2019 ఎన్నికలకు ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరీ ముఖ్యంగా జగన్ మోహన్ రెడ్డి అన్నీ సెల్ఫ్ గోల్స్ వేసుకుంటారు అనే పేరు ఉండేది. నిజంగానే చాలా సెల్ఫ్ గోల్స్ వేసుకుని, రాజకేయంగా నష్టం చేకుర్చుకున్నారు కూడా. అయితే ఎన్నికల్లో గెలవటంతో, ఈ సెల్ఫ్ గోల్స్ అన్నీ సైడ్ అయిపోయాయి. టైం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా, గుండ్రంగా ఉంటుంది. అయితే ఇప్పుడు తాజాగా వైసిపి వేసుకున్న సెల్ఫ్ గోల్ తో, రాజకీయంగా మరింతగా దిగజారే స్టెప్ అనే చెప్పాలి. పట్టాభి ప్రెస్ మీట్ పెట్టి, నక్కాఆనంద బాబుగారికి నోటీసులు ఇచ్చిన విషయంలో, సజ్జల ఇదంతా చేపిస్తున్నారు అంటూ, సజ్జలను ఒక మాట అన్నారు. ఇదే ప్రెస్ మీట్ లో జగన్ ని ఉద్దేశించి ఆయన అన్నది, పబ్జీ దొర అని మాత్రమే. అయితే జగన్ మోహన్ రెడ్డిని ఎవరు తప్పుదోవ పట్టించారో తెలియదు కాని, పట్టాభి ఆ వ్యాఖ్యలు చేసింది నన్నే అంటూ జగన్ మోహన్ రెడ్డి, నిన్న ఆ పదం చెప్పి, ఆ పదానికి అర్ధం చెప్తూ బూతులు వినిపించారు. ఒక ముఖ్యమంత్రి నోటి వెంట ఆ పదాలు విని అందరూ ఆశ్చర్య పోయారు. అసలు తనని అనని మాటలు, తనకు ఆపాదించుకుని, అర్ధం చెప్పి, తన తల్లిని లాగి, జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో అందరూ షాక్ తిన్నారు. అసలు జగన్ మోహన్ రెడ్డిని ఎవరు తప్పుదోవ పట్టించారు అనేది తెలియదు.

tdp 22102021 21

సజ్జలని అంటే, జగన్ రియాక్ట్ అయ్యారు. అంటే టిడిపి కార్యాలయాల పై దా-డు-లు చేసింది కూడా, జగన్ ని ఆ పదం అన్నారనే. ఇంత రచ్చ జరిగింది, జగన్ ని తప్పుదోవ పట్టించినందుకే. అందుకే విశ్లేషకులు ఇది సెల్ఫ్ గోల్ అంటున్నారు. ఏమి లేని దానికి ఇంత చేసి, అసలు మాకు బూతులు అంటే ఏంటో తెలియవు, మా మీద ప్రేమ ఉన్న వాళ్ళు బీపీ పెరిగి చేసారు అంటూ, చేసిన వ్యాఖ్యలు అందరూ విన్నారు. అయితే ఇదే సమయంలో టిడిపి శ్రేణులు అన్నీ ఆక్టివ్ అయ్యాయి. రాష్ట్రం నలు మూలల నుంచి, టిడిపి శ్రేణులు కదం తొక్కాయి. మంగళగిరి పోలీస్ ఆఫీస్ కి జనం పోటెత్తారు. ఈ రెండేళ్ళలో ఎప్పుడూ లేని విధంగా టిడిపిలో ఊపు వచ్చింది. మహానాడు ముందే వచ్చిందా అన్నట్టు, కోలాహలం నెలకొంది. జగన్ మోహన్ రెడ్డి వేసిన అడుగులు వల్లే, ఈ రోజు టిడిపిలో ఈ జోష్ వచ్చిందని, అనవసరంగా చిన్న విషయాన్ని, కెలికి పెద్దది చేసి, చివరకు టిడిపికి మొత్తం ప్లస్ అయ్యే విధంగా జగన్ మోహన్ రెడ్డిని తప్పుదోవ పట్టించి సెల్ఫ్ గోల్ వేసుకున్నారని అన్నారు.

గత ఆరు నెలలుగా జగన్ మోహన్ రెడ్డికి అత్యంత గడ్డు కాలం నడుస్తుంది. అందరికీ సంక్షేమం ఇచ్చేసాం అని ఇన్నాళ్ళు డబ్బా కొట్టిన జగన్ ప్రభుత్వం, ఆసలు స్వరూపం ఇప్పుడిప్పుడే ప్రజలకు తెలుస్తుంది. ఏదైతే తన బలం అని సంక్షేమాన్ని నమ్మాడో, ఆ సంక్షేమం కూడా బూటకం అని ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. వీటికి తోడు ప్రజలకు అసలు సినిమా కనిపించింది. అప్పులు ఒక పక్క, ఆ అప్పులు కవర్ చేసుకుంటానికి, మటన్ కొట్టులు, సినిమా టికెట్లు అమ్మటాలు, ఇలా అనేకం అనేకం ముందుకు తెచ్చారు. ఇది బాగా ప్రజల్లోకి వ్యతిరేకత తీసుకుని వచ్చింది. ఇక రోడ్డులు పరిస్థితి చెప్పే పనే లేదు. అలాగే మహిళల పై జరుగుతున్న ఘటనలు, దళితుల పియా జరుగుతున్న ఘటనలు, కరెంటు చార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, పెట్రోల్ చార్జీలు, ఇసుక, మద్యం, మైనింగ్, ఇలా ఒకటా రెండా, మొత్తం గందరగోళమే. రైతులకు మద్దతు ధర లేదు, ధాన్యం బాకీలు ఒక ఎత్తు. యువతకు ఉద్యోగాలు లేవు. ఇలా ఒకటి రెండు కాదు, మొత్తం అన్ని వర్గాలు జగన్ పాలనతో ఇబ్బందులు పడుతున్నారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడే సెంటిమెంట్ అస్త్రం బయటకు తీసారు. ఈ మొత్తాన్ని అడ్డుకోవటానికి ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్తున్నారని అంటున్నారు. ఈ మొత్తం పరిణామాల నేపధ్యంలో, అసలు వాస్తవం బయట పడింది.

jagan 22102021 2

తాజాగా సిఓటర్ సర్వే నిర్వహించిన సర్వేలో జగన్ మోహన్ రెడ్డి ఉలిక్కిపడే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోనే ఎమ్మెల్యేల పై భారీ వ్యతిరేకత ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 2019లో ఎంత గొప్పగా మెజారిటీలోకి వచ్చిందో, అంతే త్వరగా రెండేళ్ళకే పతనం దిశగా వెళ్తుంది. జగన్ మోహన్ రెడ్డి పని తీరు మాత్రమే కాదు, వైసీపీ ఎమ్మెల్యేల పై కూడా రాష్ట్ర ప్రజలు తిరగబడుతున్నారు. దేశంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతను వారి అవినీతి. వ్యక్తిత్వం, పరిపాలన, ప్రజలతో సంబంధాలు, ప్రభుత్వ కార్యక్రమాలు వంటి అంశాల ఆధారంగా సిఓటర్ సర్వే చేయగా, దేశంలోనే అత్యధికంగా 28.5 శాతం వ్యతిరేకత ఏపి ఎమ్మెల్యే పై ఉంది. ఇది ఎమ్మెల్యేలదే అని, జగన్ మోహన్ రెడ్డి పని తీరు పై సర్వే చేస్తే, ఇంకా ఎక్కువ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రోజు రోజుకీ పెరుగుతున్న ఈ ప్రభుత్వ వ్యతిరేకత, తాడేపల్లి ప్యాలెస్ ను చుట్టముట్టటం ఎంతో దూరంలో లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే వచ్చిన ఒక సర్వేలో 46 మంది కచ్చితంగా ఓడిపోతారని సర్వే వచ్చిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేసారు. కొద్ది సేపటి క్రితం, పట్టాభి ఇంటి గేటు బద్దలు కొట్టి, పట్టాభిని అరెస్ట్ చేసినట్టు, ఆయన భార్య చెప్పారు. ఎందుకు అరెస్ట్ చేసారు, ఎక్కడ కేసు పెట్టారు అనే దాని పై ఏ సమాచారం లేకుండా, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారో కూడా చెప్పకుండా ఆయన్ను అరెస్ట్ చేసారని ఆయన భార్య చెప్పారు. మధ్యానం నుంచి కూడా పట్టాభి ని అరెస్ట్ చేయటానికి పోలీసులు పెద్ద ఎత్తున వచ్చారు. పట్టాభి ఇంటి దగ్గర నుంచి అందరినీ పంపించి వేసారు. పట్టాభి ఇంటి వద్దకు ఎవరినీ రానివ్వలేదు. సాయంత్రానికి అదనపు బలగాలు రప్పించారు. అంతే కాదు, కొద్ది సేపటి క్రితం మీడియాను కూడా పట్టాభి ఇంటి నుంచి పంపించి వేసి, ఆయన్ను అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే అరెస్ట్ కు ముందే, పట్టాభి ఒక వీడియో విడుదల చేసారు. తన బాడీ పైన ఎలాంటి గాయాలు లేవని, ఒక చిన్న గీత తన మీద పడినా, డీజీపీ నే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు.

మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం పై, రెండు రోజుల క్రితం ప్రణాళిక ప్రకారం అటాక్ జరిగిన సంగతి తెలిసిందే. పట్టాభి ప్రెస్ మీట్ లో సజ్జలని తిడితే, ఆ మాట తననే అన్నారని జగన్ మోహన్ రెడ్డి ఆపాదించుకుని మరీ, చేసిన హడావిడి అందరూ చూసారు. ఇక ఇక్కడ మరో గమ్మత్తు అయిన విషయం ఏమిటి అంటే, ఆ అటాక్ చేసింది మా వాళ్ళే అని సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రకటించుకోవటం,అందరినీ ఆశ్చర్య పరిచింది. కొంత మంది తమ ఆత్మీయులు, ప్రేమ ఉన్న వాళ్ళు, అభిమానులు బీపీ పెరిగి, టిడిపి ఆఫీస్ ల పై రాష్ట్ర వ్యాప్తంగా దా-డు-లు చేసారు అంటూ, సాక్షాత్తు జగన్ మోహన్ రెడ్డి చెప్పటం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక డీజీపీ కూడా మొత్తం తప్పు అంతా పట్టాభిది అని తేల్చేసారు. ఆయన ఆ వ్యాఖ్యలు చేసినందుకే దా-డి చేసారు అట. ఇక పోలీసులు కూడా దా-డి జరిగిన పట్టాభినే అరెస్ట్ చేసారు. ఇలా జరుగుతున్న సంఘటనల పై టిడిపి స్పందిస్తూ, ఇది స్టేట్ స్పాన్సార్డ్ టెర్రరిజం అంటూ ప్రకటించి, దీక్షలు కూడా చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ రోజు , రేపు కూడా దీక్ష చేస్తున్నారు. అయితే టిడిపి నేతలు ఆరోపణలు చేయటం లేదు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇస్తున్నారు.

tdp 21102021 2

టిడిపి ఆఫీస్ పై అటాక్ చేయటానికి వస్తున్నారు అంటూ, 15 నిమిషాల ముందే టిడిపి కార్యాలయానికి సమాచారం వచ్చింది. అప్పటికే కొంత మంది కార్లు వేసుకుని ఆఫీసు బయట ఉన్నారు. వెంటనే టిడిపి సిబ్బంది మంగళగిరి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసారు. అయితే ఇది తమ పరిధి కాదని రూరల్ పోలీస్ లకు ఫోన్ చేయమన్నారు. అక్కడకు ఫోన్ చేస్తే, వెంటనే స్పందించకుండా, పోలీసులు సాగదీసిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచింది. ఒక పార్టీ స్టేట్ ఆఫీస్ పై అటాక్ జరుగుతుంది అంటే, వెంటనే రాకుండా, మీ పేరు ఏంటి, మీ నాన్న పేరు ఏంటి, మీ వయసు ఎంత, మీ పోస్ట్ ఏంటి, మీరు ఎంత కాలం నుంచి పని చేస్తున్నారు, మీకు వైసిపీ వాళ్ళు వస్తున్నారని ఎవరు చెప్పారు, మీరు చూడకుండా ఎలా చెప్తున్నారు, ఇలా అనేక అనేక ప్రశ్నలు వేసి, సాగ దీసారు. ఈ ఆడియో క్లిప్ తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. ఫోన్ చేసిన వెంటనే పోలీసులు స్పందించి, పోలీసులు వచ్చి ఉంటే, ఇంత విధ్వంసం జరిగేది కాదని, ఎందుకు రాలేదో పోలీసులే చెప్పాలని అంటున్నారు. ఇది టిడిపి విడుదల చేసిన ఆడియో. https://twitter.com/JaiTDP/status/1451184676953985027

Advertisements

Latest Articles

Most Read