జగన్ మోహన్ రెడ్డికి చెందిన సొంత కంపెనీ, సరస్వతీ సిమెంట్స్ కు ప్రభుత్వం నుంచి నజరానాలు అందుతూనే ఉన్నాయి. ఎవరైనా ఒత్తిడి చేసారో లేక, రూల్స్ ప్రకారం చేస్తున్నారో లేక జగన్ మోహన్ రెడ్డి దగ్గర మంచి మార్కులు కొట్టేసే అత్యుత్సాహమో కాని, జగన్ గారి సొంత కంపెనీకి, అనుమతులు తన్నుకుంటూ వస్తున్నాయి. నెల క్రితం, సరస్వతి పవర్స్ కు కృష్ణా నది నీళ్ళు, శాశ్వత నీటి కేటాయింపులు ఇచ్చిన ప్రభుత్వం, నేడు మరో బంపర్ ఆఫర్ ఇచ్చింది. సరస్వతి సిమెంట్స్ మైనింగ్ లీజ్ ను, ఏకంగా 50 ఏళ్ళుకు పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మొత్తంగా గుంటూరు జిల్లాలో ఉన్న, 613.70 హెక్టార్లలో ఉన్న మైనింగ్ ను, 50 ఏళ్ళ పాటు సరస్వతీ సిమెంట్స్ కు కేటాయిస్తూ, జీవో నెంబర్ 30 విడుదల చేస్తూ, నిన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కంపెనీలో జగన్ కు 26.4 కోట్లు విలువ చేసే షేర్లు వాటా ఉండగా, ఆయన భార్యకు 13.8 కోట్ల విలువ చేసే షేర్లు వాటా ఉంది. ప్రభుత్వ పరిశ్రమలు, వాణిజ్య శాఖ సూచన మేరకు, జీవ విడుదల అయ్యింది. గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ను గుంటూరు జిల్లాలో పెట్టాలి అనుకుని, దాచేపల్లి, మాచవరం మండలాల్లో కొన్ని గ్రామాల్లో భూములు సేకరణ చేసారు.

ప్రభుత్వంలో తన తండ్రే ఉండటంతో, అనుమతులు వచ్చేసాయి. అయితే, కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తులు నుంచి కూడా తీసుకున్నారు. భూములు తీసుకునే సమయంలో, ఉద్యోగాలు ఇస్తాం అని ఆశ పెట్టారు. రాజశేఖర్ రెడ్డి చనిపోవటం, జగన్ కేసులతో, ఈ కంపెనీ సమయానికి స్థాపించక పోవటంతో, భూములు ఇచ్చిన వారు, తమ భూముల్లో సేద్యం చేసుకోవటానికి సిద్ధం కాగా, కొంత మంది వైసిపి నాయకులు వారి పై దాడి చెయ్యటం, పోలీసులు కేసులు నమోదు కావటం తెలిసిందే. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత, అక్కడ స్థానికులు జరిగిన విషయం చెప్పటంతో, రూల్స్ కు విరుద్ధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ని చంద్రబాబు క్యాన్సిల్ చేసారు. 2019లో జగన్ అధికారంలోకి రాగానే, దీనికి అనుమతి ఇవ్వటం, శాశ్వతంగా నీటి కేటాయింపులు జరగటం, ఇప్పుడు ఏకంగా 50 ఏళ్ళు లీజుకి ఇవ్వటం జరిగిపోయాయి. ఒక వేళ చంద్రబాబు ఇలాగే చేస్తే, ఈ పాటికి హైదరాబాద్ మీడియా, కొంత మంది మేధావులు, ఎంత గోల చేసేవారో ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు మాత్రం, ఎవరూ మాట్లాడటం లేదు.

 

ఎల్టీ పాలిమర్స్ విషవాయువు వెంటాడుతోంది. నిపుణులు హెచ్చరించిన విధంగానే స్టెరీన్ గ్యాన్ ప్రభావం మానవాళిని వెంటాడుతోంది. గ్యాస్ లీకేజీ ఘటనలో అప్పుడు అధిక మోతాదులో గ్యాస్ పీల్చిన వారు, ఇప్పటికీ మృతి చెందుతూనే ఉన్నారు. పోయిన వారం ఒక వ్యక్తి చనిపోయిన సంగతి తెలిసిందే. నిన్న మరొకరు చనిపోయారు. ఎక్కువ మోతాదులో విషవాయువు పీల్చిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. అయితే కొద్ది మోతాదులో విషవాయువు పీల్చిన వారిపై స్టెరీన్ గ్యాస్ ప్రభావం దీర్ఘకాలంలో ప్రభావం చూపుతుందని అప్పట్లోనే వాతావరణ నివుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అది అక్షరాలా రుజువు అవుతోంది. ఎల్టీపాలిమర్స్ కర్మాగారం అనుకుని ఉన్న ఆర్ఆర్ వెంకటాపురం వాసులపై సైరీన్ గ్యాస్ ప్రభావం అధికంగా ఉందని జరుగుతున్న పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఘటన జరిగిన తరువాత మృతులు సంఖ్య 12 కాగా వారానికొకరు వంతున అదే గ్రామానికి చెందిన వృద్ధులు ఆరోగ్యం క్షీణించి హఠాత్తుగా మృత్యువాత పడుతుండడం ఆ గ్రామస్తులను ఆందోళనకు గురిచేస్తోంది.

సోమవారం వెంకటాపురం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ ముసలయ్య(58) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. గత నెలలో జరిగిన గ్యాస్ లీకేజీ మటనలో ముసలయ్య విషవాయువు పీల్చి అపస్మారక స్థితిలో చికిత్స పొంది ఇటీవల డిశ్చార్జ్ అయ్యాడు. అయితే సోమవారం ఉన్నట్టుండి మునలయ్య ఆరోగ్యం క్షీణించడంతో హుటా హుటిన కుటుంబ సభ్యులు ఓప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ముసలయ్య సోమవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో గ్యాస్ లీకేజీ మృతుల సంఖ్య 15కు చేరుకుంది. ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు వాపోతున్నారు. దీర్ఘకాలికంగా, దీని ప్రభుత్వం ఉంటుందని అర్ధం అవుతుందని, ప్రభుత్వం, దీని పై తగు చర్యలు తీసుకోవాలని, అందరికీ లైఫ్ లాంగ్ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఉచిత వైద్యం ఇవ్వాలని కోరుతున్నారు.

ఇది ఇలా ఉంటే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైవపర్ కమిటీ మూడు రోజుల విచారణ పూర్తయింది. దీనిపై ఈ నెల 20వలోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని హైవపర్ కమిటీ చైర్మన్, భూమిశిస్తు చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. గ్యాస్ లీకేజీ ఘనటకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించేందుకు వీలుగా హైపవర్ కమిటీ సన్నాహాలు చేస్తోంది. మూడో రోజైన సోమవారం జీవీఎంసీలో హైపవర్ కమిటీ విచారణ చేపట్టింది. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన, తర్వాతి పరిణామాలు, తీసుకున్న చర్యలపై జీవీఎంసీ అధికారులతో హైపవర్ కమిటీ చర్చించింది. అలాగే జిల్లాలో ఉన్న పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాల వివరాలపై కమిటీ ఆరా తీసింది. ప్రమాద తీవ్రత పరిశ్రమలపై విశ్లేషాత్మక నివేదికలు తయారు చేయాలని హైపవర్ కమిటీ సూచించింది.

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని నెమ్మదిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసారు. అక్కడ పనులు అన్నీ ఆపేసి, వైసీపీ మంత్రులు అంటున్నట్టు నిజంగానే, దాన్ని స్మశానం చేసారు. ఇక తరువాత, నెమ్మదిగా అమరావతి అక్కడ ఉండదు అనే సంకేతాలు ఇచ్చి, అసెంబ్లీ సమావేశాల్లో, అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నట్టు ప్రకటించారు. అమరావతిని మూడు ముక్కలు చేస్తున్నాం అని, విశాఖలో ఒక ముక్క, కర్నూల్ లో ఒక ముక్క, అమరావతిలో మరో ముక్క ఉంచుతాం అని చెప్పారు. అయితే ఈ మూడు ముక్కల రాజధాని అనేది మంచి నిర్ణయం కాదని అందరూ చెప్తున్నారు. ఇది పక్కన పెడితే, అక్కడ 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులు ఉన్నారు. తమ జీవితాలు బాగు పడతాయి, తమతో పాటు రాష్ట్రానికి ఒక మంచి రాజధాని వస్తుంది, మనల్ని గెంటిన వారికి, హైదరాబాద్ కంటే ధీటైన రాజధాని నిర్మాణం చేసుకోవచ్చు అని అనుకున్నారు. కాని, జగన్ మోహన్ రెడ్డి దీన్ని మూడు ముక్కలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చెయ్యటంతో, అమరావతి ప్రజలు ఉద్యోమం మొదలు పెట్టారు, చివరకు రాజధాని మార్పు, సీఆర్డీఏ చట్టం అనేది కోర్టులోకి వెళ్ళింది.

అయితే ఈ విషయం పై, మాజీ ఎంపీ, ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. ఒక యుట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఉండవల్లి అరుణ్ కుమార్ అమరావతి పై మాట్లాడారు. చంద్రబాబు చెప్పుకున్నంత కాకపోయినా, అమరావతిలో నిర్మాణాలు జరిగాయని, కొన్ని జరుగుతున్నాయని, ఇప్పుడు ఉన్న అసెంబ్లీ, సెక్రటేరియట్ అక్కడే కదా ఉంది అన్నారు. వైసీపీ ఆరోపిస్తున్నట్టు అక్కడ స్మశానం ఏమి లేదని, అన్నారు. అలాగే అమరావతి మార్పు అనేది, ఎవరి తరం కాదని, అక్కడ నుంచి రాజధాని మార్చటం అనేది జరగదు అని అన్నారు. గతంలో ఒప్పుకుని, అందరూ ఏకగ్రీవంగా రాజధాని అమరావతి ఉండాలని, ఇప్పుడు మార్చటం కుదరదు అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసి, అలాగే అక్కడ డబ్బులు ఇచ్చిన చోటు, ఇప్పుడు మార్చి వేరే చోటు పెడతాను అంటే, అది జరిగే పనే కాదని అన్నారు. ఇక్కడే కావలి అంటే, చంద్రబాబు చెప్పినట్టు కాకుండా, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు కాని, ఇక్కడ నుంచి అమరావతిని రాజధానిగా మార్చటం జగన్ వల్ల కాదని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ఏడాది పలాన పై, తెలుగుదేశం పార్టీ చార్జ్ షీట్ విడుదల చేసింది. నారా లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి, చార్జ్ షీట్ విడుదల చేసారు. ఈ సందర్భంగా లోకేష్, జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు స్పందించారు. చంద్రబాబు వైజాగ్ ఎందుకు వెళ్ళలేదు అని అడగగా, లోకేష్ స్పందించారు. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా మొదట నిలబడింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. ఈ రోజు విశాఖపట్నం వెళ్లలేదు అంటున్నారు. రెండు నెలల క్రితం విశాఖ పర్యటన అప్పుడు, పర్మిషన్ ఇచ్చి ఎయిర్ పోర్ట్ దగ్గర చంద్రబాబు గారిని అడ్డుకున్నారు. పర్మిషన్ ఇచ్చింది వీళ్ళే, 10 గంటలు ఎయిర్ పోర్ట్ దగ్గర ఆపింది వీళ్ళే. మొన్న ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన రోజే పర్మిషన్ అడిగాం. అప్పుడు పర్మిషన్ రాలేదు. తరువాత విమానాలు మొదలైన తరువాత పర్మిషన్ అడిగాం, టికెట్లు బుక్ చేసుకున్నాం, పర్మిషన్ ఇచ్చారు. కాని రాత్రికి రాత్రి ఏకంగా ఫ్లైట్ క్యాన్సిల్ చేసారు. చంద్రబాబు గారు వైజాగ్ రాకుండా, వీళ్ళు పడుతున్న పాట్లు ఇవి. ఎందుకు చంద్రబాబు వైజాగ్ వస్తున్నారు అంటే అంట భయం అని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పుడు వైజాగ్ వచ్చినా అడ్డు పడుతున్న, మీరా మమ్మల్ని అడిగేది. హూద్ హూద్ అప్పుడు అక్కడ ఉంది ఎవరు ? తిత్లీ అప్పుడు నిలబడింది ఎవరు ? ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తరువాత, అక్కడ పోలీసులతో కలిసి రేస్క్యే ఆపరేషన్ చేసింది మా ఎమ్మెల్యే, వీళ్ళ దగ్గర నుంచి మేము నీతులు నేర్చుకోవాలా అని లోకేష్ అన్నారు.

తెలంగాణాలో పార్టీ మూసుకుంది మేము కాదని, మాకు అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారని, తెలంగాణాలో పార్టీ ఎత్తేస్తింది వైసీపీ అని లోకేష్ అన్నారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గురించి అడగగా, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, ప్రభుత్వం స్కూల్స్ లో తెచ్చిందే తెలుగుదేశం పార్టీ అని, అప్పట్లో ఇదే పార్టీ అడ్డు పడింది అని అన్నారు. మేము అప్పుడు తెలుగు మీడియం ఆప్షన్ పెట్టామని అన్నారు. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నామని అన్నారు. ఇంగ్లీష్ మీడియం పెట్టవద్దు అని చెప్పటం లేదు, తెలుగు మీడియం ఆప్షన్ కూడా ఉంచండి అని చెప్తుంటే, ఎందుకు దీనికి మీరు ఇబ్బంది పడుతున్నారు అని అడిగారు. ఇది మేము ప్రశ్నిస్తుంటే, మీ పిల్లలు ఏ స్కూల్స్ అని అడుగుతున్నారని, మేము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, అది తెచ్చిందే మేమని, మేము తెలుగు మీడియం ఆప్షన్ కూడా పెట్టమంటున్నామని అన్నారు. అలాగే మేము ట్వీట్ పెడితే భయపడుతున్నారని, ట్వీట్ పెట్టారు ట్వీట్ పెట్టారు అంటూ హేళన చేస్తున్నారని, విషయాలు బయటకు వస్తుంటే, ఎందుకు భయ పడుతున్నారని అన్నారు.

అలాగే మేము కరోనా పార్టీగా మారదలుచుకోలేదని, కాళ్ళ మీద పూలు చల్లించుకోవాలని అనుకుంటూ, కరోనా వ్యాప్తి చెయ్యదలుచుకోలేదని, అందుకే జూమ్ ద్వారా పార్టీ నేతలతో కనెక్ట్ అవుతున్నామని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, పార్టీ కార్యక్రమాలు చేస్తామని, వాళ్ళ లాగా రోడ్లు మీద తిరిగి కరోనా వ్యాప్తి చెయ్యం అని లోకేష్ అన్నారు. ఇసుక కొరత, విద్యుత్ ధరల పెంపు , కరోనా సహాయం కోసం, భూములు తరుపున పోరాటం, మద్యం మాఫియా, అమరావతి పైన, రైతుల కష్టాలు, ఇలా ప్రతి అంశం పై ,పోరాడుతుంది తెలుగుదేశం పార్టీ నాయి లోకేష్ అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యే పై స్పందిస్తూ, విప్ జారి చేసిన సందర్భంలో, వారి పై ఆక్షన్ తీసుకుంటామని అన్నారు. నా పైన 7 ఏళ్ళుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, ఇప్పుడు ప్రశ్నిస్తున్న ప్రజల పై చేస్తున్నారని లోకేష్ అన్నారు.

Advertisements

Latest Articles

Most Read