లాక్ డౌన్ కారణంగా, సినిమా షూటింగ్లు అన్నీ నిలిచి పోవటంతో, సినిమా పరిశ్రమలో ఉన్న చిన్న చిన్న వారు, చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యెక జీవో తెచ్చి, షూటింగ్లకు అనుమతులు ఇస్తూ ఒప్పుకోవటం పై, హర్షం వ్యక్తం చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చి, సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది పెద్దలు ఈ రోజు వచ్చి కృతజ్ఞతలు చెప్పారు. చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు, సి. కళ్యాణ్, రాజ మౌళి, ఈ రోజు హైదరాబాద్ నుంచి వచ్చి, జగన్ మోహన్ రెడ్డిని, తాడేపల్లిలోనే ఆయన క్యాంప్ ఆఫీస్ లో కలిసారు. అయితే బయటకు వచ్చిన తరువాత, ఎప్పటి నుంచి జగన్ ని కలవాలని అనుకున్నాం అని, ఇప్పుడు కలిసాం అని, ఏపిలో సినీ పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తాం అని చెప్పారని, అలాగే వైజాగ్ లో స్టూడియో నిర్మాణానికి, అడిగాం అని, దాని పై కూడా సానుకూలంగా స్పందించినట్టు చెప్పారు. అలాగే వైజాగ్ లో స్థిర పడే సినిమా వారికీ, స్థలాలు ఇస్తాం అని చెప్పినట్టు చెప్పారు. అయితే, చిన్న చిన్న సినీ కార్మికులు ఎలా బ్రతకాలి అనేదాని గురించి ఆలోచన చెయ్యకుండా, స్టూడియోల కోసం భూములు, స్థలాల కోసం మాట్లాడటం పై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయం పక్కన పడితే, అమరావతి ప్రజలతో ప్రవర్తించిన తీరు పై కూడా విమర్శలు వచ్చాయి.

ఈ రోజు గన్నవరం ఎయిర్ పోర్ట్ ల దిగిన చిరంజీవి అండ్ టీం, అక్కడ నుంచి ఉండవల్లి దగ్గర ఉన్న, గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు. చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలో తమ ప్రాంతానికి వచ్చారని తెలుసుకుని, అమరావతి రైతులు, మహిళలు అక్కడకు చేరుకున్నారు. అయితే వీరి వద్దకు రాకుండానే, కార్లు గెస్ట్ హౌస్ లోపలకు వెళ్ళిపోయాయి. తరువాత అయినా, చిరంజీవి, నాగార్జున, తమ వద్దకు వచ్చి, తమ సమస్యలు గురించి వింటారని, అక్కడ ప్రజలు అనుకున్నారు. అయితే వారు రోడ్డు పక్కన నుంచున్నా, వారిని కనీసం పలకరించకుండా, వారి సమస్య ఏమిటో వినకుండా, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కనీసం తమ సమస్య కూడా వినకుండా, తమను కనీసం పలకరించకుండా, హైదరాబాద్ వెళ్ళిపోవటం పై, విమర్శలు వస్తునాయి. చిరంజీవి కేంద్ర మంత్రిగా, ఒక పార్టీ పెట్టిన వ్యక్తిగా, ఒక స్టార్ హీరోగా, ఇలా ప్రవరిస్తారాని అనుకోలేదని రైతులు వాపోతున్నారు. తమ ఉద్యమానికి మద్దతు తెలపకపోయినా, కనీసం మా మోర ఆలకించండి అని రోడ్డు మీద నుంచున్నా, పట్టించుకోకుండా వెళ్ళిపోవటం ఎంత వరకు సమంజసం అని వాపోతున్నారు. చిరంజీవి ఇలా చేస్తారని అనుకోలేదని, బాధ పడుతున్నారు.

హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ టాప్ హీరో, నందమూరి బాలకృష్ణ, రేపటితో 60వ ఏట అడుగుపెట్టబోతున్నారు. ఈ సందర్భంగా, నందమూరి బాలకృష్ణ అభిమానులు, బంధుమిత్రుల హడావిడి ఎక్కువగానే ఉంది. ముఖ్యంగా ఆన్లైన్ లో, వివిధ మాధ్యమాల ద్వారా నందమూరి బాలయ్యకు, పుట్టిన రోజు శభాకాంక్షలు తెలుపుతూ, బాలయ్యకు అభిననంధనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఇది బాలయ్యకు షష్టిపూర్తి ఏడాది కావటంతో, హడావిడి కొంచెం ఎక్కువగానే ఉంది. అయితే ఈ ఏడాది క-రో-నా మహమ్మారి ఉండటంతో, పుట్టిన రోజు వేడుకులకు, సేవా కార్యక్రమాలకు బాలయ్య దూరంగా ఉన్నారు. తన అభిమానులకు కూడా బాలయ్య అదే పిలుపు ఇచ్చారు. ఎలాంటి వేడుకలు జరుపుకోవద్దు అని, అలాగే ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసినా, బౌతిక దూరం పాటిస్తూ చెయ్యాలని, బాలయ్య పిలుపు ఇచ్చారు. ఇదే సందర్బంలో, ఇంత స్పెషల్ బర్త్ డే చేసుకుంటూ, తన అభిమానులకు కూడా గిఫ్ట్ ఇవ్వాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు.

ఇందులో భాగంగా, తన తండ్రి నటించిన సినిమాలో, శివసంకరి, శివానంద లహరి పాటను, స్వయంగా బాలయ్య పాడారు. ఆరు నిమిషాల పైగా ఉన్న ఈ పాట, ఎంతో కష్టంగా ఉన్నా, బాలయ్య అలవోకగా పాడేసి, తన అభిమానాలకు గిఫ్ట్ ఇచ్చారు. ఇక మరో బంపర్ సర్ప్రైజ్ ఇస్తూ, బోయపాటితో తీస్తున్న తన 106వ సినిమా టీజర్ కూడా ఈ రోజు రిలీజ్ చేసారు. బోయపాటి, బాలయ్య హిట్ కాంబినేషన్ లో వస్తున్న, మూడవ సినిమా ఇది. టీజర్ లో బాలయ్య, ఎప్పుడూ కనిపించిన లుక్ లో, లుంగీ కట్టుకుని, మీసం తిప్పి ఉన్న లుక్ లో అభిమానులను అలరించారు. ఈ టీజర్ లో, బాలయ్య చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. "మీ నాన్న అనటానికి, నీ అమ్మా మొగుడు అనటానికి చాలా తేడా ఉంది, భాష సరిగ్గా మాట్లాడురా లంబిడీకొడకా" అనే డైలాగ్ సూపర్ గా పేలింది. ముఖ్యంగా టిడిపి అభిమానులు, ఈ డైలాగ్ ఒక బూతులు తిట్టే మంత్రి కోసమే పెట్టారు అంటూ, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా, ఎవరిని ఉద్దేశించి ఆ డైలాగ్ చెప్పినా, బాలయ్య కొత్త లుక్ మాత్రం సూపర్..

తెలంగాణా నుంచి విడిపోయిన తరువాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవటంతో, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు, అమరావతి ప్రాంతంలో, రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారు. అయితే చంద్రబాబు నాయుడు ఓడిపోవటం, జగన్ మోహన్ రెడ్డి రావటంతో, మొత్తం తారు మారు అయ్యింది. అమరావతిని మూడు ముక్కలు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి దాకా, 175 రోజుల పాటు, రాజధాని మహిళలు, రైతులు ఆందోళన చేస్తున్నారు. అయితే, అమరావతి రైతుల సమస్యలు కాని, అలాగే మహిళల ఆందోళన గురించి కానీ, తెలుగు సినీ ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకోలేదు. తెలంగాణాలో చిన్నది జరిగినా, తపించిపోయే తెలుగు సినీ పెద్దలు, కనీసం పట్టించుకోలేదు. మహిళలను కొట్టినా, కనీసం స్పందించలేదు. అయితే, ఈ రోజు తెలుగు సినీ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉంది అని, జగన్ మోహన్ రెడ్డి సహకరించాలి అంటూ, చిరంజీవి, నాగార్జున, తదితర సినీ పెద్దలు, ఈ రోజు జగన్ ని కలవటానికి ఆంధ్రప్రదేశ్ వచ్చారు. జగన్ మోహన్ రెడ్డితో, ఈ రోజు మూడు గంటలకు మీటింగ్ ఉంది. అయితే, ఎయిర్ పోర్ట్ దిగిన తరువాత, సినీ పెద్దలు, ఉండవల్లి దగ్గర ఉన్న, గోకరాజు, గంగ రాజు గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు.

అక్కడ కొంచెం సేపు సేద తీరు, జగన్ మోహన్ రెడ్డిని మూడు గంటలకు కలవనున్నారు. అయితే, విషయం తెలుసుకున్న అమరావతి మహిళలు, రైతులు, అక్కడకి చేరుకున్నారు. ప్లే కార్డులు పట్టుకుని, గెస్ట్ హౌస్ ముందు నుంచున్నారు. మా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని, మా తరుపున ఉండాలని, మా కష్టాలు జగన్ కు చెప్పాలి అంటూ, అక్కడ నుంచుని నినాదాలు చేసారు. మీ లాభాల కోసం వస్తారు, మా కష్టాలు ఉన్నప్పుడు కనీసం మా మొఖం మీరు చూడరా అంటూ కొంత మంది నిరసన తెలిపారు. ఇన్ని రోజులు మమ్మల్ని పట్టించుకోలేదు కాని, ఇప్పుడు మాత్రం మా ప్రాంతం కావాల్సి వచ్చిందా, మీకు సేద తీరటానికి అంటూ కొంత మంది వ్యాఖ్యానించారు. అయితే పరిస్థిత అదుపు తప్పుతూ ఉండటంతో, పోలీసులు రంగంలోకి దిగారు, వెంటనే వెళ్ళిపోవాలని, లేకపోతే అరెస్ట్ చేస్తాం అంటూ , పోలీసులు చెప్తున్నారు.

మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రముఖ పారిశ్రామికవేత్త శిద్దా రాఘవరావు బుధవారం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు సమాచారం. వాణిజ్య వేత్తగా,
ప్రకాశం జిల్లాలో పలు సేవా కార్య క్రమాలు నిర్వహిస్తున్న శిద్దా రాఘవరావు టీడీపీ సీనియర్ నాయకుడు. అనతి కాలంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అతి సన్నిహితంగా, పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. పార్టీలో టీడీపీ పోలిటిబ్యూరో సభ్యునిగా, జాతీయ కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. శిద్దా రాజకీయ జీవితంలో 2009లో ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ అభ్యర్తిగా పోటీచేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి చేతిలో ఓటమి చెందారు. శిద్దా కార్యదీక్షతను గుర్తించిన చంద్రబాబు నాయుడు ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అలా అంచెలంచెలుగా జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగిన రాఘవరావు 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దర్శి శాసనసభ స్థానం నుంచి ఎన్నికై రాష్ట్ర మంత్రిగా రహదారులు - భవనాల శాఖ, అటవీ శాఖ మంత్రిగా 5 సంవత్సరాలు పనిచేశారు.

తదనంతరం 2019 ఎన్నికలలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పో టీచేసి, వైసీపీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాస రెడ్డి చేతిలో ఓటమి చెందారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా అందరికి ఆత్మీయ పలకరింపుతో ఆకట్టుకునే విలక్షణమైన శైలి శిద్దాకే సొంతం. జిల్లాలో మారుతున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నుంచి అధికార వైసిపీ కొంత మందిని లాక్కుంటుంది. నయానో - భయానో ప్రధానమైన నాయకులను పార్టీలోకి చేర్చుకునేందుకు రాష్ట్రస్థాయి నుంచి వ్యూహాలు ప్రారంభం అయ్యాయి. వీటిలో భాగంగా ప్రతిపక్ష నాయకుల పై ఒత్తిడి పెంచి వైసీపీ కండువాలు కప్పుతున్నారనే వాతావరణం ఉంది.

ఇదిలా ఉండగా అధికార పార్టీ శిద్దాపై దృష్టిసారించి, గత కొన్ని నెలలుగా ఆయనపై తీవ్ర ఒత్తిడి తీస్తున్నట్లు సమాచారం. శిద్దా రాఘవరావు అతని సోదరులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. కుటుంబ సభ్యుల నుండి తీవ్ర ఒత్తిడులు వచ్చినట్లు తెలిసింది. దీంతో శిద్దా రాఘవరావు తనయుడు శిద్దా సుధీర్ బాబును వైసీపీలోకి పంపుతారని ప్రచారం జరుగగా, శిద్దా చేరికకే అధికార పార్టీ ఒత్తిడి పెంచింది. శిద్దా రాఘవరావు ఆదివారం కుటుంబ సభ్యులతో చర్చించిన తరువాత ఈ నెల 10న సీఎం జగన్ సమక్షంలో వైసీపీ కండువ కప్పుకోవడానికి మూహుర్తం నిర్ణయించినట్లు తెలిసింది. శిద్దా కుటుంబంలో రాజకీయంగా సంబంధాలు ఉన్న శిద్దా వెంకటేశ్వరరావు టీడీపీ హయాంలో జిల్లా మిల్క్ డైరీ చైర్మన్ గా వ్యవహరించి టీడీపీ ఓటమి అనంతరం బీజేపీ లో చేరారు. ఒత్తిడి నుంచి తప్పుకునేందుకు జిల్లా అధికార పార్టీ నాయకులతో చర్చించి వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు శిద్దా సిద్ధం అయ్యారు.

Advertisements

Latest Articles

Most Read