ఏప్రిల్ 20న, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, 68వ ఏట అడుగుపెట్టబోతున్నారు... అయితే, ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో, పుట్టిన రోజు వేడుకులకు దూరంగా ఉండాలని నిర్ణయించారు... అదే సమయంలో, ఢిల్లీ మోసాన్ని, దేశం మొత్తానికి తెలియచేసి, అందరూ మనకు మద్దతు పలికే విధంగా, ఆ రోజు చంద్రబాబు నిరాహార దీక్ష చెయ్యనున్నారు... మోడీ అరాచకాలకు నిరసనగా, ఈ నెల 20న, నిరాహారదీక్ష చేసే సంచలన నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు... సహజంగా, ముఖ్యమంత్రి, ప్రధాని పై నిరసన తెలుపుతూ, దీక్ష చెయ్యటం చాలా అరుదు... ఢిల్లీ ముఖ్యమంత్రి ఇలా నిరసన దీక్ష చేసారు...

cbn 14042018 1

ఆంధ్రప్రదేశ్‌ హక్కుల సాధనలో రాజీపడబోమని స్పష్టంచేశారు. విభజన హామీల సాధన కోసం ఈ నెల 20న ఒక్క రోజు నిరాహార దీక్ష చేస్తానని వెల్లడించారు. ‘నమ్మక ద్రోహం, కుట్రల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’ అనే నినాదంతో ఈ నెల 30న తిరుపతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అంబేడ్కర్‌ జయంతి వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లాలోని తుల్లూరు మండలం శాఖమూరులో రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించబోయే అంబేడ్కర్‌ స్మృతివనం ఆకృతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆయన మాట్లాడారు.

cbn 14042018 1

‘‘రాష్ట్రానికి కేంద్రం తీరని ద్రోహం చేసింది. ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. ఈనెల 20న నా పుట్టినరోజు..సాయంత్రం వరకు దీక్ష చేస్తా. ఈనెల 30న తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తాం. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలి. కేంద్రం లాలూచీ, ముసుగు రాజకీయాలు చేస్తోంది. నన్ను విమర్శించే అర్హత బీజేపీ, వైసీపీకి లేదు. కొత్తగా వచ్చిన ఓ పార్టీ కూడా మాపై విమర్శలు చేస్తోంది. రాష్ట్రాన్ని ఇబ్బందిపెట్టాలనే బంద్‌కు పిలుపునిచ్చారు. అభివృద్ధికి విఘాతం కలగకుండా శాంతియుతంగా నిరసనలు చేద్దాం. కేంద్రంపై రాజీలేని పోరాటానికి ప్రజలు సహకరించాలి. రాజకీయాల్లో మోదీ నాకంటే జూనియర్. 1995లోనే నేను సీఎం అయ్యా..2002లో మోదీ సీఎం అయ్యారు. 25 మంది ఎంపీలున్న రాష్ట్రాన్ని బీజేపీ కాదనుకుంటోంది. 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ఢిల్లీని శాసించేది మనమే’’ అని చంద్రబాబు ఉద్ఘాటించారు.

జగన్ మోహన్ రెడ్డికి బంపర్ ఆఫర్ లు వస్తున్నాయి... కాని, ఆయనే స్పందించటం లేదు... ఎందుకో తెలియదు కాని, ఈ విషయాల పై మాత్రం, ఎంత ఒత్తిడి ఉన్నా, ఒక్కరు కూడా నోరు విప్పటం లేదు... జవాబివ్వలేక వైకాపా నేతలు సతమతమవుతున్నారు.... ఒక్క వీడియో క్లిప్పింగ్ అయినా చూపించమని ఆయన... కాళ్ళు పట్టుకుంటా అని ఈయన... కాని పాపం, వారి మీద కనికరం చూపించటం లేదు జగన్... ఇంతకీ విషయం ఏంటి అంటే, కర్నూలు తెలుగుదేశంపార్టీ ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేత జగన్మోహన్‌రెడ్డికి చేసిన సవాల్‌ మాత్రం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో బాణంలా దూసుకెళ్లింది...

jagan 14042018 1

జగన్మోహన్‌రెడ్డి నాలుగేళ్ల కాలంలో ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోదీని ఒక్కసారైనా విమర్శించినట్లు ఒక్క వీడియో క్లిప్పింగ్‌ చూపించినా చాలు వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని మోహన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. తమ అధినేతకే మోహన్‌రెడ్డి సవాల్‌ విసరడంపైన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు సీరియస్‌గా తీసుకుని తీవ్రంగా చర్చించారట! మోహన్‌రెడ్డి సవాల్‌కు వైకాపా నేతలు సమాధానం వెతికేందుకు కృషి చేస్తున్న క్రమంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో ఇటీవల జరిగిన టీడీపీ ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే మోహన్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా జగన్‌కు చేసిన సవాల్‌ను మరోసారి రిపీట్‌ చేశారు. తాను చేసిన సవాల్‌కు రోజులు గడుస్తున్నా వైకాపా నుంచి సమాధానం రావడం లేదంటే ప్రధాని మోదీని జగన్‌ పల్లెత్తుమాటైనా అనలేదని అర్థమవుతోందని మోహన్‌రెడ్డి అన్నారు.

jagan 14042018 1

ఇది ఇలా ఉండగానే, బీకాం ఫిజిక్స్ అంటూ ఎగతాళి చేసిన ఎమ్మల్యే జలీల్ ఖాన్ కూడా స్పందించారు... ప్రధానమంత్రి నరేంద్రమోడీని జగన్ విమర్శించగలిగితే నేను జగన్ కాళ్ళు పట్టుకుంటానని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ... పాదయాత్రలో జగన్ నోటి వెంట మోదీ దొంగ, బీజేపీ మోసం చేసింది అని ఒక్క మాట అంటే నా పదవికి రాజీనామా చేస్తానని జలీల్‌ఖాన్ అన్నారు... అయితే అటు మోహన్ రెడ్డి సవాల్ కు కాని, ఇటు జలీల్ ఖాన్ సవాల్ కు కాని, ఎవరూ సమాధానం చెప్పటం లేదు.. మోడీ అంటే భయపడి పోతున్నారు... బీజేపీతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతల లోపాయికారి ఒప్పందం ఏమిటన్నది ఈ సంఘటన రుజువు చేస్తున్నదని టీడీపీ నాయకులు అంటున్నారు.. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ వైసిపీ పార్టీకి విజయవాడ ప్రజలు ఒకరకంగా కూడా కనిపించటం లేదు... రోజుకి ఒక డ్రామా ఆడుతూ, ప్రజలని పిచ్చోళ్లని చేస్తూ, నిజం అనుకునే లోప అబద్దం అంటారు, అబద్దం అనుకుంటే నిజం అంటారు... అసలు ఎవరు ఎవరి పక్షమో అర్ధం కాక, ఇటు ప్రజలు, అటు కార్యకర్తలు జుట్టు పీక్కుంటున్నారు... మొన్నటి మొన్న పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు అంటూ డ్రామా ఆడిన గౌతంరెడ్డి, నెల రోజుల క్రితం వైఎస్ జగన్ ను పాదయత్రలో కలవటం సంచలనం అయ్యింది... వంగవీటి రంగాను చంపడం తప్పు కాదు అంటూ, వైఎస్ జగన్ దగ్గరి బంధువు, గౌతంరెడ్డి చేసిన వ్యాఖ్యలతో, కాపుల ఆగ్రహానికి గురై, గౌతంరెడ్డిని పార్టీ నుండి సస్పెన్షన్ చేస్తున్నాం అంటూ, అప్పట్లో వైసీపీ డ్రామా ఆడింది...

jagan 14042018

గౌతంరెడ్డి జగన్ ను కలిసిన్ వెంటనే, విజయసాయి వచ్చి, ఒక ప్రకటన విడుదల చేసారు... గౌతమ్‌రెడ్డికి వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ పార్టీ సభ్యుడు కూడా కాదని, ఆయన్ను సస్పెండ్ చేసాం అని చెప్పారు.. ఇది ఇలా ఉండగానే, ఈ రోజు జగన్ పాదయాత్ర విజయవాడలో అడుగుపెట్టింది... మరి ఏమైందో ఏమో తెలియదు కాని, వంగవీటి రాధాతో పని లేదు అనుకున్నాడో ఏమో కాని, గౌతం రెడ్డి సస్పెన్షన్ ఎత్తి వేస్తూ, లోటస్ పాండ్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి... సరిగ్గా, జగన్ విజయవాడలో అడుగుపెట్టిన క్షణమే, గౌతం రెడ్డి సస్పెన్షన్ ఎత్తి వేసారు అని తెలియటంతో, రాధా వర్గం ఒకింత షాక్ కు గురైంది... తన తండ్రిని ఘోరంగా అవమానించిన, వాడిని నెత్తిన పెట్టుకోవటంతో, ఇప్పుడు రాధా ఎలా స్పందిస్తారో అని ఆయన వర్గం వేచి చూస్తుంది...

jagan 14042018

రాధా ఇక మన మాట వినడు అని, జగన్ కు అర్ధమై పోయిందో ఏమో కాని, రంగాను అన్ని బూతులు తిట్టిన గౌతం రెడ్డిని, బహిరంగంగా కలిసి, తనతో పాటు నడిపించుకుని, రాధా ఉంటే ఎంత పొతే ఎంత అనే సంకేతం జగన్ ఇచ్చారు అని పరిశీలకులు అంటున్నారు.. రాధా సామాజికవర్గం కంటే, నా సొంత సామాజికవర్గమే నాకు ముద్దు అనే సంకేతం ఇచ్చి, రెడ్డి సామాజికవర్గాన్ని మంచి చేసుకోవటానికి, జగన్ ఇలా చేసారేమో అని అంటున్నారు... మరి ఈ పరిణామాలు చూస్తున్న రాధా, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి... ఇప్పటికే జగన్ పై అసహనంతో, ఊగిసలాటలో ఉన్న రాధా, ఈ పరిణామాలు చూసి, త్వరగా రియాక్ట్ అవుతారని అంటున్నారు...

ప్రకాశం జిల్లాలో పాదయత్ర చేస్తూ, రాజధానికి అనువైన ప్రాంతం దొనకొండ అని, నేను సియం అయిన వెంటనే, అమరావతిని మార్చేస్తంటూ జగన్ చేసిన ప్రకటన, అమరావతిలో వ్యతిరేకత తెప్పించిన సంగతి తెలిసిందే.. అయితే, అప్పట్లో మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, వారిని సముదాయించారు... పాదయాత్ర మంగళగరికి వచ్చినప్పుడు, జగన్ స్పష్టమైన ప్రకటన చేస్తారని వారికి హామీ ఇచ్చారు... అయితే, గురువారం వరకు జగన్ మంగళగిరిలోనే ఉన్నా, అమరావతి పై ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు... ఇదే విషయం నిన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేని రైతులు అడగ్గా, ఈ రోజు శుక్రవారం కోర్ట్ కి వెళ్ళారని, రేపు విజయవాడలో అడుగు పెట్టే లోపు, జగన్ అమరావతి పై ప్రకటన చేస్తారని చెప్పారు...

amaravati 14042018

అయితే, జగన్ మాత్రం, అమరావతి అనే పేరు పలకటానికి కూడా ఇష్ట పడలేదు... తెల్లారి లేగిస్తే, అమరావతిలో అల్లకల్లోలం జరుగుతుంది అంటూ హడావిడి చేసి జగన్ బ్యాచ్, మరి పాదయాత్ర రాజధాని గ్రామాల నుంచి ఎందుకు చెయ్యలేదు ? నిజంగా అంత ఘోరాలు అమరావతిలో జరుగుతుంటే, జగన్ ప్రతిపక్ష నాయకుడుగా అటు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కదా అంటూ, నిలదీశారు.. జగన్ మాత్రం, ఇవేమీ పట్టించుకోలేదు... అమరావతి పై తనుకున్న ద్వేషాన్ని చూపిస్తూ, అమరావతి అనే మాట కూడా ఎత్తకుండా, విజయవాడ వెళ్ళిపోయారు... దీంతో రాజధాని రైతులు మండిపడుతున్నారు...

amaravati 14042018

రాజధానిపై జగన్‌ స్పష్టమైన ప్రక టన చేస్తాడని చెప్పిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే యాత్రలో ఆ విషయమే ప్రస్తావించలేదని.. దానికి ఆర్కే రాజీనామా చేస్తారా..? అని రైతు నాయకులు నేలపాడు సర్పంచ్‌ ధనేకుల సుబ్బారావు ప్రశ్నించారు. రైల్వేస్టేషన్‌, ఎయిర్‌ పోర్టు ఉండి, పుష్కలమైన నీరు, రాష్ట్రానికి మధ్యలో ఉన్నప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తుంటే ఓర్వలేని జగన్‌ ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదన్నారు. జగన్‌లా దోచుకొని ఇక్కడ రైతులు కోటీశ్వరులు అవలేదన్నారు. రాజధాని రావటంతో కష్టపడి సంపాదించిన భూములకు విలువ పెరిగి కోటీశ్వరులు అయ్యారని అన్నారు. 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా రైతులు ఇచ్చి సంతోషంగా ఉంటే రాజకీయాల కోసం అభాండాలు వేయటం సరికాదని, జగన్ కు చిత్తశుద్ధి ఉంటే అమరావతిలో పాదయాత్ర చేసేవారని రాజధాని రైతులు అన్నారు...

Advertisements

Latest Articles

Most Read