రాష్ట్ర ప్రజలకు వరుస షాకులు ఇస్తూ, షాకుల మీద షాకులు ఇస్తున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, మరో బాదుడికి సిద్ధం అయ్యింది. సినిమా టికెట్ల రేట్లు తగ్గించి, మాది పేదల ప్రభుత్వం అని చెప్పుకున్న జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం, సినిమా టికెట్ల రేట్లు తగ్గింపుని వ్యతిరేకించిన వారు అందరూ కూడా, పేదల వ్యతిరేకులు అని సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి గారే చెప్పారు. అయితే సినిమా టికెట్ల విషయంలోనే జగన్ మోహన్ రెడ్డి గారు ఇంత ఉదారంగా ఉంటే, ఇక మిగతా విషయాలు అన్నీ కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక లెక్కా అని అందరూ భావించారు. అందులోనూ నిన్నే నా చేతికి ఎముక కూడా లేదని ప్రకటించుకున్నారు. ఇవన్నీ చూసిన ప్రజలకు, గంటల్లోనే షాక్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. సంక్రాంతి పండుగ సీజన్ లో వేసే, స్పెషల్ ఆర్టీసీ బస్సుల చార్జీలు అన్నీ, ఏకంగా 50 శాతం పెంచేసారు. నిన్న ఆర్టీసీ ఎంపీ ద్వారకా తిరుమల రావు, ఈ నిర్ణయం ప్రకటిస్తూ, డీజిల ధరలు గతంలో కంటే బాగా పెరిగాయని, అందుకే పెంచక తప్పదు అంటూ తేల్చి చెప్పారు. ఆ ఎముక లేని చేయి తగ్గించేది ఏదో, డీజిల్ మీద తగ్గిస్తే, ఆర్టీసీ చార్జీలు మీద తగ్గిస్తే లాభం కదా అని, పేదలు వాపోతున్నారు.
news
ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. పీఆర్సీ ప్రకటించిన జగన్...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇన్నాళ్ళు చేసిన నిరీక్షణను నిరాశ ఎదురైంది. ఇన్నాళ్ళు పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన చర్చలు, వాళ్ళ డిమాండ్లు ఏమి ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫిట్ మెంట్ విషయంలో కనీసం 27 శాతం అయిన పీఆర్సీ ఇస్తారు అనుకున్నారు. నిన్న జగన్ మోహన్ రెడ్డితో జరిగిన చర్చల్లో కూడా, ఇదే విషయం ఉద్యోగ సంఘాలు స్పష్టం చేసాయి. అయితే ప్రభుత్వం మాత్రం, ఉద్యోగుల ఆశల మీద నీళ్ళు చల్లింది. కేవలం 23 శాతం మాత్రమే ఫిట్ మెంట్ ప్రకటించింది. ఇదే విషయాన్ని ఉద్యోగులు సమక్షంలో ఈ ప్రకటన చేసారు. దీనికి సంబంధించి, 2020 ఏప్రిల్ నుంచి ఈ ఫిట్ మింట్ వర్తిస్తుందని ప్రభుత్వం చెప్పింది. అయితే గతంలో అయితే అరియర్స్ ఇస్తాం అని చెప్పే వాళ్ళు, ఈ సారి మాత్రం మానిటరీ బెనిఫిట్స్ అని ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఇది ఏమిటో అర్ధం కాలేదు. ఇలా అనేక కన్ఫ్యూషన్ ఇందులో నెలకొంది. అయితే ఇప్పటికే ఐఆర్ 27 శాతం ఇస్తున్నా, దాని కంటే తక్కువగా పీఆర్సీ ఇవ్వటం, చరిత్రలో ఇదే మొదటి సారి. ఎప్పుడైనా ఐఆర్ కంటే, ఫిట్ మెంట్ ఎక్కువ ఉంటుంది. గతంలో చంద్రబాబు ఏకంగా 43 శాతం పీఆర్సీ ఇస్తే, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి కేవలం 23 శాతం ఇవ్వటంతో, ఉద్యోగులు షాక్ తిన్నారు.

అయితే ఉద్యోగ సంఘాలు ఈ విషయం సంతోషం వ్యక్తం చేస్తుంటే, కింద స్థాయి ఉద్యోగులు మాత్రం మండి పడుతున్నారు. వాళ్ళ గ్రూపుల్లో ఈ విషయం పై ఉద్యోగ సంఘ నేతల పై విరుచుకు పడుతున్నారు. చరిత్రలో లేని విధంగా, ఈ విధంగా ఐఆర్ కంటే తక్కువగా ఇవ్వటం పై మండి పడుతున్నారు. అసలు రిటైర్మెంట్ వయసు ఎవరు అడిగారని అంటున్నారు. ఈ దెబ్బతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోతుందని అన్నారు. ఇక సీపీఎస్ విషయంలో అతి గతీ లేదు. ఇక ఉద్యోగ సంఘాల నేతల పైన అయితే, కింద స్థాయి ఉద్యోగులు మండి పడుతున్నారు. ప్రధానంగా పీఆర్సీ, సీపీఎస్ విషయంలోనే కాక, HRA విషయంలో కూడా ప్రభుత్వం ఏ ప్రకటన చేయక పోవటం పై న కూడా ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ అంశం ఎక్కడకి వెళ్తుందో చూడాలి. ఉద్యోగ సంఘాల నేతలను మ్యానేజ్ చేసి, ప్రభుత్వం ఇలా చేసిందని, కింద స్థాయి ఉద్యోగులు వాపోతున్నారు. కింద స్థాయి ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతల పై తిరగబడే అవకాసం ఉండి.
సోషల్ మీడియాలో మరోసారి ట్రోల్ అవుతున్న రఘురామరాజు...
ఈ మధ్య వైసిపి సొంత పార్టీ నేతల తీరుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటుంది. మొన్నామధ్య MLAల తీరుతోనే వైసిపి విసిగి పోతుంటే ఇప్పుడు తాజాగా ఒక MP కారణంగా మళ్ళి పార్టీ ఇబ్బంద్దుల్లో పడుతుందని పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. కేవలం రాష్ట్రం లోనే కాకుండా దేశంలో ఈయన మాట్లాడే మాటల వల్ల తమ పార్టీ పరువు పోతుందని వారు విమర్శిస్తున్నారు. ఈ మధ్య రాజమండ్రి MP మార్గాని భరత్ ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. గెలిచిన మొదట్లో నెమ్మదిగా ఉన్న ఆయన తరువాత తరువాత పార్టీ లో వివాదాలకు కారణం అవుతున్నారట. దీని పై జగన్ కూడా ఈయనకు క్లాస్ తీసుకున్నట్టు సమాచారం. మొన్నామధ్య పార్లమెంటు లో భరత్ మాట్లాడుతూ మా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉందని, మా ఖజానా ఖాళి అయిపొయింది సార్ , కేంద్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆయన అర్జించిన తీరు పార్టీ పరువును దిగ జార్చే లాగ ఉందని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఈయన మాట్లాడే తీరు ప్రతిపక్షాలకు ఎత్తి చూపే అవకాసం ఇస్తునట్లు ఉందని కూడా వారు భయపడుతున్నారు. మళ్ళి తాజాగా ఆయన మీడియాతో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మా జగన్ పేదలకు చాలా పదకాలతో చేతినిండా డబ్బులు ఇస్తున్నారని, ఆ డబ్బులతోనే పేదవాళ్ళు సినిమాలు చూసి , సినిమా పెద్దల ఖాతాలు నింపుతున్నారని కీలక వ్యాఖ్యలు చేసారు. మా రాష్ట్ర ప్రజాల వల్లే సినిమా వాళ్లకు బ్యాంకు బాలెన్సు లు పెరుగుతున్నాయి. దీన్ని ఆపాలనే మంచి ఉద్దేశంతోనే, మా AP లో వైసిపి ప్రభుత్వం టికెట్ల రేట్లు తగ్గించిందని అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో కామెడీ అయ్యాయి. అసలే సినిమా టికెట్ల విషయం పై ప్రభుత్వానికి సినిమా పెద్దలకు మధ్య వివాదం ముదిరి పాకాన పడుతుంటే మళ్ళి ఈయన వచ్చి దానికి ఆద్యం పోసినట్టయింది అని వైసిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇలా మట్లాడటం వల్ల ఆయన ఇమేజ్ డామేజ్ అవ్వటంతో పాటు పార్టీ కూడా ఇబ్బందుల్లో పడుతుందని కూడా వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో కూడా ఈయన పై విమర్శలు కురిపిస్తున్నారు. ఏంటి సారూ ఇది మన పార్టీ పరువు దిగాజారుస్తున్నరంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈయన తెలియక మాట్లాడుతున్నార లేక RRR రూట్లో వెళ్తున్నారో అని కూడా కామెంట్ చేస్తున్నారు. అయితే దీని పై ఎంపీ మార్గాని భరత్ ఎలా స్పందిస్తారో చూడాలి.
ఎంపీ పదివికి రాజీనామా చేస్తున్నా.. రఘురామరాజు సంచలన ప్రకటన...
వైసిపి ఎంపి రఘురామకృష్ణరాజు తన సొంత ప్రభుత్వం పై రోజు బాణాలను సంధిస్తూ, ప్రతి రోజూ చాకిరేవు పెడుతూ, చేస్తూ సొంత్ పార్టీ నేతలకే చెమటలు పట్టిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేసారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని వచ్చిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పార్టీయే తనపై అనర్హత వేటు వేసే ఆలోచనలో ఉన్నారని, నేనే జగన్ కు టైం ఇస్తున్నా, అనర్హత వేటు వేస్తారా సరే , లేదంటే అప్పుడే నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తా అని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒకవేళ నేనే రాజీనామా చేస్తే మళ్ళీ ఎన్నికలకు వెళ్లి గెలిచి చూపిస్తా, అప్పుడు ఈ పనికిమాలిన ప్రభుత్వం మీద జనాలకి ఎంత వ్యతిరేఖత ఉందో అర్థం అవుతుంది, వాళ్ళు నా మీద అనర్హత వేటు వేసి నన్ను పార్టీ నుంచి తొలగించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారని, వాళ్ళు నన్ను వదలట్లేదు అని అన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన పీడ వదిలించుకునేందుకే నేను ఈ రాజీనామా నిర్ణయం తీసుకున్నానని రఘురామకృష్ణరాజు, సంచలన వ్యఖ్యలు చేసారు. రాజధానిగా తన మద్దతు ఎప్పుడు అమరావతేనని చెప్పుకోచ్చారు. అయితే గత కొన్ని రోజులుగా వస్తున్న రాజీనామా వ్యఖ్యలకు, రఘురామరాజు, ఈ రోజు ఫూల్ స్టాప్ పెట్టారు...