు, మహిళలు, వివిధ ప్రజాసంఘాలు, ఆఖకిలపక్ష పార్టీల సహకారంతో అమరావతి పరిధిలో ఉద్యమాలు కొనసాగిస్తున్నారు. ఇదే తరుణంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కొవిడ్-19 వ్యాప్తి చెందుతున్నందున స్వచ్చంధంగా ఇంటిలోనే సభ్యులు కలసి నిరసనలు కొనసాగించే కార్యక్రమం చేపట్టిన సందర్భాలు చోటుచేసుకున్నాయి. రాజధాని తరలింపు వార్తల నేపధ్యంలో రాజధాని రైతులు మృతిచెందిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.

రాజధాని జేఎసితోపాటు కొందరు రైతులు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని న్యాయస్థానాలను ఆశ్రయించారు. రాష్ట్ర శాసన మండలిలో కూడా పరిపాలన వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం లభించని విషయం తెలిసిందే. వీటి అన్నిటి మధ్య రేపు అమరావతి పోరాటం 200 రోజులకి చేరుకుంటుంది. అయితే, సరిగ్గా ఇలాంటి సమయంలోనే, అమరావతి రైతులకు మద్దతు తెలపటానికి, ఒక అధికార పార్టీకి చెందిన ఎంపీ సంఘీభావం తెలుపుతున్నారని, అమరావతి జేఏసీ నేతలు తెలిపారు. ఆయన ఎవరో కాదు, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. అమరావతి మూడు ముక్కలు చేసినందుకు, రైతులను రోడ్డుపాలు చేసి, మహిళల పై లాఠీ దెబ్బలు తగిలినా, 200 రోజులుగా అమరావతి వాసులు చేస్తున్న పోరాటానికి, మద్దతుగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రఘురామకృష్ణం రాజు మాట్లాడి, అమరావతి వాసులకు మద్దతు తెలపనున్నారు. ఒక పక్క వైసిపీ పార్టీ మొత్తం అమరావతిని హేళన చేస్తుంటే, అదే పార్టీకి చెందిన ఎంపీ, అమరావతి రైతులకు మద్దతు తెలపనున్నారు.

Advertisements

Latest Articles

Most Read