జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన వీర భక్తిని చాటుకున్నారు... ఇప్పటి వరకు మోడీని కాని, చంద్రబాబుని కాని, ఒక్క మాట కూడా అనని జగన్, చంద్రబాబుని మాత్రం నిత్యం విమర్శిస్తూ ఉంటారు.. నిన్న ఢిల్లీకి కిరాయి మందని తోలుకుపోయి, అక్కడ కూడా ధర్నా చేస్తున్నాం అంటూ, చంద్రబాబుని తిట్టారు... అసలు ప్రత్యేక హోదా కాని, విభజన హామీలు నెరవేర్చాల్సిన మోడీని ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అనకుండా, కేవలం రాజకీయం చేస్తూ చంద్రబాబునే తిడుతున్నారు... మోడీతో జగన్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు అనే విమర్శలు వస్తున్నా, జగన మాత్రం, ఎక్కడా మోడీని ఒక్క మాట కూడా అనటం లేదు...

modi jagan 06032018 2

తాజాగా జగన్ వేసిన ఒక ట్వీట్ మోడీని ఎంతగా ఆరదిస్తున్నారో తెలుస్తుంది... ఒక పక్క చంద్రబాబు స్థాయి నాయకుడు,మిత్రపక్షంగా ఉంటూనే, ఇక మోడీ ఏమి ఇవ్వడు అని డిసైడ్ అయిపోయి మలి విడత ఆందోళన చేస్తుంటే, జగన్ మాత్రం, మోడీజీ పై నాకు బాగా నమ్మకం ఉంది అంటూ, సౌమ్యంగా, స్వాతి ముత్యం లాగా ఒక ట్వీట్ వేసాడు... నిన్న ఢిల్లీలో ఇక్కడ నుంచి కొంత మందిని తీసుకువెళ్ళి, ధర్నా చేసింది వైసిపీ... అక్కడ తెలుగులో ప్రసంగాలు, తెలుగు ప్లే కార్డులు పట్టుకుని ఆందోళన చేసారు... చంద్రబాబు పై బూతులు తిట్టారు...

modi jagan 06032018 3

ఇలాంటి ధర్నాకి కత్తి మహేష్ లాంటి అపర మేధావులు వచ్చి మద్దతు పలికారు... దీని పై జగన్ స్పందిస్తూ, ‘‘ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ ను ఢిల్లీకి తీసుకెళ్లే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమైన నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు అందరికీ ధన్యవాదాలు. అలాగే, ఈ ధర్నాలో పాల్గొన్న మిగతా వారికి కూడా కృతజ్ఞతలు. నరేంద్ర మోదీజీ మన ఆందోళనలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుని ప్రత్యేక హోదా మంజూరు చేస్తారని నేను నమ్ముతున్నాంటూ’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు... జగన్ నమ్మకం ఏంటో, జగన్ కాన్ఫిడెన్సు ఏంటో కాని, ప్రజలు మాత్రం, ఈ ట్వీట్ చూసి, జగన్, మోడీకి మరింత దగ్గరయ్యారని అనుకుంటున్నారు...

జగన్ ఎంత అభద్రతా భావంలో ఉన్నాడో చెప్పటానికి ఇదొక ఉదాహరణ... జగన్ అంటే, తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు అని చెప్పే ఉదంతం... తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, తన మీద భరోసా లేదని తెలిసిన జగన్, చివరకు ఈ పని చేస్తున్నారు... సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కంట్రోల్ చెయ్యలేని జగన్, ఇక రాష్ట్రాన్ని ఏమి చెయ్యగలడు... జగన్ మీద విశ్వాసం లేక ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు వచ్చేశారు... ఇంకా దాదాపు 25 మంది వచ్చేయటానికి రెడీగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి... అయితే, రాజ్యసభ ఎన్నికలు వస్తున్న తరుణంలో, జగన్ కు ప్రస్తుతం ఉన్న 44 మంది ఎమ్మెల్యేలకు, ఒక రాజ్యసభ సీటు వస్తుంది... అయితే, జగన్ పై విశ్వాసం లేక, ఇప్పటికే కొంత మంది టిడిపిలో చేరి పోవటానికి రెడీగా ఉన్నారు..

jagan mla 06032018 2

ఈ నేపధ్యంలో, జగన్ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ ఎమ్మల్యేలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు... ముగ్గురు ఎమ్మెల్యేల టిడిపిలోకి వెళ్తే, టిడిపి రాజ్యసభ సీటు గెలుస్తుంది... అందుకే ముగ్గురు వెళ్ళినా, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మల్యేలతో, క్రాస్ వోటింగ్ కి జగన్ ప్లాన్ చేసారు... మరో బీజేపీ ఎమ్మల్యే జగన్ కు వోట్ వెయ్యటానికి ఒప్పుకోలేదని సమాచారం... అయితే, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం, దాదాపు 12 మంది వైసిపీ ఎమ్మల్యేలు, టిడిపిలో చేరతారనే వార్తలు వస్తున్నాయి... దీంతో, ఎలాగైనా ఒక్క రాజ్యసభ సీటు గెలిచి, మోడీ ముందు తాను బలవంతుండని అని జగన్ నిరుపించుకోవటం కోసం, క్యాంప్ రాజకీయాలకు తెర లేపారు...

jagan mla 06032018 3

ఇందులో భాగంగా పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలు చేజారకుండా వైసీపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలను ఢిల్లీ నుంచి విదేశాలకు పంపాలని వైసీపీ నిర్ణయించింది. ఎవరికి టచ్‌లోకి రానివ్వకుండా వైసీపీ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. టీడీపీ మూడో అభ్యర్థిని పెడితే ఏం చేయాలనే దానిపై వైసీపీ వ్యూహం రచిస్తోంది... ఎంత విదేశాలకు పంపినా, వారి మనసులో జగన్ మీద భరోసా ఉండాలిగా ? చూద్దాం ఏమవుతుందో ...

సోము వీర్రాజు ఎంతటి ఘనుడో అందరికీ తెలిసిందే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావటం కోసం, విశ్వప్రయత్నాలు చేస్తూ ప్రతి రోజు పేట్రేగిపోవటం చూస్తున్నాం... రాష్ట్రానికి న్యాయం చెయ్యమని ఎవరన్నా అడిగితే, పూనకం వచ్చినట్టు ఊగిపోతూ ఉంటారు... అయితే, ఈ రోజు ఆ పూనకం, విష్ణుకుమార్ రాజుకి ఎక్కించారో ఏమో కాని, ఈ రోజు విష్ణుకుమార్ రాజు నానా హంగామా చేసారు... మా మోడీని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు, పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యద్దు అంటూ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు... రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అయ్యా అంటే, ఈ రాష్ట్ర బీజేపీ నాయకులు ఎదురు వార్నింగ్లు ఇస్తున్నారు...

vishnu 06032018 2

ఈ ఉదయం వెలగపూడిలో మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్ర వైఖరి పై టీడీపీ చేస్తున్న ఆందోళనలు పై నిప్పులు చెరిగుతూ ఊగిపోయారు... తాము నోరు తెరిస్తే చాలా విషయాలు చెప్పాల్సి వస్తుందని, పరిస్థితి అంతదూరం రానీయకుండా తన నేతలను చంద్రబాబు కట్టడి చేయాలని, చంద్రబాబుకే వార్నింగ్ ఇస్తున్నారు... విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పటికే ఎంతో సాయం అందిందని, ఏపీకి ఇచ్చిన నిధులపై బహిరంగ చర్చకు తాము సిద్ధమని అన్నారు... తామూ లెక్కలు తీయగలమని, చాలా అంశాలపై తమ వద్ద సమాచారం ఉందని ఆయన అన్నారు. టీడీపీ నేతలు మోదీని నిత్యమూ తూలనాడుతుంటే, చంద్రబాబు చూస్తూ ఊరకున్నారని అన్నారు.

vishnu 06032018 3

కాగా, నిన్న విశాఖలో ఎమ్మెల్యే వాసుపల్లి రైలు ఆకృతిలో ప్లెక్సీలు తయారు చేయించి, వాటి మధ్య నిలబడి, 'మోదీ మెడలు వంచుతాం' అంటూ వినూత్న నిరసన నిర్వహించిన సంగతి తెలిసిందే. ధానిని కించపరిచే వాళ్లపై సుమోటోగా కేసు నమోదు చేయాలని, చంద్రబాబు వెంటనే వాసుపల్లి గణేష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు... అయినా కేంద్రాన్ని మన హామీలు నెరవేర్చండి అని నిరసనలు చేస్తే, రాజు గారికి ఇంత కోపం ఎందుకో... వారి ఫ్రెండ్ జగన్ గారి పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి, మోడీని బట్టలు ఊడదీసి కొడతాం అంటే, ఒక్కరు మాట్లాడలేదు... కెసిఆర్ మోడీ గాడు అంటే దిక్కు లేదు... మా హక్కులు నెరవేర్చండి అంటే, రాజు గారికి పూనకం వస్తుంది...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన చట్టం ప్రకారం రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాల పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీతో టిడిపి, బిజెపి నేతలు సోమవారం రాత్రి పూట ఢిల్లీలో సమావేశమయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు రెండు రోజుల క్రితం బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఫోన్ చేశారు. మార్చి 5న, ఏపీకి నిదుల కేటాయింపు అంశంపై చర్చిద్దామని ప్రతిపాదించారు. కానీ, ఈ సమావేశానికి మాత్రం అమిత్‌షా గైరాజరయ్యారు... అయితే ఈ సమావేశంలో, యనమల లేవనెత్తిన రెండు అంశాలకు, ఆర్ధిక మంత్రి జైట్లీ చేతులెత్తేశారు... చేద్దాం చూద్దాం, ఆయన్ని అడగండి, ఈయన్ను అడగండి అంటూ, తప్పించుకున్నారు...

yanamala 0602018 2

జీఎస్‌టీ కౌన్సిల్‌ తొలి సమావేశంలో ఇక మీదట ఏ రాష్ట్రాలకూ పన్నురాయితీలు కల్పించడం ఉండదని మీరు చెప్పినందునే మేం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించాం. 22వ జీఎస్‌టీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీజీఎస్‌టీ, ఐజీఎస్‌టీని వాపసు ఇస్తున్నారు. అందువల్ల ఆ ప్రయోజనాన్ని ఆంధ్రప్రదేశ్‌కు కచ్చితంగా కల్పించాల్సిందేనని...’’ యనమల రామకృష్ణుడు కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీకి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జైట్లీ కొన్ని ఇబ్బందులను ఏకరువుపెట్టారు. అందుకు యనమల బృందం స్పందిస్తూ తామేం కొత్తగా ఏమీ అడగడంలేదని, ఈశాన్య రాష్ట్రాలకు ఏవైతే పన్ను రాయితీలిస్తారో అవి ఇస్తే చాలని స్పష్టం చేశారు. ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించడానికి వాణిజ్యశాఖ తయారు చేసిన సర్క్యులర్‌ ఇప్పటికే కేబినెట్‌ సెక్రెటేరియట్‌కు వెళ్లిందని, అందులో ఆంధ్రప్రదేశ్‌ పేరును కూడా చేర్చాలని యనమల కోరారు. అందుకు జైట్లీ స్పందిస్తూ తాను సురేష్‌ ప్రభుతో మాట్లాడి దీనిపై ఒక స్పష్టత ఇస్తానని చెప్పారు.

yanamala 0602018 3

అలాగే, ప్రత్యేకహోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద 90% వాటా ఇచ్చినట్లుగానే మాకూ ఇస్తామని చెప్పినందున, ఇవ్వాల్సిన 30% తేడా మొత్తాన్ని దేశీయ ఆర్థిక సంస్థల నుంచి ఇప్పించాలని యనమల కోరారు. నాబార్డు ద్వారానో, హడ్కో ద్వారానో ఆ మొత్తాన్ని ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆర్థిక శాఖ వ్యయ విభాగం కార్యదర్శితో కలిసి కూర్చొని మాట్లాడుకొని మీకు ఏ విధానమైతే బాగుంటుందో ఖరారు చేయండి, దాని ప్రకారం ఇస్తామని అరుణ్‌జైట్లీ హామీ ఇచ్చారు. ఇలా తీసుకొనే రుణం ఎవరి ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన వాహనం (ఎస్‌పీవీ) ఏర్పాటు చేసుకోవాలని తాను ఇదివరకే చెప్పానని, దానిపై మీ స్పందన కోసం ఎదురు చూస్తున్నానని చెప్పారు. అది కేంద్రమే చేయాలని ఏపీ బృందం చెప్పింది.

Advertisements

Latest Articles

Most Read