ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ల్యాండింగ్‌పై సరైన సమాచారం లేకపోవడంతో పోలీసు ఉన్నతాధికారుల్లో గందరగోళం ఏర్పడింది. శుక్రవారం ఉదయం తుపాను ప్రాంతాలను వీక్షించేందుకు శ్రీకాకుళం నుంచి సీఎం బయలుదేరారు. ఇచ్ఛాపురం, ఇతర ప్రాంతాలను విహంగ వీక్షణం చేసిన తరువాత, పలాస ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో హెలికాప్టర్‌ దిగాలి. అక్కడి నుంచి సీఎం రోడ్డు మార్గాన వెళ్లాలి. ఇందుకు పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 11.30 గంటల సమయంలో సీఎం కోసం అంతా కళాశాల మైదానం వద్ద ఎదురు చూస్తుండగా... ఆయన కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న హెలిప్యాడ్‌ వద్ద దిగినట్టు తెలిసింది.

helicpoter 13102018 2

దీంతో సీఎం కాన్వాయ్‌ మొత్తం హుటాహుటిన మూడు కిలోమీటర్ల దూరం పరుగులు తీసింది. అప్పటికే సీఎం హెలిప్యాడ్‌ నుంచి దిగిపోవడం, స్థానికులు ఆయనను చూసేందుకు దగ్గరగా వచ్చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.పోలీసులు ఆయన్ను పోలీసు స్టేషన్‌ ప్రహరీ లోపలికి తీసుకువెళ్లి గేట్లు మూసివేశారు. కాన్వాయ్‌ను సిద్ధం చేయడానికి 20 నిమిషాల వరకు సమయం పట్టడంతో అంతవరకు ఆయన స్టేషన్‌ ఆవరణలోనే గడిపారు. ముందుగా సిద్ధం చేసిన ల్యాండింగ్‌ పాయింట్‌ పైలట్‌కు కనిపించకపోవడంతో డీఎస్పీ కార్యాలయంవద్ద హెలికాప్టర్‌ దించినట్లు తెలిసింది.

helicpoter 13102018 3

‘తిత్లీ’ పెను తుపాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగారు పర్యటిస్తున్నారు. వజ్రపుకొత్తూరు మండలం అక్కుపల్లిలో బాధితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి నిర్వహించారు. అనంతరం తుపానుతో నష్టపోయిన రైతులందర్నీ ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంత వాసులకు 50 కిలోల బియ్యాన్ని అందజేస్తామని, విద్యుత్‌ పునరుద్ధరణ పనులు వేగవంతం చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. 194 గ్రామాల్లో సహాయకచర్యలను ముమ్మరం చేశామని.. పలాసలోనే ఉండి యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూస్తానని చంద్రబాబు స్థానికులతో చెప్పారు.

ఢిల్లీలో తెలుగుదేశం ఎంపీలకు అవమానం ఎదురైంది. ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో సమావేశానికి వెళ్లిన టిడిపి ఎంపీలను, గేటు బయటే నిలిపేశారు సెక్యూరిటీ సిబ్బంది. మంత్రి ఇంట్లోకి వెళ్లేందుకు పార్లమెంట్ సభ్యులను అనుమతించలేదు. బీరేంద్ర సింగ్ తమకు అపాయింట్‌మెంట్ ఇచ్చారని చెప్పినా వాళ్ళను గెట్ దగ్గరే ఆపేశారు. దీంతో టీడీపీ ఎంపీలు నిరసనకు దిగారు. పిలిచి మరీ ఇలా అవమానిస్తారా అంటూ, ఆందోళనకు దిగారు. దీంతో విషయం పెద్దది అవుతూ ఉండటంతో, కేంద్ర మంత్రి అపాయింట్మెంట్‌ ఇచ్చారు. సెక్యూరిటీ సిబ్బంది కావాలనే ఇలా చేసారని, ఇది మంచి పద్దతి కాదని, కేంద్ర మంత్రి పై ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేసారు.

tdp 13102018 2

తరువాత, మంత్రితో భేటీ అయ్యి, కడపలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. భేటీ అనంతరం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుజనా చౌదరి మాట్లాడుతూ 'వారం రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్ పై ఉక్కు మంత్రి ప్రెస్ నోట్ ఇస్తామన్నారు. కానీ.. స్టీల్ ప్లాంట్ విషయం ఉక్కు మంత్రి చేతిలో లేనట్టు ఉంది' అని అన్నారు. రాజకీయాలతోనే స్టీల్ ప్లాంట్‌ను ఆలస్యం చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎంపీ సీఎం రమేష్‌ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ పెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరామన్నారు. నాలుగైదు రోజుల్లో ప్రెస్ నోట్ ఇస్తామని మంత్రి అన్నారని చెప్పారు.

tdp 13102018 3

'అనుభవం లేని అనిల్ అంబానీకి రాఫెల్ విమానాల కాంట్రాక్టు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదు' అని ప్రశ్నించారు. అంతకుముందు ఎంపీ సుజనాచౌదరి నివాసంలో భేటీ అయిన ఎంపీలు పలు అంశాలపై చర్చించారు. టీడీపీ ఎంపీలు లేఖలో పేర్కొన్న డిమాండ్లు ఇవే: కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం ఏదో ఒకటి తేల్చాలి. కేంద్రం ఏర్పాటు చేయకపోతే ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఏపీకి అవకాశం కల్పించాలి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా ఏర్పాటుకు కృషి చేయాలి. కేంద్రం, రాష్ట్రం, ప్రైవేట్ భాగస్వామ్యానికి అంగీకారమా? కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రైవేట్ సెక్టార్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తారా? అంటూ ఎంపీలు లేఖలో పేర్కొన్నారు.

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కర్తవ్యంగా భావించాలని శనివారం నుంచి అందరికీ మంచినీరు, భోజనం సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి సోంపేట పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్ఛాపురం నియోజకవర్గ స్థాయి అధికారులతో ఎమ్మెల్యే డా. బెందాళం అశోక్‌తో కలసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు బాధిత గ్రామాలకు అధికారులు, కింది స్థాయి సిబ్బంది సైతం వెళ్లకపోవటం దురదృష్టకరమన్నారు.వ్యవసాయం, ఉద్యాన శాఖ, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమీక్ష జరిపారు.

rammohan 13102018 2

ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో అధికారులు రాకపోవటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. బృందాల వారీగా గ్రామాలకు వెళ్లి నష్టాలను అంచనా వేయాలని నిబంధనల పేరిట ఇబ్బందులు పెట్టొందని హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాసరావు, కవిటి జెడ్పీటీసీ రమేష్‌ ఉన్నారు. తుపాను బాధిత గ్రామాల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు శుక్రవారం పర్యటించారు. బారువ బీల ప్రాంతంలో నష్టాలపాలైన వరి పంటను ఆయన పరిశీలించారు. అక్కడినుంచి బట్టిగళ్లూరు, ఎకువూరు, నడుమూరు, ఉప్పలాం, గొల్లవూరు, ఎర్రముక్కాం గ్రామాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. ఎంపీతో పాటు ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, ఎంపీపీ చిత్రాడ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ సూరాడ చంద్రమోహన్‌, తెదేపా నాయకులు,రైతు నాయకులు ఉన్నారు.

rammohan 13102018 3

మరో పక్క చంద్రబాబు కూడా భరోసా ఇస్తూ కదులుతున్నారు. ‘‘భయపడొద్దు. ఆందోళన చెందవవద్దు. హుద్‌హుద్‌ సమయంలో పదిరోజులు విశాఖలోనే ఉండి అన్నీ చూసుకున్నాను. ఇప్పుడు కూడా సాధారణ పరిస్థితులు నెలకొనేదాకా పలాస, ఉద్ధానంలోనే ఉంటాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాను బాధితులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో ఏరియల్‌ సర్వే ద్వారా తుఫాను బీభత్సాన్ని పరిశీలించారు. అనంతరం రోడ్డు మార్గంలో వెళ్లి బాధితులను పరామర్శించారు. పలాస, వజ్రపుకొత్తూరు తదితర ప్రాంతాల్లో పునరావాస చర్యలను పర్యవేక్షించారు.

తిత్లీ తుఫాన్ సృష్టించిన బీభత్సం నుంచి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇంకా కోలుకోలేదు. ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపట్టినా.ఇంకా చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా, రోడ్డు సౌకర్యం కల్పించలేని పరిస్థితి. అయితే తిత్లీ తుఫాన్ ప్రభావంతో భారీ నష్టం వాటిల్లిందని, ఆదుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుఫాన్‌తో తీవ్ర నష్టం జరిగిందని, రెండు జిల్లాల్లో రూ.2,800 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు లేఖలో పేర్కొన్నారు. తక్షణమే రూ.1200 కోట్లు ఇవ్వాలని లేఖలో సీఎం కోరారు.

cbn leter 13102018 2

తితలీ తుఫాన్‌ ఉధృతికి ఇళ్లు, రహదారులు దెబ్బతిన్నాయని, హార్టీకల్చర్‌కు వెయ్యి కోట్ల నష్టం చేకూరిందని, అలాగే ఇతర పంటలు 800 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వీటితో విద్యుత్‌ నష్టం 500కోట్లు, రోడ్లు భవనాలు-100కోట్లు, పంచాయతీరాజ్‌కు100 కోట్లు, ఫిషరీస్‌- 50 కోట్లు, రూరల్‌ వాటర్‌ సప్లయ్ 100కోట్లు, ఇరిగేషన్‌కు 100 కోట్ల నష్టం వాటిల్లినట్లు లేఖలో ప్రధాని మోదీకి చంద్రబాబు నాయుడు తెలిపారు. రోడ్లు, ప్రభుత్వ భవనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. జిల్లాలో 12,000 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయన్నారు.

cbn leter 13102018 3

రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1,200 కోట్లు విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తిత్లీ దెబ్బకు మౌలిక వసతులు చిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, హూద్ హూద్ తుఫాను సందర్భంగా, కేవలం 1000 కోట్ల సహాయం చేసి, అందులో కూడా కేవలం సగం మాత్రమే విడుదల చేసిన ప్రధాని, ఈ సారి ఎంత ఇస్తారో అని ఏపి ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరో పక్క, తుపాను బాధిత ప్రాంతాల్లోని ప్రజలను ఆదుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తుపాను బాధిత ప్రాంతాల్లో అధికారులు సరుకులను పంపిణీ చేశారు. 11 మండలాల్లో 2.50 లక్షల కుటుంబాలకు 6 రకాల సరుకుల పంపిణీ చేశారు. తుఫాను బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు.

Advertisements

Latest Articles

Most Read