చంద్రబాబు ప్రభుత్వం సనాతమైన సరి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది... రాష్ట్రంలోని నిరు పేదల కోసం తీర్ధయాత్రలను దర్శించుకునే అవకాశాన్ని కలిగిస్తోంది. జీవితంలో ఎప్పుడు తీర్థయాత్రలు దర్శించుకోని హిందువల కోసం దివ్యదర్శనం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈ తీర్థయాత్రలకు వెళ్లే వారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మక్కా వెళ్లేందుకు ముస్లింలకు, ఇజ్రాయెల్ వెళ్లేందుకు క్రైస్తవలకు ప్రభుత్వం సహకారం అందిస్తోంది. తాజాగా హిందువలకు కూడా తీర్థయాత్రల అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దివ్యదర్శనం కార్యక్రమంతో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు తీర్థయాత్రల దర్శన భాగ్యం కలుగనుంది.

తీర్థయాత్రలకు ఆర్టీసీ బస్ సర్వీసులను దేవాదాయ శాఖ వినియోగిస్తోంది. తీర్థయాత్రలకు వెళ్లేవారికి ఎవరూ కూడా రూపాయి ఖర్చుపెట్టాల్సిన పనిలేకుండా అన్నీ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఆయా రూట్ల వారీగా కోఆర్డినేటర్ల ద్వారా, దేవస్థానాలతో మాట్లాడి, భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దేవాదాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన దగ్గర్నుంచి, ఏటా ఒక్కో జిల్లా నుంచి పది వేల మందిని తీర్ధయాత్రలకు తీసుకెళ్తారు. అలా తీసుకెళ్లడమే కాకుండా వారిని యాత్రకు తీసుకెళ్లిన దగ్గర్నుంచి తిరిగి తీసుకు వచ్చేవరకు బాధ్యతనంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. భక్తులకు ముందుగా ప్రణాళికబద్దంగా వసతి, భోజన సదుపాయాలతో పాటు, దర్శనం కలిగించడం, తీర్ధ ప్రసాదాలు అందించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆయా ఆలయాల్లో జరిగే కార్యక్రమాల్లో భక్తులు పాల్గొనేందుకు సైతం ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌకర్యం:
తీర్థయాత్రలకు వెళ్లదలచినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. ఏపీఎండోమెంట్స్ ద్వారా ఆసక్తి గల హిందువులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలా కాకుండా దరఖాస్తును నేరుగా సంబంధించి మండలానికి చెందిన వ్యక్తులు తహసీల్దార్ కార్యాలయాల్లోని డ్రాప్ బాక్సులో వేయవచ్చు.

దివ్యదర్శనం కింద తీసుకెళ్లే ఆలయాలివే :
దివ్యదర్శనం కింద రాష్ట్రంలోని అతిపెద్ద నాలుగు దేవాలయాలకు భక్తులను తీసుకెళ్లారు. అరసవెల్లి సింహచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, విజయవాడ దుర్గగుడి, అమరావతి, మంగళగిరి, త్రిపురాంతకం, శ్రీశైలం, మహానందీ, అహోబిలం, కసాపురం, ఒంటిమిట్ట, జొన్నవాడ, శ్రీకాళహస్తి తిరుపతి, కాణిపాకం క్షేత్రాల్లో నాలుగు క్షేత్రాలు వీటిలో ఉంటాయి.

శ్రీ వెంకటేశ్వరుని దర్శనం తప్పనిసరి :
తీర్ధయాత్రలకు వెళ్లేవారు ఏవైతే చూడలేదని భావిస్తారో ఆ క్షేత్రాల దగ్గరకు తీసుకెళ్లేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. హిందువలు అతి పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం, దివ్యదర్శనం ప్రాజెక్టులో ముఖ్యమైనది. తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనం ప్రతి భక్తుడికి తప్పనిసరిగా ఉండేలా ఏర్పాట్ల చేశారు. దేవాదాయ శాఖ, టిటిడి సౌజన్యంతో ఏర్పాట్ల బాధ్యత చేసుకుంటుంది.

ఎస్సీ, ఎస్బీ, బీసీ వర్గాలకు ప్రాధాన్యత:
ముందుగా చెప్పినట్లుగా ఈ కార్యక్రమం ఎస్సీ, ఎస్బీ, బీసీ వర్గాలను తీర్ధయాత్రలకు తీసుకెళ్లేందుకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయా వర్గాలలోని నిరు పేదలు దైవ దర్శనం వెళ్లడం దుర్లభమవుతున్న నేపధ్యంలో వారిలో ఆత్మస్తైర్యాన్ని నింపి సనాతన సంప్రదాయం ఔనత్యాన్ని పెంపొందింపజేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ఎంపిక చేసే వారిలో 80 శాతం మంది ఈ వర్గాలవారుంటారు. అగ్రవర్ణ పేదలకు సైతం అవకాశం ఉంటాయి.

ఏడాదికి ఒక్కో జిల్లా నుంచి 10 వేల మందికి ఛాన్స్:
ఈ పథకం కింద 18 నుంచి 70 ఏళ్ల వయసు ఉన్నవారిని దైవదర్శనం పథకం కింద తీర్థయాత్రలకు తీసుకెళ్తారు. ఒక్కో కుటుంబం నుంచి గరిష్టంగా ఐదుగురిని మాత్రమే తీసుకెళ్తారు. ముందుగా అనుకున్నవిధంగా ఆయా జిల్లాల నుంచి పది వేల మందిని విడతల వారీగా దైవదర్శనం పథకం కింద తీర్థయాత్రలకు తీసుకెళ్లనున్నారు. దివ్యదర్శనం కింద ఏడాదికి ఒక్కో జిల్లా నుంచి 10 వేల మందిని తీర్ధయాత్రలకు తీసుకెళ్తారు. ఏటా రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి లక్షా 80 వేల మందికి ఈ అవకాశం లభిస్తుంది. దివ్యదర్శనం యాత్ర ఆయా ప్రాంతాలను బట్టి నాలుగు నుంచి ఐదు రోజులపాటు సాగుతుంది.

ప్రతి వారం మండలానికి 200 మందికి అవకాశం:
దివ్యదర్శనం కార్యక్రమం ద్వారా ఎలాంటి ఆదాయ పరిమితి నిబంధన లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారికి ఈ పధకం కింద దివ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. ఆయా మండలంలో 200 కంటే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్న నేపధ్యంలో లాటరీ ద్వారా సభ్యుల ఎంపిక జరుగుతుంది. 200 కంటే తక్కువ దరఖాస్తు చేసుకుంటే సభ్యులందరినీ దివ్యదర్శనం కార్యక్రమానికి తీసుకెళ్లారు.

ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా భక్తులు తీర్థయాత్రలను దర్శించి ఇంటికి క్షేమంగా చేరవేసే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంది..

Advertisements

Advertisements

Latest Articles

Most Read