చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు.. అంతా అయిపోయాక ఇప్పుడు తల్చుకుని బాధపడుతున్నారు.. దౌత్యం చేయమని అడుగుతున్నారు.. చేయి దాటిపోయాక బాధపడి ప్రయోజనం ఏముంటుంది? కొంతమంది కేంద్రమంత్రులకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంతో సంబంధాలు తెంచుకోవడం ఎంతమాత్రం ఇష్టంలేదు. చంద్రబాబుతో మాట్లాడాలనీ, మధ్యవర్తిత్వం వహించాలనీ కొంతమంది కేంద్ర మంత్రులు తెలుగుదేశం ఎంపీలను అడుగుతున్నారు. రాయబారం దశ దాటిపోయిందని చెబుతుండటంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల కేంద్ర జలవనరుల శాఖమంత్రి నితిన్ గట్కరీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో ఆయన విజయవాడకు వచ్చి కృష్ణానదిలో ఏర్పాటుచేసిన భారీ ఫంట్‌ను ప్రారంభించి, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌ను సందర్శించి పనుల పురోగతిని సమీక్షిస్తారంటూ సమాచారం అందింది.

gadkari 12042018

ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం పక్షాన కేంద్రమంత్రిని ఎవరు ఫాలో అవుతారని జలవనరుల శాఖ అధికారులు ఆరాతీశారు. రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి దేవినేని ఉమా వస్తారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఇంకెవరు వస్తారంటూ మళ్లీ ప్రశ్నించారు. ఇంకెవరూ రారు అని సిఎంవో తేల్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వస్తారని గట్కరీ ఆశించారని చెబుతున్నారు. అయితే సీఎంకి ముందుగా పర్యటనలు ఖరారు కావడంతో ఆయన హాజరుకాబోరని సిఎంవో వర్గాలు తేల్చిచెప్పాయి. కనీసం పోలవరం సమీక్షకు అయినా సీఎం హాజరైతే బాగుంటుందని భావించారు. కానీ ముఖ్యమంత్రి ఆ కార్యక్రమానికి కూడా హజరయ్యే అవకాశం లేదని కేంద్ర జలవనరుల శాఖకు సమాచారం అందింది. దీంతో చివరి నిముషంలో నితిన్ గట్కరీ పర్యటన వాయిదా పడిందంటూ సమాచారం అందించారు.

gadkari 12042018

రాష్ట్రంలో హోదా కోసం ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో గట్కరీ పర్యటనకు వెళితే బాగోదని కొంతమంది తెలుగుదేశం నేతలు వ్యాఖ్యానించారు. విషయం తెలుసుకున్న గట్కరీ తన పర్యటనను స్టాండింగ్ కమిటీ సమావేశాలు ఉన్నాయన్న సాకుతో వాయిదా వేసుకున్నారని అంటున్నారు. సహజంగా ఆదివారం ఢిల్లీలో స్టాండింగ్ కమిటీ సమావేశాలు జరిగే అవకాశమే లేదు. ఇలా కేంద్రమంత్రులు నలుగురైదుగురు తెలుగుదేశంతో సంబంధాలు తెంచుకోవడం పట్ల తెగ బాధపడిపోతున్నారు. కొంతమంది చంద్రబాబుతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కూడా కేంద్రమంత్రులతో పాలనాపరమైన వ్యవహారాలు మినహా మిగతా రాయబారాలను అంగీకరించడం లేదు.

మోడీ ప్రచార పిచ్చ, కొత్త పోకడలకు తెర లేపింది... రాష్ట్రాలని నిర్వీర్యం చేసే అతి భయంకర నిర్ణయం తీసుకున్నారు మోడీ... ఇప్పటికే సామాఖ్య స్పూర్తికి విరుద్ధంగా, కేంద్రం ప్రవర్తిస్తుంది అని, అనేక రాష్ట్రాలు గోల చేస్తుంటే, మరో నిర్ణయంతో ముందుకొచ్చారు... రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా, నేరుగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం మొదలుపెట్టింది... ‘గ్రామీణ స్వరాజ్‌ అభియాన్‌ యోజన’! కేంద్ర ప్రభుత్వ పథకాలను ఊరూరా ‘చాటింపు’ వెయ్యటం కోసం, ‘మీ పథకాలు మీవే... మా పథకాలు మావే!’ అంటూ దేశ చరిత్రలోనే ఎప్పుడూ లేని వింత నిర్ణయం తీసుకుంది కేంద్రం...

modi sattes 12042018

‘‘మేం నిధులు ఇచ్చే పథకాలకు మా పేరు ఉండాలి. మా పేరుతోనే ప్రచారం జరగాలి. వాటిని మా అధికారులే పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు లెక్కాపక్కా మాకే చెప్పండి’’ అని కేంద్రం కలెక్టర్ లని ఆదేశించింది. అంబేడ్కర్‌ జయంతి (ఏప్రిల్‌ 14) నుంచి వచ్చేనెల 5 వరకు గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ పేరిట ప్రచారం చేయాలని కలెక్టర్లను కేంద్రం ఆదేశించింది. ఈ కార్యక్రమం ప్రణాళిక, అమలు, పర్యవేక్షణ అంతా అంతా ఢిల్లీ నుంచి వచ్చే కేంద్ర సర్వీసు అధికారులే పర్యవేక్షిస్తారు. గ్రామ స్వరాజ్‌ అభియాన్‌ను దేశవ్యాప్తంగా 21,058 గ్రామాల్లో నిర్వహించబోతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇందులో ఏపీలో 305 గ్రామాల్లో ఈ సభలను నిర్వహిస్తారు. అందులోనూ... ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన చిత్తూరులో అత్యధికంగా 70 గ్రామాలను ఎంపిక చేయడం గమనార్హం.

modi sattes 12042018

కేంద్ర-రాష్ట్ర సంబంధాలు చెడిపోయి రాజ్యాంగ సంక్షోభాలు తలెత్తిన కాలంలో కూడా కేంద్రం రాష్ట్రాల్లో సొంతంగా గ్రామసభలు పెట్టి ప్రచారం చేసుకోలేదు. మోదీ సర్కారు మొట్టమొదటిసారి ఆ పని చేస్తోంది. జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులే సారథులు. సూచనలు, ఆదేశాలు ఏవైనా వారి నుంచే వస్తాయి, రావాలి! కానీ... కేంద్రం మొట్టమొదటిసారిగా సీఎ్‌సతో సంబంధం లేకుండా సొంతంగా జిల్లా కలెక్టర్లను లైన్‌లోకి తీసుకుంది. ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్లు విస్తుపోతున్నారు. స్వంతంత్ర భారత చరిత్రలోనే ఇలా ఎప్పుడూ లేదని వ్యాఖ్యానిస్తున్నారు... అయితే, రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం, ఈ నిర్ణయం పై భగ్గు మంటున్నాయి... ఇప్పటికే కలెక్టర్లు, అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అములులో, పని ఒత్తిడి ఉందని, అవసరం అయినవి కాకుండా, ఇలా ప్రచారం కోసం, మా అధికారలుని తీసుకోవటం ఏంటని, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి...

అగ్రిగోల్డ్ వ్యవహరం మళ్లీ మొదటికి రావడానికి వైసీపీనే కారణమని ఏపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… అగ్రిగోల్డ్ వ్యవహరంలో వైసీపీపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన ఆరోపణలు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను టేకప్ చేయడానికి ముందుకొచ్చిన జీ-ఎస్సెల్ గ్రూప్.. వైసీపీ వల్లే వెనక్కు వెళ్లిందన్నారు. కేంద్రం మా చేతిలో ఉంది అంటూ సీబీఐ కేసుల పేరుతో జీఎస్సెల్ గ్రూప్‌ను భయభ్రాంతులకు గురిచేశారన్నారు. ఈ విషయాన్ని జీ-ఎస్సెల్ కంపెనీ ప్రతినిధులే స్వయంగా వెల్లడించారని తెలిపారు. ‘బాధితులకు న్యాయం జరగాలని ఏపీలో ఆందోళనలు చేస్తారు.. అగ్రిగోల్డ్‌పై సీబీఐ విచారణ జరపాలని ప్రధాని మోడీని అడుగుతారు..’ అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు.

ycp modi 12042018

18 లక్షల మంది అగ్రిగోల్డ్ లబ్దిదారుల ఉసురు వైసీపీకి తగులుతుందని ఆయన శాపనార్థాలు పెట్టారు. కేసుల పేరుతో జీ గ్రూపును వైసీపీయే బెదరగొట్టిందన్నారు. వైసీపీ రాక్షస క్రీడవల్లనే అగ్రిగోల్డ్ వ్యవహారం నిలిచిపోయిందన్నారు. త్వరలోనే దీనిపై కీలక నిర్ణయం తీసుకుంటామని, వైసీపీ బెదిరింపులకు సంబంధించిన అన్ని విషయాలనూ త్వరలో బయటపెడతామని కుటుంబరావు చెప్పారు. ఈ విషయం కోర్ట్ లో ఉన్నందున, అవసరం అయితే, ఈ ఆధారాలు కోర్ట్ కి కూడా ఇస్తామని అన్నారు... అగ్రిగోల్డ్‌ కేసు వచ్చే సోమవారం హైకోర్టులో విచారణకు రానుండగా ఈలోపే కొందరు రా ష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆరోపించారు..

ycp modi 12042018

తప్పుదోవ పట్టించేలా కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోర్టు పర్యవేక్షణలో జరుగుతున్న దర్యాప్తును తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ఎస్సెల్‌ గ్రూప్‌పై కోర్టు ఆంక్షలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరించిందని ఎస్సెల్‌ గ్రూప్‌ తెలిపిందని, సీఐడీ ఎప్పటికప్పుడు వివరాలను కోర్టుకు సమర్పించిందన్నారు. వచ్చిన బిడ్డర్లను వైసీపీ నాయకులు భయపెట్టి వెనక్కి పంపారని కుటుంబరావు ఆరోపించారు. ఈనెల 16న జ‌రిగే కేబినెట్ బేటీలో చ‌ర్చించిన త‌ర్వాత అగ్రిగోల్డ్ వ్య‌వ‌హారంలో స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉందని చెప్పారు.

పచ్చటి ప్రకృతి ఒడిలో... సర్వాంగ సుందరంగా.... నవ్యాంధ్ర రాజధాని మంగళగిరిలో... నిర్మించిన ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ప్రారంభించి 10 నెలలు కాక ముందే, దాని పక్కనే, ఇప్పుడు పోలీసు టెక్ టవర్ రెడీ అయ్యిపోయింది... రాష్ట్ర పోలీసు శాఖకు ప్రధాన కేంద్రంగా మారిన ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌ మరో అద్భుతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుంది. బెటాలియన్‌ ఆవరణలో పూర్తి ఈశాన్యంగా టెక్‌ టవర్‌ పేరుతో బ్రహ్మాండమైన ఏడంతస్తుల భవనం నిర్మాణ పనులను పూర్తి చేసుకుంది. సుమారు రూ.18 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. దీనికి సమీపంలోనే రూ.40కోట్ల వ్యయంతో పోలీసు హెడ్‌ క్వార్టర్స్‌ కార్యాలయ భవనం రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే.

police 12042018 1

ఏపీ పోలీస్ టెక్ టవర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో మేజర్‌గా టెక్ సర్వీస్ వింగ్.., ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, అక్టోపస్, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, పోలీస్ ట్రాన్స్‌పోర్టు ఆర్గనైజేషన్ తదితర వాటికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ఇందులోని ఏడంతస్తులలో తొలి నాలుగు అంతస్తులను కంప్యూటర్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌కు, ఆపై మూడంతస్తులను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ సదుపాయాల కోసం వినియోగించనున్నారు. ఒక్కో అంతస్తును 8500 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించారు.

police 12042018 1

రాష్ట్రంలోని అన్ని పోలీసు యూనిట్లను ఈ సాంకేతిక సౌధంతో అనుసంధానించనున్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా ఇక్కడి నుంచి పర్యవేక్షించేందుకు అనువైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ అండ్‌ స్టాండర్డైజేషన్‌, పోలీసు కమ్యూనికేషన్స్‌ ఆర్గనైజేషన్స్‌లను (పీసీవో) ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి ఇక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఇప్పటికే పోలీసులు కొంత వరకు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారని, సర్వలెన్స్ కెమెరాలు, లాక్డ్ హౌస్ మేనేజ్‌మెంట్ సిస్టం.. ఇవన్నీ ఉపయోగించుకోవడంవల్ల దొంగతనాలు, క్రైమ్‌ను నియంత్రణ చేసే అవకాశం ఉంది...

Advertisements

Latest Articles

Most Read