శ్రీశైలం ప్రాజెక్ట్ లెఫ్ట్ పవర్ హౌస్ లో, భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ ప్లాంట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు, ప్రాధమికంగా అంచనాకు వచ్చారు. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. గత 15 రోజులుగా వర్షాలు కురవటం, ఎగువ రాష్ట్రాల నుంచి భారీగా వరదల కారణంగా , భారీగా శ్రీశైలం ప్రాజెక్ట్ కు నీరు వచ్చి చేరింది. ఈ నేపధ్యంలో, నిన్నటి నుంచి గేటులు కూడా తెరిచారు. అలాగే లెఫ్ట్ పవర్ హౌస్ లో, గత 20 రోజులుగా భారీగా విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉండటంతో, ఒంటిగంట ప్రాంతంలో, అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఆ పేలుడు షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని తెలుస్తుంది. దీంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. పేలుడుతో ఒక్కారిగా పెద్ద పెద్ద శబ్దాలు రావటంతో, అందరు భయాందోళనకు గురయ్యారు. చుట్టు పక్కల ఉన్న స్థానికులు కూడా భయాందోళనకు అయ్యారు. వెంటనే అక్కడకు అధికారులు చేరుకొని, మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేసారు. అయితే వెంటనే విద్యుత్తు ఆపేయటంతో, మంటలు ఆగినా, మొత్తం పొగ అలుముకుంది. అయితే ఈ ప్రమాదంలో, మొత్తం 9 మంది ఇరుక్కున్నారని తెలుస్తుంది. లోపల చిక్కుకున్న 9 మందిని కాపాడేందుకు, రేస్క్యు టీం ప్రయత్నం చేస్తున్నా, లోపలకు వెళ్ళటానికి వీలు పడటం లేదు..

sirsaliam 21082020 2

దీంతో ఇప్పటి వరకు ఆ 9 మంది ఆచూకీ ఇప్పటి వరకు లభ్యం కాలేదు. ఈ 9 మందిలో 7 గురు జెన్కో ఉద్యోగులు కాగా, ఇద్దరు అమర్ రాజా బ్యాటరీస్ సర్వీస్ చేసే ఉద్యోగులు. అయితే ఇప్పటి వరకు వారి ఆచూకీ లభ్యం కాలేదు. ఈ పవర్ ప్లాంట్ భూగర్బ అండర్ టన్నల్ లో ఈ ప్లాంట్ ఉంటుంది. ముందుగా ఫస్ట్ ఫ్లోర్ లో మంటలు వచ్చాయి. నాలుగు జెనరేటర్లకు సంబందించిన ప్యానెల్స్ అన్నీ పూర్తిగా మంటకు దగ్ధం అయ్యి, గ్రౌండ్ ఫ్లోర్ లోకి కూడా వ్యాపించాయి. భారీ మంటలు క్షణాల్లో వ్యాపించాయి. లోపల ఉన్న సిబ్బంది మంటలు అర్పటానికి ప్రయత్నం చేసినా వారికి వీలు కాలేదు. కొంత మంది బయటకు వచ్చినా, 9 మంది ఇరుక్కుపోయారు. బయటకు వచ్చిన వారు వెంటనే విద్యుత్ ఆపేసారు. దీంతో ఈ ప్లాంట్ భూగర్భంలో ఉండటంతో, మొత్తం చీకట్లు అలుముకున్నాయి. పొగ చీకట్లు ఉండటం వల్ల, లోపల ఉన్న వారు ఎటు వైపు రావాలో అర్ధం కాక చిక్కుకుపోయారు. బయటకు వచ్చిన వాళ్ళు, లోపల ఉన్న వారికి ఫోన్ చేసి, ఎలా బయటకు రావాలో చెప్పినా, చీకటి ఉండటంతో, వారు బయటకు రాలేక పోయారు. ఒక గంట తరువాత, ఫోన్ కనెక్ట్ కాక పోవటంతో, అందోళన నెలకొంది. ప్రస్తుతం, రేస్క్యు ఆపరేషన్ కొనసాగుతుంది.

22వ తారిఖు జరిగే వినాయక చవతి ఉత్సవాల పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రగడ నెలకొంది. వినాయక చవతి ఉత్సవాల పై ఏపి ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఎక్కడ పందిరిలో పెట్టుకోకూడదు అని, ఇంట్లోనే పండుగ చేసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలు అయి చాలా రాజులు అయ్యింది, సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ కూడా తెరుస్తాం అంటున్నారు, బౌతిక దూరం పాటిస్తూ, పర్మిషన్ ఇవ్వచ్చు కదా అనే కామెంట్లు వస్తున్నాయి. లిక్కర్ షాపులకు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానికి, బౌతిక దూరం పాటిస్తూ, అన్ని జాగ్రత్తలు తీసుకుని, వినాయక చవతికి పర్మిషన్ ఇవ్వాలని కొంత మంది కోరుతున్నారు. అయితే హిందువులు తరుపున మాట్లాడే బీజేపీ, తెలంగాణాలో ఒకలా, ఏపిలో రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతుంది. ఏపి ప్రభుత్వం చెప్పినట్టు, ఏపి బీజేపీ సోము వీర్రాజు చెప్పారు. అయితే తెలంగాణా బీజేపీ మాత్రం, అనుమతి ఇవ్వాలని కోరింది. దీంతో సోము వీర్రాజు, ఏపి ప్రభుత్వానికి అనుకూలంగా చేసిన వ్యాఖ్యల పై రఘురామరాజు స్పందించారు. ఆయన మార్కు వెటకారంతో, సోము వీర్రాజుకు కౌంటర్ ఇచ్చారు.

ఆయన మాట్లడుతూ "అందరికీ వినాయకుడు అంటే అందరికీ ఇష్టమే. మన పక్క రాష్ట్రం తెలంగాణాలో బండి సంజయ్ గారు, హిందూ సంప్రదాయలు ప్రతిబంబించే లాగా, గణేష్ ఉత్సవాలు మనం నిర్వహించుకోవాలి, బౌతిక దూరం పాటిస్తూ, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే, ఆచారాన్ని కూడా కాపాడుకుందాం అని చెప్పారు. నేను ఉదయం బండి సంజయ్ తో మాట్లాడాను. మీ ఆంధ్రాలో కూడా మా బీజేపీ వాళ్ళు ఇలాగే అడుగుతున్నారా అని అడగటం జరిగింది. అయితే దానికి నేను సమాధానం చెప్తూ, ఆంధ్రా బీజేపీ వేరు, తెలంగాణా బీజేపీ వేరు అనే భావన వార్తలు చూస్తే తెలుస్తుంది. మీ ఏపి బీజేపీ అధ్యక్షుడు, ఏపి ప్రభుత్వం చెప్పినట్టే, ఒక్క పూట మాత్రమే చెయ్యాలి అంటూ ఏదో నియమావళి ఇచ్చారు. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటో అర్ధం కావటం లేదు. ఒక జాతీయ పార్టీకి, రెండు విధానాలు ఏమిటో అర్ధం కావటం లేదు. కానీ ఈ రకంగా, హిందూ పార్టీ అని చెప్పుకునే పార్టీ, ఇలా హిందూ పండుగల పై ఇలా చెప్పటం బాధ కలిగిస్తుంది. ఇది మా దురదృష్టం" అంటూ కౌంటర్ ఇచ్చారు.

అమరావతి విషయంలో జోక్యం చేసుకోండి, ఫోన్ ట్యా-పింగ్ లో జోక్యం చేసుకోండి అనే అభ్యర్ధనలు కాదు ఇది. మన దేశ ప్రతిష్టకు సంబందించిన విషయం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపీఏల వివాదం గురించి అందరికీ తెలిసిందే. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో, సోలార్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చాలా కంపనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని, సోలార్ ఎనర్జీ ఉత్పత్తి ప్రారంభించారు. దీంతో మన రాష్ట్రానికి తక్కువ రేటుకు విద్యుత్ ఉత్పత్తి చేసుకునే వీలు వచ్చింది. అయితే ప్రభుత్వం మారటంతో, జగన్ మోహన్ రెడ్డి పీపీఏ సమీక్ష చేస్తాను అంటూ, ఆ కంపెనీలకు పేమెంట్లు ఆపేసి, కొన్నిటికి ప్రొడక్షన్ కూడా ఆపేసారు. అయితే, ఇందులో కొన్ని విదేశీ కంపెనీలు కూడా ఉన్నాయి. దీంతో జపాన్ లాంటి దేశాలు, ఏపి పై కేంద్రానికి ఫిర్యాదు కూడా చేసాయి. దీంతో అప్పట్లోనే కేంద్రం ఈ విషయం పై జోక్యం చేసుకుంది. మీ తీరు వల్ల దేశ ప్రతిష్ట పోతుంది అని, పీపీఏల పై సమీక్షల విషయంలో వెనక్కు తగ్గాలని, కేంద్రం రాష్ట్రానికి వార్నింగ్ కూడా ఇచ్చింది. అయితే ఇదే సందర్భంలో, దాదాపుగా 40 కంపెనీలు పైగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై కోర్టుకు వెళ్ళాయి. దీంతో హైకోర్టులో ఈ విషయం పై విచారణ ప్రారంభం అయ్యింది. కొన్ని వాయిదాలు కూడా నడిచాయి. డిసెంబర్ లో ఇచ్చిన తీర్పులో, ఈ విషయం సెట్ అయ్యే వరకు, సోలార్ విద్యుత్ కు యూనిట్ రూ.2.44, విండ్ కు యూనిట్ రూ.2.43 చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది.

అయితే ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 40 శాతం బకాయలు మాత్రమే తీర్చింది ఇదే విషయం పై మళ్ళీ కోర్టుకు వెళ్ళటానికి ప్రయత్నం చేసినా, లేట్ అవుతూ వస్తుంది. సరిగ్గా ఇదే సమయంలో కరోనా వచ్చి పడటంతో, మొత్తం స్థంబించి పోయిన విషయం తెలిసిందే. కోర్టులు కూడా రోజు వారీ కార్యక్రమాలు వాయిదా వేసుకున్నాయి. కేవలం ముఖ్యమైన కేసులు మాత్రమే, వాదనలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో విద్యుత్ పీపీఏల కేసు మరుగున పడిపోయింది. ఈ పరిస్థితిలో, నేషనల్ సోలార్ ఎనర్జీ ఫెడరేషన్ అఫ్ ఇండియాతో పాటు వివిధ కంపెనీలు, కేంద్రం వైపు చూస్తున్నాయి. కోర్టులో విషయం లేట్ అవుతూ ఉండటంతో, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని అభ్యర్దించాయి. ప్రధాని పిలుపు మేరకు, ఆత్మనిర్భార్ భారత్ లో, ఇప్పుడున్న ఈ పరిస్థితిలో, పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, పీపీఏ ల విషయంలో ఆంధ్రప్రదేశ్ తో నెలకొన్న వివాదంలో జోక్యం చేసుకోవాలని కేంద్రాన్ని కోరాయి. మరో పక్క క్రిసిల్ రేటింగ్స్ ప్రకారం, ఏపి నిర్ణయంతో, ఈ సెక్టార్ లో, రూ21 వేల కోట్లు రిస్క్ లో పడ్డాయని తెలిపింది. ఈ సమస్యకు త్వరగా పరిష్కారం లభించాలని తెలిపింది.

తూర్పుగోదావరి జిల్లాలో లాంచీ ప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా తూరులో, శబరి వంతెన వద్ద, ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. శబరి వంతెనకు లాంచీ వచ్చి గట్టిగా తగలటంతో, లాంచీ రెండు ముక్కలు అయినట్టు చెప్తున్నారు.  ప్రమాద సమయంలో లాంచీలో నలుగుర సిబ్బని ఉన్నారు అని చెప్తున్నారు సిబ్బంది. ప్రమాదంలో నలుగురు నదిలో కొట్టుకుపోగా, ముగ్గురు సిబ్బందిని కాపాడారని తెలుస్తుంది. ఒకరు గల్లంతు అయ్యారని చెప్తున్నారు. అయితే సరైన సమాచారం అక్కడ నుంచి రావటం లేదు. విషయం తెలుసుకున్న పోలీస్ రెవెన్యు సిబ్బంది, ప్రమాదం జరిగిన ప్రదేశం వద్దకు బయలుదేరినట్టు సమాచారం. చీకటి కావటంతో, రెస్క్యు ఆపరేషన్ కష్టంగా మారిందని తెలుస్తుంది. గల్లంతు అయిన వ్యక్తి కోసం గాలింపు జరుగుతున్నట్టు సమాచారం. గోదావరి వరదల్లో చిక్కుకున్న బాధితులకు, సరకులు ఇచ్చి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. ఘటనకు గల కారణాలు ఏమిటి అనే  వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisements

Latest Articles

Most Read