నిన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మంగళవారం క్వస్చిన హావర్ సమయంలో తెలుగుదేశం పార్టీ నేతలు, రాష్ట్రంలో అప్రకటిత కరెంటు కోతల పై, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్బంగా, విద్యుత్ శాఖా మంత్రి బాలినేని, తెలుగుదేశం పార్టీ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చోదరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎమ్మల్యే బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ఐదేళ్లుగా ఎక్కడా కారెంటు కోతలు లేవని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి వచ్చిన ఆరు నెలల్లో అనేకసార్లు కరెంటు కోతలు విధించారని అన్నారు. గతంలో ఏ మాత్రం జరగని 3 వ్యాపారాలు జగన్ వచ్చిన తరువాత బాగా జరుగుతున్నాయని, మొదటిది క్యాండిల్స్‌, రెండోది జనరేటర్‌, మూడోది ఇన్వర్టర్‌ అన్నారు. బుచ్చయ్య చౌదరికి సమాధానంగా, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సమాధానం ఇవ్వటానికి సిద్ధం అవుతూ ఉండగా, జగన్‌ మోహన్ రెడ్డి కల్పించుకుని, మైకు తీసుకుని, రాష్ట్రంలో విద్యుత పరిస్థితి, విద్యుత్‌ సరఫరా వివరాలు వెల్లడించబోయారు.

balineni 18122019 12

అయితే, సమాధానం చెప్పటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ నెంబర్లు ఏమిటో చెప్పటానికి, జగన్ తడ బడ్డారు. దాదపుగా 5 నిమిషాలు జగన్, ఇలా చేస్తూ ఉండటంతో, అటు వైపు నుంచి తెలుగుదేశం ఎమ్మల్యేలు, కామెంట్లు చేస్తూ, సియంకు ఏమి తెలియదు అంటూ ఎగతాళి సెహ్సారు. దీంతో జగన్ ఇవి, 17 వేల మెగా యూనిట్లా? గంటలా?’ అంటూ అధికారుల గ్యాలరీలో ఉన్న ఎనర్జీ సెక్రటరీ శ్రీకాంత్‌ను ప్రశ్నించారు. ఆయన చెప్తూ ఉండగానే, ఇక్కడ కూడా అంతరాయమేనా? అంటూ టీడీపీ సభ్యులు ఎద్దేవా చేశారు. దీంతో అసహనానికి గురైన జగన్, మీకు బుర్రలేదు. అసలు ఇది నా సబ్జెక్ట్ కాదు, ఈ లెక్కలు నాకు ఎలా తెలుస్తాయి, నేను మీకు సమాధానం చెప్దామని లేగిసాను అంటూ చెప్పారు.

balineni 18122019 3

అయితే, కాసేపు మంత్రి బాలినేని, చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డిలతో చర్చించారు. అధికారులు స్లిప్పులు రాసి సీఎంకు పంపారు. ఇలా జరుగుతుండగానే, అర్థమైంది, ఇక అన్సర్‌ వద్దులెండి అంటూ టీడీపీ సభ్యులు మళ్ళీ అరవటంతో, జగన్ అసహనంతో కాసేపు అక్కడే కూర్చొని, మంత్రి బాలినేని చెప్పమని అన్నారు, తరువాత కొంచెం సేపటకి చాంబర్‌లోకి వెళ్లి పోయారు. అయితే ఈ విషయం పై చంద్రబాబు ఈ రోజు అనంతపురం కార్యకర్తల మీటింగ్ లో లేవనెత్తారు. తనకు ఇంగ్లీష్ రాదు అంటూ ఎద్దేవా చేసారని, నిన్న అసెంబ్లీ చూసారా, మనం విద్యుత్ పై అడిగితే, సమాధానం చెప్పలేక పారిపోయారు, మెగావాట్ కి, కిలోవాట్ కి తేడా తెలియదు ఈయనో ముఖ్యమంత్రి... సబ్జెక్ట్ తెలిస్తేగా అసలు మాట్లాడటానికి అంటూ జగన్ ను మళ్ళీ ఎద్దేవా చేసారు.

నిన్న అమరావతి పై అసెంబ్లీలో జరిగిన చర్చలో, అధికారం పక్షం వైసీపీ, తెలుగుదేశం పార్టీ పై అనేక ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పై, చంద్రబాబు పై అనేక ఆరోపణలు చేసారు. అమరావతిలో ఇన్సైడెడ్ ట్రేడింగ్ జరిగిందని, మొత్తం స్కాం అంతా చంద్రబాబు చేసారని అన్నారు. అమరావతి ప్రకటన కంటే ముందే చంద్రబాబు అమరావతిలో రాజధాని వస్తుందని, తన అనుచరులకు చెప్పారని, తన బినామీల చేత, అమరావతిలో మొత్తం భూములు కొనుగోలు చేపించారు అంటూ ఆరోపణలు చేసారు. దీనికి సంబంధించి ఎన్నో పేర్లు చదివి వినిపించారు. అయితే, దీని పై విచారణ చేసి, వారిని లోపల వెయ్యండి అంటే మాత్రం, ఏడు నెలల నుంచి మాట్లాడటం లేదు. అయితే ఇది ఇలా ఉంటే, ఈ చర్చలో భాగంగా బుగ్గన, చంద్రబాబు కుటుంబానికి చెందిన ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’పై కూడా ఆరోపణలు చేసారు. ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’ కూడా అమరావతిలో భూములు కొంది అంటూ చెప్పుకొచ్చారు.

herigate 18122019 2

అయితే బుగ్గన వ్యాఖ్యల పై, ‘హెరిటేజ్‌ ఫుడ్స్‌’ నాలుగు పేజీల క్లారిటీ, కౌంటర్ ఇచ్చింది. బుగ్గన చెప్పినట్లుగా, హెరిటేజ్ కొన్న భూమి, అమరావతి రాజధాని పరిధిలోనే లేదని, అది అమరావతికి 20 కిమీ దూరంలో ఉన్న కంతేరు అనే గ్రామంలో కొన్నామని ప్రకటించారు. హెరిటేజ్‌ ఫుడ్స్‌ విస్తరణలో భగంగా, అనంతపురం, గుంటూరు, నెల్లూరు, విశాఖపట్నంలో భూములు కొని ప్లాంట్ లు పెట్టటానికి నిర్ణయం తెసుకున్నామని, ఇందులో భాగంగా, మార్చ్ 2014 అంటే ఎన్నికలకు ముందే, గుంటూరులో భూమి కొనుగోలు చెయ్యాలని, బోర్డు మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నామని, ఆ రోజు నోట్స్ కూడా చూడవచ్చని అన్నారు. రియల్ ఎస్టేట్ కోసం, ఈ భూమి కొనుగోలు చెయ్యలేదని, తమ ప్లాంట్ కోసమే చేసామని అన్నారు.

herigate 18122019 3

2014 మార్చిలో హెరిటేజ్ కు చెందిన బోర్డు భూమి కొనుగోలుకు నిర్ణయం తీసుకుంటే, జూన్ నెలలో, మొవ్వా శ్రీలక్ష్మి అనే మహిళకు చెందిన 7.21 ఎకరాలు, చిగురుపాటి గిరిధర్‌కు చెందిన 2.46 ఎకరాలు. ఎఈపీఎల్ సంస్థకు చెందిన 4.55 ఎకరాలను కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నామని, అయితే ఎల్‌ఈపీఎల్‌కు చెందిన 4.55 ఎకరాల పై వివాదం ఉండటంతో, ఆ స్థలం కొనుగోలు చెయ్యలేదని అంటున్నారు. బుగ్గన అసెంబ్లీలో 14 ఎకరాలు కొన్నమని అన్నారని, కాని మేము కొనుగోలు చేసింది, కేవలం 9.67ఎకరాలు అని అన్నారు. డిసెంబర్ లో రాజధాని ప్రకటన వస్తే, మేము ఎన్నికల ముందు మార్చ్ 2014లో నిర్ణయం తీసుకుని, జూన్ లో కొన్నామని గుర్తు చేసారు. అది కూడా రాజధాని ప్రాంతంలో లేదని, 20 కిమీ దూరంలో ఉందని బుగ్గనకు కౌంటర్ ఇచ్చారు.

నిన్న అసెంబ్లీలో రాజధాని పై, జగన్ మోహన్ రెడ్డి పర్యటన తరువాత, రాష్ట్రమంతా, ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో కన్ఫ్యూషన్ వాతవరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని, సౌత్ ఆఫ్రికాకు కూడా అలాగే ఉన్నాయని, మనకు ఉంటే తప్పు ఏమిటి, మనం కూడా మారాలి, అమరావతి లెజిస్లేటివ్ కాపిటల్ గా, విశాఖ, కర్నూల్ మరో రెండు రాజధానులుగా ఉంటాయని జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ ప్రకటన పై రాష్ట్రమంతా ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఒక అమరావతి కాట్టలేకే, మా డబ్బులు లేవు అని చెప్తున్న ప్రభుత్వం, మూడు రాజధానులు ఎలా కడుతుంది, ఇదంతా రాజకీయంలో భాగమే అనే వాదన మొదలైంది. 90 శాతం పూర్తయిన భవనాలు అమరావతిలో ఉంటే, ఆరు నెలలుగా వాటిని పూర్తీ చెయ్యలేని ప్రభుత్వం, మరో రెండు రాజధానులు కడుతుంది అంటే ఎలా నమ్ముతాం అని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఈ చర్చ జరుగుతున్న వేళ, ఇప్పుడు ప్రభుత్వం మరో ట్విస్ట్ ఇచ్చింది.

capital 18122019 2

ఈ రోజు మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా, మూడు రాజధానుల పై, ప్రజల ఆందోళన గురించి అడగగా, అమరావతి, కర్నూల్, విశాఖపట్నంలో, రాజధానులు ఉండొచ్చు అని మాత్రమే చెప్పారని, ఉంటుంది అని చెప్పలేదు కదా అని, ఉండొచ్చు అనే మాటకు, ఉంటుంది అనే మాటికి తేడా చాలా ఉంది పేర్ని నాని చేసిన ప్రకటన ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూషన్ లో పడేసింది. రాజధాని పై ఏ నిర్ణయం అయినా రాజధాని కమిటీ రిపోర్ట్ రావాలని, దాని పై చర్చ జరగాలాని, అప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటాం అని, అయితే జగన్ మోహన్ రెడ్డి గారు, మూడు రాజధానులు ఉండొచ్చు ఏమో అంటే, దానికి ఇన్ని అర్ధాలు తీస్తున్నారు అంటూ మీడియా పై ఫైర్ అయ్యారు. మీ మీడియాకు జగన్ పై ఎంత ద్వేషం ఉందొ తెలుస్తుందని అన్నారు.

capital 18122019 3

పేర్ని నాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ పై విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఎంత మందికి భూములు ఉన్నాయి, ఇప్పుడు ఎంత మంది వచ్చి ఆందోళన చేస్తున్నారు అంటూ, రైతులు పై విమర్శలు గుప్పించారు. ఒకరో ఇద్దరో ఇన్స్టంట్ రియాక్షన్ చూపిస్తారని, అది సహజం అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఏదో జరిగిపోతుంది అనే ప్రచారం చేస్తున్నారని అన్నారు. అసలు రిపోర్ట్ రాకుండా, ఈ హడావిడి ఎందుకు అంటూ ప్రశ్నించారు. అమరావతి పై చర్చ జరిగితే తమ బండారం బయట పడుతుందని, తెలుగుదేశం పార్టీ భయమని అన్నారు. మూడు రాజధానులు ఉండొచ్చు అనే జగన్ అన్నారని, ఉంటుంది అని ఎక్కడా చెప్పలేదని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గ్రామాల్లో రేపు బంద్ కు పిలుపునిచ్చారు, అమరావతి రైతులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులంటూ సీఎం జగన్ ప్రకటన పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని, ముందుగా రేపు భారీ ఎత్తున బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నిరసనల్లో భాగంగా రిలే దీక్షలు, రహదారుల ముట్టడికి నిర్ణయం తీసుకున్నారు. ఆందోళనలో అన్ని గ్రామాల రైతులు పాల్గొంటారని వెల్లడించారు. మొదటి రోజు అయిన రేపు, రాజధాని గ్రామాల్లో రేపు బంద్ పాటించాలని రైతులు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులంటూ నిన్న అసెంబ్లీలో జగన్ ప్రకటించడం పై రైతులు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ రోజు అమరావతి రైతులు నిరసన ప్రదర్శనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు సాయంత్రం రాజధాని రైతులు ఉద్దండరాయనిపాలెంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి అన్ని రాజధాని గ్రామాల రైతులు హాజరయ్యారు.

farmers 18122019 2

భవిష్యత్ కార్యాచరణ పై, రైతులు సమాలోచనలు జరిపారు. ప్రభుత్వం పై ఒత్తిడి తేవటంలో భాగంగా, రేపు అమరావతి బంద్ పాటించాలని రైతులు పిలుపు ఇచ్చారు. అలాగే ప్రభుత్వం దిగి వచ్చే దాకా , ప్రతి రోజు నిరసనలు చెయ్యాలని, రిలే నిరాహార దీక్షలు, రహదారుల ముట్టడి లాంటి నిరసన కార్యక్రమాలు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం దిగి వచ్చే దాకా, ఆందోళనలో పాల్గొనాలని అన్ని గ్రామాల రైతులు నిర్ణయించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, జగన్ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ నిర్ణయంగా అభివర్ణించారు. అమరావతిని మూడు ప్రాంతాలుగా విడగొట్టడం చూస్తుంటే, ఒకటి గుర్తుకు వస్తుందని, ఎవరికైనా రోగం వస్తే చికిత్స ఒక ప్రాంతంలో, పరీక్షలు మరో ప్రాంతంలో, మందులు వేరే చోట తెచ్చుకునే విధంగా ఉందని అన్నారు.

farmers 18122019 3

ఇలా మూడు ప్రాంతాలు తిరిగితే, ఆ రోగి చచ్చిపోతాడని, ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం కూడా అలాగే ఉందని, రైతులు అన్నారు.ఆరు నెలలుగా మమ్మల్ని మానసిక క్షోభ పెట్టారని, అయినా జగన్ మంచి నిర్ణయం తీసుకుంటారని అనుకున్నామని, కాని చివరకు మాకు చిప్ప మిగిల్చి, నిద్రాహారాల్లేకుండా చేసారని రైతులు ఆందోళన వ్యక్తం సెహ్సారు. ఇళ్ళల్లో ఉండే వారిని, ఎప్పుడు రోడ్డు ఎక్కని వారిని, ఈ రోజు మమ్మాల్ని రోడ్డున పడేశారని, మహిళలు వాపోయారు. మా పొలాలు ఇచ్చింది ఇందుకేనా అని ప్రశ్నించారు. ఒక ప్రధాని శంకుస్థాపన చేసిన చోటుకే విలువ లేకపోతే ఎలాగని అన్నారు. మేము అభివృద్ధి వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కాదని, పరిపాలన వికేంద్రీకరణ మాత్రం వద్దని, జగన్ నిర్ణయం మార్చుకోవాలని అన్నారు.

Advertisements

Latest Articles

Most Read