మొన్నటి దాక అమరావతి పేరు ఎత్తితేనే ఎగిరెగిరి పడిన జగన్ మోహన్ రెడ్డికి, ఆయన పార్టీకి ఇప్పుడు అమరావతి అంటే ప్రేమ పుట్టుకుని వచ్చింది. అయితే వీళ్ళు తీసుకున్న నిర్ణయం పై అనేక అనుమానాలు వస్తున్నాయి. ఈ రోజు అమరావతిలోని సెక్రటేరియట్ లో క్యాబినెట్ సమావేశం జరిగింది. అయితే ఈ రోజు ప్రధాన అంశంగా చెప్పుకునే విషయం, అమరావతికి మూడు వేల కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చి, 50 శాతం పైగా పుర్తియిన భావనలు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాల కాంట్రాక్టర్ లకు, దాదాపుగా 700 కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. దీంతో పాటు, ఇచ్చే మూడు వేల కోట్లలో ఏ మేరకు సరిపోతాయనే అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. దాదాపుగా 50 శాతం పూర్తయిన భావనలను పూర్తి స్థాయిలో నిర్మించేందుకు, ఈ నిధులు కేటాయిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అయితే మిగిలిన భవనాలు అంటే, భవనాల నిర్మాణం ప్రారంభం అయ్యి, 50 శాతం కంటే తక్కువ ఏవి అయితే ఉన్నాయో వాటికి సంబంధించి, ఇంజనీరింగ్ నిపుణులు ఇచ్చిన సలహా మేరకు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం మాత్రం, 50 శాతం కంటే ఎక్కువ పూర్తయిన భావనలను పూర్తి చేయాలని నిర్ణయించారు.

అయితే ఈ నిర్ణయం తీసుకునే ముందు, ప్రభుత్వంలోని కీలక అధికారులు సమావేశం అయ్యి, ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవటానికి హైకోర్టులో ఉన్న కేసు కూడా కారణం అని తెలుస్తుంది. హైకోర్టులో రాజధాని రైతులు కానీ, రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, పడిన పిటీషన్లు మళ్ళీ హైకోర్టు ముందుకు హియరింగ్ కు వస్తున్నాయి. ఈ కేసులకు సంబంధించి విచారణ షడ్యుల్ ని కూడా విడుదల చేసారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం పై, వ్యూహాత్మిక ఎత్తుగడ ఉందని, భావించాల్సి ఉంటుంది. ఎందుకుంటే రైతులకు, ప్రభుత్వానికి మధ్య ఉన్న ఒప్పందం మేరకు, ఇన్ఫ్రా డెవలప్మెంట్ వంటి హామీలు, కోర్టులో ప్రశ్నించే అవకాసం ఉంది కాబట్టి, తాము ఇంత డబ్బులు కేటాయించమని, హైకోర్టుకు చెప్పటానికి ఈ నిర్ణయం తీసుకుని ఉంటుందని భావిస్తున్నారు. ఎందుకుంటే ఒక పక్క అమరావతిలో కేవలం శాసనసభ ఉంటుంది అని చెప్తున్నప్పుడు, ఈ భవనాలు నిర్మించి దేనికి ఉపయోగిస్తారో ఎవరికీ తెలియదు. ఇదంతా ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆడుతున్న గేమ్ లా ఉందనే అభిప్రాయం కలుగుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read