ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నాలుగేళ్ళ పరిపాలన, నవ నిర్మాణ దీక్ష జరిగిన తీరు పై, శనివారం సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్థిక కష్టాలు, కుమ్మక్కు రాజకీయాలతో సృష్టించిన అడ్డంకులన్నింటినీ అధిగమించి ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించామని తెలిపారు. ఉద్యోగులు, ప్రజలు దీనికి పెద్దఎత్తున సహకరించారంటూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ నాలుగేళ్లలో చేసిన సంక్షేమం.. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేనంత సంతృప్తిని ఇచ్చిందన్నారు. ఒక వ్యక్తి జీవితచక్రంలో కడుపులో ఉన్నప్పటి నుంచి.. చిన్నతనం, విద్యార్థి దశ, ఉద్యోగం, పెళ్లి, వృద్ధ్దాప్యం, మరణం వరకు అన్ని దశల్లోను ప్రభుత్వ సాయం అందేలా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.

cbn 10062018 2

ఇదే సందర్భంలో, విలేకరులు, జగన్ ప్రస్థావన తీసుకురాగా, చంద్రబాబు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జర్నలిస్టులూ.. ఒకపని చేయండి. దేశంలోని 4 రాష్ట్రాలను ఎంపిక చేసుకోండి. ఒక్కో రాష్ట్రంలో ఒక గ్రామాన్ని ఎంచుకోండి. మీతోపాటు జగన్‌ను కూడా తీసుకెళ్లండి. మేమే పంపిస్తాం. చూసిరండి. రాష్ట్రంలో కంటే ఎక్కడైనా ఎక్కువ సంక్షేమం, ఎక్కువ బాగున్న గ్రామం ఉందేమో చెప్పండి. ఇంత సంక్షేమం, అభివృద్ధి జరుగుతుంటే వాటిని వదిలేసి.. ఎక్కడో ఇసుక అక్రమాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎక్కడైనా ఒకరిద్దరు ఇబ్బంది పడే వారు ఉంటారు. వారికి కూడా లబ్ధి చేకూర్చడానికే టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం.’ అని అన్నారు. అయితే విలేకరులు మాత్రం, నవ్వుతూ ఈ ప్రతిపాదనని తిరస్కరించారు. ఆయన మా మాట ఎక్కడ వింటారు అంటూ, అన్నారు.

cbn 10062018 3

‘నేను పాదయాత్ర చేసిన సమయంలో ఏ గ్రామంలోకి వెళ్లినా ఎండాకాలం దుమ్ము.. వర్షాకాలం బురద ఉండేవి. ఇప్పుడన్నీ సిమెంటు రోడ్లు వేశాం. నాడు రోడ్డుకు ఇరువైపులా బహిరంగ మలవిసర్జన, భరించలేని దుర్వాసన ఉండేవి. ఇప్పుడు అన్ని గ్రామాల్లోనూ వందశాతం మందికీ మరుగుదొడ్లు నిర్మించాం. గ్రామాల్లో ఎల్‌ఈడీ వీధిలైట్లను ఈ నెలాఖరుకు పూర్తిచేస్తాం. నవనిర్మాణ దీక్షలో ఇళ్ల ప్రారంభోత్సవాలకు వెళ్లాను. అవన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చినదానికి రూ.50 వేలు, లక్ష రూపాయలు కలుపుకొని బాగా కట్టుకున్నారు. 19 లక్షల ఇళ్లు పూర్తిచేయబోతున్నాం. పాదయాత్రలో మహిళలు బిందెలు పట్టుకుని కిలోమీటర్లు నడవడం చూశాను. ఇప్పుడు రాష్ట్రంలో తాగునీటి కొరత లేకుండా చేశాం. 400 గ్రామాల్లో మాత్రం నీటికొరత ఉంది. అక్కడా ట్యాంకర్లతో సరఫరా చేశాం' అని అన్నారు.

దేశంలోనే తొలిసారిగా వంటింట్లోకి నేరుగా గ్యాస్‌ సరఫరా చేసే ప్రాజెక్టుకు ‘మేఘా ఇంజనీరింగ్‌’ శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా, కర్ణాటకలోని తుంకూరు, బెల్గాం జిల్లాల్లో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. వినియోగదారులకు నేరుగా వంటింటికే గ్యాస్‌ను అందించేలా ‘ఎకో ఫ్రెండ్లీ’ విధానాలను అమలు చేయనున్నది. నిజానికి, ‘మేఘా’ ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తోంది. త్వరలో అధికారికంగా ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, కానూరులో ఫిల్లింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి.

gas 09062018 2

కర్ణాటకలో తూంకూరు, బెల్గాం జిల్లాలోనూ గృహ, వాణిజ్య గ్యాస్‌ సరఫరాకు ‘మేఘా’ సన్నద్ధమైంది. ఈ రెండు రాష్ట్రాల్లో గ్యాస్‌ సరఫరా కోసం ఓఎన్‌జీసీ , గెయిల్‌లతో ‘మేఘా’ ఒప్పందం చేసుకుంది. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఇటీవలే వాణిజ్యపరమైన గ్యాస్‌ సర్వీసులను ఓఎన్‌జీసీ ప్రారంభించింది. ఈ కేంద్రం నుంచి 90 వేల స్టాండర్ట్‌ క్యూబిక్‌ మీటర్‌ పెర్‌ డే (ఎన్‌సీఎండీ) పొందేలా ఓఎన్‌జీసీతో మేఘా అవగాహన కుదుర్చుకుంది. ఆ సంస్థ నుంచి అందుకొనే గ్యాస్‌ను ఆగిరిపల్లిలో ఏర్పాటు చేసిన ప్రధాన కేంద్రం నుంచి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకోసం 571 కిలోమీటర్ల మేర పైప్‌లైన్‌ వేశారు. ఇప్పటికే కొన్ని ఇళ్లకు గ్యాస్‌ కనెక్షన్లను ‘మేఘా’ ఇచ్చింది. వినియోగదారుల నుంచి ఫీడ్‌ బ్యాక్‌ కోసం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించింది.

gas 09062018 3

మేఘా ఇంజినీరింగ్‌ మెయిల్‌- హైడ్రోకార్బన్స్‌ అసోసియేట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పి.రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారని వెల్లడించారు. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఈ ప్రాజెక్టు పనితీరును పరీక్షించామని, త్వరలోనే అధికారికంగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, కానూరుల్లో ఫిల్లింగ్‌ కేంద్రాలను ఏర్పాటుచేశామని, దీనికి అవసరమైన భూగర్భ సరఫరా వ్యవస్థ సిద్ధమైందని పేర్కొన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో గృహ, వాణిజ్య అవసరాలకు నేరుగా గ్యాస్‌ సరఫరా చేయడం ద్వారా జీవన ప్రమాణాలను, సమాజంలో ఇన్‌ఫ్రా ఫలాలను నేరుగా అందించేందుకు పర్యావరణ హిత పద్ధతులను అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓఎన్‌జీసీ ప్రారంభించిన గ్యాస్‌ కేంద్రం నుంచి 90వేల ఎస్‌సీఎండీ (స్టాండర్డ్‌ క్యూబిక్‌ మీటర్‌ పర్‌డే) గ్యాస్‌ను ఒక రోజులో పొందేలా త్వరలో ఓఎన్‌జీసీతో ఒప్పందం కుదుర్చుకోనున్నామని వివరించారు.

ఒకాయిన అమరావతిని భ్రమరావతి అంటాడు... ఇంకో ఆయన, అమరావతిని ఏనుగుని మేపుతున్నట్టు మేపుతున్నారు అంటాడు... వీరిద్దరూ మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం యాత్రలు చేస్తున్న జగన్ మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్. మన రాష్ట్ర రాజధాని అమరావతిని, 33 వేల ఎకరాలు త్యాగం చేసిన రైతులని ఇలా ఎగతాళి చేస్తున్నారు. శ్రీకాకుళం వెళ్లి, అమరావతికి దోచి పెడుతున్నారని అక్కడ ప్రజలని రెచ్చగొడతారు. రాయలసీమ వెళ్లి, మన దగ్గర రాజధాని లేకుండా అమరావతి కడుతున్నారు అంటారు. ఇలా వీరిద్దరూ ఎంత రెచ్చగొట్టినా, అక్కడ ప్రజలు మాత్రం, అమరావతి మనది అనే భావనలో ఉన్నారు. మొన్న శ్రీకాకుళం నుంచి వచ్చి వృధ్యాప్య పెన్షన్ లో కొంత భాగం, అమరావతికి ఇచ్చిన ముసలి అవ్వను చూసాం. ఇప్పుడు రాయలసీమ నుంచి ఒక టీ కాచుకునే వ్యాపారి, అమరావతి కోసం తన వంతు సాయం చేసారు.

amaravati 09062018 2

జిల్లా కేంద్రమైన కడప ఐటీఐ సర్కిల్‌ గాంధీ పార్క్‌ ఆవరణలో సుభాన్‌బాషా అల్లం టీ వ్యాపారం చేస్తుంటారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. చిన్నపాటి వ్యాపారంతో వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అలాంటి సుభాన్‌.. తనకు కలిగినంతలో సమాజానికి ఎంతోకొంత సేవచేయాఆలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణానికి తనవంతు సాయమందించాలని సంకల్పించారు. అనుకున్నదే తడవుగా ఇటీవల విజయవాడలో జరిగిన మహానాడు కార్యక్రమానికి హాజరై.. తను పైసాపైసా కూడగట్టిన రూ.20 వేల మొత్తాన్ని సీఎం చంద్రబాబుకు అందజేసి ఆయన నుంచి ప్రశంసలు అందుకున్నారు.

amaravati 09062018 3

తన టీకొట్టు వద్ద గాంధీ పార్క్‌ ఆవరణను ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తూ కడప కార్పొరేషన్‌ కమిషనర్‌ ప్రశంసలు కూడా అందుకున్నారు. కాగా, తన సంపాదనలో కొంత మొత్తం పొదుపుచేసి సమాజసేవకు ఖర్చు చేస్తానని తాజాగా సుభాన్‌ ప్రకటించడంపై స్థానికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారు, దగా పడ్డ మన రాష్ట్రానికి ఎంతో బూస్ట్ అప్ ఇస్తారని, రాష్ట్రం పై కుట్రలు చేస్తున్న వారు ఇలాంటి వారిని చూసి నేర్చుకోవాలి. ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్రలు పన్ని, మన తల్లి లాంటి అమరావతి పై, ప్రజల్లో వీరు ఎంత విష భీజాలు నాటాలని చూసినా, శ్రీకాకుళం నుంచి, అనంతపురం వరకు, ప్రజలు అందరూ అమరావతి మాది అనే భావనతో ఉన్నారు. మనల్ను రోడ్డున పడేసిన వారికి, అద్భుతమైన రాజధాని కట్టి చూపించాలనే కసితో ఉన్నారు.

45 రోజుల సుదీర్ఘ బస్సు యాత్ర అంటూ, మొదలు పెట్టిన పవన్, శ్రీకాకుళంలో బౌన్సర్లకు దెబ్బలు తగిలాయని రెండు రోజులు, వారి స్థానంలో కొత్త వారు రావాలని, వారి గాయాలు తగ్గాలని, ఇలా మూడు రోజులు రిసార్ట్ కి పరిమితం అయ్యారు.. ఒక రోజు రిసార్ట్ దీక్ష చేసారు. ఇక విజయనగరం వచ్చి, రెండు రోజులు తిరిగి, పోయిన శనివారం అరకు రిసార్ట్ కి వెళ్లి, గురువారం బయటకు వచ్చారు. మళ్ళీ ఈ రోజు సెలవు ప్రకటించారు. కారణం తెలియదు. ఇలా, దాదాపు 10 రోజుల పైనే సెలవులు తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఏకంగా యాత్ర వాయిదా వేసుకుని హైదరబాద్ వెళ్ళిపోతున్నారు. ఈ సారి కూడా కారణం బౌన్సర్లే, పవాన్ కళ్యాణ్ మాత్రం చాలా ఫిట్ గా ఉన్నారు. చంద్రబాబుని రిటైర్మెంట్ తీసుకోమంతున్ను, పవన్ ఆపసోపాలు ఇవి..

pavan 09062018 2

చంద్రబాబు ముసలాడు అయిపోయాడు అంటూ, 18 గంటలు 24/7 కష్టపడుతున్న పవన్ కళ్యాణ్, చేస్తున్న విన్యాసాలు ఇవి. ఒకరిని వెటకారం చేసేప్పుడు, మనం కూడా మనుషులమే, మనకీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి అనేది పవన్ కళ్యాణ్ గారు, ఆయన అభిమానులు గుర్తుంచుకోవాలి. ఇక పొతే పవన్ కళ్యాణ్ ప్రెస్ నోట్ ప్రకారం, ఇవి వివారాలు.. ఇది చదివే ముందు, పవన్ కళ్యాణ్ చాలా ఫిట్ గా ఉన్నారు అనే విషయం మాత్రం గుర్తుంచుకోండి.. కేవలం బౌన్సర్ల కోసమే, ఈ త్యాగం. ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువ సంఖ్యలో ముస్లిం సోదరులు ఉన్నందున రంజాన్ పండగను దృష్టిలో ఉంచుకునే పవన్‌ ఈ విరామాన్ని ప్రకటించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

pavan 09062018 3

రంజాన్ పండుగ అనంతరం జనసేన పోరాట యాత్ర విశాఖ జిల్లాలో యథావిధిగా కొనసాగుతుందని పేర్కొంది. ఎల్లుండి సాయంత్రం పవన్ కల్యాణ్ విశాఖ నుంచి హైదరాబాద్ కు పయనమవుతారని తెలిపింది. ఈ రెండు రోజులు పవన్ కళ్యాణ్ విశాఖలోనే మేధావులతో చర్చులు జరుపుతారని తెలిపింది. అదే మొన్న జాయింట్ ఫాక్ట్ ఫైండింగ్ కమిటీ అనే సమావేశం, దాని తరువాత ఏమైందో అలాగ అనమాట.. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ సమస్యల పై అవిశ్రాంత పోరాటం చేసిన పవన్, బౌన్సర్ల కోసం, ఆయన సొంత రాష్ట్రం అయిన తెలంగాణ రాష్ట్రం అయిన హైదరాబాద్ పయనం అవుతారు. అక్కడ కెసిఆర్ ని ఆకాశానికి ఎత్తి, మళ్ళీ స్పెషల్ ఫ్లైట్ లో మన రాష్ట్రానికి వచ్చి, యధావిధిగా అమరావతి పై విషం చిమ్ముతూ, చంద్రబాబు పై విమర్శలు చేస్తారు. మోడీని, జగన్ ని మాత్రం ఒక్క మాట కూడా అనరు. ఈ విప్లవ నాయుకుడి పోరాటం కోసం మళ్ళీ, రంజాన్ పండుగ అయ్యేదాకా ఆగాల్సిందే...

Advertisements

Latest Articles

Most Read