విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో, రామకృష్ణాపురం గ్రామంలో, స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత వెలగపూడి రామకృష్ణబాబు, ఆ గ్రామంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చెయ్యటానికి, ఇక్కడ వచ్చారు. అయితే, అక్కడ ఉన్న కొంత మంది వైసిపీ నేతలు, కార్యకర్తలకు, వెలగపూడి రామకృష్ణ బాబు రాగానే, రాళ్ళ దాడి చేసారు. ఈ రాళ్ళ దాడిలో పలువురు టిడిపి కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. ఇద్దరికీ తలకాయి కూడా పగిలినట్టు చెప్తున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గాయపడ్డ వారిని, హాస్పిటల్ కు తరలించారు, తెలుగుదేశం నేతలు. అయితే కార్యకర్తల పై దాడి జరిగిన విషయం పై, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీవ్ర నిరసన వ్యక్తం చేసారు. అక్కడే రోడ్డు పై, కార్యకర్తలతో బైఠాయించి, నిరసన తెలుపుతున్నారు. ఎవరైతే దాడిలో పాల్గున్నారో, వారి పై చర్యలు తీసుకునే వరకు, ఇక్కడ నుంచి లేగిసే పనే లేదని, వారి పై చర్యలు తీసుకోవాలని, గత గంట సేపటి నుంచి, రామకృష్ణ బాబు నిరసన తెలుపుతున్నారు. అయితే పోలీసులు మాత్రం, నిరసన విమరమించాలని, కోరుతున్నారు. ప్రస్తుతం, ఇంకా నిరసన కొనసాగుతుంది.

ఈ ఘటన పై రామకృష్ణ బాబు, స్పందించారు. "ప్రభుత్వం మారటం, వైసిపీ ప్రభుత్వం రావటంతో, గత ఏడాదిగా, విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలో, అభివృద్ధి అనేది లేకుండా పోయింది. అయితే అధికారుల దగ్గరకు తీసుకు వెళ్లి, వారిని అన్నీ చెప్పి, వారిని ఒప్పిస్తే, ఈ రోజు ఈ రోడ్లు వెయ్యటానికి, వారు సాంక్షన్ చెయ్యటం జరిగింది. సిసి రోడ్లు, డ్రైన్లు సాంక్షన్ చేపించుకున్నారు. గతంలో రామకృష్ణా పురం ఎలా ఉందొ అందరికీ తెలుసు, ఈ రోజు రోడ్లు వేసినా, కరెంటు ఇచ్చినా, షెడ్లు ఇచ్చినా, స్ట్రీట్ లైట్లు పెట్టినా, మంచి నీళ్ళు ఇచ్చినా, అండర్ గ్రౌండ్ డ్రైనేజి వేసినా అన్నీ తెలుగుదేశం హయాంలోనే జరిగింది. ఈ రోజు, సిసి రోడ్లు, డ్రైన్లు, 13 వ వార్డులో శంకుస్థాపనకు వస్తే, ఈ రోజు అభివృద్ధి నిరోదకులు అయిన వైసిపీ గూండాలు, వేరే ప్రాంతాలు నుంచి రౌడీలను తీసుకు వచ్చి, మా పైన రాళ్ళు దాడి చేసారు. ఒకరికి తలకాయి పగిలింది. మేము అభివృద్ధి చెయ్యటానికి చూస్తుంటే, ఇక్కడ మాత్రం కక్షలు, రెచ్చగోడుతున్నారని, ప్రజలను మంచిగా చూసుకోకుండా, ఇలా రౌడిజం ఏమిటి అని" రామకృష్ణ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ప్రముఖ దుబాయి కంపెనీ లూలు గ్రూప్, విశాఖపట్నంలో, అతి పెద్ద కన్వేషన్ సెంటర్ పెట్టాలని, నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత, అందులో అవకతవకలు జరిగాయని, అందుకే వారితో ఒప్పందం రద్దు చేసుకున్నామని చెప్పారు. అయితే, ఈ చర్య పై లూలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మేము ఆంధ్రప్రదేశ్ లో తప్ప ఎక్కడైనా పెట్టుబడి పెడతాం అని, చెప్పి వెంటనే పక్క రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టారు. దీంతో ఒక పెద్ద కంపెనీ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినట్టు అయ్యింది. అయితే ఇది పక్కన పడితే, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పనితో అందరూ అవాక్కయారు. పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన స్థలం, అమ్ముకుంటున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. విశాఖపట్నం నగరంలోని లులు గ్రూపుతో ఒప్పందం రద్దు చేసిన తరువాత ఎపిఐఐసి ఆధీనంలో ఉన్న, సర్వే నెంబర్ 1011 లోని 13.83 ఎకరాల భూమిని అమ్మి, డబ్బులు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బిల్డ్ ఏపి కింద, ఈ స్థలం అమ్మకానికి పెడుతున్నామాని, 30 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది, తరువాత చదరపు అడుగుకు 6,800 రూపాయలకు విక్రయించనుంది.

సీతమ్మధారలో ఉన్న, ఆరోగ్య శాఖకు చెందిన సర్వే నెం 39 లోని సర్వే నంబర్ 8 మరియు 11లో ఉన్న, మూడు ఎకరాలు భూమిని కూడా అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే , మాజీ కేంద్ర ఇంధన కార్యదర్శి ఇ.ఎ.ఎస్ శర్మ శనివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, అటువంటి విలువైన పట్టణ భూములను విక్రయించాలనే నిర్ణయం ప్రజా ప్రయోజనానికి విరుద్ధమైనందుని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల తరపున ప్రజా ఆస్తుల ధర్మకర్త మాత్రమేనని, , ఆ ఆస్తుల యాజమాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలకు ఇచ్చే హక్కు లేదని ఆయన అన్నారు. అయితే విశాఖలో విలువైన భూమిని అమ్మటం పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి భూములు ఇప్పుడు వదులుకుంటే, తరువాత చాలా కష్టం అని, ప్రభుత్వం ఇలాంటి భూముల్లో, ఏదైనా పెట్టుబడులు పెట్టించాలి కాని, ఇలా అమ్మేయటం ఏమిటి అనే విమర్శలు వస్తున్నాయి.

అచ్చెన్నాయుడి అరెస్ట్ వ్యవహారంలో, పోలీసులు వ్యవహరించిన తీరు పై, ఏపి బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ మెప్పు పొందేందుకే, పోలీసులు ఇలా వ్యవహరించారని, బీజేపీ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. విష్ణుకుమార్ రాజు గారి మాటల్లో "ఆరోపణలు వచ్చినప్పుడు నోటీసు ఇవ్వచ్చు, గౌరవంగా తీసుకుని వెళ్ళవచ్చు, అంతే కాని హడావిడిగా అచ్చెన్నాయుడి గారిని తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఏమి వచ్చింది ?వారి భార్య గారు, బాత్ రూమ్ లో ఉండి, బాత్ రూమ్ నుంచి బయటకు వచ్చే లోపలే, ఈయన్ను హడావిడిగా ఎక్కించుకుని తీసుకుని రావటం అనేది, సబబు కాదు. ఇది నిజంగా చూస్తే, ఒక ఎమ్మెల్యే కాని, ఒక అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి కాని, ఇలా చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన ఎక్కడికైనా పారిపోయే వ్యక్తి కాదు. ఎక్కడికో గోడ దుకేసో, దేశం వదిలి పారిపోయే వ్యక్తి కాదు. ఇటువంటి పనులు, పోలీసులు అధికారులు కూడా, ఇటువంటి పనులు, రాజకీయంగా మెప్పు పొందుదాము, ప్రభుత్వంలో ఉన్న పెద్దల దృష్టిలో పడదాము, అనే ఉద్దేశంతో చేసిన పనిగా అనిపిస్తుంది. వారు ఇంతకు ముందు చాలా మందిని అరెస్ట్ చేసి ఉంటారు, ఎప్పుడైనా ఈ విధంగా చేసారా ?"

"జీవితంలో ఏ పోలీసు అధికారి కూడా, ఎప్పుడూ తప్పు చెయ్యలేదా ? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ గుండెల మీద చెయ్య వేసుకుని చెప్పాలి, ఎప్పుడూ తప్పు చెయ్యలేదా ? ఏదైనా ఎంక్వయిరీలో తేల్చుకోవాలి, కాని ఇదేమి పధ్ధతి. ఎవరో 70 ఏళ్ళ మహిళ పోస్టు పెడితే, ఆవిడ పైన కేసులు పెట్టారు. ఎంత మంది పైన, ఏమేమి కేసులు ఉన్నాయి అన్నది అందరికీ తెలుసు. అవన్నీ ఇప్పుడు నేను విడమర్చి చెప్పనవసరం లేదు. మనం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజలు ఏదైనా అడగాలి అంటే భయపడుతున్నారు. ఏదైనా పోస్ట్ పెట్టాలి అంటే, వాట్స్ అప్ ఫార్వర్డ్ చెయ్యాలి అంటే భయపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో, ఈ పధ్ధతి మంచి పధ్ధతి కాదు అని విష్ణు కుమార్ రాజు అన్నారు. అటు బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ కూడా వైసీపీ తీరు పై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకుని, అవన్నీ తామే చేస్తున్నట్టు, వైసిపీ నేతలు డబ్బా కొడుతున్నారని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో, ఇప్పటికీ అక్కడ ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రత్యెక పైప్ లైన్ వేసి, మంచి నీళ్ళు సరఫరా చెయ్యాలని అన్నారు.

వైసిపీ అధికారంలోకి వచ్చి ఏడాది అయ్యింది. ఎక్కడ చూసినా ఈ ఏడాదిలో గందరగోళమే. మొదటి నాలుగు నెలలు, ఇసుక లేక, పనులు లేక, రాష్ట్రం అల్లాడిపోయింది. తరువాత నాలుగు జిల్లాల్లో వచ్చిన వరదలతో, మొత్తం గందరగోళం. ఇక గత నాలుగు నెలలుగా కరోనాతో, జీవితాలు తలకిందులు అయిపోయాయి. ఇక వీటికి తోడూ అన్ని చోట్లా మాఫియాలే. ఏకంగా వైసిపీ నేతలే, ఈ మాఫియాలు బయట పెట్టటం కొస మెరుపు. ఇసుక మాఫియా, నాటు సారా మాఫియా, మద్యం మాఫియా, ఇళ్ళ స్థలాల మాఫియా, ఇలా ప్రతి విషయంలోనూ మాఫియానే. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రభుత్వం పై ఎక్కడ చూసినా అసంతృప్తి. దీంతో ప్రజలు పడుతున్న ఈ ఇబ్బందులు అన్నిటి నుంచి, ప్రజలను డైవర్ట్ చెయ్యటానికి, అధికారం పక్షం, ప్రతిపక్షాన్ని అటాక్ చెయ్యటం మొదలు పెట్టింది. వరుస పెట్టి, ప్రతిపక్ష నాయకులని అటాక్ చెయ్యటం మొదలు పెట్టింది. మజ్జిగ ప్యాకెట్ల పై సిబిఐ ఎంక్వయిరీ ఆదేశించింది. తరువాత రోజే అచ్చెంనాయుడుని, ఆ తరువాత రోజు జేసి ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి, రాష్ట్రంలో రాజకీయ వాతవరణం మొత్తం మార్చేసింది. అయితే ఇందులో నిజంగా స్కాం ఉందా అంటే, తిప్పి తిప్పి కొడితే కోటి రూపాయలు కూడా ఆ విలువ ఉండదు. అయితే, ఇందలో కూడా వారి ప్రమేయం లేదని తెలుస్తుంది.

అయినా వారిని అరెస్ట్ చెయ్యటం, ఏదో అవినీతి చేసారు అని, తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల్లోకి నేట్టేసాం అని వైసిపీ అనుకున్న టైంలో, రివర్స్ లో, వైసీపీ నుంచి వచ్చిన ఆయనే, సొంత పార్టీని ఇబ్బంది పెడుతున్నారు. ఆయనే నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు. తెలుగుదేశం నేతలను ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్న టైంలో, ఆయన ఏకంగా ఏబీఎన్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి టార్గెట్ లో చంద్రబాబు తరువాత ఉందే ఏబీఎన్. ఏబీఎన్ కే ఏకంగా ఎంపీ రఘురామకృష్ణం రాజు ఇంటర్వ్యూ ఇవ్వటం, అచ్చెంనాయుడు అరెస్ట్ అలా చెయ్యటం తప్పు అని చెప్పారు. అలాగే చంద్రబాబుని కలవనివ్వకుండా ఉండటం కూడా తప్పు అని, ఇది మానవహక్కులు ఉల్లంఘన అని ఆయన అన్నారు. ఇక విజయసాయి రెడ్డి కోర్టుల మీద ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసిన వారిని, వెనకేసుకుని రావటం తప్పు అని అన్నారు. రోజుకి ఒకరు అరెస్ట్ అవుతారు అంటూ వైసిపీ నేతలు అత్యుత్సాహంతో చేస్తున్న వ్యాఖ్యలు, తప్పు అని అన్నారు. ఇళ్ళ పట్టాల విషయంలో కూడా పెద్ద స్కాం ఉంది, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చాం అని అన్నారు. తనకి జగన్ ని కలిసే అవకాసం లేదు కాబట్టే, తాను ఇలా మీడియాకు ఎక్కాం అని అన్నారు. అయితే ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి టిడిపి నేతలను అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడుతుంటే, ఏకంగా వైసిపీ ఎంపీనే సొంత పార్టీని ఇబ్బంది పెడుతూ, ఏబీఎన్ లాంటి చానెల్ లో ఇంటర్వ్యూ లు ఇచ్చి, మరింతగా వైసిపీని ఇబ్బంది పెడుతున్నారు.

Advertisements

Latest Articles

Most Read