రాజకీయంగా ఆపరేషన్ గరుడ, ఇప్పటికే మొదలైపోయింది... అయితే, విధ్వంసం సృష్టించి, రాష్ట్రంలో అనిశ్చితికి ప్లాన్ చేసిన సంగతి కూడా తెలిసిందే... అయితే, నిన్న బంద్ సందర్భంగా భారీ విధ్వంసం ప్లాన్ చేసారా అనే అనుమానాలు కలుగుతున్నాయి... సిసి టీవీ ఫుటేజీలను చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు... ప్రశాంతంగా జరుగుతున్న ‘ప్రత్యేక హోదా’లో ఉద్రిక్తతలు సృష్టించేందుకు ప్రయత్నించారంటూ నలుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ‘హోదా బంద్‌ హింసాత్మకం... బైక్‌ను తగలబెట్టిన ఆందోళనకారులు... ఉద్రిక్తత’ అనే కలరింగ్‌ ఇచ్చేందుకు తమంతట తామే ఒక డొక్కు బైక్‌ను తీసుకొచ్చి, దానికి నిప్పంటించారని పోలీసులు తెలిపారు. తిరుపతి ఈస్ట్‌ డీఎస్పీ మునిరామయ్య తెలిపిన ప్రకారం... సోమవారం బంద్‌ సందర్భంగా తిరుపతి బస్టాండ్‌ సమీపంలో ఓ ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. ఇది పార్టీలు, లేదా సంఘాల ఆందోళనలో భాగంగా కాకుండా... అల్లర్లు, హింసను ప్రేరేపించేలా జరిగింది. బస్టాండు సమీపంలో బైక్‌ తగలబడటంతో జనం ఆందోళనకు గురయ్యారు.

yco 17042018

దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఇద్దరు వ్యక్తులు ఆ బైక్‌ను తోసుకుంటూ వచ్చి... అక్కడ నిలిపి తగలబెట్టినట్లు గుర్తించారు. వారిని వైసీపీ కార్యకర్తలుగా గుర్తించారు. అజయ్‌కుమార్‌, రాజు, మురళి, ఉదయ్‌ వంశీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరు ఇటీవల వైసీపీ నిర్వహించిన హైవేల దిగ్బంధం సందర్భంగానే బైక్‌ను తగలబెట్టాలని నిర్ణయించుకున్నట్లు విచారణలో తేలింది. రూ.3500 చెల్లించి ఒక పనికిరాని బైక్‌ను మెకానిక్‌ నుంచి కొనుగోలు చేశారు. సోమవారం వ్యూహాత్మకంగా తగులబెట్టారు.

yco 17042018

తమ కార్యకర్తలను అరెస్టు చేయడంపై వైసీపీ శ్రేణులు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగాయి. అరెస్ట్‌ చేసినవారిని వెంటనే విడుదల చేయాలని వీరు డిమాండ్‌ చేశారు. ‘వ్యూహాత్మక విధ్వంసం’ సృష్టించేందుకే ఇలా చేశారని, సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారాలున్నాయని, ధర్నా విరమించకుంటే అందరిపైనా కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. దీంతో... వారంతా వెనక్కి తగ్గారు. తిరుపతిలో పనికట్టుకుని విధ్వంసం సృష్టించే ప్రయత్నం జరిగిందని పోలీసు అధికారులు అమరావతిలో కేబినెట్‌ భేటీలో వెల్లడించారు. తునిలో రైలు నుంచి ఇప్పుడు మోటార్‌ సైకిల్‌ దహనం వరకూ అన్నీ వ్యూహాత్మకంగా జరిగినవేనని, ఉద్యమాల చాటున అశాంతి సృష్టించే ప్రయత్నం జరుగుతోందని సీఎం అన్నారు.

వైసిపీ - బీజేపీ మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిందీ... కాకపొతే పిల్లి పాలు తాగుతూ, ఎవరు చూడటం లేదు అనుకున్నట్టే, వీళ్ళు కూడా ప్రజలకు ఏమి తెలియదు అనుకుని డ్రామాలు ఆడుతున్నారు... అవిశ్వాస తీర్మానం పెట్టి, అదే కాపీ తీసుకుని, ప్రధాని ఆఫీస్ లో ఉన్న విజయసాయ రెడ్డిని చూసాం, అయినా వీరిని ఎవరూ ఏమి అనకూడదు... వీరి బంధం బలపరిచే మరో సంఘటన చోటు చేసుకుంది... తెలుగుదేశం ఎంపీలు ఎన్ని రోజుల నుంచి ప్రయత్నిసున్నా అవ్వని పని, వైసిపీ ఎంపీలు ఇలా అడగ్గానే పని అయిపొయింది... దీంతో, వైసిపీకి, బీజేపీ ఎంత బంధం ఉందో ఇట్టే అర్ధమవుతుంది... అయినా, వీళ్ళు వచ్చి, ఎదురు చంద్రబాబు మీద విమర్శలు చేస్తారు... మోడీని ఒక్కటి అంటే ఒక్క మాట అనరు... ఇంతకీ జరిగిన విషయం ఏంటి అంటే...

vijaya sai 17042018

వైసీపీ ఎంపీలు ఈరోజు రాష్ట్రపతి రాంనాథ్‌కోవింద్‌ను కలువనున్నారు. టీడీపీ ఎంపీలు కోరినా అవకాశం ఇవ్వని రాష్ట్రపతి.. వైసీపీ ఎంపీలు అడగ్గానే అపాయింట్‌మెంట్ ఇచ్చారు. మధ్యాహ్నం 12:30గంటలకు రాష్ట్రపతిని వైసీపీ ఎంపీలు కలువనున్నారు. అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చకు రాని సమయంలో రాష్ట్రపతిని టీడీపీలు కలవాలనుకున్నారు. ఈనెల 5,6 తేదీల్లో రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. కానీ రాష్ట్రపతి భవన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ప్రధాన మంత్రి నివాసం ముందు టీడీపీ ఎంపీలు మెరుపు ధర్నా చేశారు.

vijaya sai 17042018

ప్రత్యేక హోదా డిమాండ్‌తో లోక్‌సభకు వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి పది రోజులు అయినా స్పీకర్ సుమిత్రామహాజన్ ఆమోదించలేదు. రాజీనామాలను స్పీకర్ తిరస్కరించినా ఆశ్చర్యపోనక్కర్లేదని, భావోద్వేగాలతో రాజీనామాలు చేశారంటూ ఆమోదించకపోవచ్చని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. వైసీపీ ఎంపీల రాజీనామాలను టీడీపీ, ఇతర పార్టీలు డ్రామాలుగా అభివర్ణిస్తున్నాయి. జనం నిలదీస్తారన్న ఆందోళన వైసీపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతికి వినతిపత్రం పేరుతో మరో డ్రామాకు తెరలేపిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కేంద్రం అనుసరించిన వైఖరిపై ఏపీ ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజన హామీల్లో రూపాయి ఖర్చు లేనిది, కేవలం మోడీ నిర్ణయం తీసుకుంటే అయిపోయేది ఏదన్న ఉంది అంటే, అది వైజాగ్ రైల్వే జోన్.. అయితే ఇప్పుడు దీన్ని కూడా పక్కన పడేసింది కేంద్రం... మొన్నటి దాక, అదిగో రైల్వే జోన్, ఇదిగో రైల్వే జోన్ అంటూ ఊరించారు... బీజేపీ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు అసెంబ్లీలో, రైల్వే జోన్ తీసుకువచ్చి తీరుతాం, మా కేంద్రం పై, మాకు నమ్మకం ఉంది అంటూ, హడావిడి చేసారు... ఈ నేపధ్యంలో, ఈ విషయంలో రూపాయి ఖర్చు లేదు కాబట్టి, కనీసం ఇదైనా మన రాష్ట్రానికి వస్తుంది అని, అందరూ భావించారు.. కాని కేంద్రం, మన పై కక్ష కట్టింది... రైల్వే జోన్ లేదు అనే సంకేతాలు ఇస్తుంది..

tdp mp 16042018

అయితే ఇదే అంశం పై, విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఒకటైన విశాఖకు రైల్వేజోన్‌ అంశంపై తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు దీక్ష చేపట్టారు. విశాఖకు రైల్వేజోన్‌ కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ శ్రీకాకుళం రోడ్డు శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస రైల్వే స్టేషన్‌కి తమ కార్యకర్తలతో వచ్చిన ఆయన అక్కడే 12 గంటల దీక్షను ప్రారంభించారు. రేపు ఉదయం 7 గంటల వరకు ఆయన దీక్షను కొనసాగించనున్నారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ విభజన హామీల అమలులో కేంద్రం విఫలమైందని, హోదాతో పాటు రైల్వే జోన్ ఆంధ్రుల హక్కు అని అన్నారు.

tdp mp 16042018

కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీని దెబ్బతీయాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని. ఒడిశా అభ్యంతరం చెప్పకపోయినా కేంద్రం మోకాలడ్డుతోందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంపై కేంద్రం కుట్రలు పన్నుతోందని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. ఏపీకి రైల్వేజోన్ ఇచ్చేస్తున్నాం అని, ఒడిశాతో చర్చలుజరుపుతున్నామని, అవన్నీ ఒక కొలిక్కి వచ్చిన తరువాత, విశాఖ రైల్వేజోన్‌ను ప్రకటిస్తామని కొద్దిరోజుల క్రితమే కేంద్ర పెద్దలు స్పష్టం చేశారు. ఇది ఇలా ఉండగానే, కేంద్ర కేబినెట్ నుంచి టీడీపీ వైదొలిగింది. విభజన హామీలు నెరవేర్చాలని తెలుగుదేశం ఆందోళన చేస్తున్న నేపధ్యంలో, రెండు నెలల నుంచి అసలు రైల్వే జోన్ అంశమే కేంద్రం పట్టించుకోవటం లేదు...

బీజేపీ ఎంపీ, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఎవరూ ఊహించని సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఫ్యాక్స్ ద్వారా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు పంపించారు. హరిబాబు ఆకస్మిక నిర్ణయానికి కారణాలేమిటో స్పష్టంగా తెలియడంలేదు. రాష్ట్ర బీజేపీలో ఒకవర్గం మొదటి నుంచి తెలుగుదేశం సర్కారుపై ధ్వజమెత్తుతుండగా... హరిబాబు సంయమనం పాటిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో మరొకరిని పారీ అధ్యక్షుడిగా నియమిస్తారని ఒక దశలో గట్టి ప్రచారం జరిగింది. ఇప్పుడు... పార్టీ కోరినందునే ఆయన అధ్యక్ష పదవిని వదులుకున్నారా, లేక తనంతట తాను ఈ నిర్ణయం తీసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది.

haribabu 17042018

కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ సోమువీర్రాజుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షపదవి ఇవ్వనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఆయన అధ్యక్ష పదవి స్వీకరిస్తారని ప్రచారం సాగింది. అధిష్టానం అధికారికంగా ప్రకటించడమే ఇక ఆలస్యం అని వార్తలు వచ్చాయి. అందుకే హరిబాబు చేత రాజీనామా చేయించారా? లేదా తనకు తానుగా ఆయన రాష్ట్ర బీజేపీ నేతలతో పోరు పడలేక రాజీనామా చేశారా? లేదా ప్రస్తుతం ఎలాగో ఎంపీ పదవి ఉంది గనుక ఈ కొద్ది రోజులు పార్టీలోనే ఉండి అనంతరం బీజేపీకి రాజీనామా చేసేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తారానే యోచనలో ఆయన ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

haribabu 17042018

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికొచ్చేసిన తర్వాత బీజేపీ నేతలను టార్గెట్ చేసిన అధికార పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తూ దుమ్మెత్తి పోసిన సందర్భాలు కోకొల్లలు. అంతేకాదు ఇప్పటికీ కొందరు రాష్ట్ర బీజేపీ నేతలు.. టీడీపీకి వత్తాసు పలకడంతో ఆ మధ్య పార్టీ నేతల మధ్య చిన్నపాటి గొడవలు జరిగి మీడియాకెక్కారు. అప్పట్నుంచి హరిబాబు కాస్త అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే అధికార పార్టీ నేతల విమర్శలు తిప్పికొట్టడంలో ప్రస్తుతమున్న అధ్యక్షుడు విఫలమయ్యారని అధిష్టానం భావించినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీగా ఉన్న సోము వీర్రాజు, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌‌ విమర్శలను తిప్పి కొట్టడంలో ముందు వరుసలో ఉన్నారని అందుకే సోముకు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Advertisements

Latest Articles

Most Read