amaravati 06012017

దుర్గమ్మ ఆశీస్సులు.. కృష్ణమ్మ పరవళ్లతో..అద్భుతమైన అమరావతిని నిర్మించుకుంటున్న మనం, అమరావతిలో వేసిన తొలి అడుగు, వెలగపూడిలోని సచివాలయం.. ఈ సచివాలయం, ప్రతి ఆంధ్రుడి దేవాలయం.... అమరావతి ఆంధ్రుల రాజధాని అని ప్రకటించిన దగ్గర నుంచి, మొదలైన పాజిటివ్ వైబ్రేషన్స్, 5 కోట్ల మంది ఆంధ్రులని ముందుకు నడిపిస్తుంది… “అమరావతి”, అంటే మరణం లేనిది…క్షీణించడం, జీర్ణించడం, బాధపడటం అనేవి మచ్చుక కూడా కనిపించని ప్రాంతంగా అమరావతి విలసిల్లుతుంది. బాల్యం, కౌమారం, యవ్వనం మాత్రమే అమరత్వంలో ఉంటుంది, మరణించడం అనేదే ఉండదు... అందువల్ల ఎల్లప్పుడూ అభివృద్ధి బాటలో పయనిస్తూ ఉంటుంది.

శాతవాహనుల రాజధానిగా ఘనచరిత్ర వహించిన ఈ ప్రాంతానికి, మళ్లీ పూర్వ వైభవం తీసుకురావటానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి... రాష్ట్ర విభజన కష్టాలు వెంటాడుతున్నాయి. ఆర్థిక లోటు.. మౌలిక సదుపాయల లేమి.. పారిశ్రామికంగా వృద్ధి చెందని కారణంగా ఉపాధి అవకాశాల కోసం యువత నిరీక్షించాల్సిన దుస్థితి.... ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రం నలు దిక్కులా సత్వర.. సమగ్రాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. అలాంటి సమయంలో వెలగపూడి సచివాలయం నుంచి పాలన మొదలు పెట్టిన వేళా విశేషం, ఆ ప్రాంత మహత్యం, మానవ సంకల్పం అన్నీ కలిసి వచ్చాయి... రాష్ట్రంలో పనులు అన్నీ చక చకా జరిగి పోతున్నాయి... పెండింగ్ లో ఉన్న పోలవరం మొదటి విడత నిధులు వచ్చాయి...ఇలా ఎటు వైపు చూసినా గత నెల రోజులుగా పాజిటివ్ వైబ్రేషన్స్... భవష్యత్తు కూడా ఆశాజనకంగా కనిపిస్తుంది.

ఆశ్చర్యం ఏమిటి అంటే, ఎప్పుడూ తన మనసులో ఎమోషన్స్ బయటకు చూపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంత పని చేసినా ఇంకా బెస్ట్ అవుట్ పుట్ కావలి అనే చంద్రబాబు... ఈ మధ్య చాలా ఉల్లాసంగా కనిపిస్తున్నారు... మొఖం పై, ఎప్పుడూ చిరు నవ్వు ఉంటుంది... అధికారులు, మంత్రులు, నాయకులతో కూడా ఉల్లాసంగా కనిపిస్తున్నారు... సహజ శైలికి భిన్నంగా అందరికే షేక్ హ్యాండ్ కూడా ఇస్తున్నారు.... అధికారులు కూడా, చంద్రబాబులో వచ్చిన ఈ మార్పు చూసి చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కూడా తనను కలిసే వారితో, ఈ భూమి మహత్యం చాలా గొప్పది, కాలం కలసి వచ్చింది, అన్నీ కలసి వస్తున్నాయి, అంతా మన అమరావతి మహత్యం అంటున్నారు.... ఇక్కడకి వచ్చిన దగ్గర నుంచి పనులు అన్నీ మనం నిర్దేశించుకున్న లక్ష్యాలకు తగ్గటుగా పూర్తి అవుతున్నాయి అని చెప్తున్నారు... ఇక మనకు తిరుగులేదు, భవిష్యత్తు అంతా మనదే అనే భరోసా ఇస్తున్నారు...

ఈ సంతోషానికి కారణం లేకపోలేదు...ఎక్కడ కుర్చుని పని చెయ్యాలో తెలీక బస్సులో ఉంటూ, విజయవాడ నుంచి పాలన ప్రారంభించి, ఈ రెండు సంవత్సరాల్లో ఎన్నో ఆటు పోట్లు చుసిన రాష్ట్రానికి, ఇప్పుడు ఇప్పుడే రిజల్ట్స్ రావటం ప్రారంభించాయి... ఈ రెండు ఏళ్ళలో పడిన కష్టం తాలుకూ, ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి... మెజారిటీ ప్రజలు కూడా ప్రభుత్వం చేస్తున్న పనులకు, కృతజ్ఞత చూపిస్తున్నారు...

వెలగపూడి సచివాలయానికి వచ్చిన తర్వాత, పోలవరం ప్రాజెక్ట్ కు నిధులు కేటాయించండి అని కేంద్రానికి ఉత్తరం రాసారు... కేంద్రం దీనికి స్పందించింది... పోలవరం ప్రాజెక్ట్ కు 1981 కోట్ల రూపాయలు కేటాయించింది.... వెంటనే ఆంధ్రల జీవ నాడి అయిన, పోలవరం కాంక్రీట్ పనులు ప్రారంభం అయ్యాయి. అదే విధంగా రాష్ట్రానికి ఆర్ధిక లోటు రాకుండా చేస్తాం అని, అన్ని విధాలుగా ఆదుకుంటాం అని, కేంద్రం కూడా గట్టి హామీ ఇచ్చింది...

మరొకటి, రాయలసీమకు నీటి అవసరాలు తీర్చే, ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రారంభం... అలాగే పురుషోత్తపట్నం ఎత్తిపోతలకు శంకుస్థాపన చెయ్యటం.... 11వ తారీఖు పులివెందులకు నీళ్ళు ఇవ్వటం... గండికోట నిర్వాసితుల సమస్యలు పరిష్కారం అవ్వటం... కొత్తగా పెన్షన్ లు, రేషన్ కార్డులు ఇవ్వటం, జన్మభూమి బ్రహ్మాండంగా సాగటం... పెద్ద నోట్ల సమస్యలు ఒక కొలిక్కి రావటం... వర్షాలు తక్కువగా పడినా, పంటను కాపాడటం.. రాష్ట్ర వృద్ది రేటు పెరగటం...వెలగపూడి వస్తూనే, మొదటి సంతకం డ్వాక్రా మహిళలకు నిధుల ఫైలుపై సంతకం పెట్టటం. ఇవన్నీ రాష్ట్రానికి మంచి చేస్తున్నాయి, చంద్రబాబుకి వెయ్యి ఎనుగల బలాన్ని ఇస్తున్నాయి.. అన్నిటికీ మించి, ప్రజల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత రోజు రోజుకి పెరుగుతూ ఉండటంతో, చంద్రబాబు మొఖం వెలిగిపోతుంది...

భవిష్యత్తులో వెలగపూడి, అమరావతి రాజధానికి ఒక చిహ్నంగా నిలుస్తుంది. ఎవరు అమరావతికి వచ్చినా...వెలగపూడిలో రాజధాని నిర్మాణం ఈ భవనంతోనై మొదలైందని దీన్ని చూడటానికి వస్తారు. ఈ భూమి మహత్యం చాలా గొప్పది. ఈ సచివాలయం మనందరికి దేవాలయం వంటిది. భావితరాల భవిష్యత్తు నిర్ణయించేది. మన సమస్యల పరిష్కార వేదిక ఇదే. చంద్రబాబు తరుచూ చెప్తూ ఉంటారు, "చిన్నప్పుడు 'అ' అంటే 'అమ్మ' అని చదువుకున్నామని.. ఇకపై 'అ' అంటే 'అమరావతి', 'ఆ' అంటే 'ఆంధ్రప్రదేశ్‌' అన్న భావన ప్రతి ఒక్కరిలో రావాలి". ఈ స్పూర్తి ప్రతి ఒక్కరకీ ఉండాలి....

Advertisements

Advertisements

Latest Articles

Most Read