ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్లో మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఆంక్షలు కారణంగా వ్యాపారలావాదేవీలు లేకుండా పోయిన సంస్థలకు ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు వరకు వాటిని నిర్వహించుకునే అవకాశాన్ని కల్పించింది. నగలు, బట్టలు, చెప్పుల దుకాణాలకు, స్ట్రీట్ ఫుడ్స్ కు అనుమతినిచ్చింది. అయితే పెద్ద క్లాత్ షోరూమ్ కు వెళ్లాలంటే ఆన్లైన్లో అనుమతి తప్పనిసరి చేసింది. అంతేకాకుండా అన్ని షాపుల్లో ట్రయల్ రూమ్ లకు అనుమతి నిరాకరించింది. పానీపూరీ బండ్లకు అనుమతులు నిరాకరించింది. ఈ సడలింపుల వలన చిన్నపాటి వ్యాపారులకు సైతం ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పెద్ద దుకాణాల్లోకి షాపింగు ఆన్ లైనులో ముందస్తు బుకింగ్ చేసుకోవాలి. అన్ని దుకాణాలో ట్రయల్ రూమ్ లో ట్రయల్స్ విధానం ఉండకూడదు. నగల దుకాణంలో డిస్పోజబుల్ గ్లోవ్స్ వేసుకోవాలి. చెప్పుల దుకాణాల వద్ద ఖచ్చితం శానిటైజర్స్ ను వాడాలి. అక్కడ మాస్కులు తప్పని సరి.

తోపుడు బళ్ల పై ఆహార విక్రేతలు ఆహా రం అక్కడ తినకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింవుల ప్రకారం నేటి నుండి విజయవాడలో నిబంధనలను అనుసరించి వస్త్ర, చెప్పుల, బంగారం దుకాణాల వారు షాపులు తెర్చుకొని వ్యాపారం నిర్వహించుకోవచ్చని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ వెంకటలక్ష్మి (రెవెన్యూ) తెలియచేశారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు మంగళవారం, విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగరంలోని వస్త్ర వ్యాపారాలు, పాదరక్షల విక్రయదారులు, జ్యూయలరీ వ్యాపార సంఘాల వారితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వంచే జారీచేయబడిన మార్గదర్శకాలను వివరించారు. వాటిని తప్పకుండా పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వారి పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో మరి కొన్నింటికి లాక్ డౌన్ నిబంధనల నుండి సడలింపులు ఇస్తూ, పెద్ద షోరూం లకు వెళ్లాలంటే మందే ఆన్లైన్లో అను మతి తీసుకోవాలని, అన్నిషాపుల్లో ట్రయల్ రూమ్ కు అనుమతిని నిరాకరించారన్నారు.

ప్రతి షాపు వారు కేవలం 50 శాతం మంది సిబ్బందిని మాత్రమే వినియోగించాలని, షాపులో ధర్మల్ స్కానింగ్ అందుబాటులో ఉంచి భౌతిక దూరం పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేయాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, తరచూ డిస్ ఇన్పె క్షన్ చేయాలన్నారు. సిబ్బంది తప్పనిసరిగా గ్లోజు లు ధరించాలని, కొనుగోలుదారులకు కూడా గ్లోజు లు అందించాలని ప్రభుత్వం తాజా ఆదేశాలలో ఉత్తర్వులు జారీ చేసిందని వివరించారు. నగరంలో కొత్త డివిజన్ల వునర్విభజన ప్రకారం, జిల్లా అధికారులు నిర్ణయించిన నాన్ కంటోన్మెంట్ జోన్ లలో మాత్రమే షాపులు తెరుచుకోవచ్చని, కంటోన్మెంట్ జోన్, టఫర్ జోన్స్ లో వ్యాపారాలకు ఎటువంటి అనుమతులు లేవని ఆమె వెల్లడించారు. షాపులు ఏ జోన్లో ఉన్నాయో తెలుసుకొని నాన్ కంటోన్మెంట్ జోన్ పరిధిలో ఉన్నవారు మాత్రమే తమ షాపులను ప్రారంభించుకోవచ్చని ఆమె పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల విక్రయంపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బిల్డ్ ఏపి అని జగన్ చేస్తున్న కార్యక్రమం పై, హైకోర్ట్ అభ్యంతరం తెలిపింది. భూములు విక్రయించి పరిపాలన సాగించే స్థాయికి ప్రభుత్వం దివాళా తీసిందా అని ప్రశ్నించింది. లాక్ డౌన్ కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వ భూములను ఇ-వేలం విధానంలో విక్రయించడం సరికాదని పేర్కొంది. ఏపిలో భూముల అమ్మకాలపై గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలుచేశారు. పిటిషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా హైకో ర్టు కీలకవ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ భూములను రక్షించుకోవాలి గాని ఇలా హడావిడి చేస్తూ విక్రయాలుచేయడం ఎంత వరకు సమంజస మని ప్రశ్నించింది. విలువైన భూములు అమ్ము కోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వం నడపటం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం భావిస్తోందా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

వేల కిలోమీటర్ల సముద్ర తీరప్రాంతం ఉన్న ఎపీలో ప్రజలు ధనవంతులు మాదిరిగా ప్రభుత్వం పేదరికంగా ఉందని విచారణ సందర్భంగా ధర్మాసనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయ మూర్తి వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ అమలులో ఉంటే ఇంత అర్జెంట్ గా వేలానికి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి సంబంధించి ఇచ్చే ఉత్తర్వులకు లోబడి వేలం జరపాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ భూములను ఇ-వేలం విధానంలో విక్రయించడం తగదని గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త సురేష్ బాబు హైకో ర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

పిటీషనర్ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు వాదనలు వినిపించారు. ఒక వైపు ఇళ్లస్థలాల కొరకు భూములు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఉన్న భూములను అమ్ముకుంటున్నారు. ఇదేమి పరిస్థితి? అని హైకోర్టు ఆక్షేపించిందని న్యాయవాది శ్రీనివాస రావు తెలిపారు. హైకోర్టు తీర్పు పరిధిలోనే ఈ నెల 28నుండి జరగనున్న ఇ-వేలం ఉండాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వం తరవున కౌంటరు దాఖలుకు అదనపు అడ్వకేట్ జనరల్ గడు వు కోరడంతో కేసు తదుపరి విచారణను ఈనెల 28కు హైకోర్టు వాయిదా వేసింది.

గత కొన్ని రోజులుగా, హైకోర్ట్ జడ్జిల పై, ఇష్టం వచ్చినట్టు, వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులు, వైసీపీ ఎంపీ, నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. జడ్జిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులపై న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టుకు లేఖ ద్వారా ఫిర్యాదు చేయగా, న్యాయస్థానం స్పందించింది. సోషల్ మీడియాలోని పోస్టులను, నేతల వీడియో క్లిప్పింగ్​లను పరిశీలించింది. ఇవన్నీ పరిశీలించిన కోర్ట్, సుమోటోగా విచారణకు తీసుకున్నట్టు కోర్ట్ తెలిపింది. దీనికి సంబంధించి 49 మందికి నోటీసులు జారీ చేసింది. వీరిలో బాపట్ల ఎంపీ సురేశ్‌, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్, వైసీపీ నాయకుడు రవిచంద్ర రెడ్డి కూడా ఉన్నారు.

జడ్జిలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారని న్యాయవాది లక్ష్మీనారాయణ మీడియాతో అన్నారు. సోషల్ మీడియాలో న్యాయవ్యవస్థ పై పోస్టులు చాలా అసభ్యకరంగా ఉన్నాయని, కోర్టులను రాజకీయాలకు వేదిక చేసుకోవడం బాధ కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్‌ ఘటనలో కోర్టుపై లేనిపోని వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యల వెనుక అనేకమంది నేతలు, ఎంపీలూ ఉన్నారని లక్ష్మీనారాయణ అన్నారు. కోర్టును భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించారని చెప్పారు. కోర్టు తీర్పుల్లో ఎలాంటి పక్షపాతం ఉండదని స్పష్టం చేశారు. దోఘలైన వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని బార్ కౌన్సిల్ ఛైర్మన్‌ రామారావు అభిప్రాయపడ్డారు.

న్యాయస్థానాలకు దురుద్దేశాలు అంటగట్టడం సరికాదని మాజీ న్యాయమూర్తి జస్టిస్​ చంద్రకుమార్​ అన్నారు. కావాలంటే కోర్టు తీర్పులపై పైకోర్టుకు వెళ్లవచ్చని సూచించారు. ప్రతి తీర్పుపైనా అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుందన్న ఆయన.. న్యాయమూర్తులపై కామెంట్స్​ చేయడం సరికాదని హితవు పలికారు. అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని స్పష్టం చేశారు. ఇది ఒక రకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. కోర్టు తీర్పును విమర్శించే హక్కు పౌరులకు ఉందని అన్నారు.

సుప్రీం కోర్టులో ఎల్‌జీ పాలిమర్స్‌ పిటిషన్‌ను జస్టిస్‌ లలిత్‌ ధర్మాసనం విచారించింది. ఎల్‌జీ పాలిమర్స్‌ ను సీజ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల పై ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ సుప్రీంను ఆశ్రయించింది. ప్లాంట్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా అత్యవసరంగా లోపలికి వెళ్లేందుకు ఎల్‌జీ పాలిమర్స్‌ అనుమతి కోరింది. ఏడు కమిటీల్లో దేనికి హాజరు కావాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎల్‌జీ తెలిపింది. తదుపరి విచారణ కొనసాగించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాని హైకోర్టు, వీటి పై పూర్తిగా దర్యాప్తు చేస్తాయని సుప్రీం కోర్టు తెలిపింది. అత్యవసర పరిస్థితుల్లో ప్లాంట్‌ని సందర్శించేందుకు సుప్రీంకోర్టు ఎల్జీ పాలిమర్స్‌కు అవకాశం ఇచ్చింది. 30 మంది కంపెనీ నిపుణుల పేర్లను జిల్లా కలెక్టర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.

తొలి పిటిషన్‌తో కలిపి వాదనలు జూన్‌ 8 వ తేదీన వింటామని, అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. పోయిన శుక్రవారం, ఎల్జీ పాలిమర్స్ విషయంలో, హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. స్టేరైన్ ను ఎవరు తరలించమన్నారు ? ఎవరు ఆదేశాలు ఇచ్చారు అంటూ ప్రశ్నించింది. అలాగే లాక్ డౌన్ తరువాత ఎవరు పర్మిషన్ ఇచ్చారు, కంపెనీ డైరెక్టర్ లో లోపల ఎందుకు తిరుగుతున్నారు, కంపెనీని సీజ్ చెయ్యండి, విచారణ సంస్థలు మాత్రమే లోపలకు వెళ్ళాలి, వాళ్ళు కూడా, రిజిస్టర్ లో నమోదు చేసుకోవాలి అని హైకోర్ట్ ఆదేశించింది. అయితే దీని పై సుప్రీం కోర్ట్ కు వెళ్ళిన ఎల్జీ పాలిమర్స్ కు, రిలీఫ్ లభించలేదు, కేవలం ఎమర్జెన్సీ సర్వీసులకు మాత్రమే అనుమతి ఇచ్చింది.

Advertisements

Latest Articles

Most Read