
స్వాస్థ్య విద్యావాహిని కార్యక్రమంతో రాష్ట్రంలో ప్రజలందరి ఆరోగ్యం కోసం ఒక నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుట్టినటు అవుతుందని ముఖ్యమంత్రి శ్రీ నారాచంద్రబాబునాయుడు చెప్పారు. విజయవాడ నగరంలో శనివారం వెన్యు కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాస్ట్ర విద్యావాహినిని ప్రారంభించారు. వైద్య విద్యార్థుల్లో సామాజిక స్పృహ పెంచడమే ఈ పథకం లక్ష్యం, వైద్య విద్యార్థులు ఏడాదిలో 10 సార్లు గ్రామాల్లో పర్యటించేలా పథకాన్ని రూపకల్పన చేశారు.
ఈ సందర్భంగా, వైద్య విద్యారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మనోజ్ఞ అనే విద్యార్థిని అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం అందరినీ ఆకట్టుకుంది. "మీరు సీఎంగా రోజూ ఎన్నో మీటింగ్లకు ఆటెండ్ అవుతుంటారు. ఎన్నో సమస్యలు చూస్తుంటారు. వీటి వల్ల మీకు పర్ఫెక్ట్ షెడ్యూల్ ఉండకపోవచ్చు. ఇలాంటి జీవన శైలితో ఒత్తిడి విసుగు వస్తుంటాయి. ఆయినా మీరు ఇంత యాక్షిప్గా ఉంటారు. ఎలా సాధ్యం" అని మనోజ్ఞ ప్రశ్నించారు. దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్తూ, పని మీద మనసుపెట్టి చేస్తే ఎలాంటి విసుగరాదని, నేను ఏ పనిచేసినా మనసు పెట్టి చేస్తా. పనిలో ఆనందం వెతుక్కుంటా, అందుకే అలసట నా దిరికి చేరదు. మీరు కూడా ఆనందంగా చదువుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. కష్టపడి ఆనే దాని కన్నా ఇష్టపడి పనిచేస్తే. ఏదైనా సాధ్యమే, ఆసాధ్యం ఆనే పదాన్ని వినడానికి కూడా ఇష్టపడనని సీఎం పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా ఆలోచించి ఇష్టంతో కష్ట పడితే వచ్చే ఫలితాలతో ఆనందం కలుగుతుంది. నువ్వు బాగా చదువుకో తల్లీ' ఆని మనోజ్ఞను దీవించారు.
అలాగే ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు, ప్రభుత్వ మెడికల్ కాలేజి విద్యార్దులతో పాటు సిదార్థ, పిన్నమనేని మెడికల్ కాలేజిల విద్యార్ధులు, ప్రభుత్వ నర్సింగ్ కాలేజికి చెందిన వైద్య విద్యార్ధులు ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అన్ని వృత్తులలో కంటే వైద్య వృత్తి చాలా కష్టమైందని, ఈ విద్యార్ధులు చాలా కష్టపడతారని జీవితంలో ఇంటర్ విద్య తరువాత 10-15 సంవత్సరాలు కష్టపడతారని, దీంతో వారు కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు దూరమవుతున్నారని తెలిపారు.

