మాజీ ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ విషయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మొదటి నుంచి కుట్ర పూరితంగా, కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా ఆయన ఎన్నికలు వాయిదా వేసారని, కక్ష కట్టి, వరుస పెట్టి, 60కి పైగా ప్రెస్ మీట్లు ఒక్క రోజులో పెట్టి, ఆయనకు కులానికి అంటగట్టి, తిట్టి పోశారు. తరువాత, ఆయన కరోనా సహాయం కోసం ప్రభుత్వం ఇచిన వెయ్యి రూపాయలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు, అందరికీ ఇస్తూ ఉండటాన్ని, విపక్షాలు ఈసీ దృష్టికి తేగా, దాని పై స్పందిస్తూ, కలెక్టర్లని ఆక్షన్ తీసుకోమని కోరారు. అంతే ఇక్కడ నుంచి కుట్ర మొదలైంది. ఆర్దినెన్స్ తేవటం, వెంటనే గవర్నర్ ఆమోదం పాడటం, ఆ వెంటనే రమేష్ కుమార్ ని తప్పిస్తూ రహస్య జీవో ఇవ్వటం, తరువాత కొత్త ఎన్నికల కమీషనర్ ను నియమించటం, ఇవన్నీ కొన్ని గంటల్లోనే జరిగిపోయాయి. చాలా వేగంగా, ఈ ప్రక్రియ అంతా కొనసాగింది. ప్రభుత్వం ఇంత వేగంగా, ఒక నిర్ణయం తీసుకుని, అమలు చెయ్యటం అంటే నిజంగానే వింత అనే చెప్పాలి.

ముఖ్యంగా ఈ నిర్ణయం వెనుక, అనేక వాదనలు ఉన్నాయి. ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ ఎత్తేస్తారని, వెంటనే ఎన్నికలు పెట్టేయాలని, అందుకే ప్రభుత్వం ఇలా చేసిందని అంటున్నారు. మరో పక్క ఎకగ్రీవాలు కూడా, రద్దు చేసే అవకాసం ఉందని, అందుకే హడావిడిగా కొత్త ఎన్నికల కమీషనర్ ని నియమించారు అనే వాదనలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ వ్యవహారం కోర్ట్ కు చేరింది. ఇలా ఆర్దినెన్స్ తెచ్చి మరీ, ఒక ఎన్నికల కమీషనర్ ను, ఆరోపణలు ఎదుర్కుంటున్న వారే తొలగించటం పై, అభ్యంతరాలు వస్తున్నాయి. అలాగే రాజ్యాంగానికి కూడా ఇది వ్యతిరేకం అని వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే, ఈ కేసు హైకోర్ట్ వద్దకు చేరుకుంది. దీని పై హైకోర్ట్ స్పందిస్తూ, మూడు రోజుల్లోగా ప్రభుత్వాన్ని కౌంటర్ వెయ్యమంది.

నిన్నటితో మూడు రోజులు గడువు ముగుస్తుంది. అయితే, ప్రభుత్వం అనూహ్యంగా, కౌంటర్ దాఖలు చెయ్యలేదు. తమ వద్ద సరిపడా సిబ్బంది లేరని, అందుకే కౌంటర్ దాఖలు చేయ్యలేకపోతున్నామని అని అన్నారు. తమకు మరో రెండు రోజులు వరకు గడువు కావలి అంటూ, అడ్వకేట్ జనరల్, కోర్ట్ ని కోరారు. శనివారం సాయంత్రం లోపు కౌంటర్ దాఖలు చేస్తామని, కొత్తగా మరి కొన్ని వ్యాజ్యాలు దాఖలైన నేపథ్యంలో, తమకు సమయం కావాలని అన్నారు. అయితే ఈ విషయంలో ప్రభుత్వ వాదన పై, విమర్శలు వస్తున్నాయి. ఒక పక్క రమేష్ కుమార్ ని తప్పించటానికి, కొన్ని గంటల్లో ఆర్దినన్సు, గవర్నర్ వద్ద ఆమోదం, జీవో ఇచ్చి మరీ, తప్పించిన ప్రభుత్వం, ఇక్కడ మాత్రం అఫిదివిట్ దాఖలు చెయ్యటానికి, మరి కొన్ని రోజులు కావాలి అని కోరటం గమనార్హం.

ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం, జగన్ మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, మనం కరోనాను కట్టడి చెయ్యటంలో, అద్భుతంగా పని చేస్తున్నాం అంటూ చెప్తున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి గురించి అయితే, ఆయన దేశంలోనే నెంబర్ వన్ క్రైసిస్ మ్యానేజ్మెంట్ చేస్తున్నారు అంటూ, మంత్రులు డబ్బా కొడుతుంటే, వాస్తవం మాత్రం వేరేలాగా ఉంది. జాతీయ మీడియా ఈ విషయంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైపు వేలెత్తి చూపిస్తుంది. జాతీయ మీడియా చూపించిన ఫోటోలు చూస్తూ, మన రాష్ట్రం ఎంత ప్రమాదకర స్థితిలో ఉందొ అర్ధం అవుతుంది. ప్రభుత్వం వాస్తవాలు దాస్తుంది అంటూ, తెలుగుదేశం చేస్తున్న విమర్శలు నిజం అవుతున్నాయి అనే చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రెండు జిల్లాలు మాత్రం రెడ్ జోన్ అంటూ కేంద్రానికి చెప్పగా, కేంద్రం మాత్రం, 11 జిల్లాలు రెడ్ జోన్ గా చూపించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, 85 శాతం రాష్ట్రం, రెడ్ జోన్ లో కి వెళ్ళిపోయింది. తరువాత 38 శాతంతో, మహారాష్ట్ర ఉంది అంటే, మన రాష్ట్రం ఎంత ప్రమాదక స్థితిలో ఉందొ అర్ధం అవుతంది.

ఒక పక్క వాస్తవాలు ఇలా ఉంటే, ప్రభుత్వ పెద్దలు మాత్రం, తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో 676 మండలాల్లో కేవలం 27 మండలాలు రెడ్ జోన్ లో, 44 ఆరెంజ్ జోన్లో మాత్రమే ఉన్నాయని చెప్పినప్పటికీ, కేంద్రం దీనిని నమ్మలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 13 జిల్లాల్లో 11 జిల్లాలను రెడ్ జోన్‌లుగా ప్రకటించింది. కాగా, తెలంగాణలో ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయని, తెలంగాణ సిఎం పూర్తి లాక్డౌన్ కోసం పట్టు బట్టారు. అయితే కేంద్రం 33 జిల్లాలలో 8 జిల్లాలను మాత్రమే రెడ్ జోన్లు గా ప్రకటించింది. కరోనావైరస్ పాజిటివ్ కేసులకు సంబంధించినంతవరకు కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా విశ్వసిస్తుందని బిజెపి హైకమాండ్ అంతర్గత వర్గాలు చెప్పినట్టు, ఒక జాతీయ మీడియా ఆర్టికల్ రాసింది.

అయితే ఏపి విషయంలో మాత్రం, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విషయాలు నమ్మలేదు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాలు అంటే కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, కృష్ణ, కదపా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, చిత్తూరు, విశాఖపట్నం, మరియు అనంతపురం రెడ్ జోన్లుగా ప్రకటించబడ్డాయి. ఆంధ్రాలో కరోనావైరస్ వ్యాప్తికి సంబంధించినంతవరకు కేంద్ర ప్రభుత్వం, స్వంత డేటా తెప్పించుకునట్టు తెలుస్తోంది. బిజెపి నాయకుడు లంక దినకర్ ఒక జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ ”ఆంధ్రప్రదేశ్‌లో చాలా కోవిడ్ -19 కేసులు ఉన్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం డేటాను దాచిపెట్టి, కొన్ని కేసులను మాత్రమే విడుదల చేస్తోంది. నంద్యాలా, ఒంగోల్ వంటి పట్టణాల్లో వందలాది కేసులు ఉన్నాయి, కాని ప్రభుత్వం పారదర్శకంగా లేదు ” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, హైకోర్ట్ లో షాకులు మీద షాకులు తగులుతున్నాయి. మొన్న, తెలుగు మీడియం పూర్తిగా ఎత్తేసి, తల్లిదండ్రులకి, పిల్లలకు ఛాయస్ ఇవ్వకుండా, బలవంతంగా ఇంగ్లీష్ మీడియం వైపు వెళ్ళాలి అంటూ, ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులని కోర్ట్ కొట్టిసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు కూడా, 52 సార్లు హైకోర్ట్ లో ఎదురు దెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఇలా ప్రతి విషయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా, అవగాహనా రాహిత్యం, దూకుడుగా వెళ్ళటంతోనే, ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతున్నాయిని చెప్పవచ్చు. తాజాగా ప్రభుత్వ భవనాలకు, వైసీపీ రంగుల విషయంలో, ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే ఈ విషయంలో, హైకోర్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసి, వెంటనే రంగులు మొత్తం తొలగించాలి అంటూ, చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఆ తీర్పు ఇచ్చిన సందర్భంగా, పది రోజుల్లోగా, రంగులు తొలగించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇప్పటికే ఆ ఆదేశాలు ఇచ్చి, రెండు నెలలు అవుతూ ఉండటంతో, ఇప్పుడు ప్రభుత్వం కోర్ట్ కు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. కోర్ట్ పది రోజులు టైం ఇచ్చినా రంగులు తొలగించలేదు. దీంతో, ఇప్పుడు హైకోర్ట్ కి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. తమకు రంగులు తొలగించటానికి మూడు నెలలు సమయం కావాలని, ప్రభుత్వం కోర్ట్ కు తెలిపింది. తమకు మూడు నెలలు సమయం ఇస్తే, రంగులు అన్నీ మార్చేస్తాం అని కోర్ట్ కు ప్రభుత్వం చెప్పింది. అయితే, ప్రభుత్వ స్పందన పై హైకోర్ట్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

రంగులు మార్చటానికి మూడు నెలలు కావాలా ? మీ తీరు చూస్తుంటే, స్థానిక ఎన్నికలు అయ్యే వరకు, ఈ రంగులు ఇలాగే ఉంచాలి అనే ఆలోచనలో ఉన్నట్టు ఉన్నారు. సరే, మీరు కోరినట్టే మూడు నెలలు గడువు ఇస్తాం, అప్పటి వరకు, స్థానిక సంస్థలు ఎన్నికలు జరపకుండా మీరు ఉంటారా ? అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్ట్. రంగులు తొలగించటానికి, అంట సమయం ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. లాక్ డౌన్ ముగిసిన తరువాత, వేసిన రంగులు అన్నీ తొలగించటానికి, ఎంత సమయం పడుతుందో, అధికారులు దగ్గర సమాచారం తెలుసుకుని చెప్తామని, దానికి కొంత సమయం కావాలని, ప్రభుత్వం కోర్ట్ ను అభ్యర్థించగా, దానికి అంగీకారం తెలిపిన హైకోర్ట్, కేసును వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, ఎప్పుడూ వైసీపీ టార్గెట్ లోనే ఉంటారు. ఎక్కువగా ప్రెస్ మీట్ లు పెట్టి, వైసీపీ నేతలను విమర్శించటం, వైసీపీ చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులు ఎండగట్టటంలో ముందు ఉంటారు. ఇక మరో పక్క, ట్విట్టర్ లో విజయసాయి రెడ్డి, ఇష్టం వచ్చినట్టు వేసే ట్వీట్లకు కూడా, బుద్దా వెంకన్న అదే రకమైన భాషలో ధీటుగా సమాధానం చెప్తూ, విజయసాయి రెడ్డికి, ఘాటుగా సమాధానం చెప్తూ ఉంటారు. ఈ క్రమంలోనే, బుద్దా వెంకన్న, వైసీపీకి ఎక్కువ టార్గెట్ అయ్యారు. ఇక ఆయన సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గా ఉంటూ ఉండటంతో, ఆయన పై, వైసీపీ శ్రేణులు మూకుమ్మడిగా దాడి చేస్తూ ఉంటాయి. ఇదే క్రమంలో, ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు కాని, నేతలు కాని, ఇప్పుడు డైరెక్ట్ గా బుద్దా వెంకన్నకు ఫోన్ చేసి బెదిరించే స్థాయికి వచ్చారు. చంపేస్తాం, కేసులు వేస్తాం అంటూ, వైసీపీ నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని, బుద్దా వెంకన్న నిన్న మీడియాకు లేఖ రాసి, జరిగిన విషయాన్ని తెలియచేసారు.

విజయసాయి రెడ్డి మాత్రం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతారు కాని, మేము మాట్లాడితే మీకు తప్పు వచ్చిందా అంటూ, బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఇది బుద్దా వెంకన్న మీడియాకు రాసిన లేఖ. "ఈ రోజు సాయంత్రం నుంచి నాకు పలు నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. జగన్ మోహన్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని విమర్శిస్తున్నానని, నీ అంతు చూస్తాం కేసులో ఇరికిస్తాం అని హెచ్చరించటం జరిగింది. మొన్న మాచర్లలో నా పై హత్యా ప్రయత్నం జరిగింది. మళ్ళీ ఇలా ఫోనులో బెదిరించటానిని చూస్తే, ప్రభుత్వం నా పై కక్ష సాధింపు చర్య చేస్తుందని అర్ధం అవుతుంది. "

"మీ ద్వారా ఈ ప్రభుత్వానికి చెబుతున్నా, ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలని తట్టుకోలేని వారు వ్యకిగతమైన బెదిరింపులు పాల్పడుతున్నారు. ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో, ప్రజలకు మేలు చేయ తలచినవారు, సరి చేసుకొనుటకు ప్రయత్నిస్తారు. నిగ్రహం కోల్పోయి ప్రజల్లో అభాసుపాలు కావద్దు. మీరు చంద్రబాబు గారిని ఏమైనా అనొచ్చు, కానీ మేము చేసే విమర్శలకు తట్టుకోలేరా ? మీరు చేసే బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు" అంటూ బుద్దా వెంకన్న, మీడియా వారికి లేఖ రాసి, తనకు వస్తున్న బెదిరింపుల గురించి వివరించారు.

Advertisements

Latest Articles

Most Read