వైఎస్ వివేకానందరెడ్డి హ-త్యకేసులో ప్రతీసారి ఓ కొత్త వాదనని తెచ్చి వైఎస్ అవినాష్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారని మాజీ పోలీసు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. మర్డర్ జరిగిన వెంటనే అంతా ఓ మాటనుకుని గుండెపోటు థియరీ తెచ్చారు. అదీ జగన్ సాక్షి చానల్లోనే వేశారు. జగన్ ఆత్మలాంటి విజయసాయిరెడ్డి గుండెపోటు ప్రకటన చేశాడు. ఆ తరువాత ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు మంచి అవకాశం అని ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన సలహాతో చంద్రబాబు గొడ్డలితో అడ్డంగా తన బాబాయ్‌ని నరికేశారని, ఆయనకి లోకేష్, బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి సహకరించారని అదే సాక్షిలో జగన్ రెడ్డి అచ్చేయించారు. ఇక్కడి నుంచే అనుమానాలు మొదలయ్యాయి. సేమ్ పరిటాల రవి కేసులో మాదిరిగానే సాక్షులు అనుమానాస్పదంగా చనిపోవడం ఆ స్కెచ్ ఇక్కడా అమలయ్యిందని సందేహాలు వ్యక్తం అయ్యాయి. సీబీఐ రాకముందే కేసుని అనామకుల్ని ఇరికించి క్లోజ్ చేయాలనుకున్నారు. సీబీఐ దిగడంతో సీబీఐపైనే దా-డు-లకు వెనకాడలేదు. ఒక్కో నిందితుడినీ సీబీఐ అరెస్ట్ చేసినా, విచారణకి పిలిచినా వైఎస్ అవినాశ్‌రెడ్డి గిలగిలా కొట్టుకుంటుండడం, నిందితులకు మద్దతుగా లాయర్లని పెట్టడంతో ఏ విచారణ లేకుండానే అవినాష్‌రెడ్డి హ-త్యలో తన పాత్ర ఉందని ఒప్పేసుకున్నట్టు అయ్యింది. ఈ నేపథ్యంలో మళ్లీ సాక్షిలోనే ఆస్తి గొడవల నేపథ్యంలో అల్లుడు నర్రెడ్డి ఈ హత్య చేయించాడని నిందితులు చెబుతున్నది రాశారు. వివేకా హ-త్యలో సాక్షిలో రాసిన మూడో వెర్షన్ ఇది. తాజాగా మూడోసారి సీబీఐ విచారణకి హాజరైన అవినాష్ రెడ్డి తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని కోర్టుకి వెళ్లడం, విచారణ అనంతరం వివేకానందరెడ్డి అక్రమసంబంధాల గురించి మాట్లాడటం కొత్త వెర్షన్ బయటకి తెచ్చారు. ఇదీ సాక్షి మీడియాలోనే వస్తోంది. వివేకాకు ఓ ముస్లిం మహిళతో సంబంధముందని షేక్ షహన్ షా అనే అబ్బాయి వారికి పుట్టాడని, ఆ అబ్బాయినే వారసుడ్ని చేయాలనుకున్నాడని, ఆ గొడవల్లోనే చంపేసి ఉంటారని కొత్త వాదన తెరపైకి తెచ్చాడు. అంటే సాక్షిలో వేసినదాని ప్రకారం, జగన్ రెడ్డి సన్నిహితులు చెప్పిన దాని ప్రకారం వివేకా హ-త్యకేసులో ఇది నాలుగో వెర్షన్. ప్రతీసారి కేసులో అనుమానితులు ఎందుకు మారుతున్నారంటే, అసలు నిందితులు వారికి తెలుసుకాబట్టి అనేది కామన్ మేన్‌కి కూడా అర్థం అవుతోంది.
news
జగన్ ని పొడిచిన కోడికత్తిని తీసుకురండి.. కోర్టు సంచలన ఆదేశాలు ..
విశాఖ ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ రెడ్డిని పొడిచిన కోడికత్తి ఎక్కడుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పటివరకూ విచారణ జరగని ఈ కేసు ఇటీవలే కదలిక వచ్చింది. అయితే బాధితులు, సాక్షులు రాకుండా కేసు విచారణ ఎలా అని న్యాయమూర్తి ప్రశ్నించడంతో సాక్షి వచ్చారు కానీ, బాధితుడైన జగన్ రెడ్డి మాత్రం కేసు విచారణకి రావడంలేదు. ఈకోడికత్తి కేసులో అసలు బాధితుడు అప్పటి ప్రతిపక్ష నేత.. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మాత్రం ఇప్పటివరకు కోర్టుకు హాజరుకాలేదు. నిందితుడు ఇప్పటి వరకు కోర్టుకు హాజరుకాకపోవటంపై ఎన్ ఐఏ కోర్టు అసహనం వ్యక్తంచేసింది. బాధితుడిగా భావిస్తున్న జగన్ కోర్టుకు రావాల్సిందేనని గతంలో స్పష్టంచేసింది. అయినా జగన్ కోర్టుకు హాజరుకాకపోవడం ఏంటని అసహం వ్యక్తం చేసినట్టు సమాచారం. పోలీసులు స్వాధీనం చేసుకున్న కోడికత్తిని కోర్టులో ప్రవేశపెట్టలేదని తెలుస్తోంది. మరోవైపు అవినాష్ రెడ్డి కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు కోడికత్తి కేసులో మరో ట్విస్ట్ కి తెరలేపాయి. జగన్ రెడ్డిపై దాడి జరిగిన రోజు ఎయిర్ పోర్టులో సీసీ కెమెరాలు కూడా పనిచేయలేదట. అంటే ఇదంతా చాలా ప్లాన్డ్గా రికార్డు కాకూడదని చేసినట్టే ఉంది. 2018లో విశాఖపట్నం ఎయిర్ పోర్టులో అప్పటి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిపై జనిపల్లి శ్రీనివాస రావు కోడికత్తితో దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ భుజానికి గాయమైంది. ఈ కేసు విచారణని ఎన్ఐఏ తీసుకుంది. అప్పటి నుంచి జైలులోనే కోడికత్తి శ్రీను ఉంటున్నాడు. సీఎం జగన్ రెడ్డిని కలిసేందుకు కోడికత్తి శ్రీను తల్లిదండ్రులు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. శ్రీను లాయర్ విజ్ఞప్తి మేరకు విజయవాడ ఎన్ఐఎ కోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రధానమైన కోడికత్తిని తీసుకురావాలని కోర్టు ఆదేశించింది. కోడికత్తి కేసుకు సంబంధించి సాక్షిగా సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండర్ దినేశ్ కుమార్ ను కోర్టు విచారించింది.
డైవర్షన్ ప్లాన్ అదిరింది... వివేకా కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పక పోవటంతో, డైవర్షన్ ప్లాన్...
తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించినప్పుడే, వివేకానందరెడ్డి హత్యకేసులో అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదని తేలిపోయింది. కోర్టులో కూడా సీబీఐ అనుమానితుల్ని అదుపులోకి తీసుకుంటామని చెప్పేసింది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం మార్చి 14న వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా చంపేశారు. ఇప్పుడు హైకోర్టు కూడా మార్చి14న సీబీఐ ముందు హాజరవ్వాలని సూచించడం...అదే రోజు అరెస్టు తప్పదని, ఇది దేవుని స్క్రిప్ట్ అంటున్నారు నెటిజన్లు. ఏ బాబాయ్ హత్యని చూపించి 2019 ఎన్నికల్లో లబ్ధి పొందారో అదే హత్యకేసు తన మెడకి చుట్టుకోవడంతో డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరతీశారు. మార్చి 14న అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తే, ఆ టాపిక్ నుంచి జనాల్ని డైవర్ట్ చేయడానికి చాలా పెద్ద ప్లాన్లు వైసీపీ వేసిందని జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఓ వైపు స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుతో సీఐడీ అరెస్టులు, మరోవైపు రాజధాని భూముల కేసులో నారాయణ ఇంటి చుట్టూ తిరుగుతున్న సీఐడీ, తాజాగా ఏపీ వ్యాప్తంగా మార్గదర్శి అధికారులని అదుపులోకి తీసుకుంటున్న సీఐడీ కేసులని చూస్తే...అవినాష్ అరెస్టు తప్పదని తేలిపోతోంది. ఆ అరెస్టుని డైవర్షన్ చేయడానికే సీఐడీని వాడుకుని ప్రతిపక్షం, ప్రధాన మీడియా సంస్థలపై కేసులని తెలుస్తోంది.
"We stand with Avinash" హ్యాష్ ట్యాగ్ తో మొత్తం క్లారిటీ ఇచ్చిన వైసీపీ
వివేకానందరెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డే చంపేశాడని సీబీఐ చెప్పినా మేము నమ్మం అంటోంది వైసీపీ. సీబీఐయే కాదు, కోర్టులు తీర్పు ఇచ్చినా మేము అవినాష్ రెడ్డి వెంటే ఉంటామంటూ వైసీపీ క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీ అఫీషియల్, వైసీపీ సోషల్‌మీడియా, వైసీపీ వెరిఫైడ్ లీడర్స్ అక్కౌంట్ల నుంచి మొత్తం #westandwithysavinash పేరుతో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే వైఎస్ అవినాష్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డిని చంపేసినా ఆయన వెనుకే మేమున్నాం అని పార్టీ ప్రకటించడం ద్వారా కిందిస్థాయి కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇదే సోషల్‌మీడియాలో నారాసురరక్తచరిత్ర పోస్టులు పెట్టామని, ఇప్పుడు వైఎస్ సునీత రక్తచరిత్ర అని పెట్టమంటున్నారని వైసీపీ పోస్టుల కింద కామెంట్ల రూపంలో పోస్టులు చేస్తున్నారు. అవినాష్ రెడ్డిని అనుమానితుడు అని సీబీఐ స్పష్టం చేశాక కూడా వుయ్ స్టాండ్ విత్ అవినాష్ అంటున్నారంటే, వేసింది ఆయనే అయినా వేయించింది తమ అభిమాన నేతే అని కార్యకర్తలు కన్ఫామ్ చేసుకుంటున్నారు. మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డితో అన్ని విధాలా వైరం ఉన్న దూరపు బంధువు వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు చంపుతాడనే వాదనలో ``ఒక కన్ను మరో కన్నుని ఎందుకు పొడుస్తుంది అధ్యక్షా`` అని అమాయకంగా ప్రశ్నించిన జగన్ రెడ్డి తన సాక్షి పేపర్లో వివేకానందరెడ్డి కూతురే చంపేసిందని అవినాష్‌రెడ్డి చెప్పినట్టు అచ్చేయించడం చూస్తే అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఒక కన్ను మరో కన్నుని ఎలా అనేది జగన్ చెప్పిందే నిజమనుకుంటే..సునీతపై నేరం మోపడం దారుణం అని వైసీపీలోనే చర్చ మొదలైంది.