తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి నేతల పేర్లు చెప్పి కొంతమంది కింద స్థాయి నేతలు ఎక్కడికక్కడ రెచ్చి పోతున్నారు. అందులో భాగంగా రామచంద్రాపురం నియోజకవర్గానికి సంభందించి ఆయన ప్రధాన అనుచరుడు గణపతి కనుసన్నల్లో ఇదంతా జరుగుతుంది .ఈ నెల జనవరి 1 వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బియ్యం పంపిణి జరుగుతున్న నేపద్యంలో రేషన్ వాహనాలు ఇంటింటికి వెళుతూ బియ్యం పంపిణి చేస్తున్నాయి. అదే సమయంలో స్థానికంగా వేణు అనుచరుడైన గణపతి కనుసన్నల్లో వైసిపి నేతలు ఈ బియ్యం వాహనం దగ్గర వచ్చి ఎవరైతే రేషన్ తీసుకుంటారోవారి దగ్గర సంక్రాంతి మామూలు పేరుతో 100 నుంచి 400 రూపాయల వరకు కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సంక్రాంతి లోపు తమకు టార్గెట్ ఇచ్చారని తప్పకుండా అందరు డబ్బులు ఇవ్వవలిసిందేనని అందరి మీద ఒత్తిడి తెస్తున్నారు. ఆ నియోజక వర్గంలో ప్రతి చోట ఎక్కడైతే రేషన్ ఇస్తారో అన్ని చోట్ల కుడా ఇదే దందా కొనసాగితుంది . ఈ విషయం మంత్రి దగ్గరకు వెళ్ళినా కూడా తన అనుచరులకే డబ్బులు వస్తున్నాయి కనుక ఆయన చూసి చూడనట్టు వదిలేస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నారు. మరోపక్క దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకుందని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా ఇళ్ళ స్థలాల పేరుతో కూడా ఇలాగే 20000 ,30000 కూడా డిమాండ్ చేసిన పరిస్థితిని మనం చూసాం. ఆ తరువాత ఇంటింటికి రిజిస్ట్రేషన్ పేరుతో డబ్బులు వసూలు చేసారని మళ్ళి ఇప్పుడు సంక్రాంతి మామూలు పేరుతో డబ్బులు కట్టమంటన్నారని, ఇలా అయితే పేద ,మధ్య తరగతి వాళ్లు ఎలా బ్రతకాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి
news
సినిమా టికెట్ల వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జగన్ ను, ఆదుకున్న నాగర్జున...
సినిమా టికెట్ల వ్యవహారంలో, జగన్ మోహన్ రెడ్డి సర్కార తీసుకున్న నిర్ణయానికి, సినీ ఇండస్ట్రీలో అందరూ నెగటివ్ గానే స్పందించారు. మరీ ముఖ్యంగా మోహన్ బాబు, ఆర్ నారయణ మూర్తి, ఆర్జీవీ లాంటి వైసీపీ వీరాభిమానులు కూడా, ఈ టికెట్ల అంశంలో ప్రభుత్వాన్నే తప్పు బట్టారు. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి, జగన్ కు సపోర్ట్ గ ఒక్కరు కూడా మాట్లాడ లేదు. అయితే జగన్ కు అత్యంత సన్నిహితిడు అయిన నాగార్జున మొదటి సారి, ఈ అంశం పై స్పందిస్తూ, జగన్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చారనే చెప్పాలి. ప్రస్తుతం నడుస్తున్న సినిమీ టికెట్ల అంశం పై తన సినిమాక్కు వచ్చిన ఇబ్బంది ఏమి లేదని అన్నారు. వేరే సినిమాల సంగతి తెలియదని, తన సినిమాకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదని అన్నారు. టికెట్ ధర ఎక్కువ ఉంటే, ఇంకా కొంచెం ఎక్కువ కలెక్షన్ వస్తుంది తప్ప, నాకు ఇబ్బంది లేదని నాగార్జున అన్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో పెద్ద హీరో నుంచి సపోర్ట్ రావటంతో, వైసీపీ ప్రభుత్వానికి పెద్ద ఊరట లభించింది.
ఢిల్లీలో ఆ కేంద్ర మంత్రి వద్ద ఈ సారి కూడా జగన్ కు నో అపాయింట్మెంట్ !
జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటుగా, కొంత మంది కేంద్ర మంత్రులను కూడా జగన్ మోహన్ రెడ్డి కలిసారు. అయితే ఎప్పటిలాగే ఢిల్లీలో మాత్రం ఈ సారి కూడా అమిత్ షా అపాయింట్మెంట్ జగన్ మోహన్ రెడ్డికి లభించ లేదు. ఢిల్లీ పర్యటనకు వెళ్ళే ముందు, ప్రధాని మోడీతో పాటుగా, అమిత్ షా అపాయింట్మెంట్ కూడా జగన్ అడిగారని ప్రచారం జరిగింది. అయితే ప్రధాని మోడీ అపాయింట్మెంట్ అయితే దొరికింది కానీ, ఈ సారి కూడా అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. గతంలో కూడా నాలుగు అయుదు సార్లు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో, జగన్ మోహన్ రెడ్డికి, అమిత్ షా అపాయింట్మెంట్ దొరకలేదు. సోమవారం, మంగళవారం కూడా జగన్ కార్యాలయం, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం ఎదురు చూసారు. నిన్న ఉదయమే వచ్చేయాల్సి ఉండగా, మధ్యానమైనా అమిత్ షా అపాయింట్మెంట్ దొరుకుతుందేమో అని ఎదురు చూసినా, అమిత్ షా అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. దీంతో మూడు గంటలకు జగన్ మోహన్ రెడ్డి గన్నవరం బయలు దేరి వచ్చేసారు. అయితే అసలు అమిత్ షా అపాయింట్మెంట్ కోరలేదని వైసీపీ వర్గాలు చెప్తున్నా, అంత మంది కేంద్ర మంత్రులను కలిసిన జగన్, కీలకమైన అమిత్ షా అపాయింట్మెంట్ కోరకుండా ఎందుకు ఉంటారు ?
జగన్ ఢిల్లీ టూర్ ఫలించింది... జగన్ గన్నవరంలో ల్యాండ్ అవ్వక ముందే, చల్లటి వార్త...
జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన దగ్గర నుంచి, ప్రతిపక్షాలు ఆయన పై విమర్శలు గుప్పించాయి. అసలు జగన్ ఢిల్లీ టూర్ ఎందుకో, ఎవరికీ తెలియదు. ఎందుకంటే, అక్కడ నుంచి అధికారిక సమాధానం ఉండదు. ఎవరికీ నచ్చింది వాళ్ళు వేసుకుంటారు. ఏదో లీకులు ఇచ్చి, ఇదే మా అజెండా ని చెప్తారు. లోపల ఏమి జరుగుతుందో, ఎవరికీ తెలియదు. అయితే ఈ సారి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ పై అనేక విమర్శలు వచ్చాయి. వివేక కేసు విషయం అని, తన సొంత కేసులు విషయం అని, షర్మిల పార్టీ విషయం అని, ఇలా అనేక ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఎట్టకేలకు, అసలు జగన్ మోహన్ రెడ్డి ఎందుకు ఢిల్లీ వెళ్ళారో, అర్ధం అయ్యింది. జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి రూ.2500 కోట్ల అప్పు తీసుకుని వచ్చారు. అలా జగన్ మోహన్ రెడ్డి గన్నవరం లో దిగారో లేదో, ఇలా అప్పు వచ్చేసింది. ఇందులో గొప్ప ఏముంది అనుకుంటున్నారా ? చాలా గొప్ప ఉందండి బాబు. ఎందుకంటే, మన ప్రభుత్వం అప్పుల విషయంలో చేసిన అవకతవకలు అన్నీ కేంద్రం పసి గట్టేయటంతో, అప్పులు లేకుండా పోయాయి. గాతంలో ఆర్ధిక శాఖ కార్యదర్శి అప్పుల కోసం ఢిల్లీ వెళ్ళే వారు, తరువాత ప్రినిసిపల్ సెక్రటరీ వెళ్ళే వారు, ఆ తరువాత బుగ్గన వెళ్ళే వారు. రోజుల తరబడి ఢిల్లీలోనే ఉంటూ, అప్పుల కోసం ప్రయత్నాలు చేసే వారు.

అయితే ఈ సారి మాత్రం, బుగ్గన వెళ్ళినా పని అవ్వలేదు. ఏపి ప్రభుత్వం అన్ని అప్పులు ఎడా పెడా చేసేయటంతో, ఇక అప్పు ఇచ్చే వారు లేకుండా పోయారు. ఇక చేసేది లేక జగన్ మోహన్ రెడ్డి నేరుగా ఢిల్లీ వెళ్లి, అప్పుల కోసం ప్రయత్నం చేసారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, ఆర్ధిక మంత్రిని కలిసి, కష్టాలు చెప్పుకున్నారు. ఈ సారి ఇంకా జీతాలు ఇవ్వలేదని, జీతాలు ఇవ్వకపోతే ఇబ్బందులు వస్తాయని, ఆదుకోవాలని చెప్పటంతో, రెండో రోజే ఆర్బిఐ నుంచి అదనపు అప్పు ఇస్తూ, కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీంతో జగన్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అయితే అప్పు వచ్చిందో లేదో, గంటల్లోనే ఖాళీ అయిపొయింది. అందులో కొంచెం ఆర్బిఐ ఓవర్ డ్రాఫ్ట్ కింద మినాయించుకోగా, మిగిలినవి జీతాలకు సద్దారు. అయినా కూడా ఇంకా పూర్తిగా పెన్షన్లు జీతాలు ఇవ్వని పరిస్థితి. ఏదైతేనేం, జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లి అప్పు సాధించుకుని వచ్చారు. ఇక్కడ మరో విశేషం కూడా ఉండి. గడిచిన 8 రోజుల్లో, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రూ.4750 కోట్ల అప్పు చేసింది.