ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో, తన పాదయాత్రలో వికలాంగుల కష్టాలకు చేలించిపోయి, 200 రూపయలు ఉన్న వికలాంగుల పెన్షన్ ని, 1500కి పెంచుతా అని హామీ ఇచ్చి, ప్రమాణస్వీకారం చేసిన రోజే, ఫైల్ పై సంతకం చేసి, రాష్ట్రంలోని వికలాంగుల అందరికీ, 1500 పెన్షన్ ఇస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు...

ఒకటో తారీఖునే పింఛను ఇచ్చి, ఈ సమాజంలో మేమేమి తక్కువ కాదు, అని ఆత్మగౌరవంతో బ్రతికేలా చేస్తున్నారు... వారి కనీస అవసరాలకి వీలుగా, వికలాంగులకి తోడుగా చంద్రబాబు ప్రతి నెలా పెన్షన్ లు అందిస్తున్నారు...

ప్రస్తుతం రాప్ర వ్యాప్తంగా 45.68 లక్షల మందికి పింఛన్లను ఇస్తుండగా, వారిలో వికాలంగుల పెన్షన్ తీసుకునే వారు 5,72,075 మంది ఉన్నారు... జిల్లాల వారీగా పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళంలో 32,257 మంది, విజయనగరంలో 37,376, విశాఖలో 40,361, తూర్పుగోదావరిలో 63,403, పశ్చిమగోదావరిలో 50,849, కృష్ణాలో 50,542, గుంటూరులో 44,338, ప్రకాశంలో 35,385, నెల్లూరులో 31,271,చిత్తూరులో 50,465, కడపలో 33,785, కర్నూలులో 42,967, అనంతపురంలో 59,076 మంది నిరుపేద వికలాంగులు ప్రతినెల రూ.1500 చొప్పన పింఛను తీసుకోవడం జరుగుతోంది.

ఎవరు అర్హులు:
18 సంవత్సరాల వయస్సు పైబడిన వికలాంగులు ఎవరైనా పింఛనుకు అర్జులే. కనీసం 40శాతం వికలాంగత్వం ఉంటేనే పింఛను వచ్చే అవకాశం ఉంటుంది.

ఎన్టీఆర్ భరోసా పథకం కింద వికలాంగ పింఛను ఎలా దరఖాస్తు చేసుకోవాలి

  • సదరన్ సర్టిఫికేట్ తప్పనసరి
  • వికలాంగత్యం నిర్ధారించేందుకు నిర్వహించే సదరన్ క్యాంప్కు వెళ్లి అక్కడ వైద్యులతో పరీక్షలు చేయించుకుని వికలాంగ ధృవ పత్రం పొందాలి.
  • ముందుగా ఆ మండలానికి చెందిన ఎంపీడీవో వద్ద ఉన్న ఫారం పూర్తి చేయాలి. ఎంపీడీవో సంతకం పెట్టాకే సదరన్ క్యాంపుకు వెళ్లాలి.
  • వికలాంగుల ధ్రువీకరణ పత్రం సదరన్ క్యాంప్ వారు చేతికి ఇవ్వకుండా అభ్యర్థులున్న ప్రాంతాల్లోని మండల పరిషత్ కార్యా లయాలకే పంపుతారు.
  • కృష్ణా జిల్లాలో అయితే మచిలీపట్నం జిల్లా ప్రభుత్యాస్పత్రిలో ప్రతి మంగళవారం, విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ లో ప్రతి శుక్ర వారం సదరన్ క్యాంప్లు జరుగుతాయి.
  • మానసిక వికలాంగులకు సంబంధించి గుడివాడ, విజయవాడ డివిజనుల ప్రజలకు విజయవాడలో శుక్రవారం పరీక్షలు చేస్తారు.
  • 18 సంవత్సరాల పైబడిన వికలాంగులు ఎవరైనా పింఛనుకు అర్జులే. కనీసం 40శాతం వికలాంగత్వం ఉంటేనే పింఛను వచ్చే అవకాశం ఉంటుంది.
  • ఆ ధృవపత్రం వచ్చాక మండల పరిషత్ కార్యాలయం సుంచి పింఛను దరఖాస్తుకు ఆన్లైన్ లో పెడతారు.
  • ఒక ఇంట్లో వికలాంగ పింఛను ఉన్నా మరొకరికి వికలాంగత్యం ఉన్నా వారికీ కూడా పింఛను వస్తుంది.
  • 40 నుంచి 80 శాతం వరకు వికలాంగత్యం ఉన్న పింఛనుదారునకు రూ.1,000...వంద శాతం వికలాంగత్యం ఉన్న వారికి రూ.1500 పింఛను ప్రభుత్వం ఇస్తుంది...

ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా జరుగుతుంది.. నిజమైన అర్హులకే పెన్షన్ అందుతుంది... http://ntrbharosa.ap.gov.in/NBP/homePage.do వెబ్సైటు ద్వారా, ప్రతి నెలా ఎన్ని పెన్షన్లు తీసుకున్నారు... మీ ఊరిలో, మీ వార్డ్ లో ఎవరు పెన్షన్ తీసుకున్నారో కూడా తెలుసుకోవచ్చు... అంతే కాదు, ఏ తారీఖును, ఏ సమయంలో పెన్షన్ తీసుకున్నారో కూడా ఈ వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read