పేద మహిళల అభ్యున్నతికి చంద్రబాబు ప్రభుత్వం స్త్రీ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది. గ్రామీణ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో స్త్రీనిధి ద్వారా ప్రభుత్వం రుణాలు అందజేస్తోంది. పేద మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న లక్ష్యంతో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నది. దీనిని అర్హులు వినియోగించుకుని ఆర్థికంగా తమ పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చు. స్త్రీ నిధి రుణాన్ని స్వయం సహాయక గ్రూపు ద్వారా తీసుకోవచ్చు.

స్త్రీ నిధి పొందాలంటే స్వయం సహాయక గ్రూపులో మహిళలు తమ సంఘం అధ్యక్షురాలి వద్ద లేదా బాధ్యురాలి వద్ద ఉన్న నిర్ధారిత ఫోన్ నెంబర్ ద్వారా రుణం కోరవచ్చు. రుణం తీసుకున్న తరువాత రీపేమెంట్ వివరాలు, తదితరాలు అన్నీ కూడా ఆ ఫోన్ ద్వారానే చెపుతారు. ఈ ప్రక్రియలో దళారులకు చోటు ఉండదు. కోరిన రుణం మొత్తం నేరుగా బ్యాంకు ద్వారా చేతికే అందుతుంది. కమీషన్ల బాధ కూడా ఉండదు. ముఖ్యంగా స్త్రీ నిధి రుణం పొందాలంటే స్వయం సహాయక గ్రూపు సభ్యులై ఉండాలి.

ఈ సంఘానికి సొంత మొబైల్ ఫోన్ ఉండాలి. ఈ ఫోన్ సంఘం అధ్యక్షురాలి వద్ద ఉంచాలి. ఒక వేళ ఆమె అందుబాటులో లేకపోతే బాధ్యత గల మరో సభ్యురాలి వద్ద మొబైల్ను ఉంచాలి. పగటిపూట పోన్ ఆన్లోనే ఉంచాలి. వేరే సిమ్ పెట్టకూడదు. పిన్ నెంబరును మార్చుకోవచ్చు గాని, పిన్ నెంబరును ఇతరులకు చెప్పకూడదు. మొబైల్ నెంబరును బ్యాంక్లో నమోదు చేసుకున్నట్లయితే, దానిలో రుణ మొత్తం, రీపేమెంట్ వివరాలు తదితరాలు అన్నీ తెలుస్తాయి.

రుణం ఎలా అడగాలంటే...
గ్రామ సంఘం అధ్యక్షురాలి మొబైల్ నెంబరుకు ఫోన్ చేస్తే చాలు, స్త్రీ నిధి సంస్థకు దరఖాస్తు వెళుతుంది. ఫోన్ చేసిన తరువాత అటు నుంచి వచ్చే రిక్వైర్మెంట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. గ్రామ సంఘం పిన్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత అప్పు కోసం అయితే ఫోన్లో 1 ని నొక్కాలి. ఆ తరువాత స్వయం సహాయక గ్రూప్ షార్ట్ కోడ్ నమోదు చేయాలి. దీంతో ఏ స్వయం సహాయ గ్రూప నుంచి దరఖాస్తు చేసుకుంటున్నారో తెలుసుకోవడానికి మరలా 1 ను నొక్కాలి. దీంతో ఎంత మొత్తం తీసుకోడానికి అర్హులో పోన్లోనే తెలుస్తుంది. ఆ తరువాత సభ్యురాలి షార్ట్ కోడ్ తెలుసుకుంటారు. ఆ తరువాత నంబర్ కోడ్ నమోదు చేసిన తరువాత అప్పు కావాల్సిన మొత్తం, అప్పు అవసరం తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. దీంతో అప్పుకోసం పెటుకున్న దరఖాస్తు పూర్తయిందని మెసేజ్ వస్తుంది.

ఎంత రుణం ఇస్తారు
స్త్రీనిధి ద్వారా మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు తమ ఆదాయాన్ని పెంచేందుకు వారు చేపట్టే జీవనోపాధి కార్యక్రమాలకు కావాలసిన రుణాలతో పాటు వారి వ్యక్తిగత అవరాలకు కూడా రుణాలు అందిస్తారు. స్త్రీ నిధిలో వైద్యం కోసం రూ.15 వేలు, పిల్లల విద్య కోసం రూ.25 వేలు, ఆడపిల్ల వివాహానికి రూ.25 వేలు, వ్యవసాయ అవసరాల కోసం రూ.20 వేలు, పాల వ్యాపారాన్ని చేసేందుకు రూ 25 వేలు, వ్యాపారం కోసం రూ 25 వేల చొప్పున రుణాలు ఇస్తారు. స్త్రీ నిధి ద్వారా రుణం తీసుకోవడం, పొదుపు చేయడం, బీమా సౌకర్యం కల్పించడం, నగదు బదిలీ వంటి సేవలను అందుకోవచ్చు. స్త్రీ నిధి ద్వారా ఒక్కో స్వయం సహాయక సంఘానికి రూ 2.50 లక్షలు, జీవనోపాధి సభ్యురాలికి రూ. లక్ష వరకు రుణం ఇచ్చే వెసులుబాటు ఉంది. గ్రామీణ గిరిజన పట్టణ ప్రాంతాల్లో, మారుమూలల్లో ఉన్న డ్వాక్రా మహిళలకు సాంకేతిక, ఎలక్రానిక్ పేమెంట్ విధానంలో 48 గంటల్లో రుణం అందించడం స్త్రీ నిధి పత్యేకత.

స్త్రీ నిధి కార్యాలయం విజయవాడలో ఎక్కడంటే:
స్త్రీ నిధి నిర్వహణకు సంబంధించి స్త్రీ నిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ ప్రత్యేకంగా ఒక విభాగం, ఆర్టీసీ కాంప్లెక్సులోని ఎన్టీఆర్ పరిపాలనా భవనంలో రెండో అంతస్తులో నడుస్తుంది.

స్త్రీనిధిలో రుణం తీసుకోవడం, చెల్లించడం, ఇంకా ఇతర విధి విధానాలు, స్త్రీ నిధిలో రుణం తీసుకున్న వారికి అవసరమైన సూచనలు ఇవ్వడం, సలహాలు ఇవ్వడం వంటి అనేక కార్యక్రమాలపై వివరాలు అందించేందుకు గ్రామ సంఘాలకు కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read