తల్లీ బిడ్డల సంక్షేమమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న పథకానికి శ్రీకారం చుడుతోంది. పీహెచసీ నుంచి జిల్లా ఆస్పత్రి వరకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవమైన తల్లీ బిడ్డ, వారితో ఉన్న కుటుంబ సభ్యులను ఉచితంగా వారింటికి క్షేమంగా చేరవేయడమే లక్ష్యంగా తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ అనే పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ప్రారంభించింది. నిరు పేద నిండు గర్భిణలకు ‘తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్’ ఒక వారం లాంటిది. 102కు కాల్ చేయడం ద్వారా 24 గంటలూ ఎప్పుడైనా వైద్యసేవలు పొందవచ్చు. ప్రసవ సమయంలో మాతా ,శిశు మరణాలను అరికట్టేందుకు 102 సర్వీసులను చంద్రబాబు ప్రారంభించారు. ఫోన్ చేసిన 30 నిమిషాల్లోగా వాహనం వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది.

జీపీఎస్ వ్యవస్థ కలిగిన తల్లీ - బిడ్డ ఎక్స్ ప్రెస్ లను కొత్తగా ప్రవేశపెట్టింది. ప్రభుత్వాస్పత్రులకు గర్భిణులను తీసుకువచ్చి ప్రసవం తర్వాత తల్లీబిడ్డను క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకువెళ్లేందుకు వీటిని వినియోగిస్తున్నారు. ఈ తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు ఇప్పటి వరకు నాలుగు లక్ష మందికిపైగా మాతృమూర్తులకు సేవలందించాయి. ఇ- ఔషధి, మాతాశిశు ఆరోగ్యం కోసం 102, తల్లీబిడ్డ ఎక్స్ ప్రెస్ లను తీసుకువచ్చిన ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ, అత్యవసర ఆరోగ్య సేవల కోసం 108 కాల్ సెంటర్, సంచార ఆరోగ్య సేవలకు 104 కాల్ సెంటర్ను తీసుకువచ్చింది.

ఈ సేవలు పొందే సమయంలో తల్లీబిడ్డలకు ఏదైనా అసౌకర్యం కలిగితే తక్షణమే 102 కాల్‌సెంటర్‌కి ఫిర్యాదు చేసే సౌకర్యం కూడా ఉంది, ఇలా అందుకున్న ప్రతి ఫిర్యాదుకు జీవీకే ఈఎంఆర్‌ఐ సర్వీసుల్లో నెగెటివ్‌ పాయింట్లు జమ అవుతుంటాయి. నెగెటివ్‌ పాయింట్ల ఆధారంగా జీవీకే అనే కాంట్రాక్టు సంస్థకి చెల్లించాల్సిన డబ్బులు ప్రభుత్వం తగ్గిస్తుంది..

ఉచిత రోగ నిర్ధరణ పరీక్షలు (డయాగ్నోస్టిక్స్ సేవలు) :-
సాధారణంగా గర్భిణీ స్త్రీలకు..ప్రసవానికి ముందు, ప్రసవం తరువాత కచ్చితంగా ఖర్చుతో కూడుకున్న వైద్య పరీక్షలు చాలానే ఉంటాయి. ఉదాహరణకు సిటీ స్కాన్ ఒక్క పరీక్షకే రూ. 3వేలు ఖర్చు అవుతుంది. ఇక స్కానింగ్ చేయించాలంటే రూ. 1500-2000 ల వరకూ ఉంటుంది. ప్రతి గర్భిణీ ఐదో నెలలో తప్పక చేయించుకునే టిఫా టెస్ట్ కూడా రూ. 3వేల వరకూ ఉంటుంది. మిగతా పరీక్షల ధర కూడా కనీసం రూ. 1000 చెల్లించక తప్పడం లేదు. ఇలా ఎంతో మంది కష్టాలను తీర్చేందుకు..ప్రభుత్వం పరీక్షలన్నింటినీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఉచితంగా అందించనుంది.

జీపీఎస్ తో తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనం:-
గర్భిణీ స్త్రీలు ఒకవేళ ఒంటరిగా వైద్య పరీక్షల కోసం ఆస్పత్రులకు వచ్చి ఇంటికి తిరిగి వెళ్లలేని పరిస్థితి ఏర్పడితే ‘తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్’ అనే ప్రత్యేక వాహనంలో ఇంటికి సురక్షితంగా చేర్చే బాధ్యతనూ నెరవేర్చనుంది. వారి రక్షణకోసం వాహనానికి జీపీఎస్ ( గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) సాంకేతికతతో పాటు మంటలను ఆర్పే పరికరాలు అమర్చనున్నారు. ఈ వెబ్సైటు లోకి వెళ్తే, ఆ వాహనం ఎక్కడ ఉందో, లైవ్ ట్రాకింగ్ లో తెలిసిపోతుంది... http://thallibiddaexpress.in/102tbe/Home.aspx

ఇప్పటి వరకు నాలుగు లక్షల మందికి లభ్ది:
జిల్లాల వారీగా తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సహాయం తీసుకున్న వారిని పరిశీలిస్తే, శ్రీకాకుళంలో 22264 మంది, విజయనగరంలో 24389, విశాఖలో 47289, తూర్పుగోదావరిలో 48869, పశ్చిమగోదావరిలో 26323, కృష్ణాలో 28585, గుంటూరులో 27945, ప్రకాశంలో 19497, నెల్లూరులో 17523, చిత్తూరులో 43666, కడపలో 20461, కర్నూలులో 41448, అనంతపురంలో 36825 మంది తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ సహాయం తీసుకోవడం జరుగింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read