సీబీఐ దాగుడుమూత‌ల‌కి తెర‌దించేసింది. ఏపీ సీఎం వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డికి త‌న బాబాయ్ వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య గురించి ముందే తెలుస‌ని సంచ‌ల‌న విషయాల‌తో కోర్టులో అఫిడ‌విట్ వేసింది. ఇదే అంశం కొన్ని వారాల క్రితం ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ కూడా వెల్ల‌డించారు. అనంత‌రం జరిగిన ద‌ర్యాప్తులో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి హ‌త్య జ‌రిగింద‌ని చెబుతున్న 6.15 కంటే ముందు ఈ స‌మాచారం తెలుసు అని సీబీఐ అనుమానిస్తోంది. వైఎస్ అవినాష్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్ పై సీబీఐ వేసిన అనుబంధ కౌంటర్ లో జ‌గ‌న్ కి హ‌త్య గురించి తెలుసు అనే విషయాన్ని సీబీఐ ప్ర‌స్తావించింది. త‌న బాబాయ్ హత్య విషయం జగన్ కు ఉదయం 6.15కు ముందే తెలిసినట్లు దర్యాప్తులో తేలింద‌ని సీబీఐ తేల్చేసింది. వివేకానంద‌రెడ్డి పీఏ ఎంవీ కృష్ణారెడ్డి బయటపెట్టక ముందే హత్య విషయం జగన్ కు తెలుసు అని, జగన్ కు హ‌త్య విష‌యం అవినాష్ రెడ్డే చెప్పారా అనేది దర్యాప్తు చేయాల్సి ఉంద‌ని సీబీఐ ఇన్నాళ్లు తెలిసిన బ‌హిరంగ ర‌హ‌స్యాన్నే కోర్టు వేదిక‌గా బ‌య‌ట‌పెట్టేసింది. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌పై సీబీఐ ద‌ర్యాప్తు వేయాల‌ని డిమాండ్ చేసిన జ‌గ‌న్ రెడ్డే వ‌ద్ద‌ని ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థం అవుతోంది. వివేకా హ‌త్య కేసు ద‌ర్యాప్తుని అడుగ‌డుగునా ప్ర‌భావితం చేసి ఎందుకు అడ్డుకుంటున్నారో క్రిస్ట‌ల్ క్లియ‌ర్‌గా జ‌నాలకి తెలిసేలా సీబీఐ కౌంట‌ర్ అఫిడ‌విట్ వేసింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read