రాష్ట్రంలో సుమారు 22 లక్షల నిరుపేద వృద్ధులకి పెద్ద కొడుకు అతను... భారమై ఒకరు... మరొక కారణంతో ఒకరు, తమ తల్లి తండ్రులని జీవితపు చరమాంకంలో వదిలేస్తుంటే, వారికి భరోసా అతను.... ఒంట్లో ఓపిక లేని నిరుపేద వృద్ధులకి భారసో అతను... ఒకరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో బ్రతుకుతున్న ఆ పండుటాకులకి భరోసా.... జీతాల మాదిరి, ప్రతినెలా ఒకటో తేదీనే ఆ వృద్ధులకి అందిస్తున్న భరోసా... ఆ భరోసా పేరే నారా చంద్రబాబు నాయుడు... ఆ భరోసానే ఎన్టీఆర్ భరోసా... పేదలకు నెలకు వెయ్యి రూపాయల పింఛన్ తో సంక్షేమానికి సరికొత్త నిర్వచనమిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. 2014 అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున ప్రారంభమైన ఈ కార్యక్రమం రాష్ట్ర సంక్షేమ చరిత్రలో కొత్త అధ్యాయన్ని లిఖిస్తోంది. దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా రికార్డు సృష్టిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ లేనంత మందికి జీవనభృతిని అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ఎంతో మంది నిరుపేద వృద్ధులకి భారసో ఇస్తుంది...

సమాజంలో కుటుంబ సభ్యుల ఆదరణ కరవై, వయసు పై బడటంతో పనిచేయడానికి శరీరం సహకరించక దుర్భర జీవితాలను అనుభవించే వయో వృద్దుల జీవితాల్లో ఈ పధకం నూతన వెలుగునునింపతోంది. పునర్విభజన తరువాత రాష్ట్రం రూ.16 వేల కోట్లు లోటుతో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేపట్టిన రోజనే రూ.200గా ఉన్న పింఛన్ను రూ.1000 పెంచుతూ రెండవ సంతకం చేశారు. ఎన్నో సమస్యలు, సవాళ్లతో బండిని నడుపుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంక్షేమ విషయంలో మాత్రం వెనకడుగేయలేదు. ఇచ్చినమాటకు కట్టుబడి పేల సంక్షేమాన్ని ఐదు రెట్లు పెంచి పింఛన్ అందించారు. పింఛన్ల అందించడంలోనూ ఎన్నో సంస్కరణలు చేపట్టి అర్హులకు అందేలా ప్రభుత్వం చూస్తోంది... ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా సామాజిక బద్రతా పించనుల పథకం ద్వారా సుమారు రూ.6500 కోట్లు సంవత్సరానికి ఖర్చు చేయ్యడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో సుమారు 45 లక్షల నిరుపేదల వృద్ధులకి, దివ్యాంగులకు, ఒంటరి వితంతువులకు, కల్లు గీత కార్మికులకు,చేనేత కార్మికులకు, ఎయిడ్స్ రోగులకు ఈ పెన్షన్ లు ఇస్తున్నారు..

ప్రస్తుతం రాప్ర వ్యాప్తంగా 45.68 లక్షల మందికి పింఛన్లను ఇస్తుండగా, వారిలో వృద్ధులు 21,18,203, వితంతువులు 16,94,682, దివ్యంగులు 5,73,697 మంది, చేనేత కార్మికులు 76,991 మంది, కల్లుగీత కార్మికులు 16,664 మంది ఉన్నారు. సామాజిక భద్రత దిశగా పంపిణీ చేస్తున్న ఈ పింఛన్ల పథకానికి చంద్రబాబు ప్రభుత్వం 2013-14 లో రూ.1,410 కోట్లు కేటాయించగా, 2014-15లో రూ.3,811 కోట్లు, 2015-16 లో 5,308 కోట్లు, 2016-17లో రూ.5,477 కోట్లు, 2017-18లో రూ.5,906 కోట్లను కేటాయించడం జరిగింది. ఈ ఏడాది పింఛనను ప్రతి నెల 46.18 లక్షల మందికి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను కేటాయించడం జరిగింది.

వృద్ధులకు ప్రతి నెల రూ.220.93 కోట్లు పంపిణీ:
సామాజిక భద్రతలో భాగంగా అమలు చేస్తున్న పింఛను పథకం క్రింద భారత ప్రభుత్వం వృద్ధులకు కేవలం రూ.200 మాత్రమే చెల్లించడం జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కేంద్రం నుంచి వస్తున్న రూ.200కు తోడు మరో రూ.800 కలిపి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు అర్హత పొందిన 21,18,203 మంది వయోవృద్ధులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పన ప్రతి నెల ఇవ్వడం జరుగుతోంది. దీనికోసం ప్రతినెలా రూ.220.93 కోట్లు ఖర్చుచేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం ఏడాది మొత్తానికి రూ.2651.16 కోట్లను కేటాయించడం జరిగింది. నిర్భాగ్యులు, నిస్సహాయులైన వృద్ధులకు పింఛన్లు నేరుగా అందేలా, ఎటువంటి దళారుల ప్రమేయం లేకుండా ఉండేందుకు ఆధార్ అనుసంధానంతో కూడిన బయోమెట్రిక్ విధానం ద్వారా పించను ఇవ్వటం జరుగుతుంది.

వృద్ధులకు భారంగా భావించే సంస్కృతి కేవలం నిరుపేద కుటుంబాలే పరిమితం కాలేదని చెప్పవచ్చు. మధ్యతరగతి, ధనిక వర్గాల్లో కూడా వృద్ధుల దుర్భర జీవితాలను అనుభవిస్తున్నారనేది అక్షర సత్యం. బ్రతికి ఉండగానే స్మశాన వాటికల్లో వృద్ధులను వదలి వెలుతున్న ఈ రోజుల్లో, ముఖ్యమంత్రి చంద్రబాబు వయో వృద్ధుల జీవితాలకు భద్రత కల్పిస్తూ అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛనుతో వారికి సామాజిక భద్రతను కల్పించడం జరిగింది. ప్రతి నెల వస్తున్న రూ.1000 పింఛనును తమ కుటుంబ సభ్యులకు ఇస్తూ వారి నుంచి సేవలను గౌరవప్రదంగా నేడు వృద్దులు పొందుతున్నారని చెప్పవచ్చు.

జిల్లాల వారీగా పింఛన్లు తీసుకుంటున్న వారి వివరాలను పరిశీలిస్తే శ్రీకాకుళంలో 1,47,792 మంది, విజయనగరంలో 1,21,870, విశాఖలో 1,51,732, తూర్పుగోదావరిలో 2,28,733, పశ్చిమగోదావరిలో 1,91,526, కృష్ణాలో 1,48,194, గుంటూరులో 1,85,778, ప్రకాశంలో 1,58,775, నెల్లూరులో 1,13,174,చిత్తూరులో 2,01,486, కడపలో 1, 25, 905, కర్నూలులో 1,45,771, అనంతపురంలో 2,02,467 మంది నిరుపేద వయో వృద్ధులు ప్రతినెల రూ.1000 చొప్పన పింఛను తీసుకోవడం జరుగుతోంది.

ఎవరు ఈ వృద్ధాప్య పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు ?
65 సంవత్సరాలు నిండిన నిరుపేద కుటుంబానికి చెందిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు...

ఎక్కడ అప్లై చేసుకోవాలి ?
వృద్ధులు నివసించే పంచాయితీలో కాని, వార్డ్ లో కాని అప్లై చేసుకోవాలి... తరువాత జన్మ భూమి కమిటి స్క్రూటినీ చేసి, MPDOకి కాని, మునిసిపల్ కమీషనర్ కి కాని ఫార్వర్డ్ చేస్తారు... అక్కడ అన్నీ సవ్యంగా ఉంటే, వెంటనే పెన్షన్ ని ఆమోదిస్తారు... తరువాత నెల నుంచి, పెన్షన్ వస్తుంది.

ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా జరుగుతుంది.. నిజమైన అర్హులకే పెన్షన్ అందుతుంది... http://ntrbharosa.ap.gov.in/NBP/homePage.do వెబ్సైటు ద్వారా, ప్రతి నెలా ఎన్ని పెన్షన్లు తీసుకున్నారు... మీ ఊరిలో, మీ వార్డ్ లో ఎవరు పెన్షన్ తీసుకున్నారో కూడా తెలుసుకోవచ్చు... అంతే కాదు, ఏ తారీఖును, ఏ సమయంలో పెన్షన్ తీసుకున్నారో కూడా ఈ వెబ్సైటు ద్వారా తెలుసుకోవచ్చు... ఇంత పారదర్శకంగా జరుగుతున్న ఈ పధకం, దేశానికే ఆదర్శం అయ్యింది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read