సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చేనేత వృద్దాప్య పింఛన్ను రూ. 200 నుంచి రూ. 1000కి పెంచింది. ఇప్పటివరకు రూ.85 కోట్ల రుణమాఫీ చేసి ఆర్ధిక చేయూతను అందించింది. వ్యవసాయం తరువాత అధికంగా చేనేతపైనే అధారపడి అనేక కుటుంబాలు ఉన్నట్లుగా ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో 2.5లక్షల మంది చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారు.

దీనిలో భాగంగా చేనేత కార్మికుల ప్రయోజనాలకై కేంద్ర ప్రభుత్వం సామూహిక సదుపాయాల కేంద్రాలు, శిక్షణ, డైయింగ్ యూనిట్లు, డిజైన్ డెవలప్ మెంట్, టెక్నాలజీ వినియోగానికి బ్లాక్ స్థాయిలో గ్రూపులను ఏర్పాటు చేసి రూ.2 కోట్లను కేటాయించింది. ఇటువంటి 17 క్లస్టర్లను రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం మంజూరు చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఉన్న 25 వేల మంది చేనేత కార్మికులను ఆదుకునేందుకు సమీకృత చేనేత సమూహాల అభివృద్ధి పథకాన్ని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేయనుంది. ఈ రెండు జిల్లాల్లోనే 31 సిఎఫ్సిలు ఏర్పాటు చేయనున్నారు.

అలాగే చేనేత కార్మికుల కోసం పొదుపు పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనిలో కార్మికుడు 8 శాతం, రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో 8 శాతాన్ని చెల్లిస్తుంది. ఈ మొత్తాన్ని త్రిఫ్ట్ ఫండ్ ఖాతాలో జమ చేస్తారు. 2016-17 సంవత్సరానికి సంబంధించి రూ.267.89 లక్షలు 2,298 మంది చేనేత కార్మికులకు పొదుపు మొత్తం నుంచి రుణాలు అందచేశారు.

2016-17కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 73,368 మంది చేనేత కార్మికులు వృద్ధాప్య పింఛన్లు ప్రయోజనాన్ని పొందుతున్నారు. 2017-18 సంవత్సరంలో అదనంగా మరో 25 వేల మందికి వృద్ధా ప్యపింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

చేనేత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ ఋనకర్ భీమా యోజన కింద బీమా సౌకర్యాన్ని కల్పించింది. చేనేత కార్మికులు రూ.80లు చెల్లిస్తే బీమా సౌకర్యంతో పాటు వారి కుటుంబంలో ఇద్దరు పిల్లలు చదువుకునేందుకు ఉపకార వేతనాలు కూడా అందజేస్తారు. ప్రమాదవశాత్తు మరణించినా, శాశ్వత అంగవైకల్యం సంభవించినా రూ.5లక్షల పరిహారం చెల్లిస్తారు. సాధారణ మరణం, పాక్షిక అంగవైకల్యానికి కూడా పరిహారం అందిస్తారు. 2017-18 సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 56,593 మంది చేనేత కార్మికులను ఈ బీమాలో చేర్పించారు.

అప్పల ఊబిలో చిక్కుకున్న చేనేత కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేసింది. ఇప్పటివరకు 23,897 మంది చేనేత కార్మికులు రూ. 85 కోట్ల లబ్దిని పొందారు. వీటిలో 527 స్వయం సహాయక గ్రూపులు కూడా ఉన్నాయి. 2014 నుంచి 2016 సెప్టెంబర్ వరకు ఉన్న వడ్డీని సైతం ప్రభుత్వం మాఫీ చేసింది.

మైక్రో యూనిట్ డెవలప్ మెంట్రీ ఫైనాన్స్ ఏజెన్సీ (ముద్ర) పథకం ద్వారా బ్యాంక్లు, చేనేత పారిశ్రామికవేత్తల నుంచి కార్మికులకు రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. నూలు ఉత్పత్తులకు రూ. 50వేలు, సిల్క్ ఉత్పత్తులకు లక్ష రూపాయలు, గ్రూపులకు రూ.5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రాజెక్టు ఖర్చులో 20 శాతం సబ్సిడీ ఇస్తారు. 2016-17లో 724 మందికి రూ. 392.45 లక్షలు. 2017-18లో 334 మంది చేనేత కార్మికులకు రూ.187.50 లక్షలు రుణాలను ఇచ్చారు.

చేనేత సహకార సంఘాలు, జాతీయ చేనేత అభివృద్ధి కార్పొరేషన్ ఏపీ సివో ద్వారా చిలువనూలు, రంగులు, ఇతర రసాయనాలపై రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం రాయితీని చేనేత కార్మికులకు అందిస్తోంది. ఈ పథకానికి సంబంధించి 2016-17లో రూ.706.79లక్షలు, 2017-18లో రూ.800 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

ప్రాథమిక చేనేత సహకార సంఘ సభ్యుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.12,500లు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటి వరకు 428 కుటుంబాలకు రూ. 58.49 లక్షల ఎక్స్గ్రేషియాను ప్రభుత్వం చెల్లించింది.

ప్రైవేట్ ఉత్పత్తులకు ధీటుగా చేనేత, ఆప్కో వస్త్రాలను తయారు చేస్తున్నారు. సుమారు 200 కొత్త డిజైన్లను ఆప్కో ద్వారా రూపొందించారు. విజయవాడ, వరకు రూ.11కోట్ల అమ్మకాలు, ఈ మూడు కేంద్రాల్లోనే జరిగాయి, మిగిలిన ప్రధాన నగరాల్లో కూడా షోరూంలను ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ కార్పొరేషన్ చర్యలు చేపట్టింది. చేనేత ఉత్పత్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా కార్పొరేషన్ చర్యలు తీసుకుంది. 2014 నుంచి జలై 2017 వరకు రూ. 51 లక్షల విలువైన విక్రయాలు జరిగాయి. వివిధ దేవస్థానాల్లో భక్తుల కోసం చేనేత ధోవతీలు, తువాళ్లను తక్కువ ధరకు అందుబాటులో ఉంచింది. ఇప్పటి వరకు రూ.102.45 లక్షల అమ్మకాలు దేవస్థానాల్లో జరిగాయి.

ప్రధాన నగరాల్లో చేనేత వస్తాల ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసి కార్మికులకు ఆర్ధికంగా చేయూతనిచ్చేందుకు సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read