శ్రీకాకుళం జిల్లాను అతలాకుతలం చేసిన తిత్లీ తుపాను ప్రభావం వల్ల ఉద్దానం ప్రాంతానికి అపార నష్టం వాటిల్లింది. ఇక్కడ బాధితులకు అండగా నిలిచి సాధారణ పరిస్థితులు మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూడు రోజులుగా సెక్రటేరియేట్‌ను అమరావతి నుంచి పలాసకు మార్చేశారు. రాష్ట్ర చరిత్రలోనే ఓ ముఖ్యమంత్రి మున్సిపల్ కార్యాలయాన్ని తన క్యాంపు ఆఫీసుగా మార్చుకుని బస్సులోనే బస చేస్తూ24 గంటలు విధులు నిర్వహించేలా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించడం శ్రీకాకుళం జిల్లాలో ఇదే ప్రథమం. గతంలో విశాఖకు హూద్ హూద్ వచ్చినప్పుడు కూడా, ఇలాగే పని చేసారు చంద్రబాబు.

secretariat 14102018 2

తాజగా శ్రీకాకుళంలో కూడా అలాగే పని చేస్తున్నారు. ముఖ్యమంత్రి పిలుపుతో డిప్యూటీ సి.ఎం. నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు కె.నారాయణ, పితాని సత్యనారాయణ, నారా లోకేష్, దేవినేని ఉమా, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావులతోపాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు విజయానంద్, అజయ్‌జైన్, నీరపుకుమార్‌ప్రసాద్, పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరితోపాటు 50 మంది ఐఎఎస్ అధికారులు, 100 మంది డిప్యూటీ కలెక్టర్లు, 136 మంది ఉన్నతాధికారులతో పలాసలో మినీ సెక్రటేరియేట్‌ను ముఖ్యమంత్రి నడుపుతున్నారు. 2014లో సంభవించిన హుదూద్ తుపానుకు విశాఖ జిల్లా దెబ్బతిన్నప్పుడు సీఎం చంద్రబాబు విశాఖలో ఉండి ఇదేవిధంగా రాష్టస్థ్రాయి ఉన్నతాధికారులను, మంత్రులను రప్పించి యుద్ధ ప్రాతిపదిక సహాయక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.

secretariat 14102018 3

పలాస, వజ్రపుకొత్తూరు, మందస, కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాలను తుపాను విపత్తు పూర్తిగా కకావికలం చేసింది. దీంతో అక్కడ ప్రజలు మనోధైర్యం కోల్పోయి సాయం కోసం ఎదురుచూడాల్సి పరిస్థితి నెలకొంది. ఇటువంటి కుటుంబాలకు అండగా నిలిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గత మూడు రోజులుగా పలాసలోనే బస చేస్తూ అమరావతి నుంచి సెక్రటేరియేట్‌ను ఇక్కడకు మార్చేయడంతో మంత్రులు, ముఖ్యకార్యదర్శులు, సీనియర్ ఐఎఎస్ అధికారులు విశాఖపట్నం, విజయనగరం, జిల్లాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు సహాయక చర్యలు అందించేందుకు గ్రామాలను చుట్టుముడుతున్నారు. బాధిత గ్రామాల్లో తాగునీరు, ఆహారం, నిత్యావసర వస్తువులు పౌరులకు అందేలా చర్యలు వేగవంతం చేస్తున్నారు.

పార్లమెంట్‌లో కేంద్రాన్ని ప్రశ్నించినందుకే తన ఇంటిపై ఐటీశాఖతో దాడులు చేయించారని తెదేపా సీనియర్‌ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ విమర్శించారు. తన ఇంట్లో ఐటీ సోదాలపై ఆయన ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సియం రమేష్ చెప్పిన మాటలు చూస్తూ, మోడీ-షా ఎంతకు దిగాజారిపోయరో అర్ధమవుతుంది. కెసిఆర్ ఎలా అయితే నకిలీ ఐటి దాడులు చేపించారో, ఇంచు మించు అలాంటిదే ఇక్కడ కూడా జరిగింది. కాకపోతే ఇక్కడ నిజమైన ఐటి అధికారులు వచ్చినా, వారెంట్ మాత్రం తప్పుడు వారెంట్.

itwist 14102018

సియం రమేష్ మాట్లాడుతూ, ఐటీ అధికారులు తప్పుడు వారెంటుతో వచ్చారని తెలిపారు. తన భార్య పేరుతో సెర్చ్‌ వారెంట్‌ తీసుకుని వచ్చారని.. రిత్విక్‌ అగ్రిఫామ్స్‌లో ఆమె డైరెక్టర్‌ కాదని వివరించారు. తప్పుడు సమాచారంతో వచ్చి హడావుడి చేశారని మండిపడ్డారు. తనిఖీలకు కారణం చెప్పమంటే ఐటీ అధికారులు చెప్పలేదన్నారు. ఈ విషయం పై వదిలిపెట్టను అని, దీని పై నాకు సరైన వివరణ ఇచ్చే దాకా ఎంత వరకు అయినా వెళ్తానని అన్నారు. ఇప్పటి వరకు ఐటి అధికారులకు భయపడి ఎవరూ మాట్లాడలేదని, నేను మాత్రం ఇలా కక్ష సాధింపు చేసే వారిని వదిలిపెట్టే సమస్య లేదని అన్నారు. తన తలతీసినా తాను బెదిరిపోయేది లేదన్నారు. తాను పోయినా... తన కుటుంబసభ్యులు పోరాడుతారని రమేష్‌ పేర్కొన్నారు. మూడు బెడ్‌రూమ్‌లు ఉన్న ఇంట్లో... ఉదయం 8 నుంచి రాత్రి 12 గంటల వరకు సోదాలు చేయడానికి ఏముంటుందని రమేష్ ప్రశ్నించారు

itwist 14102018

‘పదేళ్ల క్రితం మూసిన కార్యాలయానికి వెళ్లి తనిఖీలు చేశారు. ఏ సమాచారంతో తనిఖీలు చేశారో లీగల్‌గా వెళ్లి ప్రశ్నిస్తాం. మా ఇంట్లో కీలక పత్రాలు దొరికాయని కొన్ని ఛానళ్లు ప్రసారం చేశాయి. ఎలాంటి కీలక పత్రాలు దొరికాయో ఆ ఛానళ్లే చెప్పాలి. నేనేమైనా పాకిస్థాన్‌తో సంబంధం పెట్టుకున్నానా?. నావద్ద ఏదైనా రక్షణ ఆయుధాలకు సంబంధించిన సమాచారం ఉందా?. బ్యాంకు ఖాతాల పత్రాలు మాత్రమే దొరికితే కీలక పత్రాలు అంటు ప్రచారం చేశారు. మా బంధువుల ఇంట్లో మాత్రమే రూ.3.50 లక్షల నగదు ఐటీ అధికారులకు దొరికింది. నేను, మా బంధువులు క్రమం తప్పకుండా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్నాం. ఐటీ దాడులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించడం మానుకునేది లేదు.’ అని సీఎం రమేశ్‌ స్పష్టం చేశారు.

గత మూడు రోజులుగా జరుగుతున్న ఐటీ తనిఖీలపై టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పందించారు. తన ఇల్లు, ఆఫీసుల్లో మూడురోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు చేశారని టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ తెలిపారు. తన బంధువులు, చిన్ననాటి స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు చేశారని చెప్పారు. తన ఇళ్లు, ఆఫీసుల్లో ఎలాంటి డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని సీఎం రమేష్ వెల్లడించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు జరిగాయని ఆయన విమర్శించారు. భయానక వాతావరణం సృష్టించేందుకే ఐటీ దాడులు చేశారని, రాజకీయంగా అభాసుపాలు చేయాలని కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. పైనుంచి ఒత్తిడి ఉందని ఐటీ అధికారులే చెప్పారని సీఎం రమేష్‌ వెల్లడించారు.

kadapa 14102018 2

తప్పుడు వారెంట్‌తో వచ్చి తన ఇంట్లో సోదాలు చేశారని, రిత్విక్‌ అగ్రిలో తన భార్య డైరెక్టర్‌ కాదని.. షేర్‌ హోల్డర్‌ కాదని ఆయన తెలిపారు. తన కంపెనీ నుంచి వేలకోట్లు తరలిపోయాయని తప్పుడు వార్తలు రాశారని ఆయన చెప్పుకొచ్చారు. తమ కంపెనీ టర్నోవరే రూ.వెయ్యి కోట్లు లేదని, తన ఇంట్లో రూ.3.53లక్షలు స్వాధీనం చేసుకున్నారని సీఎం రమేష్‌ తెలిపారు. రూ.3.53లక్షల్లో దాదాపు రూ.2లక్షలు దేవుని ముడుపులే ఉన్నాయని చెప్పారు. తన ఇంట్లో ఉన్నవారి బ్యాంకు అకౌంట్లు, పాస్‌బుక్స్ తీసుకున్నారని, అలహాబాద్‌ బ్యాంక్‌లో తమకు అసలు అకౌంటే లేదని సీఎం రమేష్‌ తెలిపారు. బ్యాంకు అకౌంట్లు కీలక పత్రాలు అవుతాయా అని ఆయన ప్రశ్నించారు.

kadapa 14102018 3

పీఏసీ మెంబర్‌గా గెలిచినందుకే తనపై ఐటీ దాడులు రిపారని సీఎం రమేష్‌ అభిప్రాయపడ్డారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఇలాగే దాడులు జరుగుతాయని మీ పెద్దలకు చెప్పండని ఐటీ అధికారులు తనతో అన్నారని సీఎం రమేష్‌ చెప్పడం గమనార్హం. ఐటీ దాడులకు భయపడి కేంద్రాన్ని ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తే లేదని ఏపీ టీడీపీ నేత సీఎం రమేశ్ గట్టిగా చెప్పారు. ఈ తాటాకు చప్పుళ్లకు తాను భయపడనని అన్నారు. అధికారం ఉందని చెప్పి ఒత్తిడి చేసి తమను లొంగదీసుకోవాలని చూస్తారా? అని కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ కేంద్రానికి లొంగే ప్రసక్తే లేదని, కడప బిడ్డగా మీసం మెలేసి చెప్తున్నా అని స్పష్టం చేశారు. మళ్లీ ఢిల్లీ వెళ్లి ప్రతిపక్ష పార్టీలన్నింటిని కలుపుకుని ఈ ఐటీ దాడుల వ్యవహారాన్ని జాతీయస్థాయిలో తెలియజేస్తామని సీఎం రమేశ్ హెచ్చరించారు.

రాజకీయ కక్షతోనే కేంద్రం ప్రభుత్వం తనపై ఐటీదాడులకు దిగిందని… టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆరోపించారు. సీఎం రమేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు.. భయాందోళనలకు గురి చేయాలనే లక్ష్యంతో కేంద్రం ఇదంతా చేస్తోందన్నారు.. పరోక్షంగా బీజేపీలో చేరాలంటూ బెదిరింపులకు దిగుతోందన్నారు. ఐటీ దాడులు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఏసీ మెంబర్‌గా గెలిచినందుకే తనపై ఐటీ దాడులు చేయించారన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా వెళ్తే ఇలాగే దాడులు జరుగుతాయని, మీ పెద్దలకు చెప్పండని ఐటీ అధికారులన్నారని రమేష్‌ తెలిపారు. పార్టీ మారాలని ఐటీ అధికారి మదన్‌ అనడం దేనికి నిదర్శనమని రమేష్‌ ప్రశ్నించారు.

audio 14102018 2

ఐటీ అధికారి మదన్‌ మాట్లాడిన మాటలు ఆడియో కూడా రికార్డు చేసామని చూపించారు. ఇది ఎవరికి ఇవ్వాలో వాళ్లకి ఇస్తామని, రేపు నేషనల్ మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుందని, అక్కడ మరిన్ని విషయాలు చెప్తానని అన్నారు.
బంధుమిత్రులతో సహా, తన వ్యాపారాలతో సంబంధం లేని వ్యక్తులనూ వదలకుండా సోదాలు చేశారన్నారు. సోదాలు చేయడానికి గల సరైన కారణాలను ఐటీ అధికారులు చెప్పలేకపోయారని చెప్పారు. టీడీపీలో క్రియా శీలకంగా ఉండడంతో పాటు, ప్రజలతో మమేకమై ఉండడం వల్లే బీజేపీ తనపై కక్ష సాధిస్తోందని ఆరోపించారు. ఇలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని స్పష్టం చేశారు.

audio 14102018 3

తాను అక్రమాస్తులు కలిగి ఉన్నట్టు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తనకు రాష్ట్రంలో రెండువేల కోట్ల విలువైన ప్రాజెక్టులు టెండర్ల ద్వారా కాకుండా నామినేటెడ్‌ దక్కాయంటూ కొన్ని మీడియా సంస్థల చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.లక్ష రూపాయలైనా నామినేటెడ్‌గా వచ్చినట్టు నిరూపిస్తే.. ఏ శిక్షకైనా సిద్ధమని సవాల్‌ విసిరారు. ఇలా దాడులతో బీజేపీ పార్టీలోకి చేర్చుకోవాలన్నదే కేంద్రం లక్ష్యం అని సంచలన ఆరోపణలు చేశారు. ఎలాంటి బెదిరింపులకు దిగినా తాను భయపడేది లేదన్నారు. ఈ దాడులతో తమకేమి నష్టం లేదని కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేరని సీఎం రమేష్‌ ఆరోపించారు.

Advertisements

Latest Articles

Most Read